గెలుపు దారి కానరాదేమి బాలినేని!

ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం హవా జోరుగా ఉంది. జగన్ గాలి వీచిన 2019 ఎన్నికలలో కూడా ఈ జిల్లాలో తెలుగుదేశం నాలుగు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఈ సారి తెలుగుదేశం కు జనసేన, బీజేపీల బలం తోడైంది. జగన్ సర్కార్ పై ఉన్న తీవ్ర ప్రజా వ్యతిరేకతతో ఆ పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఇక ఒంగోలు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి, సీఎం జగన్ కు సమీప బంధువు బాలినేని అయితే గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.   ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా దామచర్ల జనార్ధన్ పోటీ చేస్తున్నారు.  2014 ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించిన ఆయన 2019 వరకూ ఒంగోలు ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషి ఇప్పుడు ఆయనకు బాగా కలిసి వస్తోంది. 2019 ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు. ఆ ఎన్నికలలో విజయం సాధించిన బాలినేని జగన్ తొలి కేబినెట్ లో మంత్రిగా కూడా పని చేశారు. అయినా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన చేసింది శూన్యం అన్న భావన ప్రజలలో వ్యక్తం అవుతోంది. అభివృద్ధి మాట అలా ఉంచితే ఆయన హయాంలో నియోజకవర్గంలో అరాచకం తాండవించింది. స్వయంగా బాలినేని కుమారుడిపైనే భూ కబ్జాలు, దాడుల ఆరోపణలు ఉన్నాయి. బాలినేని కుమారుడు, ఆయన అనుచరులు విచ్చలవిడిగా భూకబ్జాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై ప్రభుత్వం గత్యంతరం లేని పరిస్థితుల్లో సిట్ దర్యాప్తునకు ఆదేశించాల్సి వచ్చిందంటే బాలినేని హయాంలో నియోజకవర్గంలో ఏ స్థాయిలో అరాచకత్వం రాజ్యమేలిందో ఊహించవచ్చు.  అలాగే ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన సుబ్బారావు గుప్తాను వేధించిన ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్ంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.  తాగునీటి పథకాలు, పోతురాజు కాలువ ప్రాజెక్టు విషయంలో బాలినేని వైఫల్యాలు నియోజకవర్గ ప్రజలలో బాలినేని ప్రతిష్టను మసకబార్చాయి. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి దామచర్ల జనార్ధన్ కు ప్రజా మద్దతు పెరుగుతోంది. ప్రచారంలో దామచర్ల దూసుకుపోతుంటే.. బాలినేని సొంత పార్టీ క్యాడర్ నుంచే వ్యతిరేకత ఎదుర్కొంటూ ఎదురీదుతున్నారు. అలాగే ఒంగోలు  సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం గూటికి చేరడం, కూటమి బలపరిచిన అభ్యర్థిగా తెలుగుదేశం తరఫున పోటీలో దిగడం కూడా బాలినేని విజయావకాశాలపై ప్రభావం చూపనుందని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మాగుంట కుటుంబానికి ఒంగోలు, కొంండెపి నియోజకవర్గాలలో మంచి గుర్తింపు ఉంది. బైపాస్ రోడ్డు వంటి నిర్మాణాలతో ప్రజలలో మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుటుంబంపై నియోజకవర్గ ప్రజలల సానుభూతి వ్య్తఅవుతోంది. అదే సమయంలో ఉద్యోగులు, టీచర్లు, కాపు సామాజికవర్గం ఈ సారి బేషరతుగా తెలుగుదేశం పార్టీకి, దామచర్ల విజయానికి మద్దతు ప్రకటించారు  

ఓటు వేయ‌డానికి ఎన్నారైల రాక! టీడీపీ గెలుపు కోసం ఎన్నారైల‌ ప్రచారం

ఎన్నిక‌ల పండగలో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రవాస భారతీయులు ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా కేరళ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ నుంచి విదేశాలకు వెళ్లినవారిలో.. వేల మంది స్వదేశీ బాట పట్టారు. ఇందుకోసం ప్రత్యేక విమానాలను ఆశ్రయిస్తున్నారు. గత రెండు రోజుల్లోనే దాదాపు 25 వేలకు పైగా ఎన్నారైలు వచ్చినట్లు అంచనా. పోలింగ్‌ తేదీ నాటికి ఈ సంఖ్య భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. అమెరికా, కెన‌డా, లండ‌న్‌తో పాటు  గల్ఫ్‌ దేశాల నుంచి పోలింగ్‌లో పాల్గొన‌డానికి త‌ర‌లి వ‌స్తున్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా పోలింగ్‌లో భాగస్వామ్యం చేసేందుకు రాజకీయ పార్టీలు విదేశాల్లోనూ ప్రచారం చేశాయి. స్వదేశానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశాయి. విదేశాల నుండి ఎన్ ఆర్ ఐ లు రావడం తో ఢిల్లీ -  విజయవాడ విమానం రద్దీ నెలకొంది.  ఓటు  హక్కు వినియోగించుకోవడానికి  మునుపెన్నడూ లేని విధంగా సుదూర ప్రాంతాల నుండి వస్తున్నారు. ఇదే ఒరవడి మరో మూడు రోజు లు కొనసాగుతుంది అని విమానాశ్రయాధికారులు చెబుతున్నారు.  విదేశాలనుండి వచ్చే వారంతా చంద్ర‌బాబుకు సంఘీభావంగానే వస్తున్నారు. టీడీపీ కూట‌మి గెలుపు కోసం ఎన్నారైలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. విదేశాలలోని టీడీపీ అభిమానులు పెద్ద సంఖ్యలో  ఉద్యోగాలకు సెలువు పెట్టి, త‌మ వ్యాపారాలకు తాత్కలిక విరామం ఇచ్చి ఓటు వేయ‌డానికే విమానం ఎక్కేశారు.  ఈ రకమైన అంకితభావం కేర‌ళ‌లో క‌నిపిస్తోంది. ఇప్పుడు ఏపీకి చెందిన వారు ఓటు వేయ‌డానికి భారీ సంఖ్య‌లో విదేశాల నుంచి వ‌స్తున్నారు. ఒక ప్రణాళికాబద్ధంగా ఏపీలోని అన్ని నియోజకవర్గాలలోనూ అమెరికా నుండి వచ్చి ప్ర‌చారంలోనూ పాల్గొన‌డం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. రాష్ట్రాన్ని రక్షించేందుకు తాము ప్రత్యక్షంగా రంగంలో దిగిన‌ట్లు వారు చెబుతున్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి పోటి చేస్తున్న అన్ని నియోజకవర్గాలలో ఎన్నారై తెలుగుదేశం బృందాలు సీరియ‌స్‌గా ప‌నిచేస్తున్నారు. మంగళగిరిలో పార్టీ ఏర్పాటు చేసిన వార్ రూంలో ఎన్నారై టీడీపీ అధ్యక్షుడు వేమూరి రవి కీలకపాత్ర వహిస్తున్నారు. - ఎం.కె.ఫ‌జ‌ల్‌

రామయ్యా.. రావాల్సిన అవసరం లేదయ్యా!

వేమన శతకం, సుమతీ శతకం తరహాలోనే భాస్కర శతకం కూడా వుంది. మారవి వెంకయ్య కవి 16వ శతాబ్దంలో ఈ శతకాన్ని రచించాడు. ఈ శతకంలోని ఒక పద్యం ఇలా చెబుతుంది... దానముఁ జేయనేరని యధార్మికు సంపద యుండి యుండియున్ దానె పలాయనంబగుట తథ్యము; బూరుగు మ్రాను గాచినన్, దాని ఫలంబులూరక వృథాపడిపోవవె యెండి గాలిచేఁ గానలలోన నేమిటికిఁగాక, యభోజ్యములౌట భాస్కరా!   ఈ పద్యం అర్థం ఏమిటంటే, దానం చేయడం చేతగాని ధనికుడికి ఎంత సంపద వుండి ఏం లాభం? అడవిలో బూరుగుచెట్టు విరగ కాస్తుంది. కానీ, దాని కాయలు ఎవరికీ ఉపయోగపడవు. దాని కాయలు పగిలిపోయి దాంట్లో వున్న దూది మొత్తం గాలిలోకి ఎగిరి ఎవరికీ ఉపయోగపడకుండా పోతుంది. ఈ పద్యం తరహాలోనే జూనియర్ ఎన్టీఆర్‌కి వున్న జనాకర్షణ అడవిలో పుట్టిన బూరుగ చెట్టు మాదిరిగా అయిపోయింది. ఆయన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఎంతమాత్రం ఉపయోగపడకుండా వృధా అయిపోయింది. అకారణంగా తెలుగుదేశం పార్టీ మీద అలిగిన జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరంగా వుంటున్నారు. పార్టీకి దూరంగా వుండటమే కాకుండా, కొడాలి నాని లాంటి వ్యక్తులకు అండగా నిలిచి, వాళ్ళ నోరు ఎంత మాట అయినా అనడానికి ధైర్యం ఇస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఉద్దేశం కావచ్చు, ఆయన సన్నిహితుల ఉద్దేశం కావచ్చు.. తెలుగుదేశం పార్టీని అర్జెంటుగా జూనియర్ ఎన్టీఆర్ చేతిలో పెట్టేయాలి. తెలుగుదేశం పార్టీలో అన్ని విషయాలూ జూనియర్ ఎన్టీఆర్‌ని సంప్రదించే జరగాలి. అలాంటి అవకాశం లేకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరమయ్యారు. 2019 ఎన్నికల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయకుండా దూరంగా వున్నారు. ఏ నిమిషంలోనైనా అతని మనసు మారి ప్రచారానికి వస్తారేమోనని తెలుగుదేశం వర్గాలు ఎదురుచూశాయి. తమవంతు ప్రయత్నాలు చేశాయి. అయినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయకపోవడం కూడా ఒక కారణం అని అనుకుంటూ ఆయన అభిమానులు ఆనందిస్తూ వుంటారు.. అది వేరే విషయం! ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస్ వైసీపీ తీర్థం పుచ్చుకోవడం మాత్రమే కాకుండా, చంద్రబాబును విమర్శించడానికి నేనున్నానంటూ ముందుకు వస్తూ వుంటారు. దీని వెనుక జూనియర్ ఎన్టీఆర్ ఆమోదం లేదని ఎవరూ అనుకోరు. ఈసారి ఎన్నికలలో పరిస్థితి మారిపోయింది. తెలుగుదేశం వర్గాలు అసలు జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తే వున్నాడనే విషయాన్ని మరచిపోయారు. ఆయన ప్రచారం చేస్తే ఎలా వుంటుందన్న ఆలోచన కూడా ఎవరికీ రాలేదు. గత ఎన్నికలలో రామయ్యా.. వస్తావయ్యా అన్న తెలుగుదేశం.. ఈసారి మాత్రం రామయ్యా.. రావాల్సిన అవసరం లేదయ్యా అని చెప్పకుండానే చెప్పింది. గత ఎన్నికల సందర్భంగా బెట్టు చేసి, బిల్డప్ ఇచ్చే అవకాశం ఈసారి జూనియర్ ఎన్టీఆర్‌కి రాలేదు. జూనియర్ ఎన్టీఆర్‌ ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ కోరుకోలేదు. కానీ వైసీపీ మాత్రం జూనియర్ పేరుతో ఫేక్ ప్రచారం చేసుకుంటోంది. జూనియర్ ఫొటో పెట్టుకుని, ఆయన వైసీపీకి మద్దతుగా స్టేట్‌మెంట్ ఇచ్చినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ ఆత్మానందం పొందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ అయిన పార్టీకి ఉపయోగపడలేదు. కాని పార్టీ మాత్రం ఇలా ఫేక్ ప్రచారానికి ఉపయోగించుకుంటోంది. 

ఫోనే లేకుండా నంబరెక్కడిది జగన్ రెడ్డీ!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తాను చెప్పే అబద్ధాలు గోడకట్టినట్లు కాదు కదా కనీసం తడికె కట్టినట్లు కూడా ఉండటం లేదు. ఎప్పటికప్పుడు అవాస్తవాలు ప్రచారంలోకి తీసుకురావడం, అడ్డంగా దొరికిపోయి నవ్వుల పాలు కావడం జగన్ కు ఒక ఆనవాయితీగా, ఒక అలవాటుగా మారిపోయింది. మనమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా జరిగిన గులకరాయి దాడిని హత్యాయత్నంగా అభివర్ణించి ఎన్నికలలో సానుభూతి లబ్ధి కోసం చేసిన ప్రయత్నం ఎలా బూమరాంగ్ అయ్యిందో తెలిసిందే. గాయం తగిలిందంటూ డజను మంది డాక్టర్ల బృందంతో చికిత్స చేయించుకుని అందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేసి, గాయానికి పెద్ద పట్టీ వేసుకుని మరీ ప్రచారం నిర్వహించిన జగన్ ఆ పట్టీ తీసేయగానే నుదుటిపై గాయానికి సంబంధించి చిన్న మచ్చ, గీత కూడా లేకపోవడం వైద్య శాస్త్రంలోనే అద్భుతంగా అభివర్ణిస్తూ నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్లు పెట్టారు. ఆయన ఐదేళ్ల పాలనలో ఇటువంటి అద్భుతాలు ఎన్నో జరిగాయి.   తాజాగా ఒక చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ తనకు ఫోనే లేదంటూ ఓ బ్రహ్మాండమైన విషయం వెల్లడించారు. జగన్ తనకు ఫోన్ లేదు అని చెప్పి నెటిజనులకు అడ్డంగా బుక్కైపోయారు. ఫోన్ లేదు అని చెప్పి ఊరుకోకుండా ఆయన ఒక వేళ ఫోన్ ఉన్నా ఆ ఫోన్ నంబర్ కూడా తనకు తెలియదని మరో  మాట అన్నారు. ఫోన్ లేకుండా నంబర్ ఎందుకు ఉంటుంది జగన్ భాయ్ అంటూ నెటిజనులు జోకులు పేలుస్తున్నారు.   ఇంకా స్పష్టంగా జగన్ తన ఫోన్ బాగోతం ఎలా చెప్పారంటే... తన దగ్గర ఫోన్ లేదు అన్నారు. అలా అని ఊరుకోకుండా  ఫోన్ నంబర్ కూడా లేదు. అసలు నా ఫోన్ నెంబర్ నాకే తెలియదు అని సాగదీశారు. ఫోనే లేకపోతే.. నంబర్ ఎక్కడ నుంచి వస్తుంది సీఎం గారూ అని నెటిజనులు నిలదీస్తున్నారు. అదే సమయంలో ఉన్న రాజధానిని నిర్వీర్యం చేసేసి మూడు రాజధానులు కట్టేసినట్లే లేని ఫోన్ కు కూడా నంబర్ ఉందేమో అంటూ జోకులేస్తున్నారు.   అదే సమయంలో  పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా జగన్ తన అఫిడవిట్లో పోన్ నంబర్ ఇచ్చారు. ఆ ఫోన్ నెంబర్ ఎ9849904123. ఫోన్ లేని జగన్ కు నంబర్ ఎలా వచ్చింది. అసలు తనకే తెలియని నంబర్ ను అఫిడవిట్లో ఎలా పేర్కొన్నారు.  అంటూ నెటిజనులు ప్రశ్నలు సంధిస్తుండటంతో అసలా ఇంటర్వ్యూ ఇవ్వనేల.. ఇచ్చితిని పో ఫోన్ బాగోతం గురించి చెప్పనేల? అంటూ జగన్  తల బాదుకుంటూ ఉండొచ్చు. 

టాలీవుడ్ సపోర్టు తెలుగుదేశం కూటమికే!

ఆంధ్రప్రదేశ్ లో  మే 13న పోలింగ్ జరగనుంది. శనివారం (మే 11) సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది.  ఎన్నికల ప్రచారంలో సినీ తళుకులు ఈ సారి పెద్దగా కనిపించలేదు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తెలుగుదేశం కూటమికి సామాజిక మాధ్యమం ద్వారా తెలుగుదేశం కూటమికి మద్దతు ప్రకటించారు. హిందూపురం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ పోటీలో ఉన్నారు. అలాగే పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. వీరిరువురికీ వారి అభిమానుల మద్దతు ఎటూ ఉంటుంది. అలాగే నందమూరి హీరోల మద్దతు బాలయ్యకు, మెగా హీరోల సపోర్టు పవన్ కల్యాణ్ కు  ఉంటుంది. పవన్ కల్యాణ్ తరఫున మెగా హీరోలు సాయిధర్మతేజ,  వైష్ణవ్ తేజ్, నాగబాబు వంటి వారు ప్రచారం చేశారు. మెగా స్టార్  చిరంజీవి.. తన తమ్ముడు పవన్ కి, కూటమికి మద్దతు తెలుపుతూ ప్రత్యేక వీడియోలు విడుదల చేశారు. రామ్ చరణ్ కూడా సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటించాడు. అలాగే అల్లు ఫ్యామిలీ కూడా మద్దతు తెలిపింది. పవన్ కే తమ ఫుల్ సపోర్ట్ అని.. అల్లు అరవింద్, అల్లు అర్జున్ ప్రకటించారు.ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ కూడా జనసేన తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. అలాగే నందమూరి బాలకృష్ణ తరఫునా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రచారం చేశారు. అన్నిటికీ మించి బాలకృష్ణ కూటమి తరఫున సీమ మెత్తం తిరిగి చేసిన ప్రచారానికి భారీ స్పందన  అభించింది. అదే విధంగా కూటమి భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీ అభ్యర్థుల తరఫున హీరో విక్టరీ వెంకటేష్, రెబల్ స్టార్ కృష్ణం రాజు సతీమణి, ప్రభాస్ పెద్దమ్మ ప్రచారం చేశారు.   నందమూరి, మెగా, అల్లు, దగ్గుబాటి, రెబెల్ స్టార్ కుటుంబాలే కాకుండా  కూటమికి సపోర్ట్ చేస్తున్న సినీ ప్రముఖుల జాబితా భారీగానే ఉంది. అలాగే  హీరోలు నాని, తేజ సజ్జ, నిఖిల్, నారా రోహిత్, రాజ్ తరుణ్, సీనియర్ నటులు నరేష్, సురేష్.. కమెడియన్స్ సప్తగిరి,  జబర్దస్త్ నటులు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్, కిరాక్ ఆర్పీ వంటి వారు కూటమికి మద్దతు ప్రకటించారు.  వీరే కాకుండా ఇంకా ఎందరో నటీనటులు, దర్శకనిర్మాతలు తమ మద్దతు కూటమికే అని స్పష్టం చేశారు. టాలీవుడ్ విషయంలో జగన్ వ్యవహరించిన తీరు కారణంగా..  అధికార పార్టీపై సినీ పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున  వ్యతిరేకత వ్యక్తమవుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీ తరఫున ఈ సారి సినీ పరిశ్రమ నుంచి పెద్దగా ఎవరూ మద్దతు పలికిన దాఖలాలు లేవు. వైసీపీలో ఉన్నప్పటికీ ప్రముఖ కమేడియన్ అలీ అసలు పార్టీ తరఫున ప్రచారానికి దూరంగా ఉన్నారు. అలాగే ఆ పార్టీ తరఫున పోసాని కృష్ణ మురళి మీడియా సమావేశాల్లో మాట్లాడడానికే పరిమితమయ్యారు.    

ఏపీ ఫలితాలపై కేసీఆర్ బానిసల ఊహలు!!

చంద్రబాబు నాయుడు అంటే కేసీఆర్‌కి విపరీతమైన ద్వేషం. ఎందుకంటే, ఆ రోజుల్లో కేసీఆర్ తోక కట్ చేసింది చంద్రబాబు. అలా తోక కట్ చేయడం వల్లే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేశాడు. యువతరం ఆత్మబలిదానాల వల్ల తెలంగాణ వస్తే, దాన్ని తన గొప్పగా కలరింగ్ ఇచ్చి, పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఘోరమైన పాలన అందించాడు. తాను ముఖ్యమంత్రి అవడానికి పరోక్షంగా చంద్రబాబు కారణం అయినప్పటికీ కేసీఆర్‌కి చంద్రబాబు అంటే ద్వేషం. కేసీఆర్ అధికారంలో వున్న పదేళ్ళకాలంలో చంద్రబాబు మీద ఆయన చేయని కుట్ర లేదు.. పన్నని కుతంత్రం లేదు.. ఇప్పుడు తెలంగాణ ప్రజల చేత ఛీ కొట్టించుకుని, అధికారం కోల్పోయిన కేసీఆర్ ఇప్పటికీ చంద్రబాబు మీద విషం కక్కుతున్నాడు. ఏపీలో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడని తన దగ్గర సమాచారం వుందని వీలైనచోటల్లా ఎవరూ అడక్కపోయినా చెబుతూ నోటి దురద తీర్చుకుంటున్నాడు.  చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి దెబ్బకి అధికారం కోల్పోయిన కేసీఆర్ లబోదిబో అంటున్నాడు. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే కేసీఆర్ తట్టుకోగలడా.. అటు గురువు, ఇటు శిష్యుడు అధికారంలో వుంటే కేసీఆర్ కుళ్ళుకుని, క్రుంగి కృశించిపోతాడు. అందుకే చంద్రబాబు అధికారంలోకి రాడు అని విషప్రచారం చేయడానికి కేసీఆర్ వెనుకాడటం లేదు. మొన్నటి ఎన్నికలలో ఈయన గెలుస్తాడో, గెలవడో ఈయనకి తెలియదుగానీ, ఏపీ ఎలక్షన్ల గురించి ఈయన జోస్యం చెబుతున్నాడు. ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో 17 స్థానాలున్న తెలంగాణలో ఒక్క స్థానం కూడా బీఆర్‌ఎస్‌కి వచ్చే అవకాశాలు లేవని సర్వేలు చెబుతున్నాయి. తనకు గెలవటం చేతకాదుగానీ, చంద్రబాబు ఓడిపోతాడని ఈయన పనికిమాలిన జోస్యాలు చెబుతున్నాడు. కేసీఆర్ వ్యవహారం అలా వుంటే, కేసీఆర్ మోచేతి నీళ్ళు తాగుతూ బతుకులు వెళ్ళదీస్తున్న ఆయన సొంతమీడియాలో పనిచేసే బానిసలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాడు అంటూ కథనాలు వండుతున్నారు. వాటిని సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు అయినప్పుడు పొరుగు రాష్ట్రం గొడవలు మా రాష్ట్రంలో ఎందుకు అంటూ వదరుగా మాట్లాడిన కేటీఆర్ మనుషులు ఇప్పుడు పొరుగు రాష్ట్రం ఎన్నికల గురించి ఎక్కడలేని ఇంట్రస్టు చూపిస్తూ కథనాలు వ్యాప్తి చేస్తున్నారు.  బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఇప్పటికే చెత్తకుండీలో వేసేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ డైరెక్ట్.గా డంపింగ్ యార్డుకు చేరుకుంటుంది. బీఆర్ఎస్ డంపింగ్ యార్డుకు చేరుకుంటే కేసీఆర్ మోచేతి నీళ్ళు తాగుతూ బతికే జనాలకు పోషణ వుండదు. అందుకే చంద్రబాబు మీద విష ప్రచారం చేస్తూ, తాము చేస్తున్న విష ప్రచారం నిజం కావాలని కోరుకుంటున్నారు. ప్రజలు మాత్రం వీళ్ళ ఆకతాయితనాన్ని గమనిస్తున్నారు. 

గుడివాడ టిడిపి అభ్యర్థి తరపున కుమారి ఆంటీ ప్రచారం

సోషల్ మీడియాలో కుమారి ఆంటీ పేరు అంతా కాదు. హైదరాబాద్ కుమారి ఆంటీ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌త్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఓ వీడియోతో రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెన్షేషన్ అయ్యారామె. ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దృష్టిని ఆకర్షించారు. తాజాగా ఏపీ ఎన్నికల వేళ కుమారి ఆంటీ మరోసారి వార్త‌ల్లో నిలిచారు. ఆమె గుడివాడ టీడీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు మద్దతుగా గుడివాడలోని 21, 24, 25, 31, 32 వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వెనిగండ్ల రాముపై కుమారి ఆంటీ ప్రశంసలు కురిపించారు.  మహర్షి సినిమాలో మహేశ్‌ బాబు లాంటి మంచి మనసున్న వ్యక్తి అంటూ ప్రశంసించారు. ఆ సినిమాలో మహేశ్‌ బాబు ప్రజల కోసం సేవ చేస్తే, రియల్ లైఫ్ లో గుడివాడ‌లో రాము సేవ చేస్తున్నార‌ని కొనియాడారు. తన స్వస్థలమైన పెద్ద ఎరుకపాడులో ప్రచారం చేయడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ప్రజలందరి మంచి కోసమే తాను ప్రచారానికి వచ్చిన‌ట్లు పేర్కొన్నారు. గుడివాడ 15 ఏళ్ల క్రితం అభివృద్ధి లేకుండా ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందన్నారు. వెనిగండ్ల రాము గెలిస్తే గుడివాడ అభివృద్ధి చెందుతుంద‌ని కుమారి ఆంటీ వ్యాఖ్యానించారు.  తన స్వస్థలమైన గుడివాడపై ప్రేమ, మమకారంతో ఇక్కడికి వచ్చానని.. ఇక్కడ అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో రాముకు మద్దతుగా ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. గుడివాడలో ఉపాధి అవకాశాలు లేకపోవంతో తనలాంటి వారు పక్క రాష్ట్రాలకు వెళ్లి కష్టపడాల్సి వస్తుందన్నారు. కొడాలి నాని హయాంలో అభివృద్ధి లేకపోగా, ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడలేదని దుయ్య‌బ‌ట్టారు.  వెనిగండ్ల రాము చ‌క్క‌టి విజన్ ఉన్న నేత అని.. కష్టపడేవారికి, విద్యావంతులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇప్ప‌టికే చర్యలు తీసుకున్నారని ఆమె గుర్తు చేశారు. రాము వంటి నేతలు అధికారంలో ఉంటే.. తమలాంటి వారికి ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా వెనిగండ్ల రామును, గ్లాస్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా వల్లభనేని బాలశౌరిని గెలిపించి, ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలవాలని కుమారీ ఆంటీ కోరారు. ఇక ఈ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర్రావు, మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు , జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ పట్టణ టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, 32, 31, 25, 21,24 వార్డుల టీడీపీ, జనసేన కమిటీల సభ్యులు పాల్గొన్నారు. అలాగే గుడివాడ నియోజకవర్గ కూటమి పార్టీల నాయకులు, తెలుగు మహిళలు, తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్, టీడీపీ జనసేన అనుబంధ విభాగాల నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

కడప ఓటు.. ఒకటి అటు.. ఒకటి ఇటు.. అవినాష్ పనైపోయిందా?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. గెలుపు ఓటములపై సర్వేలన్నీ వార్ వన్ సైడే అని చెబుతున్నాయి. అధికార పార్టీ నేతల తీరులో కానీ, స్వయంగా ఆ పార్టీ  అధినేతలో కూడా ఓటమి భయం ప్రస్ఫుటమౌతోంది. ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరుగుతాయన్న నమ్మకం లేదని  స్వయంగా జగన్ ప్రకటించి కాడె పడేసినట్లు చెప్పేశారు. దీంతో వైసీపీ శ్రేణులలో నైరాశ్యం కానవస్తోంది. ఇవన్నీ ఆ పార్టీ ఎన్నికల ప్రచారంలో ప్రతిఫలిస్తున్నాయి. ఇక ఉద్యోగులు, టీచర్లు నభూతో అన్న చందంగా పెద్ద ఎత్తున పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకున్నతీరు కూడా వైసీపీ ఓటమి ఖాయమన్న సంకేతాన్నే ఇచ్చింది.  అయితే రాష్ట్ర మంతో ఒకెత్తు అయితే రాయలసీమది ఒక్కటీ ఒకెత్తు. మరీ ముఖ్యంగా కడప జిల్లా పరిస్థితే వేరు అని అంతా అంటుంటారు. కడప జిల్లాలో వైఎస్ ముద్ర అత్యంత బలంగా ఉంటుంది. ఆయన సీఎం కావడానికి ముందు నుంచీ కూడా కడప అంటే కాంగ్రెస్ కంచుకోట అని చెప్పుకున్నా.. ఆ జిల్లాలో కాంగ్రెస్ బలం మొత్తం వైఎస్ బలమేనన్నది తెలిసిందే. వైఎస్ మరణానంతరం వైఎస్ బలం, బలగం జగన్ కు బదలీ అయిపోయింది. 2014, 2019 ఎన్నికలలో ఇది స్పష్టంగా కనిపించింది. 2024 ఎన్నికలలోనూ అదే పరిస్థితి అని అంతా భావించారు. అయితే షర్మిల కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు చేపట్టి, కడప ఎంపీగా పోటీలోకి దిగడంతో కడపలో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అలా అని వైఎస్ ను అభిమానించేవారంతా ప్లేటు ఫిరాయించి.. జగన్ కు దూరం జరిగి షర్మిల పంచకు వచ్చేసిన పరిస్థితీ లేదు. ఇప్పుడు ఏపీలో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దీంతో వైఎస్ అభిమానులంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు. కడపలో ఒక ఓటు అటు, ఒక ఓటు ఇటు అని డిసైడైపోయారు. అంటే కడప లోక్ సభ స్థానంలో  ఒక  పార్టీ అభ్యర్థికి ఓటేస్తే, ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాలలో మరో పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని కడప ఓటర్లు భావిస్తున్నారని పరిశీలకుల విశ్లేషణ. వారి విశ్లేషణ ప్రకారం అసెంబ్లీ ఎన్నికల వద్దకు వచ్చే సరికి వైఎస్ కుమారుడైన జగన్ పార్టీ వైసీపీ అభ్యర్థికి, కడప లోక్ సభ ఎన్నికలలో వైఎస్ కుమార్తె వైఎస్ షర్మిలకు ఓటు వేయాలని మెజారిటీ జనం భావిస్తున్నారు. అదే జరిగితే కడప లోక్ సభ వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి పనైపోయినట్లే అనడంలో సందేహం లేదు. కడప లోక్ సభ లో వైసీపీ ఓట్లను భారీగా షర్మిల తన ఖాతాలో వేసుకుంటారు. తెలుగుదేశం కూటమి ఓట్ల లో ఎటువంటి చీలికా ఉండదు. దీంతో అవినాష్ కు అంటే వైసీపీకి భారీ నష్టం వాటిల్లుతుంది. వైసీపీ ఓట్లలో భారీ చీలిక అనివార్యమని షర్మిల ప్రచారానికి వస్తున్న విశేష జనస్పందనే చెబుతోంది. దీంతో  కడప లోక్ సభ ఎన్నికలలో పోటీ కాంగ్రెస్, తెలుగుదేశం కూటమి మధ్యే అన్న వాతావరణం కనిపిస్తోంది.  వైసీపీ వీరభక్త హనుమాన్ వంటి కేడర్, నేతలూ కూడా వైఎస్ కుమార్తెకు ఓ ఓటు వేద్దాం అన్న అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు.  

వామ్మో.. జనం భూమిపై జగన్ భారీ కుట్ర!

ఒక తెలుగు మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీకి ఊడిపోయే ముఖ్యమంత్రి లాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చేసిన కామెంట్లు విని జనానికి మతిపోతోంది. కడుపులో ఇంత కుట్ర పెట్టుకుని, జనం భూమిని కబళించడానికి ఇన్ని ప్లాన్స్ వేస్తూ, పైకి మాత్రం జనానికి మేలు చేయడానికి మాత్రమే దేశంలో ఎక్కడా లేని ఈ చట్టాన్ని తెస్తున్నట్టుగా జగన్ మాట్లాడుతున్న తీరు చూసి ‘ముదురు టెంకెవే’ అని అని జనం అనుకుంటున్నారు.  ఎవరైనా సరే ఫలానా భూమి తమది అని ప్రభుత్వం దగ్గర ప్రూవ్ చేసుకోవాలి. ఒకవేళ వేరే ఎవరైనా ఆ భూమి తమదని ప్రభుత్వానికి క్లైమ్ చేసుకుంటే, ఆ విషయాన్ని సదరు అసలు ఓనరు గుర్తించి, నిర్ణీత వ్యవధిలో ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలి. లేకపోతే ఎవరైతే ముందు ఆ భూమి తమదని క్లెయిమ్ చేశారో వారికే ఆ భూమి చెందుతుంది. ఆ తర్వాత భూమి రియల్ ఓనర్ కోర్టుకు వెళ్ళే ఛాన్స్ కూడా వుండదు. మళ్ళీ వాళ్ళు ప్రభుత్వానికి మొర పెట్టుకుంటే, ప్రభుత్వమే జరిగిన పొరపాటును గ్రహిస్తుంది. నష్టపోయిన వ్యక్తికి ప్రభుత్వమే నష్టపరిహారం ఇస్తుంది. అంతే తప్ప, అక్రమంగా భూమిని కొట్టేసిన వ్యక్తిని ఏమీ అనదు. ఇక్కడ పెద్ద తిరకాసు ఏమిటంటే, ఏ భూమి అయినా గవర్నమెంట్ విలువ ఎకరానికి రెండు లక్షలు వుంటే, దాని విలువ మార్కెట్లో ఎన్ని కోట్లయినా వుండవచ్చు. ప్రభుత్వ ధరకు, అసలు ధరకు చాలా వ్యత్యాసం వుంటుంది. అంటే, జగన్ మనుషులే భూములు కబ్జా పెడతారు. భూమి సొంతదారు లబోదిబోమంటే, గవర్నమెంట్ పరిహారం ఇస్తుంది. అంటే, లక్షలు, కోట్ల విలువ చేసే భూమికి ప్రభుత్వ రేటు ఎంత వుందో అంత ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. భూమి విలువ ఎంత వుందో అంతే ఇచ్చాంగా.. ఇందులో మా తప్పేముంది అని అమాయకంగా మాట్లాడుతుంది. నీ భూమిని నువ్వు కాపాడుకోకుండా నిర్లక్ష్యం వహించావు, అందుకే అది అన్యాక్రాంతం అయింది. అయినా సరే, ప్రభుత్వం దయతలచి నీకు నష్టపరిహారం ఇచ్చింది అని దానకర్ణుడికి కజిన్ సిస్టర్లా మాట్లాడుతుంది. అప్పుడు భూమి యజమానికి ఏడవటం తప్ప చేసేదేం వుండదు.

చంద్రబాబుపై అసత్య ప్రచారం... ఈసీ ఆదేశం మేరకు సజ్జల భార్గవ్ పై కేసు నమోదు 

వైసీపీ ప్రభుత్వంలో    అడ్డూ, అదుపు లేకుండా వ్యవహరిస్తున్న భజనపరులకు ఎన్నికల కమిషన్  కట్టడి చేసింది . నా కెవ్వరూ  అడ్డూ  లేరు అనుకున్నవారిపై కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం మారితే ప్రత్యర్థులపై కేసులు నమోదవుతాయి. కానీ వైసీపీ ప్రభుత్వ హాయంలోనే కేసులు నమోదు కావడం గమనార్హం. కర్మ సిద్దాంతం ప్రకారం నువ్వు ఏమిస్తావో తిరిగి నువ్వు అందే పొందుతావు. ఇన్నాళ్లు ప్రత్యర్థుల మీద అక్రమ కేసులు బనాయించిన వైసీపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఆదేశాలమేరకు తలొగ్గాల్సి వచ్చింది.స్వంత పార్టీ నేతలపై కేసులు నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.   వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియాలో ఇంఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. భార్గవ్ పై 171f, 171g, 505(2), రెడ్ విత్120బి ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు ఫైల్ అయ్యింది. వైఎస్సార్‌సీపీ‌ సోషల్ మీడియాలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ.. ఆ పార్టీ సీనియర్ నేత వర్లరామయ్య ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఈసీ కేసు నమోదు చేయాలని సీఐడీని ఆదేశించగా.. సీఐడీ కేసు నమోదు చేసింది.సజ్జల భార్గవ్ ఆధ్వర్యంలో ఓటర్లను, పింఛన్ లబ్ధిదారులను తప్పుదోవ పట్టించేలా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రచారం చేశారని టీడీపీ నేత వర్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా పింఛన్ల ఇంటికి ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారని వైఎస్సార్‌సీపీ తప్పుడు ప్రచారం చేశారని టీడీపీ చెబుతోంది. రాష్ట్రంలో వృద్ధులకు ఏప్రిల్ 1న పింఛన్లు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని.. సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగిందని.. రాష్ట్ర వ్యాప్తంగా ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ప్రచారం చేశారని ఆరోపించారు. ఈ ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేయగా.. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు సీఐడీ నుంచి నివేదిక వెళ్లాల్సి ఉంది. అనంతరం ఎలాంటి చర్యలు ఉంటాయన్నది చూడాలి.

జగన్ పారిపోతే దరిద్రం వదిలిపోతుంది!

ఈనెల 13న సార్వత్రిక ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. ఈ ఎన్నికలలో వార్ వన్ ‌సైడ్ అని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, వైసీపీ అధికారం కోల్పోవడంతోపాటు జగనన్న జైలుకు వెళ్ళడం ఖాయమని అందరికీ అర్థమైపోయింది. అందరితోపాటు జగన్‌కి కూడా ఈ విషయం అర్థమైపోయి దేశం నుంచి సతీ సమేతంగా లండన్ పారిపోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈనెల 17 నుంచి జూన్ 1 వరకు తాను లండన్, స్విట్జర్లాండ్ వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలని జగన్ సీబీఐ కోర్టు ముందు దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సీబీఐ సంగతి అలా వుంటే, ఏపీ జనం కూడా జగన్‌ని దేశం వదిలి పారిపోనివ్వకూడదని, అతన్ని దేశంలోనే ఉంచి, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జీవితాంతం జైల్లోనే వుంచాలని కోరుకుంటున్నారు. జగన్ ఈసారి దేశం విడిచి వెళ్ళాడంటే తిరిగి రాడన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ చేసిన పాపాలకు తగిక శిక్ష పడాల్సిందేనని, అలా జరగాలంటే జగన్ దేశం విడిచి వెళ్ళకుండా చూడాలని భావిస్తున్నారు. అయితే జగన్ తిరకాసులు, చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని, డబ్బు వెదజల్లి, రకరకాల కుట్రలు కుతంత్రాలు చేసే మనిషి కాబట్టి, అలాంటి వ్యక్తి దేశం విడిచిపోతే రాష్ట్రానికి, దేశానికి పట్టిన దరిద్రం వదిలిపోతుందని కొంతమంది భావిస్తున్నారు. అందువల్ల జగన్ దేశం విడిచి పారిపోతుంటే చూసీ చూడనట్టు ఊరుకోవడమే మంచిదని అంటున్నారు. జగన్‌కి ఇన్ని ఆస్తులున్నాయి కదా, దేశం వదిలి పారిపోతాడా అనే సందేహాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు దేశం వదిలి పారిపోయిన విజయమాల్యా, నీరవ్ మోడీ లాంటివాళ్ళు తక్కువ వాళ్ళేమీ కాదు. ఒక వేళ జగన్ దేశం వదిలి పారిపోవాలని నిర్ణయించుకుని వుంటే, విదేశాల్లో జీవితాంతం చీకూచింతా లేకుండా గడపడానికి అవసరమైన ఏర్పాట్లు ఏనాడో జరిగిపోయి వుంటాయి.

పాయకరావు పేట.. తెలుగుదేశం కోట!

పాయకరావు పేట తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట లాంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకూ  టీడీపీ అభ్యర్థులు ఏడుసార్లు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ నాలుగుసార్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు విజయం సాధించాయి. రాష్ట్ర విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికలలో  అంటే 2014లో పాయకరావు పేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థి వంగలపూడి అనిత విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ విజయం సాధించింది. అయితే ఆ ఎన్నికలలో వంగలపూడి అనిత పాయకరావు పేట నుంచి పోటీ చేయలేదు. ఆమె పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి పోటీ చేశారు. అక్కడ ఆమె తానేటి వనిత చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే ఓటమితో ఆమె కుంగిపోలేదు. పార్టీలో మంచి వాగ్ధాటి కలిగిన నేతగా ఎదిగారు. వైసీపీ వేధింపులను దీటుగా ఎదుర్కొన్నారు. ఈ సారి అంటే 2024 ఎన్నికలలో ఆమె మళ్లీ పాయకరావు పేట నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.  తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా అనితకు మంచి గుర్తింపు ఉంది. అదీ కాకుండా వైసీపీ దాష్టికాలను ఎదుర్కొని ప్రజల మన్ననలు కూడా పొందారు.  వైసీపీ అధికారంలో ఉన్న గత ఐదేళ్లు టీడీపీకి చెందిన మహిళా నేతలు ఎటువంటి వేధింపులకు గురయ్యారో అందరికీ తెలిసిందే. తెలుగుదేశం మహిళా నేతల చిత్రాలను మార్ఫింగ్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో అనుచిత, అసభ్య వ్యాఖ్యలతో మానసికంగా కుంగదీసే ప్రయత్నం చేయడం వైసీపీ సోషల్ మీడియా వింగ్ కు పరిపాటిగా మారింది. అయితే అటువంటి వేధింపులన్నిటీనీ ఎదుర్కొని వంగలపూడి అని గట్టిగా నిలబడ్డారు.  పార్టీ తరఫున వాయిస్ వినిపించే బలమైన నాయకురాలిగా గుర్తింపు పొందారు.  పాయకరావు పేట రిజర్వ్‌డ్ నియోజకవర్గం అయినప్పటికీ ఇక్కడ కాపు సామాజికవర్గం ఓట్లు కూడా చెప్పుకోదగ్గ స్ధాయిలో ఉన్నాయి. అలాగే బీసీ ఓట్లు కూడా అధికమే.  నియోజకవర్గంలోని 18 తీర గ్రామాల్లో మత్స్యకారుల ఓట్లు ఇక్కడ గెలపు ఓటములను ప్రభావితం చేస్తాయి. వంగలపూడి అనిత తన వ్యక్తిత్వంతో, సవాళ్లను దీటుగా ఎదుర్కొని పాయకరావుపేటలో బలమైన పునాది వేసుకున్నారు. 2019 ఎన్నికల సమయంలో పాయకరావు పేటలో ఆమెకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురుకావడంతో పార్టీ అధినేత చంద్రబాబు ఆమెను నియోజకర్గం మార్చారు. అయితే ఈ సారి ఆమెకు సొంత పార్టీ నుంచి పాయకరావు పేటలో సంపూర్ణ మద్దతు లభిస్తోంది. అలాగే నియోజకవర్గ ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు.  దీంతో ఈ సారి పాయకరావు పేటలో మరో సారి తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.   

జగన్ సర్కార్ పై ఉద్యోగుల ఆగ్రహానికి నిదర్శనం.. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సునామీ!

వైపీపీ ఓటమి తథ్యమన్న బలమైన సంకేతాన్ని ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్  ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 90శాతం మందికి పైగా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. గతంలో ఎన్నడూ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 77 శాతం మించిన దాఖలాలు లేవు. అంతెందుకు పొరుగు రాష్ట్రం తెలంగాణలో గతం కంటే తక్కువ మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఉద్యోగులు ఉప్పెనలా కదలి వచ్చి మరీ తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకున్నారు.  ఈ క్రమంలో వారెన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారు తమ ఓటు ఎక్కడ వేయాలన్న విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఇక్కడ కాదు అక్కడ అంటూ తిప్పారు. కొందరు అధికారులు వారి పని ప్రదేశంలోనే వారి ఓటు ఉంటుందని చెబితే మరి కొందరేమో వారు నివసించే ప్రాంతంలోనే వారి ఓటు ఉంటుందని చెప్పారు. ఈ గందరగోళం కారణంగా కొందరు ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకోలేకపోయారు. మరి కొందరి ఓట్లు గల్లంతయ్యాయి. ఇక పోస్టల్ బ్యాలెట్ కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ ల లో సౌకర్యాలు లేవు. ఇన్ని కష్టాల మధ్య కూడా 90శాతం మందికి పైగా ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  2019 ఎన్నికలలో 77 శాతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైతే.. వాటిలో వైసీపీకి 1.34 లక్షలు, తెలుగుదేశంకు 80 వేలు, జనసేనకు 11 వేలు, బీజేపీకి నాలుగువేల ఓట్లు వచ్చాయి.  అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి అత్యధికంగా 90శాతానికి పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇంత అధికంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలు కావడమే వైసీపీని ఖంగారు పెడుతోంది. ఆందోళనకు గురి చేస్తోంది. జగన్ సర్కార్ ఉద్యోగులను నానా విధాలుగా వేధించింది. వారి పీఎఫ్ డబ్బులను మళ్లించడం దగ్గర నుంచి అన్ని విధాలుగా వారిని వేధింపులకు గురి చేసింది. చులకనగా చూసింది. మద్యం దుకాణాల దగ్గర కాపలాగా పెట్టింది. అసలు మీరేం పని చేస్తున్నారని సమయానికి వేతనాలు, అలవెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంటూ ప్రశ్నించింది. చివరాఖరికి వారి అటెండెన్స్ విషయంలో కూడా ఫేస్ రికగ్నేషన్ అంటూ ఇబ్బందులకు గురిచేసింది. ఈ నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగులు అనేక కష్టనష్టాలకు ఓర్చి కూడా ఎలాగైనా ఓటు వేసి తీరాలన్న సంకల్పంతో పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకోవడం వైసీపీ పట్ల వారికి ఉన్న ఆగ్రహాన్ని, ఎలాగైనా ఆ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న పట్టుదలనూ సూచిస్తోంది. వైసీపీలో అందుకే ఆందోళన వ్యక్తం అవుతోంది.  తాము సృష్టించిన సచివాలయ ఉద్యోగులు వైసీపీకే ఓట్లు వేస్తారని జగన్ సర్కార్ ఆశలు పెట్టుకంది. అయితే సచివాలయ ఉద్యోగులలో కూడా జగన్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి కనిపిస్తోంది. పేరుకు ప్రభుత్వ ఉద్యోగమే అయినా పని ఎక్కువ వేతనం తక్కువ ఉండటంతో వారు కూడా జగన్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.   మొత్తం మీద జగన్ పాలనలో తాము ఎదుర్కొన్న కష్టాలు, అనుభవించిన బాధలు, ఎదుర్కొన్న అవమానాలు.. ఇలా అన్నిటికీ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుని బదులు తీర్చేసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉద్యోగులు, టీచర్ల ఆగ్రహమే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సునామీగా మారిందని అంటున్నారు. గత ఎన్నికల ముందు అప్పటికి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చిన తరువాత తుంగలో తొక్కారనీ, హామీలు నెరవేర్చడం, వాగ్దానాలు అమలు చేయడం సంగతి అటుంచి కనీసం ఒకటో తారికు నాటికి వేతనాలు వస్తే చాలు భగవంతుడా అని వేడుకునే స్ధితికి ఉద్యోగులను తీసుకువచ్చిన జగన్ ప్రభుత్వంపై వారి ఆగ్రహం ఓటుగా మారిందని అంటున్నారు.    ఉద్యోగుల ఆగ్రహాన్ని గమనించిన  వైసీపీ నాయకులు  ఏకంగా ఉద్యోగస్తులు పాదాల మీద ఓటు వేయమంటూ బతిమలాడుకుంటున్న దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.   దీనిని బట్టే ఉద్యోగుల ఆగ్రహజ్వాలల సెగ వైసీపీకి ఎంత గట్టిగా తగిలిందో అర్ధమౌతోందంటున్నారు పరిశీలకులు. 

బెడిసి కొట్టిన ప్లాన్‌.. జగన్ కు జైలు ఖాయం!?

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో  వైసీపీ ఓట‌మి దాదాపు ఖాయ‌మైంది. జ‌గ‌న్, వైసీపీ అభ్య‌ర్థుల‌పై ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డుతున్నారు. కూట‌మికే మా ఓటు అంటూ వైసీపీ అభ్య‌ర్ధుల ఎదుటే కుండ‌బ‌ద్ద‌లు కొట్టేస్తున్నారు. క‌డ‌ప పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో సీఎం జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తీ రెడ్డి ప్ర‌చార స‌మ‌యంలోనూ ఆమెకు ప్ర‌జ‌ల నుంచి నిర‌స‌న సెగ ఎదురైంది. ప్ర‌భుత్వ‌ ప‌థ‌కాలు త‌మ‌కు అంద‌డం లేద‌ని, మ‌ళ్లీ వైసీపీకి మేమెందుకు ఓటు వేయాలంటూ భార‌తిని ప్ర‌శ్నించారు. మ‌రోవైపు ఏపీలో పోస్ట‌ల్ బ్యాలెంట్ లో ఉద్యోగులు జ‌గ‌న్ కు బిగ్ షాకిచ్చిన‌ట్లు తెలుస్తోంది. అన్ని అంశాల‌ను బేరీజు వేసుకొని, ప్ర‌ముఖ స‌ర్వేల ఫ‌లితాల బ‌ట్టి ఓడిపోతున్నామ‌ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఓ క్లారిటీకి వ‌చ్చిన‌ట్లు వైసీపీ వ‌ర్గాలే చెబుతున్నాయి దీంతో ఏపీలో ఎన్నిక‌లు పూర్త‌యిన త‌రువాత ఆయ‌న దేశం విడిచి వెళ్లిపోయావాల‌ని ప్లాన్ చేసుకున్నారు. జ‌గ‌న్‌పై అవినీతి కేసులు కోర్టులో న‌డుస్తున్నాయి. దీంతో కోర్టు అనుమ‌తి లేకుండా జ‌గ‌న్ దేశం విడిచి పోకూడ‌దు.  ఈ క్ర‌మంలో విదేశాల‌కు వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని సీబీఐ కోర్టులో జ‌గ‌న్ పిటిష‌న్ దాఖలు చేశారు. అయితే, జ‌గ‌న్ విదేశాల‌కు వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వొద్ద‌ని కోర్టును సీబీఐ కోరింది. దీంతో ఎన్నిక‌లు అయిపోగానే విదేశాల‌కు వెళ్లిపోవాల‌ని అనుకున్న జ‌గ‌న్ కు బిగ్ షాక్ త‌గిలిన‌ట్ల‌యింది.  ఏపీలో మే 13న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అయితే, మే 17 నుంచి జూన్ 1వ తేదీ వ‌ర‌కు యూర‌ప్ ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని సీఎం జ‌గ‌న్ సీబీఐ కోర్టును కోరారు. జ‌గ‌న్ కుమార్తెలు విదేశాల్లో ఉంటారు. వారితో క‌లిసి లండ‌న్‌, ఫ్రాన్స్‌, స్విట్జ‌ర్లాండ్ ల‌లో ప‌ర్య‌టించేందుకు వీలుగా అనుమ‌తి ఇవ్వాల‌ని జ‌గ‌న్ ఆ పిటిష‌న్ లో కోరారు. దీనిపై కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని సీబీఐని కోర్టు ఆదేశించ‌గా.. సీబీఐ అధికారులు జ‌గ‌న్ విదేశాల‌కు వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వొద్ద‌ని కోర్టును కోరారు. గ‌తంలో రెండుసార్లు కోర్టు అనుమ‌తితో జ‌గ‌న్ విదేశాల‌కు వెళ్లి వచ్చారు. అప్పుడు సీఎంగా ఉండ‌టంతో అనుకున్న స‌మ‌యానికి తిరిగి వ‌చ్చారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల జ‌రుగుతున్నాయి. ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఓట‌మి ఖాయ‌మ‌ని తేలిపోయింది. ఈ క్ర‌మంలో ఆయ‌న విదేశాల‌కు వెళితే తిరిగి వ‌స్తారని గ్యారెంటీ లేద‌న్న వాద‌న‌ను కోర్టు దృష్టికి సీబీఐ తీసుకెళ్లింది. దీంతో తీర్పును ఈనెల 14కి కోర్టు వాయిదా వేసింది. వాస్త‌వానికి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వేసిన‌టువంటి దాదాపు 30కిపైగా డిశ్చార్జి పిటీష‌న్ల పై గ‌త నెల 30లోగా తీర్పు రావాల్సి ఉంది. అనూహ్యంగా న్యాయమూర్తి మార‌డంతో మ‌ళ్లీ మొద‌టి నుంచి విచారణ చేపట్టాల్సిన ప‌రిస్థితి. కానీ  మే15 నుంచి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అస‌లు కేసుల విచార‌ణ ప్రారంభం కానుంది. మెయిన్ కేసుల విచార‌ణ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ ఇండియాలోనే ఉండాలి.. కేసులు జాప్యం జ‌రిగే అవ‌కాశం ఉంటుంది. వాయిదాలు కోరి కేసులు సాగ‌దీసే అవ‌కాశం ఉంటుంద‌ని సీబీఐ   స్ట్రాంగ్ కౌంట‌ర్ దాఖ‌లు చేసింది.  ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఇటీవ‌ల వైఎస్ ష‌ర్మిల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ ఓట‌మి ఖాయ‌మైంద‌ని, జ‌గ‌న్ విదేశాల‌కు పారిపోయేందుకు సిద్ధ‌మ‌వుతున్నారని ఆరోపించారు. ష‌ర్మిల వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియానూ వైర‌ల్ అయ్యాయి. దీంతో సీబీఐ సైతం అల‌ర్ట్ అయ్యింది. జ‌గ‌న్ విదేశాల‌కు వెళ్లేందుకు ఎట్టిప‌రిస్థితుల్లో అనుమ‌తి ఇవ్వొద్ద‌ని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. గ‌తంలో రెండు సార్లు జ‌గ‌న్ విదేశాల‌కు వెళ్లిన స‌మ‌యంలో కోర్టు అనుమ‌తి ఇచ్చింది. అప్పుడు సీబీఐ కూడా పెద్ద‌గా అడ్డు చెప్ప‌లేదు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ విదేశాల‌కు వెళితే తిరిగి రాక‌పోవ‌చ్చున‌ని సీబీఐ భావిస్తోంది.   దీంతో కోర్టు దృష్టికి ఇదే విష‌యాన్ని తీసుకెళ్లిన‌ట్లు తెలుస్తోంది. మోడీ, చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ కూట‌మి బ‌ల‌ప‌డే కొద్దీ జ‌గ‌న్ కు ఉచ్చు బిగుస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జ‌గ‌న్‌పై దృష్టి సారించిన‌ట్లు తెలుస్తుండ‌గా.. జ‌గ‌న్ పై కేసుల్లో క‌ద‌లిక మొద‌లు కాబోతుంద‌న్న చర్చ సైతం మొదలైంది.   ప్ర‌స్తుతం ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఓట‌మి ఖాయ‌మైన నేప‌థ్యంలో వ‌చ్చే రెండేళ్ల‌లో జ‌గ‌న్ పై కేసుల‌న్నీ పూర్తిచేసి.. ఆయ‌న్ను జైలుకు పంపించ‌డం ఖాయ‌మ‌ని ఏపీ రాజ‌కీయా వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఎవ‌రు వ్య‌తిరేకంగా మాట్లాడిన వారి వెనుక చంద్రబాబు కుట్ర ఉంద‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించేలా వైసీపీ నేత‌లు ప్ర‌చారం చేయ‌డం కామ‌న్‌. ప్ర‌స్తుతం కోర్టులో సీబీఐ వాద‌న‌ల విష‌యంలో చంద్ర‌బాబు కుట్ర ఉంద‌ని వైసీపీ నేత‌లు అన్నా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. సాధార‌ణంగా ఎన్నిక‌లు పూర్త‌యిన త‌రువాత ఏ పార్టీ అయినా పోలింగ్ ప్ర‌క్రియ‌పై స‌మీక్ష చేసుకుంటుంది. కానీ, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోలింగ్ స‌ర‌ళిపైనా, వైసీపీకి ఏమేర‌కు ఓటు శాతం న‌మోదైంద‌న్న విష‌యాల‌పై స‌మీక్ష‌లు చేయాల్సింది పోయి.. ఎన్నిక‌లు అయిపోయిన నాలుగురోజుల్లోనే విదేశాల‌కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవ‌టం ప‌ట్ల ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అందుక‌నే సీబీఐ జ‌గ‌న్‌ విదేశాల‌కు వెళ్ల‌కుండా అడ్డుప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి మున్ముందు కాలంలో అరెస్టు నుంచి త‌ప్పించుకునేదుకు జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌న్నీ బెడిసికొడుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. అలాగే జ‌గ‌న్ జైలుకు వెళ్ల‌డం దాదాపు ఖాయ‌మైంద‌న్న వాద‌న ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది.

వైసీపీ పిశాచాల్లారా.. ఇంత దిగజారారేంట్రా!?

అధికారం కోసం ఈ వైసీపీ పిశాచాలు అశుద్ధ భక్షణకు కూడా రెడీ అయ్యేట్టున్నాయి. చేజారిపోబోతున్న అధికారాన్ని మళ్ళీ ఎలాగైనా దక్కించుకుని, రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేయాలన్న ఉద్దేశంతో వైసీపీ నాయకులు పాతాళానికి దిగజారిపోతున్నారు. జూనియర్ఎన్టీఆర్ వైసీపీకి ప్రచారం చేస్తున్నట్టుగా, వైసీపీకే ఓటు వేయాలన్నట్టుగా ప్రకటనలు రెడీ చేసి సోషల్ మీడియాలోకి వదిలిపెడుతున్నారు. ఆ ప్రకటనల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫొటోతోపాటు ‘‘మా నాన్నగారి మరణానతరం నేను రాజకీయాలకు దూరంగా వుంటున్నాను. కానీ, సొంత రాజకీయ లబ్ధి కోసం ఆర్థికంగా వెనకబడి వున్న ముస్లిం మైనారిటీల 4 శాతం రిజర్వేషన్ తొలగిస్తామంటున్న బీజేపీతో కలసి ముస్లిం మైనారిటీలకు ద్రోహం చేయడం సరికాదు. దీనివల్ల ఎస్సా్ర్‌సీపీ గెలుపు అనేది దాదాపు ఖాయం అయినట్టే’’ అని మేటర్ కూడా వుంది. ఈ మేటర్ రాసిన ఫేక్‌గాళ్ళకి మేటర్ రాయడం కూడా వచ్చి చావదు. ‘గెలుపు ఖరారు అయినట్టే’ అని రాసి ఏడవచ్చుగా, ‘గెలుపు దాదాపు ఖరారు’ అయినట్టే అని రాశారు. అంటే, ఈ ఫేక్‌గాళ్ళకి కూడా తమ పార్టీ గెలుస్తుందన్న నమ్మకం పూర్తిగా లేదన్నమాట. ఈ ప్రకటనలు చూసిన ఏపీ జనం ఓరి మీ మొహాలు మండ మరీ ఇంత దిగజారిపోయారేంట్రా అని తిట్టుకుంటున్నారు. 

పెనుకొండలో సవితమ్మ ప్రచారం అదరహో!

శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలో  అశేష జనవాహిని మధ్య పెనుకొండ తెలుగుదేశం అభ్యర్థి శ్రీమతి సవితమ్మ ఎన్నికల ప్రచారం అద్భుతమైన రీతిలో జరుగుతోంది. ఉత్తేజం కలిగించే తెలుగుదేశం పార్టీ పాటలు మైకులలో వినిపిస్తూ వుండగా, తెలుగుదేశం కార్యకర్తలు పసుపుపచ్చ కండువాలను గాలిలో ఊపుతూ సందడి చూస్తూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.  ఈ రోడ్ షో కార్యక్రమంలో పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ, ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, బిజెపి జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

జగన్ మళ్ళీ వస్తే చంద్రబాబుని చంపిస్తాడు!!

జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని చంపిస్తాడా? అవునని అంటున్నాడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే కచ్చితంగా చంద్రబాబుని హత్య చేయిస్తాడని దస్తగిరి కుండ బద్దలు కొట్టాడు. ఒక టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దస్తగిరి ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన వెనుక చంద్రబాబు వున్నాడని జగన్, అతని అనుచరులందరూ ఆరోపణలు చేస్తూ వుంటారని, వాటిలో ఎంతమాత్రం నిజం లేదని దస్తగిరి చెప్పాడు. చంద్రబాబుతో తనకు ఏదైనా లావాదేవీ వుంటే, ఈ ఐదేళ్లలో మీ పార్టీనే అధికారంలో వుంది కదా? ఆధారాలతో సహా బయటపెట్టి వుండొచ్చు కదా అని జగన్‌ని దస్తగిరి ప్రశ్నించాడు. జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చాడంటే చంద్రబాబుతోపాటు తనని, సునీతని, మరికొందరిని తప్పకుండా చంపిస్తాడని దస్తగిరి అన్నాడు. ఈ ఘోరాలు జరగకుండా వుండాలనే తాను మళ్ళీ జగన్ అధికారంలోకి రాకూడదని, టీడీపీ కూటమి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నానని దస్తగిరి అన్నాడు. ఈ ఐదేళ్ళుగా జరిగిన దారుణాలు ఆగిపోవాలంటే జగన్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని దస్తగిరి అభిప్రాయపడ్డాడు. నేను హత్య చేశాను అని ధైర్యంగా చెబుతున్నానని, ఈ కేసులో లేనివాళ్ళని ఇరికించాల్సిన అవసరం తనకు లేదని దస్తగిరి వివరించాడు.