తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.30 కోట్లు

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశంలో వివిధ ప్రాంతాలు, విదేశాల నుంచి కూడా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం పోటెత్తుతున్నారు. బుధవారం (ఆగస్టు 20) తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 30 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. అలాగే ఎస్ఎస్ డి టోకెన్లు తీసుకున్న భక్తులకు స్వామి వారి దర్శనానికి ఆరు గంటలకు పైగా సమయం పడుతోంది.  ఇక మంగళవారం స్వామి వారిని మొత్తం 76 వేల 33 మంది దర్శించుకున్నారు. వారిలో  26,905 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదా యం 5 కోట్ల 30 లక్షల రూపాయలు వచ్చింది.   

తండ్రికి తగ్గ తనయుడు నుంచి తండ్రి స్థాయిని అందుకున్న నాయకుడు.. లోకేష్

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి  నారా లోకేష్ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా రాజకీయంగా ఎదుగుతున్న తీరు ప్రత్యర్థి పార్టీలకు వణుకు పుట్టిస్తుంటే.. జనసామాన్యం ఆనందాశ్చర్యలకు గురౌతున్నారు.  పార్టీ సీనియర్ నాయకులు,  మంత్రులు,  ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులూ లోకేష్ నాయకత్వంపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే లోకేష్ మాట తీరు, ప్రజలలో మమేకమౌతున్న విధానంతో ప్రజానేతగా దాదాపు అందరూ అంగీక రిస్తున్నారు. ఇటు పార్టీలో, ప్రజలలో అభిమానం పెంచుకోవడమే కాదు, అటు హస్తినలో కూడా రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం చేస్తున్న పర్యటనలతో జాతీయ స్థాయిలో లోకేష్ గుర్తింపు పొందుతున్నారు. సమర్థ నాయకుడిగా అందరి ఆమెదం, అంగీకారం పొందారు.   అయితే నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత తేలిగ్గా రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి. పొలిటికల్ గా నారా లోకేష్ తొలి పలుకులు కూడా బయటకు రాకూడదన్న ప్రయత్నాలు జరిగాయి. పప్పు అన్నారు. బాడీ షేమింగ్ చేశారు. హేళన చేశారు. టార్గెట్ చేసి మరీ క్యారెక్టర్ అసాసినేషన్ కు ప్రయత్నించారు. ఇదంతా ఎందుకు?  పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లుగా,  నారా లోకేష్ తండ్రి చాటు బిడ్డగా ఉన్నప్పుడు పార్టీ ప్రగతి కోసం తన ఆలోచనలకు పదు ను పెట్టారు. అలా పదును పెట్టడం ద్వారా వచ్చినవే పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నగదు బదిలీ. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తే తమ ఉనికే ప్రమాదంలో పడుతుందన్న భయంతో ప్రత్యర్థి పార్టీలు.. ఆయనపై  ఎటాక్ ప్రారంభించాయి. మానసికంగా ఆయన స్థైర్యాన్ని దెబ్బతీసి రాజకీ యాలకు దూరం చేయాలని ప్రయత్నించాయి.  ప్రణాళికాబద్ధంగా ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ప్రయత్నించాయి.   అయితే లోకేష్ వెనకడుగు వేయలేదు. ప్రత్యర్థుల విమర్శలను, మాటల దాడులను, హేళనలను ఎదుర్కొంటూ ముందడుగు వేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. ప్రత్యక్ష ఎన్నికలలో తొలి ప్రయత్నంలో పరాజయం పాలైనా కృంగిపోలేదు. పడిలేచిన కెరటంలా ఎదిగారు. ప్రతికూలతలను దీటుగా ఎదుర్కొని సంక్షోభాల్ని అవకాశంగా మల్చుకోవాలన్న తండ్రి మాటల స్ఫూర్తితో  ముందుకు సాగారు. పట్టుదలతో  తనను తాను మేకోవర్ చేసుకున్నారు. ప్రజా నేతగా ఎదిగారు. తండ్రికి తగ్గ తనయుడే కాదు.. తండ్రిని మించిన తనయుడు అన్న నమ్మకాన్ని విశ్వాసాన్ని పార్టీనేతలు, శ్రేణులలోనే కాదు జనంలో కలిగించారు.   తాజాగా లోకేష్ తన హస్తిన పర్యటనలో కేంద్ర మంత్రులతో, ఎన్డీయే మిత్రపక్షాల నేతలతో వరుస భేటీలూ, రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం వారితో చర్చించిన తీరు తరువాత భవిష్యత్ లో ఎన్డీయేలో నారా లోకేష్ మరింత కీలకంగా మారుతారనడంలో సందేహం లేదన్న భావన సర్వత్రా కలుగుతోంది. విశ్లేషకులు సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తరహాలో ఆయన అభివృద్ధి, సంక్షేమం, సాంకేతికత అందిపుచ్చుకోవడంలో జాతీయ స్థాయిలోనే ముందు వరుసలో నిలుస్తున్నారు.   మిత్రపక్షాల నాయకులను సమన్వయం చేయడంతో పాటు టిడిపి ప్రాధాన్యాలను మరింత పెంచే దిశగా లోకేష్ ముందుకు సాగుతున్నారు.  ఇక ఢిల్లీలో తెలుగుదేశం ఎంపీలు, జనసేన ఎంపీలతో ఆయన సమావేశాలు నిర్వహించారు. అంతే కాదు జాతీయ స్థాయిలో  ఎన్డీఏ మిత్రపక్షాల కీలక నేతలతో భేటీలలో రాష్ట్రం గొంతు బలంగా వినిపించారు.   గతంలో తనపై విమర్శలు చేసి ఎగతాళి చేసిన వారే శభాష్ లోకేష్ అనిపించుకునేలా ఎదిగారు. లోకేష్ తాజా హస్తిన పర్యటన ఆయన పరిణితికి, సమర్థతకు, రాష్ట్రప్రయోజనాల పట్ల ఆయనకు ఉన్నశ్రద్ధకు అద్ధం పట్టింది. 

సింగరేణికి బంగారు గనుల అన్వేషణ లైసెన్స్

  సింగరేణి సంస్థకి బంగారు అవకాశం లభించిందని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని దేవదుర్గ్‌లో బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్స్ దక్కినట్లు సీఎండీ తెలిపారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా కీలక ఖనిజ రంగంలోకి ప్రవేశించిందని బలరామ్ వెల్లడించారు.ఆన్‌లైన్ వేలంలో 37.75 శాతం రాయల్టీని కోట్ చేయడం ద్వారా సింగరేణి ఎల్-1 బిడ్డర్‌గా నిలిచిందని పేర్కొన్నారు.  సింగరేణిని ఇతర రంగాల్లోకి విస్తరించాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా చేస్తున్న ప్రయత్నంలో తొలి విజయం సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ గనుల్లో అన్వేషణ పూర్తి చేస్తామని తెలిపారు. దేవదుర్గ్‌లోని బంగారం, రాగి నిక్షేపాలు ఉన్న ప్రాంతంలో సింగరేణి అన్వేషణ విభాగం ఆధ్వర్యంలో త్వరలో పరిశోధన చేయనుంది. వివిధ రకాల అన్వేషణల అనంతరం తుది ఫలితాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో సమర్పించవలసి ఉంటుంది.  ఆ గనులను సింగరేణి లేదా ఇతర సంస్థలు దక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది.ఈ గనులను మైనింగ్ కోసం దక్కించుకున్న సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీలో 37.75 శాతాన్ని ఆ గని జీవితకాలం పాటు సింగరేణికి చెల్లించవలసి ఉంటుంది. బంగారం, రాగి గనుల అన్వేషణ కోసం రూ. 90 కోట్లు వ్యయం అవుతుందని అంచనాలు ఉండగా, రూ. 20 కోట్లు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుంది.  

ముంబైలో భారీ వర్ష బీభత్సం..నిలిచిపోయిన మోనో రైలు

  ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఎలివేటెడ్ ట్రాక్‌పై నడిచే మోనో రైలు నిలిచిపోయింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా మైసూర్ కాలనీ భక్తి పార్క్ స్టేషన్ల మధ్య ట్రైన్ దాదాపు గంటకుపైగా ఆగిపోయింది. ఆ సమయంలో 100 మంది ప్రయాణికులు అందులోోో చిక్కున్నట్లు సమాచారం. ఈఘటనపై సమాచారం అందుకున్న అధికారులు అప్రమత్తమైన సహాయక చర్యలు చేపట్టారు. వరుసగా నాలుగో రోజూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో నగరంలో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.  దీంతో రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అనేక ప్రదేశాలలో రైల్వే ట్రాక్‌లు నీటిలో మునిగిపోయాయి. మరోవైపు విమాన ప్రయాణాలపైనా తీవ్ర ప్రభావం పడింది. ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరే 304 విమానాలు ఆలస్యంగా నడిచాయి. పది విమానాలు రద్దు కాగా, 198 విమానాలు షెడ్యూల్ కంటే ఆలస్యంగా నడుస్తున్నాయి. మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ముంబై, థానే, రాయ్‌గడ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 

ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డిపై హత్యాయత్నానికి కుట్ర

  నెల్లూరు జిల్లా కావలి టీడీపీ ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణా రెడ్డిపై హత్యాయత్నం కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. అన్నవరంలోని గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ వద్ద మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అనుచరుల హల్చల్ చేసినట్లు టాక్. డ్రోన్ లతో వీడియోలు తీస్తున్న వేణు, వినోద్ అనే మాజీ ఎమ్మెల్యే అనుచరులు. వీరికి క్రషర్స్ పాయింట్ ని చూపించిన దామెర్ల శ్రావణ్ అనే వ్యక్తి డ్రోన్ లతో వీడియోలు తీసి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలుసుకునే ప్రయత్నం చేశాడు దుండగుడు.  ఘటనా స్థలికి చేరుకుని పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.స్థానికులు, క్రషర్ వద్ద సిబ్బంది వారిని ప్రశ్నించడంతో కత్తులతో దాడికి దిగిన వేణు,వినోద్ ..క్రషర్ శివార్లలో కారు వేసుకుని రెక్కీ నిర్వహిస్తున్న గుర్తుతెలియని నలుగురు దుండగులు. పోలీసులు విచారణలో తమని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి పంపించారని,ఎవరు అడ్డొచ్చినా ఏదైనా చేయమని చెప్పారని నిందితులు ఒప్పుకున్నరని తెలుస్తోంది.ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డిని హత్య చేసేందుకు కావలిలో సుఫారి గ్యాంగ్ దిగినట్టు సమాచారం.

సర్వేపల్లిలో హోరెత్తిన రైతుల సంతోషం

  అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం కింద తొలి విడత పెట్టుబడి సాయం విడుదలైన సందర్భంగా నెల్లూరు జిల్లా  సర్వేపల్లిలో  మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు.వెంకటాచలం సమీపంలోని ఇసుక డంపింగ్ యార్డు వద్ద నుంచి ఎర్రగుంట టోల్ ప్లాజా దగ్గరలోని కమ్యూనిటీ హాలు వరకు ర్యాలీ సాగింది. 900  ట్రాక్టర్లతో రాష్ట్రంలోనే రికార్డు సృష్టించారు. సంప్రదాయ పంచెకట్టుతో విజయోత్సవంలో ఉత్సాహంగా రైతులు పాల్గోన్నారు. నియోజకవర్గ నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన రైతులు, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భాగస్వాములైరు

చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చిన తెలంగాణ ఉద్యోగ సంఘాలు

  సెప్టెంబర్ 1న పాత పెన్షన్ సాధన సదస్సు హైదరాబాదులో తెలుగు లలిత కళాతోరణం పబ్లిక్ గార్డెన్స్ నందు వేలాదిమంది ఉద్యోగుల భాగస్వామ్యంతో పోరాట సదస్సు నిర్వహణతోపాటు  33 జిల్లాల కేంద్రాల్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ విస్తృతస్థాయి సమావేశం చైర్మన్ మారం జగదీశ్వర్,  సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు  ఆధ్వర్యంలో TNGO భవన్ నాంపల్లి హైదరాబాద్ లో 206 భాగస్వామ్య సంఘాలు పాల్గొనగా ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చూపుతున్న ఉదాసీన వైఖరికి నిరసనగా ప్రధానంగా పెండింగ్ బిల్లుల మంజూరు, పిఆర్సి అమలు, పెండింగ్ డీఏలు మంజూరు, ఉద్యోగుల ఆరోగ్య పథకం, సిపిఎస్ విధానం రద్దు తదితర 63 డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఉద్యమ కార్యచరణ ప్రకటించారు.. సెప్టెంబర్ 8 నుండి తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల పర్యటన ఉద్యోగుల చైతన్యం కోసం బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 8 న వరంగల్ జిల్లా సెప్టెంబర్ 9 న కరీంనగర్ జిల్లా  సెప్టెంబర్ 10న ఆదిలాబాద్ జిల్లా  సెప్టెంబర్ 11న నిజాంబాద్ జిల్లా  సెప్టెంబర్ 12న సంగారెడ్డి మెదక్ జిల్లాలలో  సెప్టెంబర్ 15న వికారాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో  సెప్టెంబర్ 16న మహబూబ్నగర్ జిల్లా  సెప్టెంబర్ 17న నల్లగొండ జిల్లా  సెప్టెంబర్ 18న ఖమ్మం కొత్తగూడెం జిల్లాలో  సెప్టెంబర్ 19 నుండి మిగతా జిల్లాలలో నిరసన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.  

చంద్రబాబు, జగన్, కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ విజ్ఞప్తి...ఎందుకంటే?

  విపక్ష ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ప్రకటించడం హర్షణీయమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలుగు ప్రజల ప్రతిష్టను పెంచే విధంగా తీసుకున్న నిర్ణయమని ముఖ్యమంత్రి తెలిపారు.ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎంలు కేసీఆర్ జగన్ , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కోరారు. కూటమి అభ్యర్థిగా తెలుగు వ్యక్తి గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.  రాజకీయలకు అతీతంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. . రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల నేతలంతా కలిసి రావాలి. ఆనాడు ప్రధాని పీవీ నరసింహారావుకు ఎన్టీఆర్‌ మద్దతు ఇచ్చారు. నంద్యాల ఉప ఎన్నికలో పీవీపై పోటీ పెట్టకుండా గెలిపించారు. తెలుగువాడు అత్యున్నత స్థానంలో ఉండాలనే భావనతో సహకరించారు.  ఇప్పుడు మరోసారి తెలుగు నేతలంతా ఎన్టీఆర్‌ స్ఫూర్తితో సహకరించాలి. జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి రైతు కుటుంబం నుంచి వచ్చారు. న్యాయమూర్తిగా, లోకాయుక్తగా దేశానికి సేవలందించారు ముఖ్యమంత్రి అన్నారు.జస్టిస్ సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్ సభ్యుడు, ప్రతినిధి కాదని స్పష్టం చేశారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి ఏ పార్టీతో సంబంధం, అనుబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి రాజ్యాంగ పరిరక్షకుడిగా వ్యవహారిస్తారని సీఎం పేర్కొన్నారు.  

కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టులో కేసీఆర్ పిటిషన్

  జస్టిస్‌ ఘోష్ నివేదికను సవాల్‌ చేస్తూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు  హైకోర్టును ఆశ్రయించారు. రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తోందని పిటిషన్‌లో వారు పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఏది కావాలో కమిషన్‌ నివేదిక ఆ రకంగా ఉందని కోర్టుకు తెలిపారు.కమిషన్‌ నివేదికపై స్టే ఇవ్వాలని గులాబీ నేతలు విజ్ఞప్తి చేశారు.  గత బీఆర్‌ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేయడానికి జస్టిస్‌ ఘోష్ కమిషన్ నియమించిన సంగతి తెలిసిందే.  దాదాపు 16 నెలల పాటు విచారించిన కాళేశ్వరం కమిషన్‌ 650 పేజీలకు పైగా నివేదికను రెండు సీల్డ్‌ కవర్లలో ప్రభుత్వానికి అందజేసింది కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై అసెంబ్లీలో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.  గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులను, పలువురు కీలక అధికారులను ఈ కమిషన్ విచారణ జరిపింది. ఈ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్, ఈ ప్రాజెక్ట్‌లో పనిచేసిన అధికారులని కూాడా విచారించింది. కమిషన్‌కు వారు ఇచ్చిన సమాచారం కూడా కీలకంగా మారింది. అయితే దీనికి తోడు కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో పనిచేసిన పలువురు అధికారుల నివాసాల్లోనూ ఏసీబీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే.

ఉపరాష్ట్రపతి ఎన్నిక బీఆర్‌ఎస్‌కీ ముందు నుయ్యి... వెనుక గొయ్యి

  ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేరు ప్రకటించటంతో బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉన్నట్లుండి తెలంగాణకు చెందిన వ్యక్తిని ఎలా ఎంపిక చేశారంటూ చర్చించుకోవడం మొదలైంది. దీని వెనుక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రమేయం ఉందని అంటున్నారు. లేకుంటే సడన్‌గా ఆయన పేరు తెరపైకి ఎలా వచ్చిందంటూ అప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు చర్చ మొదలైంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో గులాబీ పార్టీ ఎటువైపు అడుగులు వేయబోతోందనేది ఆసక్తికరంగా మారింది. దీంతో బీఆర్ఎస్ లోగుట్టు బయటపడడం ఖాయమని అంటున్నారు.  స్థానిక వ్యక్తికి బీఆర్ఎస్ సపోర్టు చేస్తుందా? ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇస్తుందా? ఈ వ్యవహారం బీఆర్ఎస్‌కు మింగుడుపడడం లేదు. బీఆర్ఎస్ కు రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు . రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బీఆర్ఎస్ దూరంగా ఉంటోంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వలేని పరిస్థితి. రాజకీయాల్లో జాగ్రత్తగా అడుగులు వేయాలి. లేకుంటే పార్టీ ఫినిష్ అవుతుంది. ఇప్పుడు అసలైన పరీక్ష కారు పార్టీకి ఎదురైంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక బీఆర్‌ఎస్ పార్టీకి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నచందంగా మారింది. ఎందుకంటే ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ప్రకటించింది బీజేపీ.  మరోవైపు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతు ఏ రాజకీయ పార్టీలో నాకు సభ్యత్వం లేదని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ పొలిటికల్ పార్టీతో ప్రమేయం లేని వ్యక్తి తమ అభ్యర్థిగా ఉండాలని ఇండియా కూటమి భావించి ఉండవచ్చని అందులో భాగంగానే నా పేరును ప్రతిపాదించి ఉండవచ్చన్నారు. తన అభ్యర్థిత్వంపై తనను అడాగరని అందుకు నేను అంగీకరించానని చెప్పారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి తన పేరు ఖరారు చేసిన నేపథ్యంలో ఓ న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి.. సౌత్, నార్త్ ఇదంతా అర్థవంతమైనటువంటి చర్చ కాదన్నారు. పార్టీలతో నిమిత్తం లేకుండా అదరి మద్దతు అడుగుతానని చెప్పారు.

ఇంకేముంది..అంతా అయిపోయింది...హరీశ్ రావు ఫోటోకు మంత్రి క్యాప్షన్

  ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్బంగా హైదరాబాద్‌ గ్రీన్ పార్క్ హోటల్లో సమాచార ప్రసారాల శాఖ ఏర్పాటు చేసిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పాల్గోన్నారు. అక్కడ ప్రదర్మించిన ఫోటోలను పరిశీలించిన పొంగులేటి తనదైన శైలిలో స్పందించారు. ఓ ఫోటో మాజీ మంత్రి హారీశ్‌రావు హావభావాలు ఇంకేముంది. అంతా అయిపోయింది. అన్నట్లుగా ఉన్నాయని సైటైర్ వేశారు. ఈ ఫోటో తీసిన కెమెరామెన్‌కు ప్రత్యేక కన్సోలేషన్ అవార్డు లభించింది. ఒక ఫోటో వేల పదాలకు సమాధానం...కొన్ని శతాబ్ధాల పాటు మిగిలిపోయే  జ్ణాపకాలను అందిస్తుంది.  ఒక్కో ఫోటో ఒక్కో భావాన్ని, ఆలోచనను వ్యక్తపరుస్తుంది.  ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో తీసిన ఆ ఫోటోలు ఎన్నో అర్ధాలను, ఎన్నో భావోద్వేగాలను కలిగిస్తాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను మంత్రి  తిలకించాను. చాలా ఫోటోలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అందులో ఫోటోలు తీసిన విధానం, ఫోటోగ్రాఫర్లు పడిన కష్టం ఫోటోలలో స్పష్టంగా కనిపించిందని తెలిపారు. అద్భుతంగా తీసిన ఫోటోలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని పొంగులేటి వెల్లడించారు. మధుర జ్ణాపకాలను నెమరేసుకోవడంలోనే కాదు క్లిష్టమైన సమస్యల పరిష్కారంలో కూడా ఫోటోలు ఎంతో ఉపయోగపడిన సందర్భాలున్నాయి.  ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దేశ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసు దర్యాప్తులో ఒకే ఒక్క ఫోటో కీలక ఆధారంగా మారి నిందితులకు శిక్ష పడేలా చేసింది. అదీ ఫోటో కున్న విలువ ఆయన తెలిపారు.  సమాచార పౌర సంబంధాల శాఖ నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీల్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, రాజీ యువ వికాసం, జనరల్ విభాగాల్లో గెలుపొందిన ఉత్తమ ఫోటోగ్రాఫర్లను సన్మానించి అవార్డులను మంత్రి అందజేశారు. ఫోటో గ్రాఫర్లను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం భవిష్యత్ లో కూడా కొనసాగిస్తుందని శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ఒక ఫోటో వేల పదాలకు సమాధానం...కొన్ని శతాబ్ధాల పాటు మిగిలిపోయే  జ్ణాపకాలను అందిస్తుంది. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఐ అండ్ పీఆర్ కమిషనర్  ప్రియాంక , ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి, సీఎం సీపిఆర్వో మన్సూర్ పాల్గొన్నారు  

ఆసియా కప్‌కు భారత్ జట్టు ప్రకటన

  దుబాయ్ వేదికగా  సెప్టెంబర్ 9 నుంచి జరగనున్న ఆసియా కప్‌కు బీసీసీఐ భారత జట్టు ప్రకటించింది. ముంబైలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో 15 సభ్యులతో స్క్వాడ్‌ను అనౌన్స్ చేసింది. యంగ్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కలేదు. ఈ జట్టుకు కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ కొనసాగగా.. టెస్ట్‌ జట్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ కొత్తగా వైస్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.   స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు చోటు దక్కలేదు. వికెట్‌కీపర్‌ బ్యాటర్లుగా సంజూ శాంసన్‌, జితేశ్‌ శర్మ చోటు దక్కించుకున్నారు. ప్రసిద్ద్‌ కృష్ణ, వాషింగ్టన్‌ సుందర్‌, ధృవ్‌ జురెల్‌, రియాన్‌ పరాగ్‌, యశస్వి జైస్వాల్‌ స్టాండ్‌ బై ప్లేయర్లుగా ఎంపికయ్యారు. ఈ టోర్నమెంట్ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది.   భారత జట్టు సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్ (వైస్‌ కెప్టెన్‌), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్‌ దూబే, అక్షర్ పటేల్‌, జితేశ్‌ శర్మ (వికెట్‌కీపర్‌), జస్ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్‌, సంజు శాంసన్‌ (వికెట్‌కీపర్‌), హర్షిత్ రాణా, రింకూ సింగ్

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు..? బీఆర్ఎస్, వైసీపీ సంకటం

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందనే సామెత …. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీలకు ఎదురవుతోంది.  ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరపున సి.పి. రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి తెలంగాణా కు చెందిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వైసీపీ, బీఆర్ఎస్ ఏ కూటమిలోనూ లేవు. దీంతో ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ కూటమికి మద్ధతు ఇవ్వాలనే విషయంలో ఈ రెండు పార్టీలకు సంకట స్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ కు రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బీఆర్ఎస్ దూరంగా ఉంటోంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వలేని పరిస్థితి.   ఎవరికీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉంటుందా? ఎవరికైనా అండగా నిలుస్తుందా వేచి చూడాలి.   ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్ పార్టీది కూడా సరిగ్గా ఇదే పరిస్థితి.  2019 నుంచి 2024  వరకు రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ కేంద్రంలో ఎన్డీయే కూటమికి అండగా నిలిచింది.  గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. ఎన్డీయే కూటమి విజయం సాధించింది.  ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి జగన్ రాష్ట్ర వ్యవహారాల్లో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.  ఇదే సమయంలో బీజేపీ పట్ల ఎటువంటి వ్యతిరేకతా వ్యక్తం చేయకుండా జాగ్రత్త వహిస్తున్నారు. అయితే తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇస్తే రాష్ట్రంలో కయ్యం… కేంద్రంలో వియ్యం అనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.  కాంగ్రెస్ కు మద్దతు ఇస్తే తనపై ఉన్న కేసుల విషయంలో బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారోనన్న భయంతో ఉన్నారు. మొత్తం మీద ఉపరాష్ట్రపతి ఎన్నికలు వైసీపీ, బీఆర్ఎస్ లకు తలనొప్పిగా మారుతున్నాయి.

పేదరిక నిర్మూలన ఎన్టీఆర్ సిద్దాంతం : సీఎం చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్‌లో పేదరిక నిర్మూలన కోసం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పీ4 అమలు కార్యక్రమాన్ని మంగళగిరిలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు పేదరిక నిర్మూలన అనేది సీనియర్ ఎన్టీఆర్ సిద్దాంతమని ఆయన పాలన సమయంలో వెలుగు కార్యక్రమం తీసుకొచ్చినట్టు తెలిపారు. దీని ముఖ్య ఉద్దేశం పేదరిక నిర్మూలన అని ఆర్థిక సంస్కరణ వల్ల సంపద సృష్టించడం చాలా సులభమైనట్టు తెలిపారు. ఉగాది రోజు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ప్రభుత్వం బంగారు కుటుంబాలు, మార్గదర్శుల ఎంపిక ప్రక్రియ చేపట్టింది. పీ-4లో దాదాపు 13 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించింది. మార్గదర్శలుగా 1.40 లక్షల మంది పారిశ్రామిక వేత్తలు, ప్రవాసాంధ్రులు ముందుకొచ్చారు. పీ4 ద్వారా హెచ్‌సీఎల్‌ కంపెనీలో ఉద్యోగం కల్పించడంతో భావోద్వేగానికి గురైన కృష్ణా జిల్లా వాసి పావని కంటతడిపెట్టుకున్నారు. డొక్కా సీతమ్మ అంటే పేదల పెన్నిధి. అన్నదాతగా ఇప్పటికీ ప్రజల్లో గుర్తుండిపోయారు. మంచి కార్యక్రమం చేస్తే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది.  సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక కార్యక్రమాలు చేశాను. జన్మభూమి, ప్రజల వద్దకు పాలన, శ్రమదానం వంటి కార్యక్రమాలు చేశామన్నారు. బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు సౌదీ అరేబియాకు చెందిన పలువురు తెలుగువాళ్లు ముందుకొచ్చారు. కుప్పం నియోజకవర్గానికి చెందిన 250 కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. దత్తతకు సంకేతంగా అడాప్ట్‌ ట్రీని బంగారు కుటుంబాలకు ఆయన అందజేశారు.మంచి కార్యక్రమాలు చేస్తే చరిత్ర గుర్తు పెట్టుకుంటుందని సీఎం తెలిపారు. 

తిరుమల కొండపైకి కూడా ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల

మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే స్త్రీ శక్తి పథకాన్ని  తిరుమలకు  పొడిగించినట్లు ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మంగళవారం (ఆగస్టు 19) ప్రకటించారు. అయితే.. తిరుమల కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డులో బస్సులలో సీట్లు భర్తీ అయ్యేంత వరకూ ఉచిత బస్సు ప్రయాణాన్ని అనుమతిస్తామని ఆయన తెలిపారు.  అవనిగడ్డలోని ఆర్టీసీ బస్టాండును పరిశీలించిన ఆయన..  బస్సుల్లో మహిళా ప్రయాణికులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఉచిత బస్సు ప్రయాణం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.  బస్టాండులో మహిళల, పురుషుల మరుగుదొడ్లను పరిశీలించారు. ఉచిత ప్రయాణ పథకం ప్రారంభించిన నేపథ్యంలో పెరిగే మహిళా ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలని డిపో మేనేజర్ ను ఆదేశించారు.  ఆ తరువాత మీడియాతో మాట్లాడిన కొనకళ్ల తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రారంభించిన స్త్రీ శక్తి - పథకానికి మహిళల నుంచి అపూర్వ స్పందన లబ్దిస్తోందన్నారు. రాష్ట్రంలో ఈ నెల 16వ తేదీ పది లక్షల మంది, 17వ తేదీ 15 లక్షల మంది, 18వ తేదీ 18లక్షల మంది ఉచిత బస్సు ప్రయాణం చేశారని తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలకు రోజుకు రూ.ఆరు కోట్ల 30 లక్షలు లబ్ది కలుగుతుందని వివరించారు. ముఖ్యంగా ఆసుపత్రులకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే మహిళలు, చిరుద్యోగాలు చేసే మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు.  

యథావిథిగా మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ 25న

మద్యం కుంభకోణంలో అరెస్టై ప్రస్తుతం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజంపేట ఎంపీ, వైసీపీ కీలక నాయకుడు అయిన మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు  షాక్ ఇచ్చింది. దీంతో ఆయనను జగన్ ఈ నెల 25న పరామర్శ యథావిధిగా జరుగుతుంది. వాస్తవానికి జగన్ ఇప్పటి వరకూ మద్యం కుంభకోణంలో అరెస్టైన ఎవరినీ పరామర్శించలేదు. దీంతో జగన్ మద్యం కుంభకోణం నిందుతులకు ముఖం ఎందుకు చాటేస్తున్నారన్న అనుమానాలు వైసీపీలోనే బలంగా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక తప్పదన్నట్లుగా జగన్ ఈ నెల 25న మిథున్ రెడ్డిని పరామర్శించడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. అయితే తాను జైలుకు వెళ్లి పరామర్శించాల్సిన అవసరం లేకుండా ఆయనకు బెయిలు వచ్చేస్తుందని ఆశించినట్లుగా కనిపిస్తోంది. అయితే మిథున్ రెడ్డి బెయిలు పిటిషన్ నుఏసీబీ కోర్టు  కొట్టివేసింది. దీంతో అనివార్యంగా, ఇష్టం ఉన్నా లేకున్నా జగన్ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో మిథున్ రెడ్డిని పరామర్శించక తప్పని పరిస్థితి ఏర్పడింది.   ఇదే కేసులో అరెస్టై విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నభారతీ సిమెంట్స్ ఆడిటర్ బాలాజీ గోవిందప్ప, మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలు దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్లను కూడా ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా సిట్ దర్యాప్తు బృందం అధికారులు వీరికి బెయిలు మంజూరు చేయవద్దంటూ కోర్టును కోరడమే కాకుండా, మద్యం కుంభకోణంలో వారి పాత్రను నిర్ధారించే పలు ఆధారాలను కోర్టుకు సమర్పించారు.  అలాగే మ‌ద్యం కుంభకోణంలో  మిథున్ రెడ్డి న‌గ‌దును త‌రలించ‌డంలోనూ.. కుంభకోణానికి రూప‌క‌ల్ప‌న చేయ‌డంలోనూ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. మిథున్ రెడ్డికి చెందిన కంపెనీకి మద్యం స్కాం సొమ్ము 5 కోట్ల రూపాయలు చేరిందనీ, అయితే ఆయన తెలివిగా వాటిని తిరిగి ఇచ్చేశారనీ సిట్ అధికారులు కోర్టులు ఆధారాలతో అందజేశారు. అలాగే..  మాజీ ఐఏఎస్ ధ‌నుంజ‌య‌రెడ్డి, కృష్ణమోహన్ లు కూడా ఈ స్కాంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు.  అదే విధంగా  భారతీ సిమెంట్స్ ఆడిట‌ర్ గోవింద‌ప్ప‌ మ‌ద్యం కుంభ‌కోణం ద్వారా వ‌చ్చిన నిధుల‌ను ఎలా మ‌ళ్లించాలి? ఏయే రంగాల్లో పెట్టుబ‌డులు పెట్టాలి? అనే విష‌యాల‌పై స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌డంతోపాటు.. 150 కోట్ల‌ను దారిమ‌ళ్లించార‌ని సిట్ అధికారులు కోర్టుకు వివ‌రించా రు.   పిటిష‌నర్ల త‌ర‌ఫున న్యాయ‌వాదులు  అస‌లు త‌మ వారికి మద్యం కుంభకోణంలో ఎలాంటి ప్ర‌మేయం లేద‌ని తెలిపారు.  ఇరు పక్షాల వాదనలూ విన్న ఏసీబీ కోర్టు వీరందరి బెయిలు పిటిషన్లనూ డిస్మిస్ చేస్తూ తీర్పు వెలువరించింది.  

హైదరాబాద్‌లో ఐటీ సోదాలు కలకలం

  హైదరాబాదు నగరంలో మరోసారి ఐటీ సోదాలు కొన సాగుతుడడంతో తీవ్ర కలకలం రేపుతుంది. DSR గ్రూప్ కన్స్ట్రక్షన్ కంపనీ లో ఐటీ సోదాలు నిర్వహిం చారు. DSR ఇన్ఫ్రా స్ట్రక్షర్ ప్రయివేటు లిమిటెడ్ , DSR ఇన్ఫ్రా స్ట్రక్షర్ కంపెనీల్లో మరియు .DSR గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్స్ ఇళ్లల్లో సోదాలు జరుగు తున్నాయి. సంస్థ సీఈవో సత్యనారాయణరెడ్డి, ఎండీ సుధాకర్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు.  హైదరాబాద్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో మొత్తం 13 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. టాక్స్ చెల్లింపులలో భారీగా అవకత వకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగి సోదాలు కొనసా గిస్తున్నారు.గడిచిన 5ఏళ్ల పన్నుల చెల్లింపు లపై ఐటీ ఆరా తీస్తున్నారు.  హైదరాబాద్ తోపాటు నెల్లూరు, చెన్నై, బెంగళూరులో మొత్తం 15చోట్ల సోదాలు కొనసాగించారు. హైదరాబాదు నగరంలోని జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్ ,SR నగర్ , సురారంలో ఐటీ సోదాలు నిర్వహించారు.హైదరాబాద్ నగరంలోని డిఎస్ఆర్ గ్రూపులో ఈరోజు ఉదయం నుండి ఐటి అధికా రులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్న మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇండ్లలో కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు.డి ఎస్ ఆర్ గ్రూపు లో రంజిత్ రెడ్డికి భాగస్వామ్య ఉంది. DSR ఎండీ సుధాకర్ రెడ్డితో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, అలాగే సీఈఓ సత్య నారాయ ణరెడ్డి ఇళ్లల్లో మరియు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. CRPF బలగాల మధ్య ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో సోదాల్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.ఫిలింనగర్ లో  డి ఎస్ ఆర్ భాగస్వామ్యంతో రంజిత్  రెడ్డి అతిపెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు.  

డాక్టర్ సునీత, సీబీఐ అధికారి రాంసింగ్ లపై కేసులు క్వాష్ చేస్తాం.. సుప్రీం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల బెయిల్‌ రద్దు పిటిషన్ నుసుప్రీంకోర్టు మంగళవారం(ఆగస్టు 19)) విచారణ జరిపింది. జస్టిస్‌ సుందరేశ్‌, జస్టిస్‌  సింగ్‌ లతో కూడిన ధర్మాసనం  వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు గడువు విధించినందు వల్లే దర్యాప్తును ముగించినట్లు సీబీఐ చెబుతోందన్న లూథ్రా వివేకా హత్య కేసులో మరింత దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వివేకా హత్య సూత్రధారులు తెలాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.  వివేకా హత్య కేసు నిందితులు  సాక్ష్యులను బెదిరించడమే కాకుండా.. సాక్ష్యాలను నాశనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్న లూథ్రా, వివేకా కుమార్తె డాక్టర్  సునీత దంపతులతోపాటు సీబీఐ అధికారి రామ్‌సింగ్‌పైనా కేసు పెట్టారని సుప్రీంకు తెలిపారు. ఈ దశలో జోక్యం చేసుకున్న సుప్రీం కోర్టు వారిపై కేసులను క్వాష్ చేస్తామని పేర్కొంది.  లూథ్రా తన వాదనలు కొనసాగిస్తూ.. వివేకా హత్య కేసులో మాస్టర్ మైండ్ కడప ఎంపీ అవినాష్ రెడ్డే అని చెప్పారు.