IMPACT OF YOUR THOUGHTS ON YOUR LIFE

Can't hold back sharing a small story that subtly reminds the impact of your thoughts on your life: Read the Thinking of a Couple to realize how inspiring it is! A famous writer was in his study room. He picked up his pen and started writing: **Last year, I had a surgery and my gall bladder was removed. I had to stay stuck to the bed due to this surgery for a long time. **The same year I reached the age of 60 years and had to give up my favorite job. I had spent 30 years of my life in this publishing company. **The same year I experienced the sorrow of the death of my father. **And in the same year my son failed in his medical exam because he had a car accident. He had to stay in bed at hospital with the cast on for several days. The destruction of car was another loss. At the end he wrote: "Alas! It was such bad year!!" When the writer's wife entered the room, she found he husband looking sad lost in his thoughts. From behind his back she read what was written on the paper. She left the room silently and came back with another paper and placed it on side of her husband's writing. When the writer saw this paper, he found this written on it: **Last year I finally got rid of my gall bladder due to which I had spent last few years in pain. **I turned 60 with sound health and got retired from my job. Now I can utilize my time to write something better with more focus, passion and peace. **The same year my father, at the age of 95, without depending on anyone or without any critical medical condition reached his liberation. **The same year, my son was blessed with a new life. My car was destroyed but my son stayed alive without getting any disability. At the end she wrote: "This year was an immense blessing and it passed well and I'm thankful that I'm part of this universe!!" Conclusion: In our daily lives we must see that it is not happiness that makes us grateful but gratefulness that makes us happy.   - Junaid Tahir Courtesy: Glow With Health Wellness Solutions

ఉత్సాహం నింపే ఉగాది

ముందుగా అందరికీ శ్రీ మన్మథ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ మన్మథ నామ సంవత్సరానికి సంవత్సరానికి స్వాగతం పలికే ఈ రోజున అందరి జీవితాలలో సుఖ సంతోషాలు నిండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం. ‘కొత్త’ ఎప్పుడూ ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అందుకే అనంతమైన కాలానికి అక్కడక్కడ ఇలా కొత్తదనాన్ని ఆపాదిస్తూ మనల్ని మనం ఉత్సాహపరచుకుంటూ వుంటాం. నిన్నటిదాకా లేనిదేదో ఈరోజు సరికొత్తగా రూపుదిద్దుకుంటోందని భావిస్తాం. ఈ ఉత్సాహం, ఈ ఆశే ఈరోజంతా పండుగ వాతావరణం నెలకొనటానికి కారణం. ఈ చిన్న విషయాన్ని గ్రహించగలిగితే ప్రతిరోజునూ పండుగలా వేడుకగా మార్చుకోగలం. ఉగాది పండుగను మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా అనేక ప్రాంతాల్లో చేసుకుంటారు. ఆ వివరాలు... ఉగాదిని మహారాష్ట్రలో గుడిపడ్వాగా, సింధీలు చేతిచంద్‌గా, పంజాబీలు బైశాఖీగా, తమిళనాడులో పుతండుగా, మణిపురిలో సాజి బుచె రోబా (saji bchei rao ba)గా, కర్ణాటకలో యుగాదిగా పిలిచే ఈ రోజు మనందరితోపాటు వీరందరికీ కొత్త సంవత్సర ఆరంభమే. వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలువబడుతూ, వివిధ ఆచారాలు పాటించినా అందరూ కోరుకునేది ఒక్కటే... ‘కాలం’ కరుణ చూపించాలని. జీవితాలలో ఆనందాన్ని నింపాలని. ఉగాది ఓ కొత్త ఆశకి చిగురు తొడిగే రోజని మనమందరం భావిస్తాం. అయితే ఇక్కడే ఓ చిన్న విషయాన్ని గ్రహించాలంటారు మన పెద్దలు. మనం నాటే ఓ విత్తనం మొలకెత్తి, చిగురించి మొక్కగా మారడానికి కొంత సమయం పడుతుందని మనందరికీ తెలిసిందే. అలాగే మన ఆశల విత్తనాలు చిగురించి ఓ వృక్షంగా మారి మధుర ఫలాల్ని అందించడానికి కూడా కొంచెం సమయం పడుతుంది. మన ఆశల విత్తు మొలకెత్తేందుకు దృఢ సంకల్పమనే నీరు చాలు. అది వటవృక్షమై మన లక్ష్యాల ఫలాలని మనకందించడానికి. అందుకే ఈ ఉగాది రోజున మన మనసులలో ఓ చిన్న విత్తుని నాటుదాం. దాని ఫలాల కోసం వచ్చే ఉగాది వరకూ ఎదురుచూద్దాం. నాకు బాగా గుర్తు... మా తాతగారు ఉగాది రోజున ఉగాది పచ్చడి పెట్టి, అక్షింతలు వేసి ఆశీర్వదించాక ఇంట్లో అందర్నీ ఒకచోట కూర్చోబెట్టి ఒక్కొక్కరిని ఇలా అడిగేవారు. ‘‘ఈ సంవత్సరమంతా ఎలా గడవాలని కోరుకుంటున్నావ్?’’ అని. ఎవరికి వాళ్ళం మా మా ఆశలు, కలల గురించి చెప్పేవాళ్ళం. అంతా విన్నాక ఒక్కసారి కళ్ళు మూసుకుని మీరు కోరుకున్నవన్నీ జరుగుతున్నట్టు ఊహించుకోండి. ఆ సమయంలో మీ మనసులో నిండే ఆనందాన్ని ఇప్పుడే పొందండి అనేవారు. మేం అలాగే చేసేవాళ్ళం. ఆశ్చర్యంగా మా ఆశలు, కోరికలు తీరతాయనే గట్టి నమ్మకం ఏర్పడేది. దీన్నే క్రియేటివ్ విజువలైజేషన్ అంటారని ఆ తర్వాత తెలిసింది నాకు. ఇప్పటికీ మేం అందరం ఈ సంవత్సరం మా జీవితాలలో ఏయే మార్పులు తెస్తోంది అన్నది కళ్ళముందు నింపుకుంటాం. ఆ ఉత్సాహాన్ని గుండెల్లో నింపుకుని రేపటి కోసం ఎదురుచూస్తాం. ఈ శ్రీ మన్మథ నామ సంవత్సరాది రోజున మనందరం ఈ సంవత్సరమంతా మనం కోరుకునేవన్నీ మనకి దక్కాలని ఆశపడతాం. అయితే అవన్నీ మనకి దక్కుతాయో లేదోనని ఓ చిన్న భయం కూడా మనల్ని వెంటాడుతుంది. ఆ భయాన్ని వదిలేసి మనం కోరుకున్నది మనకి దక్కినట్టు అప్పటి ఆ ఆనందం రుచిని ఇప్పుడే పొందగలిగితే అది మనలో ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ ఉగాదికి మనకి మనం ఇచ్చుకోవలసిన కానుక అదే. సరే మరి.. ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, కొత్త బట్టలు, కొత్త ఆశలు, మావి చిగురులు... ఇవన్నీ మనలో నింపే ఉత్సాహం ఈ సంవత్సమంతా మన వెన్నంటి వుండాలని కోరుకుంటూ మీ అందరికీ మరోసారి శ్రీ మన్మథ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. -రమ ఇరగవరపు  

ఎ టు జడ్.. మగువలే బెస్ట్

ఆడవాళ్ళూ మగవాళ్ళతో సమానంగా ఎదిగారని పోలుస్తుంటారు , కానీ నిజానికి ఆ పోలిక ఇటునుంచి అటు చేయాలి, అంటే ఆడవారిలా మగవారు కూడా అని పోలిస్తే బావుంటుంది. ఎందుకంటే, ఎన్నో విషయాలలో ఆడవారు మగవారికన్నా ఎంతో  మెరుగని గట్టిగా చెబుతున్నాయి ఎన్నో అధ్యయనాలు. అవేంటో తెలుసా? ఒత్తిడిని తట్టుకునే శక్తి ఎక్కువే నిర్మాణాత్మకంగా ఆలోచించే శక్తి స్త్రీలకే ఎక్కువట.  ఒక సమస్యకి చిగురుటాకులా ఒణికినా,  కన్నీరు ఆగగానే ఆలోచనలకి పదునుపెట్టగలరు. ఆ సమస్యకి దారులు వెతకగలరు. ఒత్తిడి సమయాలలో కూడా చురుకుగా అలోచించి సరి ఆయన నిర్ణయం తీసుకోగలరు. దీనివెనక వున్న సైన్సు తెలిస్తే మీరు కూడా ఒప్పుకుంటారు  ఈ విషయాన్నీ.  మనలో వుండే మూడు హార్మోన్లు ఆడ,మగ ఒత్తిడికి ప్రతిస్పందించే తీరుని నిర్ణయిస్తాయి. అవే cortisol, epinephrine, అలాగే oxytocin. ఒత్తిడి కలగగానే మొదటి రెండు హార్మోన్ల స్థాయులు పెరుగుతాయి. ఫలితంగా బ్లడ్ ప్రెషర్, షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఆ సమయంలో మూడో హార్మోన్ మెదడు సందేశాలను గమనించి ఒత్తిడిని తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది . అయతే ఆ హార్మోను ఆడవారిలో కన్నా మగవారిలో తక్కువ. అందుకే ఒత్తిడిని మగవారికన్నా ఆడవారు సమర్థవంతంగా ఎదుర్కోగలరని  చెబుతున్నారు నిపుణులు. ఆడవారికి  ప్రకృతి ప్రసాదించిన మరో వరం ఈస్ట్రోజెన్ హార్మోన్. ఒత్తిడి ప్రభావాన్ని తగ్గించటంలో కీలక పాత్ర పోషించే హార్మోన్ అది.  ఇలా ఎలా చూసినా ఒత్తిడిని తిప్పికొట్టటంలో ఆడవారే బెటర్. బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఇంటికి సంబంధించి ఆడవారే బెస్ట్ ఫైనాన్సు మేనేజర్స్ అంటున్నారు అధ్యయనకర్తలు. మామూలు పరిస్థితులలో పెద్దగా పట్టించుకోకపోయినా, ఒక బాధ్యతగా అప్పగిస్తే మాత్రం అద్భుతంగా ఆర్థిక నిర్వహణ చేయగలరు ఆడవారు. అందుకు చదువు, ఉద్యోగం లాంటివి కూడా అక్కరలేదుట. వారి పరిధిలో వారు డబ్బును పొదుపు చేయటం, ఖర్చులు అదుపులో వుంచటం వంటివి సమర్థవంతంగా చేస్తారని చెబుతున్నారు వారు. గ్లోబల్ ఫైనాన్షియల్ లిటరసి స్టడీలో తెల్సిన కొన్ని అంశాలు ఎప్పటినుంచో ఆడవారికి ఆర్థికనిర్వహణ చేతకాదని వున్న  అపవాదుని తొలగించాయి.  అమెరికా వంటి దేశాలలో 47 శాతం మంది ఆడవారు ఒంటరిగా జీవిస్తున్నారు. విడాకులు తీసుకున్న వారు పిల్లల భవిష్యత్‌కి కావాల్సిన ఆర్థిక వనరులని సమకూర్చుకోవటంలో, వాటిని నిర్వహించటంలో చూపించే నైపుణ్యం మెచ్చుకోతగ్గది అంటున్నారు నిపుణులు. ఇక వీరు చూపిస్తున్న మరో ఉదాహరణ, ఫార్చ్యూన్ 500 జాబితానే తీసుకుంటే మహిళా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల  కన్నా, మహిళా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్లే ఎక్కువ. ఇందులో మొదటి తొమ్మిది మంది 681 బిలియన్ల డాలర్ల సంపదని తమ చేతుల్లో ఉంచుకున్నారు.  అతిగా ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించక పోవటం, వాస్తవిక అంశాలకు అనుగుణంగా స్పందించటం  ఆడవారి బలాలుట. అలాగే పెట్టుబడులు పెట్టాల్సివచ్చినప్పుడు చాలా తెలివిగా నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ సమీక్ష ప్రకారం వ్యాపార రంగంలో ఉన్న మహిళలు సగటున 20 శాతం లాభాలతో ముందంజలో ఉన్నారు. మల్టీటాస్కింగ్‌లో టాప్ అటు పిల్లలు, ఇటు ఇల్లు, ఇంకో పక్క ఆఫీస్, తోడు పెట్టాల్సిన పాలు, కట్టాల్సిన బిల్స్ , బ్యాంకులో వేయాల్సిన చెక్, ఆఫీస్‌లో అటెండ్ అవాల్సిన మీటింగ్, ఇలా ప్రతిరోజూ ఆడవారు చేసే  మల్టీటాస్కింగ్ చూసి కూడా చాలాసార్లు 'నీకేం చేతకాదు'  అనే మగవారిని ‘‘ పొరపాటున కూడా ఆ మాట అనకండి . మీకంటే అన్నిటినీ ఒకేసారి చక్కబెట్టడంలో ఆడవారే బెటర్’’ అంటున్నారు గ్లాస్గో యూనివర్సిటీ వారు. మగవారు ఒకపని నుంచి ఇంకో పనికి వెళ్ళటానికి సమయం తీసుకుంటే , ఆడవారు అవే పనులని ఒకేసారి చేయగలరని తెలిసింది వీరి అధ్యయనంలో. ఆడవారిలోని ఈ శక్తే వారిని విజేతలుగా నిలబెడుతుందని కూడా అంటున్నారు వీరు. అలాగే అమ్మ అయ్యాక ఆ శక్తి ఇంకా పెరగటాన్ని కూడా గుర్తించారు.  ఎంతైనా పది చేతులు వుండే ఆది పరాశక్తికి ప్రతిరూపాలం మనం... ఏమంటారు? IQ లో కూడా ఫస్ట్ University of Pennsylvania వారి ప్రకారం మగవారికన్నా ఆడవారి IQ లెవెల్స్ ఎక్కువ. ఆడవారి మెదడులోని  orange  inter-hemisphere links  అందుకు కారణం అట . ఒకప్పటి కంటే ఇప్పుడు ఆడవారి ఐక్యు లెవెల్స్ పెరిగాయా  లేక ఒకప్పుడు వున్నా గుర్తించలేదా అన్న విషయం మీద పరిశోధనలు చేస్తున్నారు ఇంకా.  ఆ విషయం తేలేదాకా,  ఇప్పటికి అయితే ఈతరం ఆడవారు మగవారి కన్నా తెలివైన వారు. చదువులో, ఆటల్లో, ప్రయోగాలలో అన్నిటిలో ఇప్పటి తరం అమ్మాయిలు కూడా మగపిల్లల్ని దాటేస్తూన్నారుట. ఇలా ఎటు చూసినా మనకి జేజేలు పలుకుతున్నాయి అధ్యయనాలు. అందుకే అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు -రమ

రంగులంటే జీవితమోయ్

రంగుల పండుగ అంటే అందరికి ఇష్టమే... రకరకాల రంగులతో ఆనందాన్ని పంచుకుంటాం. అయితే ఆ రంగులు మన మీద చూపించే ప్రభావం గురించి ఎప్పుడు అయినా ఆలోచించారా. అవి మన భావోద్రేకాల మీద, ఆలోచనల మీద, మానసిక స్థితిగతుల మీద చాలా ప్రభావాన్ని చుపిస్తాయని ఎన్నో అధ్యయనాలలో తేలింది. కలర్ స్పెషలిస్ట్  Leatrice Eiseman ప్రకారం ప్రకృతిలోని ప్రతి రంగుతో మనకి చిన్న నాటినుంచి ఏదో ఒక అనుబంధం, జ్ఞాపకం ముడిపడి వుంటుంది. అందుకే మనకి తెలియకుండానే ఆ రంగులు మన మానసిక భావోద్వేగాల మీద ప్రభావాన్ని చూపిస్తాయి.  సహజంగా నీలం రంగు అనగానే మనకి ఆకాశం గుర్తుకొస్తుంది.  ఆకాశం అంటే దాని నీడలో చిన్నప్పటి ఆటపాటలు  మదిలో మెదులుతాయి. ఉషారుగా అనిపిస్తుంది. అందుకే నీలం రంగు ఉత్సాహానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇప్పుడు మన రోజువారీ జీవితంలో ఏ ఏ రంగులు మనకి అనుకూల ఫలితాలని అందిస్తాయో సరదాగా చెప్పుకుందాం. 1. ఉదయాన్ని ఆరంజ్‌తో ప్రారంభించాలి ఆరంజ్  చైతన్యాన్ని, ఆసక్తి ని కలిగించే గుణం కలిగింది . ఎరుపు , పసుపు కలయిక  ఈ వర్ణం.  అందుకే ఎరుపులోని  ఉద్వేగం, పసుపులోని ఆనందం అందిస్తుంది ఈ రంగు .  ఆరంజ్ ఆక్సిజన్ సప్లైని పెంచుతుందని, దాని వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని ఎన్నో అధ్యయనాలు ప్రూవ్ చేశాయి. అందుకే ఉదయాన్నే ఆరంజ్ రంగు బట్టలు వేసుకుని ఉదయించే సూర్యుడిని చూస్తూ మార్నింగ్ వాక్ చేయండి. రోజంతా సంతోషంగా, ఉషారుగా గడపండి అంటున్నారు పరిశోధకులు. 2. ముఖ్యమైన పనులకి... ఎరుపు ఎరుపు ఇట్టే ఆకర్షించే గుణం కలిగినది. ఎంత దూరంలో వున్నా ఎదుటివారి చూపుని కట్టి పడేస్తుంది. అది కాక ఎరుపు ఉత్సాహానికి, ఉద్వేగానికి ప్రతిక. ఈసారి ముఖ్యమైన పనుల మీద వెళ్లినప్పుడు ఎరుపు రంగు దుస్తులు వేసుకోండి. అక్కడ సెంటర్ అఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తారు .  3. ఒత్తిడి ఎక్కువగా వుంటే... నీలం నీలానికి రిలాక్స్ చేసే గుణం వుంది. అందుకే ఒత్తిడి ఎక్కువగా వున్నప్పుడు నీలం రంగు దుస్తులు ధరించి చూడండి. మనసుకు హాయిగా వుంటుంది. అలాగే ఆఫీస్ టేబుల్ మీద నీలం రంగులో ఓ ఆబ్జెక్ట్ పెట్టి, అప్పుడప్పుడు దానిని చూస్తుండండి. ఏకాగ్రతని, చురుకుదనాన్ని అందించే ఈ రంగు పనిలో ఒత్తిడిని తగ్గిస్తుంది. 4. ఏదన్నా సాధించాలంటే... నలుపు నలుపు aggressiveగా కనిపించేలా చేస్తుంది. తెలియకుండానే ఆత్మవిశ్వాసం స్వంతమవుతుంది. ముఖ్యమైన వ్యక్తులని కలిసేటప్పుడు, మీ ప్రభావం ఉండేలా ఏదన్నా చేద్దాం అనుకున్నప్పుడు, నలుపు ధరించి చూడండి... ఆ ఫలితం ఎలా ఉంటుందో. నలుపు దూకుడుగా ఉండేందుకు ప్రేరేపిస్తుంది. 5. ఆకుపచ్చ... ఆశయానికి ఊపిరి పోస్తుంది పచ్చదనం అంటేనే జీవం వున్నట్టు.  ఆశని కలిగించే గుణం దీని స్వంతం. ఆకుపచ్చ ప్రకృతికి ప్రతీక అందుకే ఇంట్లో, ఆఫీస్‌లో పచ్చని మొక్కలని ఉంచుకోండి.  వాటిని చూస్తుంటే రిలాక్స్ అవుతారు. ఆలోచనలు ఓ కొలిక్కి వస్తాయి. కానీ  ఫ్రెండ్స్‌తో బయటకి వెళ్ళేటప్పుడు, బాయ్ ఫ్రెండ్‌ని, లేదా గర్ల్ ఫ్రెండ్‌ని కలిసేటప్పుడు ఈ రంగు బట్టలు వేసుకోకుండా చూసుకోండి. తెలియని గాంభీర్యం ఆవహిస్తుంది. చిన్న పిల్లల్లా ఆడి పాడాలంటే నీలం, ఆరంజ్ పర్ఫెక్ట్ కలర్స్. ఎన్నెన్నో వర్ణాలు.. అన్నిట్లో అందాలు... కొన్ని వర్ణాల గురించే చెప్పుకున్నాం కానీ రంగుల ప్రభావం వెనుకున్న సైన్సు మీకు అర్థమయ్యే వుంటుంది. ఈసారి మీరు వేసుకునే రంగు మీ మూడ్ మీద చూపించే ప్రభావాన్ని గమనించండి.  నెమ్మదిగా మీకే  అర్థం అయిపోతుంది ఏ రంగు ఎప్పుడు వేసుకోవచ్చో. అన్ని వర్ణాలూ మీకు సంతోషాన్ని అందించాలని కోరుకుంటూ.. హోలీ శుభాకాంక్షలు. -రమ

మైండ్ క్లీన్‌గా ఉంచుకుందాం

  మన ఇల్లు క్లీన్‌గా లేకపోతే చిరాకుగా వుండటం మాత్రమే కాదు.. అనారోగ్యం కూడా కలుగుతుంది. మన మైండ్ కూడా ఇల్లు లాంటిదే. దాన్ని క్లీన్‌గా వుంచుకోకపోతే చిరాకులు, ఆవేశాలు, ఆగ్రహాలు కలగడం మాత్రమే కాదు... అనారోగ్యం కూడా కలుగుతుంది. కోపం, ఆవేశం, వేదన, అసహనం, అసూయ, స్వార్థం... ఇలా వీటన్నిటితో నిండిపోయిన మెదడుకి సృజనాత్మక ఆలోచనలు రావడం కష్టమే. జీవితం అందంగా వుండాలంటే సృజన ప్రతి పనిలో కనిపించాల్సిందే. కాబట్టి మనం తక్షణం ఏమాత్రం సంతోషాన్నివ్వని ఆలోచనలు మెదడులోంచి వదిలించుకుని, ఆ స్థానాన్ని మంచి ఆలోచనలతో నింపెయ్యాలి. మన మస్తిష్కంలో చోటు చేసుకున్న ఓ కొత్త మంచి ఆలోచన మన కొత్త జీవితానికి, జీవిత అభ్యున్నతికి నాంది కావచ్చు. మన మస్తిష్కం లాంటిదే మన ఇల్లు కూడా. నిజానికి ఒత్తిడికి మూల కారణాల్లో ఒక పద్ధతిగా వుండని ఇంటి పరిసరాలు కూడా ఒకటి. అవసరానికి కనిపించని వస్తువు, సమయాన్ని మింగేసే వెతుకులాట ఒత్తిడిని పెంచితే - అవసరం వున్నా లేకపోయినా ఇంటినిండా గజిబిజిగా వుండే సామాను మన మనసునీ, జీవన విధానాన్నీ చికాకు పరుస్తాయి. అందువల్ల ఇంట్లో అనవసరంగా వున్నవాటిని వదిలించుకుంటే మన ఇల్లు చక్కని పొదరిల్లులా అందంగా వుంటుంది... ఆనందాన్ని అందిస్తుంది. మన జీవన విధానం ఎంత సింపుల్‌గా వుంటే జీవితం అంత ఆనందంగా గడపచ్చు. అప్పుడప్పుడు మనలోకి మనం తొంగి చూసుకోవాలి. మనకి ఏది నచ్చుతుందో గుర్తించాలి. మన ఇష్టానికి ప్రాధాన్యం ఇచ్చుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే అవసరంలేని వాటిని విడిచి పెడుతూ, కావల్సినవాటిని చేర్చుకుంటూ, జీవితాన్ని ప్రేమిస్తూ, అందంగా, చూడముచ్చటగా తీర్చిదిద్దుకుంటే మనం కూడా లేటెస్ట్‌గా వుంటాం. నిత్యనూతనంగా వెలిగిపోతాం.   -రమ ఇరగవరపు

WRAP YOUR LOVE IN UNIQUE GIFTS THIS VALENTINE’S DAY!

The season of Love is back and its time to make the special someone in your life happy! There are many ways to do that. Do you want to give the same red rose and chocolates or do something different? If you chose the later, I have some amazing suggestions, that you can use to express your love. Fill your partner’s heart with love. A coffee mug can help you do that. Don’t mistake it for an ordinary coffee mug. Why? Its mug with a heart that turns red each time you pour hot coffee into it. This makes expressing love easy. Each time you want to say I love you, just offer a delicious cup of coffee. As the coffee in the mug decreases, the heart turns black. So if you don’t want your love to fade away, keep refilling your cup of love. Nourish a plant for 3 to 5 days and allow it express your love. Bring home the I Love You Bean and it will carry your message of love to your partner. All it needs some sunlight, water and lots of love. If you can give that, I promise, the I Love You Bean will make it the best Valentine’s Day ever. If you are hesitating to express yourself to the love of your life, I have the best gift that can help you open up. Get the ‘’What I Love About You’’ book. It will say the words that have always been hidden in your heart. It is a fill in the blank book that has incomplete sentences like    If we'd first met in a comic strip, the thought bubble over my head would have said... I adore this little daily ritual or habit we have... One of your most irresistible physical features is... I missed you when... So, sit with your partner and discover each other this Valentine’s Day. How are you going to express your love? Decide now! The special day is not far away.   Photo Curtacy: amezon

STOP TORTURING YOURSELF!

Today I’ll tell you a secret about life. Its not the people around you that make you unhappy. Its you! It can be hard to believe, but its true. Its time you stop torturing yourself in various ways. Lets make a list of things you need to stop doing. The first thing you need to stop is clinging to the wrong people. Learn to identify your true well wishers from the millions of people you meet everyday. The worst thing you could be doing to yourself, is spending the most valuable days of your life with the wrong people. Have a problem? Face it! Running away from it wont help you in any way. Remember that you have to solve your own problems. No one is going to do it for you. The sooner you make an attempt to solve them, the easier it is to solve them. Just know that you cant give up. Not even for a second! Someone said honesty is an expensive gift. You may not be able to give it to everyone at all times but at least give it to yourself. This will give you an understanding of the reality and the courage to face it. Dont fool yourself. Make yourself your priority. No, this wont make you selfish. It is good to love someone unconditionally but not at your own cost. Besides, you can give only when you have enough. If you forget to love yourself, you wont have any to give others either. As the old saying goes, life is the best teacher. So learn from it and dont regret the mistakes you make in the process. After all what is the fun in learning without making mistakes. Cherish the mistake and learn your lesson for similar circumstances in the future. The most common mistake we all make in trying to impress the world is pretending! Pretending to be someone else or pretending like something we dont like. This will only kill your happiness. So stop pretending. Be yourself and love it! Make these simple changes in your life and see how it takes a happy turn. -Kruti Beesam

నిద్రముందు ఇంటర్నెట్టా... నో...!

  రోజంతా పనులతో హడావిడిగా గడిపేస్తాం. కాబట్టి నిద్రపోయే ముందు కాస్త ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్ ఏం షేర్ చేశారో చూద్దాం అనుకుంటూ ఇంటర్నెట్ ముందు కూర్చుంటున్నారా? జాగ్రత్త... నిద్రలేమితో బాధపడతారు. దానినుంచి ఇంకెన్నో అనారోగ్యాలు చుట్టుముడతాయి అంటున్నారు జపాన్ పరిశోధకులు. నిద్ర సరిగ్గా పట్టకపోవడం, కలత నిద్ర వంటివి వేధిస్తుంటే దానికి కారణం పడుకునే ముందు టీవీ, ఇంటర్నెట్ వంటివి చూడటమే అని వీరు గట్టిగా చెబుతున్నారు. సాధారణంగా అందరూ పడుకునేంత సమయమే పడుకున్నా నిద్ర సరిపోనట్టు అనిపించిందంటే ఆలోచించాల్సిందేని హెచ్చరిస్తున్నారు.   ఎక్కువగా టీవీ, ఇంటర్నెట్ ముందు గడిపేవారికి, గడపని వారికి మధ్య నిద్రపోయే సమయంలో పెద్దగా తేడా లేకపోయినా, నిద్రలో నాణ్యత విషయంలో మాత్రం భారీగానే తేడా వుంటోందని తేలింది వీరి అధ్యయనంలో. 5 వేల మందిపై చేసిన ఈ అధ్యయనంలో ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో వున్నవారిలో చాలామంది నిద్రకు ముందు ఇంటర్నెట్ వాడుతున్నట్టు తేలిందిట. దానివల్ల వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతున్నట్టు కూడా గుర్తించారు ఆ పరిశోధనలో. నిద్రకు ఓ రెండు గంటల ముందు నుంచి టీవీ, ఇంటర్నెట్‌లకు దూరంగా వుంటే కంటినిండా నిద్రపోవచ్చుట.   -రమ

యువతకు చైతన్య స్ఫూర్తి స్వామి వివేకానంద

భారతీయ యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన స్వామి వివేకానంద జయంతి నేడు. 1863, జనవరి 12వ తేదీన కలకత్తా నగరంలో జన్మించారు. విశ్వనాథ్ దత్తా, భువనేశ్వరి దేవి ఆయన తల్లిదండ్రులు. స్వామి వివేకానందగా నామాంతరం చెందకముందు ఆయన పేరు నరేంద్రనాథ్ దత్తా. ఇంట్లో అందరూ ఆయన్ని ముద్దుగా ‘నరేన్’ అని పిలిచేవారు. నరేంద్రుడు పుట్టేనాటికే ఆయన కుటుంబం సమాజంలో ఆర్థికంగా, పేరు ప్రతిష్టల పరంగా ఎంతో ఉన్నత స్థానంలో ఉండేవారు. విద్యలోను, దానంలోను, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కోరుకునేవారిగా వారి కుటుంబాని సమాజంలో మంచి పేరు వుండేది. ఎంతోకాలంగా సంతానానికి నోచుకోని నరేంద్రుడి తల్లిదండ్రులు కాశీలోని వీరేశ్వర శివుడికి పూజలు చేయించిన తర్వాత, ఆ స్వామి వరప్రసాదం వల్లే నరేంద్రుడు జన్మించారని భావిస్తారు. నరేంద్రుడి తల్లికి శంకరుడు కలలో కనిపించి నేను నీకు కుమారుడిగా జన్మిస్తానని చెప్పారని కూడా అంటారు. ఏది ఏమైనప్పటికీ నరేంద్రుడు చురుకైన కుర్రాడిగా దినదిన ప్రవర్ధమానం అవుతూ వుండేవాడు. బాల్యంలో నరేంద్రనాథ్ ఎంతో అల్లరి పిల్లవాడిగా వుండేవాడు. ఉత్సాహంగా వుండేవాడు. అదే సమయంలో అతనికి ఆధ్యాత్మిక  అంశాల మీద కూడా ఎంతో మక్కువ వుండేది. రాముడు, సీత, శివుడు తదితర దైవ స్వరూపాలను పూజిస్తూ, ధ్యానిస్తూ ఆడుకునేవాడు. ధ్యానం అనేది నరేంద్రుడికి అన్నిటికంటే ఇష్టమైన ఆట. సాధువులు, సత్పురుషులను దర్శించి, వారిని సేవించడం అంటే ఆయనకు  అమిత ఆసక్తిగా వుండేది. అలా నరేంద్రుడు ఒక శక్తివంతమైన యువకుడిగా ఎదిగాడు. యువ నరేంద్రుడు సింహంలాంటి రూపానికి తోడు అమితమైన సరితూగే ధైర్యాన్ని కలిగివుండేవాడు. మంచి వస్తాదు వంటి శరీరనిర్మాణాన్ని, సుస్వరమైన గొంతును, ప్రకాశమానమైన బుద్ధిని కలిగివుండేవాడు. సాముగరిడీలు, తత్త్వశాస్త్రం, సంగీతం తదితర అంశాలలో అపారమైన ప్రతిభను ప్రదర్శించేవాడు. దేశీయ విధానాలతోపాటు పాశ్చాత్య తత్త్వాన్ని కూడా నరేంద్రుడు అవగతం చేసుకున్నాడు. ఈ సమయంలో నరేంద్రుడికి ఒక పెద్ద ప్రశ్న మనసులో తోచింది. అది ‘దేవుడు ఉన్నాడా‌? ఆయన్ని నేను చూడగలనా‌?’ ఈ ప్రశ్నకు సమాధానం అన్వేషిస్తూ నరేంద్రుడు ఎన్నో ప్రదేశాలకు తిరిగాడు. ఎంతోమందిని కలిశాడు. చివరికి ఆయన ప్రశ్నకు సద్గురువు తారసపడగానే సమాధానం దొరికింది. ఆ సద్గురువు ఎవరో కాదు.. రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస శిష్యరికంలో నరేంద్రుడు ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధిని సాధించాడు. పరమహంస నరేంద్రుడిని సంశయస్థితిలోనుంచి దృఢనిశ్చయానికి, ఆవేదన నుండి ఆధ్యాత్మిక ఆనందానికి అతనిని తీసుకొనిపోయారు. పరమహంస దేహాన్ని చాలించిన తర్వాత నరేంద్రుడు సన్యాసాన్ని స్వీకరించి ‘స్వామి వివేకానంద’గా మారారు. ఆ తర్వాత అనేక ప్రాంతాలలో పర్యటించారు. అమెరికాలోని చికాతో నగరంలో 1893 సెప్టెంబరు 11వ తేదీన సర్వమత సభలో స్వామి వివేకానంద ‘‘అమెరికాదేశపు సోదర సోదరీమణులారా’’ అంటూ ప్రారంభించి తన చారిత్రాత్మక ప్రసంగం చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు.  ఆ తర్వాత ప్రపంచం మొత్తం పర్యటించారు. యువతకు స్ఫూర్తిగా నిలిచే ఎన్నో ప్రసంగాలు చేశారు. రామకృష్ణ మఠాన్ని స్థాపించడం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. స్వామి వివేకానంద చెప్పిన మాటలు విని ఆచరిస్తే  చాలు.. నేటి యువత అభివృద్ధి పథంలోకి దూసుకుపోతుంది. ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన స్వామి వివేకానంద 1902 జులై 4న బేలూరులో కన్నుమూశారు. 39 సంవత్సరాలు మాత్రమే జీవించిన ఆయన పది జన్మలకు సరిపడా కృషి చేశారు. ప్రపంచంలో శాశ్వతంగా నిలిచిపోయిన స్ఫూర్తిని నింపారు.

నిశ్చితార్థం.. పెళ్ళి.. ఆ ముచ్చటే వేరు...

పెళ్ళి అనగానే ఒక వేడుక - సంబరం - ఎన్నెన్నో ఆచారాలు - సంప్రదాయాలు - ఇవన్నీ కూడా ఒకో ప్రాంతానికి ఒకో రకంగా వుంటాయి. ముందుగా మన తెలుగువారి నిశ్చితార్థం గురించి చెప్పుకోవాలంటే... తాంబూలాలని, పసుపు కుంకుమలు పెట్టుకోవడం, పూలు, పళ్ళు ఇచ్చుకోవటం ఇలా రకరకాలుగా పిలుస్తారు ఆ సంబరాన్ని. ఉంగరాలు, వస్త్రాలు ఇచ్చి పుచ్చుకుంటారు. వివాహ ముహూర్తాన్ని నిర్ణయించి లగ్న పత్రికలు రాసుకుంటారు. విందుతో కార్యక్రమం ముగుస్తుంది. దీనికి తోడు అదనంగా వేడుకలు సరేసరి. బెంగాలీల నిశ్చితార్థం వేడుకలు సంబరంగా సాగిపోతాయి. ‘‘ఆశీర్వాద్’’గా పిలిచే బెంగాలీల ఎంగేజ్‌మెంట్‌ను పెళ్ళంత వైభవంగా జరుపుతారు. పెళ్ళికి 5 రోజుల ముందు పెళ్ళికూతురు కుటుంబం పెళ్ళికొడుకు  ఇంటికి వెళ్ళి, వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. అలాగే పెళ్ళికొడుకుకి బంగారం ఇతర బహుమతులు ఇస్తారు. ఆడపెళ్ళివారు ఇక వీరి పెళ్ళి వేడుకలో సింధూర్ దాన్ ఓ ప్రత్యేకత కలిగిన వేడుక. అత్యంత శుభప్రదమైన ఎర్ర కుంకుమని స్త్రీధనంగా ఇస్తారు. పెద్ద డబ్బా నిండా కుంకుమను నింపి వధువుకి అందిస్తారు. ఈ సింధూర్ దాన్‌లో ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి వారు విలువైన బహుమతులు ఇస్తారు. సింధీలు కొబ్బరి బోండాలు ఇచ్చిపుచ్చుకోవడాన్ని ‘కచ్చిమిశ్రీ’గా పిలుస్తారు. వేడుకలు ఘనంగా జరుపుతారు. ఇక వీరి పెళ్ళిలో ‘సిజ’ అని పిలిచే ఆచారంలో స్త్రీధనంగా మంచం, పరుపు, దిండ్లువంటివన్నీ ఇస్తారు. ఇక పంజాబీల విషయానికి వస్తే నిశ్చితార్థాన్ని వారు ‘రోక’ అంటారు. వివాహం జరగబోయే తేదీని ప్రకటిస్తారు. అబ్బాయి తరఫు వారు అమ్మాయికి నగలు, వస్త్రాలు, మేకప్ కిట్, ఆటబొమ్మలు వంటివి కానుకలుగా అందిస్తారు. అలాగే అబ్బాయికి కూడా అమ్మాయి తరఫు వారు అనేక బహుమతులు ఇస్తారు. ఇక వీరి పెళ్ళి వేడుకలో వధువుకు కొత్త కాపురానికి కావలసివన్నీ సమకూరుస్తారు ఆమె తల్లిదండ్రులు. మిజోరాం ప్రాంతీయుల పెళ్ళిలో వరుడు తనకు కాబోయే భార్యకు స్త్రీధనం ఇస్తాడు. పెళ్ళిరోజున అమ్మాయి తండ్రికి దానిని అందించడం ఆచారం. ఇక గోవా వాసులు అమ్మాయికి పెళ్ళిలో ఇచ్చే అన్ని వస్తువులనూ ఏడేడు చొప్పున ఇస్తారు. అలాగే ఎక్కువగా వస్త్రాలకు అధిక ప్రాధాన్యమిస్తారు. కొంతమంది ఆర్థిక స్తోమతని అనుసరించి ఇంటికి కావల్సిన వస్తువులని కూడా సమకూరుస్తారు. ‘సాంచ్’ పేరుతో గుజరాతీలు చేసే వేడుకలో అందమైన చుక్కల చుక్కల చాందినీ వస్త్రంతో ఓ పెద్ద సంచిని, దానితోపాటు మరో చిన్న సంచిని వధువుకు ఇస్తారు వీరు. అమ్మాయికి ఇచ్చే వస్తువులన్నీ ఆ సంచిలో పెట్టాలి. అది పూర్తిగా నిండాలి. ఇంటికి సంబంధించిన వస్తువులు పెడతారు దాన్లో. ఇక చిన్ సంచిని ‘కల్చీ’ అంటారు. వధువు తన భర్త కోసం స్వంతంగా డిజైన్ చేసుకునే సంచి అది. దీని నిండా రకరకాల పిండివంటలు వుంటాయి. ఇక పెళ్ళి సమయంలో ప్రత్యేకంగా కన్యాప్రదాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జైన్ల ఆచారం. ఆ సమయంలో వధువు తల్లిదండ్రులు లేదా మేనమామ ఆమె కుడిచేతిలో బియ్యం, రూపాయి పావలా డబ్బు ఉంచుతారు. మంత్రోచ్ఛారణతో తమ అమ్మాయిని వరుడికి అప్పగిస్తారు. ఆ తర్వాత పుట్టింటివారితోపాటు వరుడు కూడా వధువుకి కానుకలు ఇస్తాడు.   ....రమ ఇరగవరపు

తాళం చెవుల‘కీ’ చెవి!

ఆఫీసుకు టైమవుతుంటే బండి తాళాలు కనిపించవు. కారు తాళాలు ఎక్కడో వుంటాయి. వెతుకులాటతో చిరాకు, కోపం ఉదయాన్నే మనల్ని ఆవహిస్తాయి. ఇక ఆ చికాకు రోజంతా వెన్నాడుతుంది. ఇవన్నీ సరే హ్యాండ్ బ్యాగ్‌లో వేసిన ఇంటి తాళం చటుక్కున చేతికి అందదు. ఈ తాళాలతో ఇన్ని తిప్పలు. ‘‘ఎంచక్కా సెల్‌కి రింగ్ ఇచ్చి దాని అడ్రస్సు కనుక్కున్నట్టు వీటికీ ఓ ఆప్షన్ ఉంటే బాగుండును’’ అని మనందరం ఎప్పుడో ఒకప్పుడు అనుకునే వుంటాం కదా!   మనలాంటి వారి కోసమే ‘‘విజిల్ కీ ఫైండర్’’ తయారు చేశారుట. ఈసారి తాళాలు కనిపించకపోతే ఒక్క విజిల్ వేయండి చాలు అంటున్నారు దీని తయారీదారులు. మన విజిల్ సౌండ్‌కి ఈ ఫైండర్‌కి వున్న ఎల్ఇడి లైట్ వెలగటంతోపాటు ఓ బీప్ సౌండ్ కూడా వస్తుంది. దాంతో ఎక్కడ దాగున్నా టక్కున పట్టుబడిపోతుంది మన తాళం చెవి. -రమ