కరోనా ఎఫెక్ట్.. తెలంగాణలో ఏప్రిల్ 1 విడుదల

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్‌ -19(కరోనా వైరస్) కేసులు దేశంలో చాపకిందనీరులా విస్తరిస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలకు దిగింది. జనసందోహాలు లేకుండా చూడాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యా సంస్థలను ఈ నెల 31 వరకు మూసివేయాలని నిర్ణయించింది. దీనిపై కేసీఆర్ ఉదయమే అసెంబ్లీలో ప్రకటన చేసారు. అనంతరం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన భేటీ అయిన ఉన్నతస్థాయి కమిటీ దేశంలో కరోనా ప్రభావం, పలు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై చర్చించింది. అనంతరం రాష్ట్రంలో ఈ వైరస్‌ ప్రభావాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటిమే రాష్ట్రంలో జరుగుతున్న పరీక్షలను మాత్రం యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌ను మూసివేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అలాగే, శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను సైతం కుదించాలని నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఈ నెల 20 వరకు ఈ సమావేశాలు జరగాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రేపు, ఎల్లుండి సమావేశాలు నిర్వహించి.. సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి దానికి ఆమోదం తెలిపిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేయనున్నారు. 

నాకు పిరికివాళ్ళు అవసరం లేదు: పవన్ కళ్యాణ్ 

పిరికి సమాజానికి ధైర్యం పోయాలనే జనసేన పార్టీని స్థాపించానని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. రాజమహేంద్రవరంలో పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పవన్​ కల్యాణ్​ పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాల్లోకి క్రిమినల్స్‌ వస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు. చిన్నప్పటి నుంచి ఇలాంటి ఘటనలన్నీ చూసే పార్టీ పెట్టాల్సి వచ్చిందన్నారు. భయపెట్టే పరిస్థితులను ఎదిరించి ముందుకెళ్తున్నానని తెలిపారు.ఓటమిని ఎదుర్కొని ముందుకెళ్తేనే గెలుపు సాధ్యమని పవన్‌కల్యాణ్‌ అన్నారు. నిలబడి పోరాటం చేయాలంటే ధైర్యం ఉండాలన్నారు. పిరికివాళ్లు తనకు అవసరం లేదని.. గుండె ధైర్యం ఉన్నవాళ్లే కావాలన్నారు. కత్తులు తీసుకుని తిరగటం కాదని...ధైర్యంగా మనోభావాలను వ్యక్తీకరించాలని సూచించారు.

అరుంధతీ కనపడదు...అధ్వాన్నమూ కనపడదు.. అరవై వరహాల అప్పు మాత్రం రెడీ!

అరుంధతీ కనబడదు, అధ్వాన్నం కనబడదు, అరవై వరహాల అప్పుమాత్రం కనపడుతోంది అన్నట్టుంది సెక్రెటేరియట్ ఉద్యోగుల పరిస్థితి. విశాఖకు ఎప్పుడు షిఫ్ట్ అవుతామో అనే దాని మీద వస్తున్న క్లారిటీ, ప్రభుత్వం తమ విషయం లో ఎంత ఉదారంగా ఉండదలచిందో అనే అంశం లో మాత్రం రాకపోవటం వారికి ఇబ్బందిగా పరిణమించింది.  మేలో ప్రారంభించి జూన్ చివరి నాటికి సచివాలయంతో పాటు ఇతర శాఖాధిపతుల కార్యాలయాలను విశాఖకు తరలించాలని పట్టుదలగా ఉన్న ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో ఉదారంగా వ్యవహరించాలనే ఆలోచనలో ఉంది. దీంతో సచివాలయ ఉద్యోగులు తమ ముందు పెట్టిన డిమాండ్లలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా అధికారులను కోరింది. దీంతో వారు ప్రస్తుతం ఈ ప్రతిపాదనలపై చర్చిస్తున్నారు. త్వరలో వారు ఉద్యోగులకు క్లారిటీ ఇవ్వనున్నారు. అయితే, ఈ క్లారిటీ లో భాగం గా వారికేమైనా ఆర్ధిక పరమైన సహాయం, షిఫ్టింగ్ నిమిత్తం వస్తుందా , లేదా అనేదే వచ్చే బుధవారం నాటికి క్కూడా తేలుతుందో, లేదో వారికీ తెలీటం లేదు.  విశాఖ వెళ్లేందుకు ప్రభుత్వం ముందు తాము ఉంచిన డిమాండ్లపై అధికారుల నుంచి సానుకూల వస్తున్న తరుణంలో తమ నిర్ణయాన్ని ప్రకటించే ముందు చివరి సారిగా వచ్చే బుధవారం భేటీ కావాలని సచివాలయ ఉద్యోగులు నిర్ణయించారు. దీంతో ఈ భేటీలో ఏం తేల్చబోతున్నారనే అంశంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వం ముందు తాము పెట్టిన ప్రతిపాదనల్లో భాగంగా కీలకమైన విశాఖలో ఫ్లాట్ల వ్యవహారంపై వచ్చే స్పందన ఆధారంగా తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఎందుకంటే సచివాలయ ఉద్యోగుల్లో దాదాపు 600 మందికి పైగా అమరావతిలో ఇళ్లు కట్టుకోవడం లేదా కొనుక్కోవడం చేశారు. ఇప్పుడు వీరికి విశాఖలో ప్రభుత్వం ఏం ప్రత్యామ్నాయం చూపిస్తుందో చూడాల్సి ఉంది.ఏ పీలో మూడు రాజధానుల ప్రక్రియ వేగవంతమైన నేపథ్యంలో మే నెల తర్వాత విశాఖ నుంచే అధికారిక కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో మే నెలలో అమరావతిని వీడి విశాఖకు వెళ్లే విషయంలో ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచిన సచివాలయ ఉద్యోగులు వాటి విషయంలో ప్రభుత్వం నుంచి హామీల మేరకు తుది నిర్ణయం తీసుకునేందుకు వచ్చే బుధవారం సమావేశం కానున్నారు. ఇందులో కీలక నిర్ణయం ప్రకటించే అవకాశముంది.   మే నెల తర్వాత విశాఖ వేదికగా పాలన ప్రారంభమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో ఆ లోపే ఉద్యోగులను అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు ఏపీ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే సచివాలయ ఉద్యోగ సంఘాలతో సీఎస్ నీలం సాహ్ని పలుమార్లు భేటీ అయ్యారు. ఇందులో ఉద్యోగులు విశాఖ వెళ్లేందుకు తమ ముందు ఉంచిన ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించారు. వీటిని ప్రభుత్వం ముందు ఉంచారు. ప్రస్తుతం ఏపీ రాజధానిగా ఉన్న అమరావతి నుంచి విశాఖ వెళ్లేందుకు సచివాలయ ఉద్యోగులు పలు డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారు. వీటిలో ప్రధానంగా విశాఖకు మే నెలలో వెళ్లగానే అక్కడ తాత్కాలికంగా అయినా సరే ప్రభుత్వం వసతి సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. అలాగే విశాఖకు వెళ్లేందుకు రవాణా ఖర్చులు, ఇతర ఛార్జీలు చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు. అలాగే తమ పిల్లలకు విశాఖలో స్కూల్ అడ్మిషన్లు దొరికేలా ప్రభుత్వం సాయం చేయాలని కూడా ఉద్యోగులు అడుగుతున్నారు. వీటితో పాటు మరికొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ప్రధానంగా వీటిపైనే ఉద్యోగులు పట్టుదలగా ఉన్నారు.

రాబోయే కాలంలో..కాబోయే మంత్రులెవరు?

శాసన మండలి రద్దు నిర్ణయం, రాజ్యసభ ఎన్నికలు..ఈ రెండు సంఘటనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో రెండు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ ఇద్దరు కూడా ఎమ్మెల్సీలుగా ఉండి మంత్రులయ్యారు. వారిద్దరూ ఇప్పుడు రాజ్యసభకు వెళ్తున్నారు. ఈ రెండు మంత్రి పదవులను ఇప్పుడు భర్తీ చేయాల్సి ఉంది. ఒక రకంగా చూస్తే ముఖ్యమంత్రి జగన్ కు ఇది ఒకింత ఇబ్బందికర పరిణామమే. ఆశావహులు ఎక్కువగా ఉండటంతో ఈ ఇబ్బంది తలెత్తుతోంది. ప్రస్తుతం జగన్ కు ఎదురు తిరిగే పరిస్థితి లేనప్పటికి అసంతృప్తి లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. రాజ్యసభ సీట్ల వ్యవాహరంలో కూడా ఇబ్బందులు వస్తాయి అనుకున్నా తన మాటే శాసనం అన్నట్టు జగన్ చేసుకోగలిగారు.  జగన్ కు ఎదురు తిరగడం మాట అటుంచి అసలు ఆ ఆలోచన కూడా మనసులోకి వచ్చే అవకాశం లేదు. అయితే మనసులో ఆశలను మాత్రం అణచుకోలేక, నేరుగా అడగలేక, అలగలేక వైసీపీ ఎమ్మెల్యేలు తమలో తామే కుమ్ములో పెట్టిన వంకాయల్లాగా మగ్గిపోతున్నారు. ఈ  రెండు పోస్టుల కోసం ఆశలు పెట్టుకున్న అనేక మంది ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే లాబీయింగ్ చేసుకుంటున్నారని సమాచారం. ఈ రెండు పదవులు ఎవరిని వరించబోతున్నాయి? జగన్ చల్లని చూపులు ఎవరి వైపు ఉన్నాయి? అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తరువాత మంత్రి వర్గంలో స్థానం లభిస్తుంది అని మొదటిగా వినిపించిన పేరు రోజా.  రోజాకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఎందుకో ఆమెకు పదవి దక్కలేదు. అలిగిన రోజాను బుజ్జగించి ఆమెకు ఏపీఐఐసి చైర్మన్ పదవిని ఇచ్చారు. ఆ సమయంలోనే ఈ సారి మంత్రి వర్గంలో మార్పులు జరిగితే మంత్రి పదవి ఇస్తాను అని జగన్ ఆమెకు హామీ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఒక సారి మాట ఇస్తే తప్పని ముఖ్యమంత్రి అనిపించుకోవాలనుకుంటున్న జగన్ ఈ సారి రోజాకు మంత్రి పదవి ఇస్తారో లేదో చూడాలి. ఎన్నికల సమయంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవిపై బహిరంగంగా హామీ ఇచ్చినందున ఈ సారి అయినా తనను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని అయన కోరుకుంటున్నారు. ఎలాగూ ఖాళీ అవుతున్న స్థానం కూడా గుంటూరు జిల్లా నుంచే కావడంతో ఈ సారి పదవిపై ఆళ్ల ఆశలు పెట్టుకున్నారు. వీరితో పాటుగా పార్ధసారధి, కోటంరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, అంబటి రాంబాబు తదితరులు కూడా మంత్రి పదవులను ఆశిస్తున్నారు. మరి వీరిలో ఎవరికీ మంత్రి పదవులు దక్కుతాయో చూడాలి. మరోవైపు స్పీకర్ గా ఉన్న తమ్మినేనికి స్పీకర్ పదవి నుంచి తప్పించి మంత్రి పదవి ఇవ్వాలని అనుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఏపీకి కరోనా రాదు.. ఎందుకో తెలుసా...

కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రంతో పాటు చాలా రాష్ర్టాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఒడిశా, యూపీ, పశ్చిమ బెంగాళ్‌, జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వాలు విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలకు సెలవులు ప్రకటించాయి. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అసెంబ్లీ వేదికగా కరోనాను రాష్ట్ర విపత్తుగా ప్రకటించారు. విద్యాసంస్థలతో పాటు స్విమ్మింగ్ పూళ్లు, జిమ్‌లు కూడా మూసివేయాలని ఆదేశించారు. మార్చి 31వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఢిల్లీ సర్కార్‌ ఇప్పటికే విద్యాసంస్థలు, సినిమాహాళ్లను మూసివేయగా.. తాజాగా ఐపీఎల్ మ్యాచులపై నిషేదం విధించింది. ఇక యూపీ సర్కార్‌ మార్చి 21వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. మరోవైపు కరోనా వైరస్‌ నేపథ్యంలో కేరళ అసెంబ్లీ నిరవదిక వాయిదా పడింది.తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ రోజు అసెంబ్లీలో కరోనా వ్యాప్తి గురించి మాట్లాడారు. విదేశాల నుంచి వస్తున్నా వారి వల్లే కరోనా రాష్ట్రానికి వస్తోందని చెప్పారు. సాయంత్రం మంత్రిమండలి సమావేశం నిర్వహించి ఇతర రాష్ట్రాలలో వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలను పరిశీలించి ఇక్కడ కూడా సరైన నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.    ఇప్పటికే కరోనా వైరస్‌ నియంత్రణకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. కరోనా వైరస్‌ నియంత్రణకు వివిధ రాష్ట్రాలు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలపై ఢిల్లీ నుండి రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో విడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు కూడా. వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర స్థాయిలో వివిధ విభాగాలను సన్నద్ధం చేసి వారి సేవలను పూర్తిగా వినియోగించు కోవాలని తెలిపారు. కరోనా నియంత్రణకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరోనా కేసులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేయాలన్నారు. వీలైనంత వరకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకచోటకు చేసే సభలు, సమావేశాలు వంటి కార్యక్రమాలను కొంత కాలం పాటు వాయిదా వేసుకునేలా ఆయా నిర్వాహకులను కోరాలని సూచించారు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాలు, అంగన్‌ వాడీ వర్క్‌లు, ఆశా వర్కర్లు సేవలను వినియోగించుకుని ప్రజల్లో అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా అన్నిపాఠశాలల్లో విద్యార్థులకు దీనిపై అవగాహన కల్పించి వ్యక్తి గత పరిశుభ్రతపై చైతన్యం కల్పించాలని తెలిపారు. తగిన సంఖ్యలో ఎన్‌-95 మాస్క్‌లను సిద్ధం చేసి అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలో కరోనా వైరస్‌ నియంత్రణకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కరోనా వైరస్‌ బయటపడినప్పటి నుంచి విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ స్రీనింగ్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. కానీ క్షేత్ర స్థాయిలో ప్రధాన కార్యదర్శి కేంద్రానికి నివేదించినట్టు కానీ, కేంద్రం సూచించిన విధంగా కానీ ఎలాంటి చర్యలు తీసుకున్నట్టు కనిపించడంలేదని ప్రజలు అంటున్నారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది..ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంతుబట్టని విషయం ఏంటంటే దేశ ప్రధాని సహా రాష్ట్రాల ఇన్ని ముఖ్యమంత్రులు కరోనాపై స్పందించినా మన ముఖ్యమంత్రి మాత్రం ఎందుకు స్పందించడంలేదు? ఎందుకు సంబందిత అధికారులతో ఒక సమీక్ష చెయ్యరు, సూచనలివ్వరు అన్నది. అసలు సిఎం జగన్ ఏమనుకుంటున్నారు? అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువు తీసాక కూడా మన రాష్ట్రానికి ఇతర దేశాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి ఎవరొస్తారు? అందరు ముఖ్యమంత్రులు ఇప్పుడు కరోనా రాకుండా చర్యలు తీసుకుంటున్నారు..కెసిఆర్ కూడా చెప్పారు కదా విదేశాలనుంచి వస్తున్న వారే కరోనా తెస్తున్నారని..ఆ విషయం నాకు ముందే తెలుసు. అందుకే నేను అధికారంలోకి రాగానే కరోనా రాకుండా చర్యలు మొదలు పెట్టాను అని జగన్ అనుకుంటున్నారేమో అని కొందరు వెటకారం చేస్తున్నారు. ప్రజల మీద జగన్ కు ఎంత కక్ష ఉందో తెలుస్తోందని మరికొందరు గుసగుసలాడుకుంటున్నారు. మరో వైపు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాత్రం ఒక మున్సిపల్ కార్పోరేషన్ కు 5గురు డిప్యుటీ మేయర్ అభ్యర్దులను నియమించామని ఇది దేశంలోనే ప్రధమం అని చెప్తున్నారు కానీ కరోనా బారి నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారో చెప్పడంలేదని ప్రజలనుంచి విమర్శలు వస్తున్నాయి. మరో వైపు రాష్ట్ర బీజేపీ మాత్రం సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే కరోనా గురించి ఎంత హడావుడి చేసేవారో అని కామెడీ మెసేజులు పెడుతూ రాక్షసానందం పొందుతోందని ప్రజలు అంటున్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి స్పందించి కరోనా వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకునేలా చూడాలని ప్రజల ఆకాంక్ష.

వైఎస్ఆర్ పాలనే బెటర్ గా అనిపిస్తోంది: సునీల్ దియోధర్

విజయవాడ రాజ్ భవన్ లో ఎపి గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్  ను కలిసిన ఎపి బిజెపి కో ఇన్ చార్జ్ సునీల్ ధియోధర్, బిజెపి నేతలు స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపి నేతలు పోటీ చేయకుండా బెదిరించడం, కార్యకర్తలు పై వరుస దాడులు.. నామినేషన్లు లాక్కోవడం‌ వంటి  ఘటనల పై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన బీ జీ పి నేత సునీల్ దియోధర్.  రాష్ట్రం లో  వైసిపి రౌడీ పార్టీ గా వ్యవహరిస్తుందని, బిజెపి, జనసేన అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని, పోలీసులు సమక్షంలోనే నామినేషన్లు పత్రాలు లాక్కుని చించేస్తున్నారని, రౌడీయిజం, గూండాయిజంతో భయపెడుతున్నారని ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.  " దాడులు, దాష్టికాల వల్ల మా పార్టీ నేతలకు ప్రాణ భయం ఉంది. పది సంఘటనల పై ఆధారాలతో గవర్నర్ కు వివరించాం. పోలీసులు కూడా వైసిపికి  అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. వైయస్ హయాంలో ఇంత దారుణాలు జరగలేదు, రాష్ట్రం లో ఎంపికలే తప్ప.. ఎన్నికలు జరగడం లేదు. ఈ అంశాలను వివరిస్తూ వినతి పత్రాన్ని ఇచ్చి,  చర్యలు  తీసుకోవాలని గవర్నర్ ను కోరాం," అని సునీల్ డియోధర్ చెప్పారు.

పెట్రోల్, డీజిల్‌పై రూ. 3 ఎక్సైజ్ సుంకం పెంపు!

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్నిపెంచుతూ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ. 3 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. దీని ప్రభావంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరింతగా పెరగనున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.2 మేరకు తగ్గించిన కొద్దిరోజులకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇదిలా ఉంటే పెట్రోల్‌పై ప్రత్యేక ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ .2 నుండి రూ .8, డీజిల్‌కు రూ .4 మేరకు పెంచారు. అటు పెట్రోల్‌పై రోడ్‌సెస్‌ను లీటరుకు రూ .1, డీజిల్‌కు రూ .10గా నిర్ణయించారు. మార్చి 11 న పెట్రోల్ ధరను రూ. 2.69 మేరకు తగ్గించగా.. డీజిల్ ధరలను రూ .2.33కు తగ్గించారు. మరోవైపు అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి. ప్రపంచదేశాలన్ని కరోనా వైరస్ వణికిపోతున్న నేపథ్యంలో మార్కెట్ అంతటా పతనం అవుతోంది. అంతర్జాతీయ చమురు ధరలు కూడా 31 శాతానికి పడిపోయాయి. అయినా పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించ‌డం దేశ ప్ర‌జ‌ల‌కు మింగుడుప‌డ‌డం లేదు. అంతర్జాతీయంగా చమురు ధరలు దిగి వచ్చినా నరేంద్ర మోదీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తాజా నిర్ణయంతో రూ. 2000 కోట్ల మేర అదనపు ఆదాయం వ‌స్తుంద‌ట‌.

భజన కు పడిపోతే, నిమజ్జనమే నంటూ నాయుడుకి చురకలు!!

తెలుగుదేశం లో అసమ్మతి స్వరం తీవ్రత పెరిగింది. సోషల్ మీడియా లో సొంత పార్టీ వారే, నాయకత్వపు లోపాలను ఎత్తి చూపుతున్నారు. ఒక వైపు నాయుడు వైఫల్యాలను ఎండా గడుతూనే, మరోవైపు వై.ఎస్.ఆర్.సి.పి దుర్మార్గ పాలన చేస్తోందంటూ నిప్పులు చెరుగుతున్నారు. " ఇవ్వాళ తెలుగుదేశం పార్టీ దుస్థితికి వినాయక చవితి పండగకి అవినాభావ  సంబంధం ఉంది...భజన భజన భజనలో మునిగి ఎలాగైతే నిమజ్జనం జేస్తారో ఈరోజు అదే జరుగుతోంది...కనీసం ఇప్పుడు అయినా ధైర్యంగా ముందడుగు వేసే కార్యకర్తల పేర్లు పార్టీ ఆఫీసులో రాసి పెట్టుకుంటున్నారా ?? బరి తెగించే నాయకుల పేర్లు రాసి పెట్టుకుంటున్నారా?? పొర్లు దండాలు పెట్టె అధికారుల పేర్లు రాసిపెట్టుకుంటున్నారా?? ఇవేవీ లేకుండా ఆంధ్ర బీహార్ అయిందని మనం ఎంత గింజుకున్నా సోషల్ మీడియాలో ఎంత ఏడ్చినా ఎన్ని ప్రెస్మీట్లు పెట్టినా లాభం ఏంటో మనకె అర్ధమవ్వాలి," అంటూ ఒక తెలుగు దేశం గాఢాభిమాని పోస్ట్ పెట్టాడు...ఇది ఇప్పుడు తెలుగుదేశం హెడ్ క్వార్ట్రర్స్ లో పెద్ద చర్చ కు దారి తీసింది.  నాయకులు అందరూ పోతున్నారని పోయేవాళ్ళ మీద ఏడ్చే మనం లోకేష్ & చంద్రబాబు ఎన్ని నామినేషన్లకి హాజరయ్యారో మనమే ఆలోచించుకోవాలి...ఇవ్వాళ మనం చూసే అరాచకం అంతా కూడా నిజమైన అరాచకం కాదు..అదంతా పెయిడ్ ముఠాల అరాచకం..నాయకుల దృష్టిలో పడేదానికి, నాయకులకి కలెక్షన్ ఎజెంట్లుగా వుండే దానికి వాళ్ళు పడే ఆరాటం..దానికి ఉదాహరణ నిన్న మాచర్ల తురకా కిషోర్ లాంటి వాళ్ళ అతి..ఒకప్పుడు బాంబులు,కత్తులు  పట్టుకుని తిరిగినవాళ్ళు కూడా ఇలాంటివి చూసి నవ్వుకుంటున్నారు..ఇప్పుడు నడిచేది అంత "ఆర్ధిక ఫ్యాక్షన్"...అడ్డదిడ్డంగా డబ్బు సంపాదించిన నాయకులు అధికారంలో ఉన్నప్పుడు పులి పదవి పోగానే పిల్లి, అంటూ వ్యాఖ్యానించిన ఆ నెటిజెనుడు , తెలుగు దేశం పార్టీ నాయకత్వాన్ని కాస్త గట్టిగానే అప్రమత్తం చేశారు.

ఏంటి సార్..మీరు మరీ బ్రహ్మానందం లాగా...

నాగబాబు కు దురద గుంటాకు పూసుకోవటమంటే మహా సరదా మల్లే ఉంది. పొద్దున్న పొద్దునే తన ట్విట్టర్ లో కరోనా వైరస్ మీద జోకుదామనుకుంటే, అది కాస్తా బూమరాంగ్ అయింది. " కొన్ని ప్రముఖ మతాల పెద్దలు చెప్పిందేమంటే కరోన వైరస్ ని వాళ్ళ దేవుడే ఈ భూమి మీద కి పంపించాడు అని అంటున్నారు. అయినా ఈ దేవుళ్ళ కి కోపం ఎక్కువే సుమా.." అంటూ జబర్దస్త్ గా నాగబాబు చేసిన ట్వీట్ కి అసలే చిరు బ్రదర్స్ అంటే కోపం నషాలా కి అంటిన జనం వీర లెవెల్లో రిప్లై ఇచ్చారు.  "అక్కడ మన అభ్యర్థులపైన దాడులు జరుగుతున్నాయ్ సార్ కులమతాల గొడవలు వదిలేసి కొంచెం జనంలో తిరగండి", అంటూ తిరిగి నాగబాబు మీద సెటైర్ రువ్వాడో నెటిజెనుడు. అంటే, దీనర్ధం, చిరు బ్రదర్స్ ఎలాంటి బాదరా బందీ లేకుండా... ఉత్తినే ట్వీట్లు చేయటం కాదు, జన సేన అభ్యర్థుల మీద చాలా చోట్ల దాడుల జరుగుతున్నాయి కాబట్టి కాస్త వాళ్ళని పరామర్శించటానికైనా వెళ్ళండి, మైలేజ్ దక్కుతుందని ఆ నెటిజెనుడు సుద్దులు చెప్పాడు.  కాస్తంత పనికి వచ్చే విషయాల మీద ట్వీట్లు పెట్టమని ఇంకోహాయన, అలాగే, ఇవాళ జన సేన ఫార్మేషన్ డే కాబట్టి దాని మీద, ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద జనాన్ని సెన్సిటైజ్ చేసే ప్రయత్నం చేయండని మరొకాయన శ్రీమాన్ నాగబాబు గారికి సలహా ఇచ్చారు.

పోలవరం భూసేకరణ వ్యయాన్ని భరించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

పోలవరం ప్రాజెక్టు పనులను 2021 నాటికి పూర్తి చేయాల‌నే ల‌క్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కార్యాచ‌ర‌ణ‌ ప్రణాళిక రూపొందించారు. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని రీయింబర్స్‌ చేయడంతోపాటు సవరించిన అంచనాల మేరకు నిధులు ఇచ్చి సకాలంలో ప్రాజెక్టును పూర్తిచేయడానికి సహకరించాలంటూ పలు సందర్భాల్లో ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. దాంతో గత నెలలో పోలవరానికి రూ.1,850 కోట్లను రీయింబర్స్‌ చేయాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు ఎన్‌డబ్ల్యూడీఏ ద్వారా పీపీఏకు నాబార్డు నిధులు విడుదల చేసింది. వాటిలో రూ.1,780 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి పీపీఏ విడుదల చేసింది. దీంతో కేంద్రం రీయింబర్స్‌ చేయాల్సిన బకాయిలు రూ.5,099.89 కోట్ల నుంచి రూ.3,319.89 కోట్లకు తగ్గాయి. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన బిల్లులపై ఆడిటింగ్‌ నిర్వహిస్తున్న పీపీఏ.. మార్చి మొదటి వారంలో రూ.2,156 కోట్లు రీయింబర్స్‌ చేయాలని కేంద్ర జల్‌ శక్తి శాఖకు సిఫార్సు చేసింది. ఈ ఫైలుపై కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ ఆమోదముద్ర వేసి.. ఆ శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు పంపారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పోలవరానికి రీయింబర్స్‌ చేయాల్సిన నిధులు విడుదల చేయడంతోపాటు 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇవ్వాలని కోరారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన బుగ్గన రాజేంద్రనాథ్‌ కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో సమావేశమై.. పోలవరానికి రీయింబర్స్‌ చేయాల్సిన నిధులు విడుదల చేయాలని విన్నవించారు. పోలవరం సవరించిన అంచనా వ్యయం 55,545 కోట్లు. 48 వేల కోట్ల వ్యయానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. పోలవరంపై ఇప్పటికే 16 వేల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం. మిగతా 32 వేల కోట్లనూ భరించనున్న కేంద్ర ప్రభుత్వం. భూసేకరణ, పునరావాస వ్యయ భరింపు ఎట్టకేలకు స్పష్టత. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ఉన్న 2200 కోట్లు. ఆడిటింగ్ పూర్తవ్వగానే కేంద్రం నంచి విడుదల కానున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.3,319.89 కోట్లను రీయింబర్స్‌ చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ కోరారు. జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) ద్వారా కాకుండా ‘నాబార్డు’ నుంచి నిధులను నేరుగా పోలవరం ప్రాజెక్టు అథారిటీకి(పీపీఏ) విడుదల చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని ప్రతిపాదించారు. దీనిపై గజేంద్రసింగ్‌ షెకావత్‌ సానుకూలంగా స్పందించారు. పోలవరానికి రూ.2,156 కోట్లు రీయింబర్స్‌ చేయాలని పీపీఏ ప్రతిపాదనలు పంపిందని.. వాటిని విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రూ.1,163.89 కోట్ల రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి పీపీఏ నుంచి ప్రతిపాదనలు రాగానే, వాటిని విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పై ఎన్నికల కమిషన్ చర్య

తాడిపత్రి శాసన సభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి ని ఒక రోజు ప్రచారానికి దూరంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించినందుకు ఈ చ‌ర్య తీసుకుంటున్న‌ట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. రాష్ట్రంలో నిర్వహిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తాడిపత్రి నియోజకవర్గం పరిధిలో మార్చి 8 వతేదీన స్థానిక శాసన సభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి మునిసిపాలిటీ పరిధిలో చీరలు, బట్టలు పంచిపెట్టినట్లు ఫీర్యాదు రావడం జరిగిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ తెలిపారు. ఈ సంఘటన పై ఎన్నికల సాధారణ పరిశీలకులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి తాడిపత్రి మునిసిపాలిటీ లోని శ్రీరాముల పేటలో వాకబు చేసి, వాస్తవాలను నిర్ధారించడం జరిగిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళి రాష్ట్రంలో 7వ తెది నుండి అమల్లోకి వచ్చినందున, ఓటర్లు ను ప్రభావితం చేసేందుకు ప్రయత్నం చేయ్యడం తీవ్రంగా పరిగణించడ మైనదని, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘన కింద ప్రాసిక్యూషన్ చెయ్యడం జరుగుతుందని తెలిపారు. శాసనసభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి మార్చి 15 న ఒక రోజు ఎన్నికల ప్రచారం లో పాల్గొనకుడదని ఉత్తర్వులు జారీ చేశామన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు సంద‌ర్భంగా జ‌రిగిన గొడ‌వ‌ల‌కు సంబంధించి ఎన్నిక‌ల సంఘం స్పందించి ఈ నిర్ణ‌యం తీసుకుంది. స్థానిక ఎమ్మెల్యే పెద్దారెడ్డి, తన వర్గీయులతో కలిసి మున్సిపల్ ఆఫీసు ముందు కూర్చున్నారు. టీడీపీ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా పెద్దారెడ్డి వర్గీయులు అడ్డుకున్నార‌ని ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదులు అందాయి. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డి లు ప‌ర‌స్ప‌రం ఆరోప‌ణ‌లు చేసుకున్నారు.

ఆరేళ్లు ఒకటే కాయ అదీ జ‌న‌సేన లెక్క‌!

ఎన్టీఆర్ 9 నెల‌ల్లో రాష్ట్ర రాజ‌కీయాల‌నే మార్చి వేశారు. అన్న‌ చిరంజీవి 8 నెల‌ల్లో 18 సీట్లైనా ఖాతాలో వేసుకున్నారు. నాకు తిక్క వుంది కానీ దానికి ఒక లెక్క‌వుందంటూ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ పెట్టి ఆరేళ్ళైనా ఒక్క‌టంటే ఒక్క సీటు గెలిపించుకున్నారు. తాను రెండు చోట్ల ఓడిపోయారు. అప్ప‌ట్లో బీజేపీ - టీడీపీతో పొత్తు పెట్టుకొని టిడిపిని గెలిపించారు. 2019 ఎన్నిక‌ల్లో సీపీఎం, బీఎస్పీతో క‌లిసి పోటీ చేశారు. రాష్ట్ర రాజ‌కీయాల్లో తుస్సు మ‌న్నారు. తాజాగా బిజెపితో క‌లిసి స్థానిక ఎన్నిక‌ల్లో స‌త్తా చూప‌డానికి పంచ్ డైలాగ్‌లు చెబుతున్నారు. స్థానిక స‌మ‌రంలోనైనా ప‌రువు కాపాడుకోవ‌డానికి రాజ‌మండ్రి వేదిక‌గా జ‌రిగే స‌మీక్ష‌లో ఎలాంటి ఎత్తుగ‌డ‌లు వేయ‌నున్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి మార్చి 14 నేటికి ఆరు సంవత్సరాలు అవుతుంది. ఆరో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. ఐతే... ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కార్యక్రమాల్ని సాదాసీదాగా నిర్వహించనున్నారు. ఇవాళ ఏం చేసినా, ప్రతీ లెక్కా ఈసీకి నివేదించాల్సిందే. అందువల్ల వేడుకల్ని అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసారి వేడుకలకు రాజమహేంద్రవరం (రాజమండ్రి) వేదిక అయింది. జననేత శ‌నివారం ఉదయం విమానంలో మధురపూడి చేరుకుని అక్కడ నుంచి రాజమహేంద్రవరంకు వెళ్ళారు. పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. ఆరేళ్లలో పార్టీ పరిస్థితిని సమీక్షిస్తారు. ధవళేశ్వరం రామపాదాల రేవు వద్ద ‘మన నది - మన నుడి’ కార్యక్రమంలో భాగంగా గోదావరికి హారతి ఇచ్చి రచ్చబండ నిర్వహించున్నారు. ఆవిర్భావ సమావేశం రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలోని షెల్టాన్‌ హోటల్‌లో జరుగుతోంది. పార్టీ ఆవిర్భవించిన తరువాత ఆరేళ్లలో చేసిన పోరాటాలు, సాధించిన ప్రగతి, ఇబ్బందులు తదితర విషయాలను సమీక్షించి భవిష్యత్‌ కార్యాక్రమాన్ని రూపొందించ‌నున్నారు. ఆదివారంనాడు వివిధ వర్గాల మేధావులతో తెలుగభాష పరిరక్షణ కోసం షెల్టాన్‌లో సమీక్షిస్తారు. ప్రభుత్వం తెలుగు మీడియం రద్దు చేయడాన్ని వ్యతిరేకించడంతో పాటు ఒక ఉద్యమంగా భాషా పరిరక్షణ కోసం ఉపక్రమించ‌నున్నారు. పిల్లలతో నదీ పరిరక్ష ణ గురించి పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడతారు. ఇది ఓ రచ్చబండ కార్యక్రమంలా నిర్వహించనున్నారు. 15న కవులు, సాహితీవేత్తలతో సమావేశ మై, తెలుగుభాష పరిరక్షణ గురించి చర్చిస్తారు. సాహితీవేత్తల అభిప్రాయాలతో కొన్నినిర్ణయాలు తీసుకుని, తెలుగుభాషా పరిరక్షణ కార్యక్రమాలు చేపడతారు. వైసీపీపై పోరాటానికి ఆవిర్భావ దినోత్సవాన్ని ఆరంభంగా చేసుకోవాలని జనసేన భావించింది. ఐతే... 144 సెక్షన్ అమల్లో ఉండటం వల్ల... బహిరంగ సభలు చేపట్టేందుకు చాలా షరతులు తప్పవు. ఏదైనా సభ నిర్వహించినా... దానికి అయ్యే ఖర్చులు... అభ్యర్థుల ఖర్చుల లిస్టులో చేరతాయి. అందుకే జనసేన పార్టీ బహిరంగ సభ బదులు ఇతర కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకుంది. 2014 మార్చి 14న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో పార్టీని లాంచ్ చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ - టీడీపీతో కలసి జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంది. ఆ ఎన్నికల్లో మూడు పార్టీల కూటమి విజయం సాధించింది. అయితే, టీడీపీ, బీజేపీ పోటీ చేశాయి. జనసేన మాత్రం పోటీ చేయలేదు. అయితే, 2014 - 19 మధ్య రాజకీయాలు మారిపోయాయి. తెలుగుదేశం పార్టీతో పొత్తు నుంచి బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం, బీఎస్పీతో కలసి ఎన్నిక‌ల బరిలో దిగారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. జనసేన తరఫున కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కూడా ఓడిపోయారు. 2019 ఎన్నికల తర్వాత బీజేపీకి పవన్ కళ్యాణ్ దగ్గరయ్యారు. ప్రస్తుతం ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని తాజాగా విజన్ డాక్యుమెంట్‌ను కూడా రిలీజ్ చేశాయి. జ‌న‌సేన భ‌విష్య‌త్ గురించి ఈ స‌మావేశంలో 2024లో అధికారంలో రావ‌డానికి అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై కూడా చ‌ర్చిస్తున్నారు.

పశుపతి నాధుడిని దర్శించుకుని, అటు నుంచి అటే వెళ్లిపోండి...

నేపాల్ లో పశుపతి నాధుడిని దర్శించుకుని, అటు నుంచి భారత దేశానికి చేరుకోవాలనే విదేశీయులకు ప్రస్తుతానికి నో ఎంట్రీ. దేశంలో రోజురోజుకు కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య పెరుగుతుండడంతో కేంద్రం హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాల సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్టులను మూసివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దేశ సరిహద్దుల్లో మొత్తం 37 ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్టులు ఉండగా వాటిలో 19 చెక్‌పోస్టులు శనివారం అర్ధరాత్రి వరకు పనిచేయనున్నాయి. అర్ధరాత్రి తర్వాత ఇండియా-బంగ్లాదేశ్, ఇండియా-నేపాల్, ఇండియా-భూటాన్, ఇండియా-మయన్మార్ సరిహద్దుల్లోని చెక్‌పోస్టులు మూతపడనున్నాయి.  అలాగే, నేపాల్, భూటాన్ దేశాల నుంచి విదేశీయులు దేశంలోకి రాకుండా అడ్డుకోవాలని హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇటలీ, ఇరాన్, చైనా, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, కొరియా దేశాల్లో పర్యటించి దేశానికి వచ్చే వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించాలని ఆదేశించింది.   సాధారణం గా నేపాల్, భూటాన్ లలో హిందూ, బౌద్ధ ఆలయాలు, ఆరామాలను దర్శించుకుని అటు నుంచి భారత్ కు రావటం విదేశీ పర్యాటకులకు అలవాటు. అయితే, కరోనా దెబ్బకు ప్రస్తుతం వారి ఎంట్రీ మీద తాత్కాలిక నిషేధం విధించింది భారత హోమ్ మంత్రిత్వ శాఖ.

లోకేష్ ను గురజాల వెళ్లి చెక్ చేసుకోమన్న పోలీస్ పెద్దాయన!

ఎవరో బయలుకు వెళ్లొస్తే, ఊరిపెద్ద చేతులు శుభ్రం చేసుకున్న చందాన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సంఘటనలకు పోలీస్ పెద్దాయన చివరకు వివరణ ఇచ్చుకుంటూ కూర్చోవలసి వస్తోంది. అసలే హైకోర్టు పిలిచి, ఆరు గంటలు నుంచో పెట్టిందని అవమానంతో ఉడికి పోతున్న గౌతమ్ సవాంగ్ కు, టీ డీ పి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కంటి లో నలుసు లా తయారయ్యారు.  శాంతిభద్రతలకు ఎలాంటి ముప్పు లేదని, లోకేష్ కు ఏమైనా  అనుమానాలు ఉంటె ఓ మారు గురజాల సబ్  జైలు కు వెళ్లి చెక్ చేసుకోవచ్చునని  ఆంధ్ర ప్రదేశ్ డి జి పి డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శికి సూచించారు..స్థానిక సంస్థల ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ప్రజాస్వామ్యానికి, శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తమకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని, ఏ పార్టీ వారు ఫిర్యాదు ఇచ్చినా స్వీకరిస్తున్నట్టు తెలిపారు. మాచర్ల ఘటనపై టీడీపీ నేత నారా లోకేశ్ చేసిన ఆరోపణలపైనా సవాంగ్ స్పందించారు. మాచర్ల ఘటన తర్వాత లోకేశ్ స్పందిస్తూ.. టీడీపీ నాయకులపై హత్యాయత్నం చేసిన వైసీపీ నాయకుడికి స్టేషన్ బెయిలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడిగితే ఒకసారి స్టేషన్ బెయిలు అని, మరోసారి పారిపోయాడని అంటున్నారని మండిపడ్డారు. కోర్టులు కూడా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని లోకేశ్ పేర్కొన్నారు.  లోకేశ్ విమర్శలపై స్పందించిన డీజీపీ.. మాచర్ల ఘటనలో ముగ్గురు నిందితులు జైల్లోనే ఉన్నారని డీజీపీ తెలిపారు. మాచర్ల ఘటనపై చట్టపరంగా ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. ఈ విషయంలో తాము ఎవరికీ అనుకూలంగా వ్యవహరించబోమన్నారు. సెక్షన్‌ 307 కింద కేసులు నమోదు చేయలేదని వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమన్నారు. అరెస్ట్ అయిన ముగ్గురు గురజాల సబ్‌జైలులో ఉన్నట్టు తెలిపారు. మాచర్ల ఘటనపై తమను విమర్శించేవారు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలను తమ వాహనాల్లో ఎక్కించుకుని భద్రత కల్పించిన విషయాన్ని గుర్తించాలని డీజీపీ కోరారు. వాస్తవానికి లోకేష్ ట్వీట్ చేస్తూ.. " వ్యవస్థల్ని బ్రష్టు పట్టించడంలో @ysjagan గారు నెంబర్ 1. తండ్రి హయాంలో తప్పుడు పనులు చేసి ఐఏఎస్ అధికారులను జైలుకి పంపారు. ఇప్పుడు ఐపీఎస్ అధికారులను కోర్టు మెట్లు ఎక్కించి చివాట్లు పెట్టిస్తున్నారు," అని ప్రస్తావించడం ద్వారా సోషల్ మీడియా ద్వారా మైండ్ గేమ్ మొదలెట్టారు.  సోషల్ మీడియా లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించినందుకు టీడీపీ కార్యకర్తని 14 రోజులు రిమాండ్ కి పంపారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నాయకులపై హత్యాయత్నం చేసిన వైకాపా నాయకుడికి మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చాం అని ఒకసారి తూచ్ అతను పారిపోయాడు అని మరోసారి చెబుతారా, అంటూ కూడా లోకేష్ నిలదీశాడు. పొలిసు వ్యవస్థని ఇంత నిస్సిగ్గుగా దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టే ఈ రాష్ట్రంలో చట్టం అమలు అవుతుందా అని కోర్టులు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది, అంటూ లోకేష్ వాపోయారు.

తమిళనాడు ట్రెండ్ సెట్ చేస్తే, చికెన్ అలాగే ఖాళీ అయిపోతుంది మరి!

పండగ తొలినాడు గుడ్డల కరువు, పండగనాడు అన్నం కరువు, పండగ మన్నాడు మజ్జిగ కరువు... అయితే, ఇపుడు ఆ కరువు మాట పక్కన బెట్టి చికెన్ కోసం ఆ హోటల్ మీదకు ఉరికెత్తుకొచ్చారు ఊరి జనం. అది గుంటూరు లో జరిగిన లేటెస్ట్ వింత. ఏ వింతలకైనా తమిళనాడు ట్రెండ్ సెట్ చేస్తే, మిగిలిన జనాలు అది ఫాలో చేస్తారు గా.. ఓ సారి అక్కడ ఏమి జరిగిందో మీరే చదవండి.  తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లా పొన్నేరి ప్రజలు మాత్రం కరోనా భయాన్ని పక్కనపెట్టేసి అందినంత చికెన్ బిర్యానీ లాగించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. గురువారం ఇక్కడ కొత్తగా ఓ హోటల్ ప్రారంభమైంది. ప్రజలను ఆకర్షించేందుకు ప్రారంభోత్సవ ఆఫర్‌లో భాగంగా రూపాయికే చికెన్ బిర్యానీ అందిస్తున్నట్టు బోర్డులు పెట్టారు. అంతే.. జనాలు విరగబడిపోయారు. బిర్యానీని దక్కించుకునేందుకు బారులుతీరారు. వారిని అదుపు చేసేందుకు ఏకంగా పోలీసులే రంగంలోకి దిగాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12 గంటలకు విక్రయాలు ప్రారంభం కాగా, రెండు గంటల్లోనే 120 కిలోల చికెన్ బిర్యానీ హాంఫట్ అయిపోయింది. కరోనా భయంతో బిర్యానీ అమ్ముడుపోతుందో, లేదోనని తొలుత భయపడ్డామని, అయితే, వినియోగదారుల నుంచి విశేష స్పందన రావడం తమకు సంతోషాన్నిచ్చిందని హోటల్ యజమాని పేర్కొన్నారు.

లోక‌ల్‌వార్‌లో డ‌బ్బే కీల‌కం! డ‌బ్బుఖ‌ర్చుపెట్టే స‌త్తా చూసే అభ్య‌ర్థి ఎంపిక‌చేశార‌ట‌!

మీ దగ్గర క్యాష్ ఎంతుంది? ఎంతున్నా. వారు చెప్పినంత ఉండాలి. అదికూడా ముందుగానే చూపించాలి. అప్పుడుగాని ఆ అభ్యర్ధి ఎన్నిక‌ల రేసులో ఉండరు. ఇదేంటని అనుమానం వ్యక్తం చేయకండి. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు న‌డుస్తున్న ట్రెండ్ ఇదే. పోటీ చేయాలంటే ఈ స్ధాయిలోనే ప్రాథమిక స్క్రీనింగ్ జ‌రిగిందని కొందరు అభ్యర్ధులు వాపోతున్నారు. రాజకీయాల్లో డబ్బుల తర్వాతే ఏదైనా. సొమ్ములుంటే కొండమీద కోతైనా ఇట్టే వ‌చ్చేస్తోంది. స్థానిక సంస్ధలలో పోటీ చేయాలనుకుంటున్న వారికి ఆయా నియోజకవర్గ ఇన్ ఛార్జి ఆశీస్సులు ఆశీర్వచనాల‌తో పాటు విట‌మిన్ ఎం. షో చేయాల్సిందేన‌ట‌. ఏపీలో రాజకీయ పార్టీలు ఎత్తులు పైఎత్తులతో వ్యూహాల్లో నిమ‌గ్న‌మైయ్యారు. గెలుపే ల‌క్ష్యంగా అభ్య‌ర్థుల్ని ఎంపిక చేసుకున్నారు. పదేళ్ల తర్వాత పోటీ స్ధానిక ఎన్నికలు రావడంతో బరిలో నిలిచేందుకు ద్వితీయశ్రేణి నాయకులు ఆసక్తి గా ఎన్నిక‌ల బ‌రిలో దిగారు. దీంతో జాబితాను ఫైన‌ల్ చేయ‌డానికి ఇంఛార్జుల‌కు స‌ర్క‌స్ ఫీట్లు త‌ప్ప‌లేద‌ట‌. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే విజయవాడ కార్పోరేషన్లో కాలు పెట్టేందుకు వైసీపీ శ్రేణులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో నగరంలో మూడు నియోజకవర్గాలలో అభ్యర్దుల ఎంపిక నేతలకు తలనొప్పిగా మారింది. పశ్చిమ నియోజకవర్గం నుంచి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అభ్యర్దులను ఫైన‌ల్ చేశారు. మరోవైపు సెంట్రల్ నియోజకవర్గం నుంచి కాస్తాంత గట్టిపోటీ ఉన్నా అభ్యర్దుల ఎంపిక విషయంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆచీతూచీ అడుగులు వెస్తున్నారు. పార్టీ పెద్దల నుంచి ఒత్తిడులు ఉన్నా సాధ్యమైనంత వరకు గెలిచేవారికే ప్రేయార్టీ ఇచ్చార‌ట‌. తూర్పు నియోజకవర్గంలో టిడీపీ గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పార్టీ ఇంచార్జిగా ఉన్న దేవినేని అవినాష్ అభ్యర్దుల ఎంపికపై తీవ్రస్ధాయిలో కసరత్తు చేశారు. అభ్యర్ధితో పాటుగా క్యాష్ కూడా చూస్తున్నారు... కార్పోరేటర్ గా పోటీ చేయాలంటే 50 లక్షలు ఉండాల్సిందే. రిజర్వుడు నియోజకవర్గంలో అయితే 25 నుంచి 30 లక్షలట‌. ఆ మొత్తాన్ని తమ వ్యక్తులకు చూపించాలని, ఎన్నికల టైంలో మావారు చెప్పినట్లే చేయాలని కూడా హుకుం జారీచేస్తున్నారు. ఇది ఒక్క దేవినేని దొడ్డిలోనే కాదు. దాదాపు నాయకులంతా ఇదే ధోరణి అనుసరించారు. అయితే అవినాష్ అనుభవం తక్కువ కావడంతో సీక్రెట్ కాస్తా ఓపెన్ అయ్యింది. విజయవాడ కార్పోరేషన్ లో పరిస్ధితే కాదు... రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాలలో పరిస్ధితి దాదాపు ఇలానే ఉంది. కౌన్సిలర్ అయితే 15 నుంచి 20 లక్షలు వరకు ఖర్చు అవుతుంది. జెడ్పీటీసీగా బరిలో నిలబడే అభ్యర్దికి 50 లక్షల వరకు రెడీ చేసుకోవాల్సిన పరిస్ధితి. ఎంపిటీసి, సర్పంచ్ లకు 10 లక్షల వరకు అవసరం ఉంటుందనే ఇండికేషన్స్ ఆయా పార్టీల నేతలు ఇచ్చారు. ముఖ్య‌మంత్రి మద్యం, నగదు పంపిణీకి చెక్ పెట్టాలని పంచాయతీ చట్టంలోనే మార్పులు తీసుకొచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోందిని ఈ ఎన్నిక‌ల్లో డ‌బ్బు ఖ‌ర్చు పెట్టే తాహతు లేని నేత‌లు మండిప‌డుతున్నారు.

మైల విధానం నేటి ఐసోలేషన్ పరిమిత పద్ధతి ఒకటేనా?

అవునంటోంది భార‌తీయ స‌నాత‌న ధ‌ర్మం. మ‌న పూర్వీకులు అప్ప‌ట్లో చెప్పిన *మైల విధానం నేటి ఐసోలేషన్ పరిమిత పద్ధతి ఒకటే. సాంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో చెబితే చాదస్తం అన్నారు. ఇంగ్లీష్‌లో చెబితే మ‌న వాళ్ల‌కు బాగానే అర్థం అయింది. అదే మ‌న భార‌తీయ భారతీయత ఔన్నత్యం. అప్ప‌ట్లో పురుడు వచ్చినా ఎవరి ఇంట్లోనైనా మరణం సంభవించినా మైల పాటించ‌డం ఆచారంగా వుండేది. ఈ విధానం భారతీయ సనాతన ధర్మం. అయితే చ‌దువు ఎక్కువైయ్యే స‌రికి దానిని చాదస్తం లేదా మూఢనమ్మకం అంటూ కొట్టి పారేస్తున్నాం. అయితే క‌రోనా దెబ్బ‌కు అస‌లు విష‌యం బోధ‌ప‌డుతోంది. ఒక ఇంటిలో శిశువు జన్మిస్తే, ఆ సమయములో తల్లి గర్భము నుంచి కలుషిత వ్యర్ధాలు అనగా నెత్తురులాంటివి అనేకం వెలువడతాయ్. అవి వాతావరణములో అనేక హానికారక సూక్ష్మజీవులు(వైరస్) ఉత్పత్తికి దోహదం చేస్తాయి ఆ పరిసర ప్రదేశాలలో అంటే ఆ ఇంటిలో లేదా ఆ గదిలో. ఆ యజమానికి సంబంధించిన దగ్గరి (అన్నదమ్ముల కుటుంబాలు) బంధువులు పరామర్శకి వచ్చి అక్కడ ఉండి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. అటువంటి వారిని ఈ వైరస్ ఆశ్రయించే అవకాశం ఉంటుంది. సాధారణముగా వైరస్ జీవన ప్రమాణం 10 రోజులు. అందుకే 11వ రోజున ఆ వ్యక్తులందరూ పసుపు కలిపిన నీటితో సంపూర్ణ స్నానం చేస్తారు. అక్కడి వస్తువులన్నీ పసుపు(క్రిమి సంహారిణి) కలిపిన నీటితో శుద్ధి చేస్తారు. దీనినే పురిటి శుద్ధి అంటారు. అలాగే మరణం కారణముగా ఏర్పడే మైలతో మృత‌దేహం చుట్టూ క్షణాలలో చీమలు అపరిమితముగా గుమిగూడుతుంటాయ్. వాతావరణములో మార్పుల కారణముగా కనపడని సూక్ష్మజీవులు ఇంకెన్ని కోట్లలో ఆ ప్రదేశములో గుమిగూడతాయో చెప్పలేము. ఆ సమయములో ఆ ఇంటి పేరువారు, వారి కులం వారు అక్కడికి వచ్చి ఉంటారు. సూక్ష్మజీవులు జీవనప్రమాణం ఆధారంగా 11వ రోజు శుద్ధి స్నానం చేయమంది శాస్త్రం. పెండ్లి అయిన ఆడబడుచులను ఇత్యాది వారిని 4వ రోజున శుద్ధి స్నానం చేయమంది. కారణం వారు సాధారణముగా వారి వారి కుటుంబాల‌కు వెళ్ళిపోతారు. శవ దహనం తరువాత. అంటే వైరస్ వ్యాప్తి తగ్గుముఖం ఉండే స్థానాలకు తిరిగి వెళ్లిపోయేరు కాబట్టి 3 రోజులు మైలగా పరిగణిస్తారు. అదే విధముగా శవం ఉన్న సమయములో చుట్టుపక్కల వంట వంటి కార్యక్రమాలు నిషేధించి ఆ ప్రాంతము నుంచి శవం తొలగించిన తరువాత అక్కడి నివాసులు స్నానం చేసి వంట భోజన కార్యక్రమాలు చేపట్టమన్నారు. ఈ విధానాన్ని భారతీయ సనాతన ధర్మం మైల అన్నది. దీనినే ఇప్పటి శాస్త్రవిజ్ఞానం (సైన్స్) ఇమ్మ్యూనిటి అనే పేరుతో సూక్ష్మజీవ ప్రభావ రోగులను ఐసోలేషన్ ప్రాంతాలలో పెట్టి ఆరోగ్యవంతులకు దూరముగా పెడుతున్నారు. అది విష‌యం.

వైఎస్సార్సిపిలో భగ్గుమంటున్న వర్గ విభేదాలు

వైఎస్సార్సిపి లో ఎస్సి నాయకులు థర్డ్ గ్రేడ్ నాయకులుగా మిగిలిపోవాల్సిందేనా...? వైఎస్సార్సిపి కి గుడ్ బై చెప్పే ఆలోచనలో నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్డర్... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజీకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం... 151 సీట్లు గెలిచి 10 నెలలు కాకముందే వైకాపా ఎస్సి నాయకుల్లో పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేఖత ఏర్పడుతుంది.స్థానిక ఎన్నికల నేసథ్యంలో పార్టీలో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి.ఏకంగా ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం.రెడ్డి నాయకుల ఆధిపత్య పోరులో ఎస్సి నాయకులు నలిగిపోతున్నారు.కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్ పరిస్థితి అధ్వాన స్థితికి చేరుకుంది.ఆర్ధర్ ని నమ్ముకున్న నాయకులు,కార్యకర్తలను అధిష్ఠానం నీచంగా చూడటం,కనీస గౌరవం కూడా ఇవ్వకపోవడంతో ఆయన రాజకీయాలనే వదులుకోవాలి అనే ఆలోచనకి వచ్చారు.రెడ్డి నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కాళ్ళ కింద 10 నెలల నుండి నలిగిపోతూ కక్క లేక,మింగ లేక నలిగిపోయారు ఆర్డర్,ఆయన అనుచరులు.కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా తన వర్గానికి న్యాయం జరుగుతుంది అని భావించి మరోసారి అవమానపడ్డారు.తన వర్గానికి న్యాయం జరగలేదు కనీసం భీ-ఫార్మ్ ఇచ్చే అధికారం కూడా ఎమ్మెల్యేకి లేదు అని బైరెడ్డి సిద్దార్థ రెడ్డి హుక్కుమ్ జారీ చేసారు.ఎమ్మెల్యే పక్కనే ఉన్నా భీ-ఫార్మ్ లు మాత్రం బైరెడ్డి సిద్దార్థ రెడ్డి చేతుల మీదుగా ఇచ్చి ఆర్ధర్ ని ఘోరంగా అవమానించి పంపారు.ఇంత కాలం నియోజికవర్గంలో పేరుకి మాత్రమే ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ కార్యక్రమాల అమలు ఇలా ఏ కార్యక్రమంలో కూడా ప్రోటోకాల్ ఉండదు.అన్ని బైరెడ్డి ప్రారంభిస్తారు.   కనీసం కొన్ని కార్యక్రమాలకు సమాచారం కూడా ఇవ్వరు.ఇప్పుడు కనీసం 10 శాతం సీట్లు కూడా తన వర్గానికి ఇప్పుంచుకోలేని నిస్సహాయ స్థితికి దిగజారిపోయారు ఎమ్మెల్యే ఆర్డర్.దింతో ఇంతకాలం జగనన్న ఉన్నారు,అయన వింటారు అని నమ్మకం పెట్టుకున్న ఆర్ధర్ కి స్థానిక ఎన్నికల నేపథ్యంలో అసలు విషయం తెలిసింది.జరిగే ప్రతి చర్య అధిష్టానం కి తెలిసే జరుగుతుంది అని గ్రహించిన ఆర్ధర్ ఇక రాజీకీయాలకు,ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారు.దీనికి ప్రధాన కారణం నమ్ముకున్న కార్యకర్తలకు కనీస న్యాయం కూడా చేయలేకపోవడం వారి ముందు ఆర్ధర్ మొహం చెల్లకపోవడం వలన ఫైనల్ గా రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.

రోజా రెడ్డి వెర్సెస్ పెద్ది రెడ్డి

చిత్తూరు జిల్లాలో ప్రచ్ఛన్న యుద్ధం రోజా రెడ్డి కి చెక్ పెడుతున్న పెద్ది రెడ్డి మంత్రి పదవి పై కన్నేసిన రోజా రోజా మంత్రి అయితే సుధీర్ఘ కాలం కాపాడుకున్న పెద్దరికం పోతుంది అనే భయంలో పెద్ది రెడ్డి గాలి వానలా మొదలైన రోజా రెడ్డి ,పెద్ది రెడ్డి ప్రచ్చన్న యుద్ధం తుఫాను గా మారుతుంది.జిల్లా లో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది.జగనన్న గెలిస్తే చెల్లమ్మకు మంత్రి పదవి గ్యారెంటీ అనుకున్నారంతా.కానీ చెల్లెమ్మకు మంత్రి పదవి దక్కకుండా పెద్ది రెడ్డి చాకచక్యంగా చక్రం తిప్పారు.చెల్లెమ్మ అలిగి కొన్ని రోజులు బయటకు రావడం కూడా మానేసి జబర్దస్త్ కి పరిమితం అయ్యారు.ఏపిఐఐసి పదవి తీసుకోవడం ఇష్టం లేకపోయినా సన్నిహితుల సలహాతో పదవి స్వీకారం చేసినా ఆ పదవి పట్ల ఆమె ఎప్పుడు శ్రద్ద చూపడం లేదు.ఒక పక్క కోరుకున్న పదవి దక్కలేదు అని ఆవేదన మరో పక్క నియోజికవర్గంలో అంతర్గత పోరు ఆమెకు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.నియోజికవర్గంలో ఒక చోటా నాయకుడి జన్మదిన వేడుకులకు హాజరవ్వొద్దని ఎమ్మెల్యే రోజా కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చే పరిస్థితి వచ్చింది అంటే జిల్లాలో పెద్ది రెడ్డి ప్రాభవం ఎంత ఉందొ అర్ధం చేసుకోవచ్చు.ఆఖరికి సొంత నియోజికవర్గంలో పర్యటించడానికి లేదంటూ పెద్ది రెడ్డి వర్గం ఆమె కాన్వాయ్ కి అడ్డుపడే పరిస్థితి వచ్చింది అంటే ఎంత దారుణమైన పరిస్థితి,జబర్దస్త్ కష్టాలు రోజాను వెంటాడుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు.     ఈ సమయంలో మండలి రద్దు రోజాలో కొత్త ఆశలు రేకెత్తించాయి.రెండు మంత్రి పదవులు ఖాళీ అవ్వడం,రేసులో రోజా పేరు మీడియా లో రావడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సత్తా నిరూపించుకొని మంత్రి పీఠం దక్కించుకోవాలని రోజా రెడ్డి ఆలోచన.మరి పెద్ది రెడ్డి ఊరికే చూస్తూ కూర్చుంటారా?జిల్లాలో మరో పవర్ సెంటర్ అనే ఆలోచనే రాకూడదు ఆయనకి.వెంటనే రంగంలోకి దిగి నగరి లో తన వర్గానికే మెజారిటీ సీట్లు ఇప్పించుకునే పనిలో పడ్డారు.ఈ లోపు లేడీ సెంటిమెంట్ వాడి రోజా కార్చిన కన్నీటికి అధిష్టానం కాస్త తగ్గి కొంత భాగం సీట్లు ఆమె వర్గానికి వచ్చేలా చేసారు.ఇప్పుడు పెద్ది రెడ్డి వర్గం దీనికి విరుగుడు వేసింది.ఈ నియోజికవర్గంలోకి రోజా హవా జీరో చెయ్యాలని తద్వారా ఆమె మంత్రి పదవి ఆశల పై నీళ్లు చల్లాలని పెద్ది రెడ్డి ఫిక్స్ అయ్యారు.అందుకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు సైలెంట్ గా ఓట్లు గుద్ది రోజా ని జీరో చెయ్యాలని ఆర్డర్ వేసారు పెద్దిరెడ్డి.ఇప్పుడు ఎం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో రోజా పెద్ది రెడ్డి ని ఎదుర్కునే శక్తి లేక ఢీలా పడ్డారు.