ఏం పాదం రోజా.. అలా ఎంట్రీ.. జగన్ పై కేసు..

యాదృశ్చికమో లేక రోజా టైం బాలేదో తెలియదు కానీ అందరూ అన్నట్టే జరగడం ఆశ్చర్యం. గతంలో రోజా వల్ల జగన్ అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది అన్న కథనాలు వచ్చాయి. ఒకటి కాదు రెండు కాదు.. అలాంటి ఘటనలు చాలానే జరిగాయి. ఇప్పుడు జగన్ పై కేసు నమోదు అవ్వడంతో.. మళ్లీ రోజాపై విమర్శలు మొదలయ్యాయి. రోజా వచ్చిందో..? లేదో..? జగన్ పై కేసు నమోదైంది అని కామెంట్లు విసురుతున్నారు. ఇటీవల జరిగిన నంద్యాల ఉపఎన్నికల్లో ఓడి పోవడానికి ఓ రకంగా రోజానే కారణమని సొంత పార్టీ నేతలే తిట్టుకున్నారు. ఆతరువాత.. రోజా తిరుమలపై కొబ్బరికాయ కొట్టింది.. పాదయాత్ర ఆగింది అని అన్నారు. ఇప్పుడు జగన్ పాదయాత్రకి రోజా వెళ్లింది.. జగన్ పై కేసు నమోదైంది అంటున్నారు.   ప్రస్తుతం జగన్ ప్రజాసంకల్పం పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ పాదయాత్రలో రోజా కూడా పాల్గొంది. పాదయాత్రలో భాగంగా.. జగన్, రోజా  వైసీపీ నేతలు బనగాని పల్లెలో మహిళా సదస్సు నిర్వహించారు. దీంతో అనుమతి లేకుండా ఈ సదస్సు నిర్వహించారన్న ఆరోపణలతో జగన్ పై కేసు నమోదైంది. జగన్ కేవలం పాదయాత్ర కోసం మాత్రమే అనుమతి తీసుకున్నారు. కానీ మహిళా సదస్సు నిర్వహించడం కోసం కాదని టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వైసీపీ మహిళా సదస్సుకు అనుమతి తీసుకోలేదని పోలీసులు అభ్యంతరం చెప్పారు. మహిళలను తరలిస్తున్న వాహనాలను మొదట్లో అడ్డుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం మహిళలను అడ్డుకుంటోందని ఆరోపిస్తూ.. ధర్నా చేస్తామని రోజా హుస్సేనాపురానికి చేరుకున్నారు. అక్కడ పెద్దగా మహిళలు లేకపోవడంతో ఆమె తిరిగి బనగానపల్లెకు వచ్చారు. పట్టణంలో వాహనంలో అటూ ఇటూ తిరుగుతూ హడావిడి చేసి చివరకు జగన్‌ పాదయాత్రలో పాల్గొన్నారు. ఏదేమైనా రోజా పాద‌యాత్ర‌లో ఎంట‌ర్ అయ్యిందో లేదో జ‌గ‌న్‌పై కేసు న‌మోదైంది.

ఒక్క టూర్.. పవన్ ను మార్చేసిందిగా...!

  ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది అని సరదాగా చెప్పుకుంటుంటా..అప్పుడప్పుడు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఒక్క టూర్ పవన్ ను మార్చేసిందా అనిపిస్తోంది. గత మూడు రోజులుగా పవన్ లండన్ టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే కదా. ప్రజా సమస్యలపై ఆయన స్పందిస్తున్న తీరుపై.. ఆయనకు 'ఇండియా-యూరోపియన్ బిజినెస్ ఫోరం' ఎక్స్‌లెన్సీ అవార్డును ప్రకటించింది. దీంతో పవన్ కు ఉన్న మైలేజ్ ఇంకా పెరిగిపోయింది. మరోవైపు పవన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు కూడా ఆయనకు అవార్డు రావడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక ఇదే జోష్ లో ఉన్న పవన్ కూడా ఇంకా ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లి.. వారితో మమేకం అయి.. వారి సమస్యలను తెలుసుకొని కృషి చేయాలని భావిస్తున్నారట.   అయితే పవన్ ఇంతకుముందు కూడా ఇవే ఆలోచనలు చేసేవాడు. ఇక 2019లో పార్టీ ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి దిగనుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటినుండే వర్కవుట్లు చేస్తున్నారు. కానీ.. పవన్ సినిమాలు చేస్తూ.. విదేశాల్లో ఉండటం వల్ల కొన్ని పనులు మాత్రం జరగడంలేదు. కానీ విదేశీ పర్యటన నుంచీ తిరిగి వచ్చిన తరువాత ఈ విషయంలో చాలా సీరియస్ గా వర్కౌట్ చేయాలని చెప్పారట.. లండన్ టూర్ నుండి వచ్చిన పపన్ పార్టీ నేతలతో సమావేశమై.. త్వరలోనే ప్లీనరీని నిర్వహించి, పార్టీ విధివిధానాలను ప్రజలకు వివరించాలని భావిస్తున్నారట. అందుకే..ప్లీనరీకి సంభందించిన ఏర్పాట్లు..తదితర విషయాలు వేగవంతం చేసేలా పార్టీ శ్రేణులకి చెప్పారట. అంతేకాదు... పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని..రెండు రాష్ట్రాలలో చాలా వేగంగా సభ్యత్వ నమోదు జరిగేలా చూడాలని పార్టీ నాయకులని ఆదేశించారని తెలుస్తోంది. ఇక వచ్చే ఎన్నికలకు కూడా ఎంత సమయం కూడా లేదు కాబట్టి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించే విషయంపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారట. మొత్తానికి లండన్ వాళ్లు ఇచ్చిన అవార్డు ఎఫెక్ట్ వల్ల... లండన్ టూర్ వల్ల పవన్ లో మార్పు బాగానే వచ్చింది.

శశికళ ఆస్తులపై దాడులు..జయలలిత నమ్మినబంటు కారణమా...!

  అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్సి శశికళ ఆస్తులపై.. ఆమె కుటుంబ సభ్యుల ఇళ్లపై ఏకకాలంలో ఐటీ దాడులు జరిపిన సంగతి తెలిసిందే కదా. ఈ దాడులు దేశ వ్యాప్తంగా పలు సంచలనమే సృష్టించింది. అంతేకాదు ఐటీ దాడుల్లో కొన్ని కోట్ల ఆస్తులు కూడా బయటపడ్డాయి. దాదాపు రూ. 5 లక్షల కోట్ల విలువైన స్థిరాస్తులను అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే... ఈ దాడుల వెనుక ఓ వ్యక్తి ఉన్నాడట. అదెవరో కాదు..  జయలలిత సహాయకుడు 'పూంగుండ్రన్' అనే వ్యక్తట. అతను ఎవరూ..?ఏంటి.. ?ఈ దాడుల వెనుక అతని హస్తం ఏంటీ అన్న విషయాలు తెలుసుకోవాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే.   పూంగుండ్రన్.. ఎన్నో ఏళ్లుగా జయలలితకు నమ్మినబంటుగా ఉన్నాడు. అన్నాడీఎంకెలో జయలలిత అధికారంలోకి వచ్చినప్పటినుండీ.. పెరుగుతూ పూంగుండ్రన్ ఆమె సహాయకుడిగా వ్యవహరిస్తూ వస్తున్నాడట. అంతేకాదు అతని తండ్రి శంకరలింగం జయలలితకు స్పీచ్ కూడా రాసి ఇచ్చేవాడట. ఇక జయలలిత పోయస్ గార్డెన్స్ అయితే పూంగుండ్రన్ హలా బాగానే కొనసాగిందట. ఎవరూ ఫోన్ చేసినా.. ఎంతటి వారైనా సరే.. ముందు పూంగుండ్రన్ తో విషయం చెబితేనే.. ఆ తర్వాత జయలలిత వారితో మాట్లాడేవారట.  జయలలిత పార్టీ వ్యవహారాలతో పాటు, ఆమె వ్యక్తిగత ఆస్తుల విషయాలను పూంగుండ్రన్ చాలా దగ్గరిగా పరిశీలించేవాడట.   అయితే ఇదంతా శశికళ ఎంట్రీ ఇవ్వకముందట. ఇక ఎప్పుడైతే శశికళ ఎంట్రీ ఇచ్చిందో అప్పటినుండి పూంగుండ్రన్ పాత్ర తగ్గిపోయిందట. ఆతరువాత శశికళను జయలలతి బయటకు పంపడం.. ఎలాగో అలా మళ్లీ పోయెస్ గార్డెన్ కు రావడం జరిగిపోయింది. ఇక ఈ క్రమంలో శశికళ పూంగుండ్రన్ తో చేతులు కలిపినట్టు తెలుస్తోంది. ఇది ఒకప్పటి స్టోరీ.. ఇక ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ ఆస్తులపై దాడులు నిర్వహించాలని ప్లాన్ చేసిన ఐటీ అధికారులు...  ముఖ్యంగా ఎవరిని పట్టుకుంటే వివరాలన్ని బయటపడుతాయో అన్నది ఆరా తీశారు. ఈ క్రమంలో పూంగుండ్రన్ పేరే వారికి ప్రధానంగా కనిపించింది. దీంతో ముందు అక్కడినుండే నరుక్చొచారు ఐటీ అధికారులు. తీగ లాగితే డొంగ కదిలినట్టు.. ముందుగా పూంగుండ్రన్‌ కార్యాలయంపై ఐటీ దాడులు చేయగా.. అందులో అసలు విషయాలు బయటపడ్డాయి.. దశాబ్దాలుగా పోయెస్ గార్డెన్ కేంద్రంగా జరిగిన ఆస్తుల కొనుగోళ్లు, పంపకాలు, బినామీలు, బినామీ కంపెనీల వ్యవహారాలు వంటి విషయాలన్ని పూంగుండ్రన్ అధికారులకు వివరించినట్టు తెలుస్తోంది. ఆ ఆధారాలతోనే ఏకకాలంలో ఐటీ అధికారులు 200ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఇంకా కొన్ని చోట్ల ఐటీ అధికారులు దాడి జరిపే అవకాశం ఉంది. చూద్దాం.. ఇంకా ఎన్ని కోట్ల ఆస్తులు బయటపడతాయో.

కుల రాజకీయాలు అంటే మంట...

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందరి కంటే కాస్త భిన్నంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఒక హీరోగా కాకుండా వ్యక్తిగతంగా ఆయన్ని ఇష్టపడేవాళ్లే ఎక్కువ. ఇక ఇప్పుడు ఏదో ప్రజలకు సేవ చేద్దామన్న ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చాడు. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చా అని చెప్పిన పవన్ కళ్యాణ్... అప్పుడప్పుడు ప్రజల సమస్యలపై స్పందిస్తూనే ఉన్నాడు. ఇక ప్రజా సమస్యలపై స్పందిస్తున్న తీరుకు ఆయనకు లండన్ అవార్డ్ కూడా ఇచ్చింది. ఇక యూరప్ టూర్లో వున్న పవర్ స్టార్.. 'తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్' (TAL) నిర్వహించిన 'యువ సమ్మేళనం'లో పాల్గొని రాజకీయాల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో కులాల పాత్ర ఎలా ఉంటుందో చెప్పారు. యువ సమ్మేళనం యువతీయువకులతో ముచ్చటించిన పవన్... మీ దృష్టిలో మానవత్వం అంటే ఏంటి అన్న ఒకమ్మాయి ప్రశ్నకు.. పవన్ కళ్యాణ్ గట్టిగా స్పందించారు. కుల, వర్ణ, ప్రాంతాలంటూ ఏ అడ్డుగోడలూ లేకుండా సమభావం పాటించడమే మానవత్వం అన్నారు.   ఇంకా రాజకీయాల గురించి మాట్లాడుతూ..పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వగానే నువ్వు పలానా కులం అంటూ ముద్ర వేస్తారు.. వద్దన్నా మెళ్ళో ఒక బిళ్ళ తగిలిస్తారు.. ఈ తరహా కుల రాజకీయాలకు తాను వ్యతిరేకం అన్నారు. కుల ప్రాతిపదికన ఎవరు మద్దతిచ్చినా తీసుకునేది లేదని స్పష్టం చేశారాయన. ఆ మాటకొస్తే మానవత్వమే నా కులం అంటూ చెప్పుకొచ్చారు. ''నేను ఏ కులంలో పుట్టినా.. నాకు మాత్రం క్రిస్టియన్ పాప పుట్టింది.. కులం అనేది మన ఛాయిస్ కానప్పుడు.. ఆ కులానికి మనమెందుకు ప్రయారిటీ ఇవ్వాలి'' అంటూ సూటిగా ప్రశ్నించారు పవన్ కళ్యాణ్.

ఆడపిల్ల పుట్టిందని.. టీఆర్ఎస్ లీడర్ రెండో పెళ్లి....

టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ ఆడపిల్లా.. మగపిల్లవాడా అన్న తేడా పెద్దగా ఎవరు పట్టించుకోవడంలేదు. మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లు పోటీ పడుతున్నారు. ఎక్కడో కొంత మంది ఉన్నారు.. ఆడపిల్లా.. మగపిల్లాడా అని చూసేవారు. అది కూడా చదవుకోనివారు.. కాస్త మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నవారు. కానీ ఇక్కడ ఓ ప్రజా ప్రతినిధి కూడా ఆడపిల్ల పుట్టిందని ఏకంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. అతను ఎవరో కాదు...ఓ టీఆర్ఎస్ ప్రతినిధి. తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన పులకండ్ల శ్రీనివాస్‌రెడ్డి.. టీఆర్ఎస్ పార్టీలో యువజన విభాగంలో పనిచేస్తున్నాడు. అయితే అతనికి  చందానగర్‌కు చెందిన సంగీతతో నాలుగేళ్ల క్రితమే వివాహం జరిగింది. వారికి రెండేళ్ల క్రితం ఆడపిల్ల కూడా పుట్టింది. కానీ ఆడపిల్ల పుట్టడం శ్రీనివాస్ రెడ్డికి నచ్చలేదు. దీంతో అతను మరొక యువతిని రెండో పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చాడు. ఇక ఇది చూసి సహించలేని సంగీత తన భర్తను నిలదీసింది. ఆడపిల్ల పుట్టిందని రెండో పెళ్లి చేసుకున్నానని చెప్పాడు.అంతేకాకుండా సంగీతను దారుణంగా కొట్టి ఇంటినుండి గెంటివేశాడు. ఇక ఈ తతంగం అంతా అక్కడ ఉన్న కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియీలో వదలగా.. అది ఇప్పుడు వైరల్ అవుతుంది.   మరోవైపు తీవ్రగాయాల పాలైన సంగీత తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇంటి ముందు ఆందోళన చేపట్టడంతో అసలు కథ బయటపడింది. ఇక విషయం వెలుగుచూడటంతో శ్రీనివాస్‌రెడ్డి ఇంటి నుండి పరారయ్యాడు. ఈ ఘటనతో.. టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలినట్టైంది. మరి ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులే ఇలా ఉంటే ఏం చేస్తాం...

పప్పులో కాలేసిన జగన్ భార్య... జగన్ అనుకొని..!

  పైన ఫొటోలో ఉన్న వ్యక్తిని చూస్తే ఎవరిలా అనిపిస్తుంది... జాగ్రత్తగా చూడండి.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫొటోలా అనిపించడం లేదు. కానీ అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అది వైఎస్ జగన్ కాదు. పాపం జగన్ భార్య కూడా అలానే అనుకొని ఈ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ తరువాత పప్పులో కాలేసినట్టు తెలిసింది. ఆమె పొరపడిందో లేక... భార‌తి పేరుతో ట్విట్ట‌ర్ నిర్వ‌హిస్తున్న వారి పొర‌పాటో, తెలియదు కానీ పాపం అడ్డంగా బుక్కయ్యారు. అసలు ఆ ఫొటో ఏంటీ...? ఆ స్టోరీ ఏంటీ...? తెలుసుకోవాలంటే అసలు కథలోకి వెళ్లాల్సిందే.     YSBharathiReddy ఐడీతో ఓ ఫొటోని పోస్టే చేశారు. అందులో ప‌చ్చ‌ని పొలాల‌లో జ‌గ‌న్ నీళ్లు తాగుతున్న ఫోటో పెట్టి This picture speaks more than anything..అనే హ్యాష్ ట్యాగ్‌ కూడా పెట్టారు. తీరా చూస్తే అది జగన్ ఫొటో కాదని తేలిపోయింది. అది నంద్యాల సాక్షి టీవీ కంట్రిబ్యూట‌ర్ ప్ర‌దీప్ సాల్మ‌న్‌రాజ్ ఫొటో అంట. అతన్ని జగన్ అనుకొని భ్రమపడి ఫొటోను పోస్ట్ చేశారట. ఇదిలా ఉంటే.. ఇక తన ఫొటో ను జగన్ ఫొటో అనుకొని పెట్టిన సాల్మన్ రాజ్ అయితే త‌న్ను అంద‌రూ జ‌గ‌న్ అనుకోవ‌డం జీవితంలో మ‌రిచిపోలేని అనుభూతి అంటూ పోస్టులు పెడుతున్నాడు. దీంతో ఫొటో పెట్టి జగన్ ను ఏదో ఆకాశానికి ఎత్తేద్దామనుకున్న జగన్ అండ్ బ్యాచ్ కు గట్టి షాక్ తిగిలినంత పనైంది. అంతేకాదు కొంత మంది అయితే జోకులు కూడా పేల్చుకుంటున్నారు..? జగన్ పాదయాత్రకు సరైన స్పందన రావడంలేదని..  ఆ టెన్షన్ లోనే.. త‌న భ‌ర్త‌ను కూడా పోల్చుకోలేని స్థితికి భారతి చేరింద‌ని అంటున్నారు.   మరోవైపు.. ఓ రకంగా ఈ ఫొటో పెట్టి మంచి పని చేశారు అని అంటున్నారు కొంతమంది. ఎందుకంటే.. ఫోటో చుట్టూ ఉన్న ప‌చ్చ‌ని పంట పొలాలు, బోరు నుంచి ఉప్పొంగుతున్న నీరు.. క‌రువుసీమ రాయ‌ల‌సీమ‌ను ర‌త‌నాల సీమ‌గా మార్చిన టీడీపీ ప్ర‌భుత్వ పాల‌న‌కు ప‌చ్చ‌ని సంకేతంగా నిలుస్తోందని చెప్పుకుంటున్నారు. దీంతో జగన్ పాద‌యాత్ర చాలా నీరసంగా జరుగుతుంది... మళ్లీ ఈ ఫొటో పెట్టి మూలిగే న‌క్క‌ మీద తాటికాయ పడ్డట్టు చేశారు అని అంటున్నారు. ఏది ఏమైనా మొత్తానికి జగన్ కు మాత్రం ప్రస్తుతం కాలం అస్సలు కలిసిరానట్టే ఉంది.

దేవుడా.. జగన్ కు ఇంత అవమానమా..?

  పాపం జగన్ పరిస్థితి ఏలా ఉందంటే.. కామెడీగా సెటైర్లు వేసుకోవడానికి అన్నట్టు తయారైంది. ఇప్పటికే పాదయాత్ర అంటూ.. శుక్రవారం కోర్టు కు అంటూ తిరుగుతున్న జగన్ పై నెటిజన్లు కామెడీ చేసుకోవడానికి కావాల్సినంత స్టఫ్ దొరుకుతుంది. సోషల్ మీడియా సాక్షిగా జగన్ ను ఆడేసుకుంటున్నారు. అక్రమాస్తుల కేసులో భాగంగా జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే కదా. పాపం పాదయాత్ర చేసుకోవాలి.. వ్యక్తిగత మినహాయింపు ఇవ్వండని బతిమాలుకున్నా కోర్టు మాత్రం ససేమిరా ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితిలోనూ కోర్టుకు రావాల్సిందే అని మొట్టికాయలు వేసింది. ఇక కోర్టు ఆదేశాల మేరకు నిన్న శుక్రవారం కావడంతో జగన్ కోర్టుకు వెళ్లాడు. ఇంకేముంది ఇప్పుడు జగన్ ను ఆడేసుకుంటున్నారు. దానికి కారణం చంద్రబాబు, పవన్ కళ్యాణే. అదేంటీ అనుకుంటున్నారా..? అక్కడే ఉంది మరి అసలు ట్విస్ట్.   అసలు సంగతేంటంటే.. నిన్న అక్రమాస్తుల కేసులో భాగంగా... జగన్ కోర్టుకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే నిన్ననే.. పవన్ కళ్యాణ్ కు లండన్ లో అరుదైన గౌరవం దక్కిన సంగతి తెలిసిందే. పలు ప్రజా సమస్యలపై ఈయన స్పందిస్తున్న తీరుకుగాను ఇండో-యూరోపియన్ ఎక్సలెన్స్ అవార్డును ఆయనకు ప్రదానం చేశారు. ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే.. నిన్న చంద్రబాబు బిల్ గెట్స్ తో కలిశారు. ఆయనతో కలిసి ఒక వ్యవసాయ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిల్ గేట్స్ చంద్రబాబు ను పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో ముగ్గురు ఫొటోలు కలిపి ఓ ఫొటో తయారు చేసి సోషల్ మీడియాలోకి వదిలారు. ఇంకేముంది... ఇప్పుడు ఈ ఫొటో తెగ వైరల్ అవుతుంది. మొత్తానికి జగన్ మాత్రం నెటిజన్లకు అడ్డంగా బుక్కయ్యాడు. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫొటో ఏంటో మీరు కూడా చూడండి...  

జనసేన సర్వే గ్రాఫ్ లో ఇంత తేడానా..!

  సాధారణంగా ఎన్నికల్లప్పుడు పార్టీలు సర్వేలు జరపడం కామన్ థింగే. కానీ ఇటీవల ఎప్పుడు పడితే సర్వేలు చేయడం.. ఒక్క ఎన్నికలప్పుడే కాదు.. అసలు ప్రజల్లో పార్టీపై ఎలాంటి అభిప్రాయం ఉంది.. పార్టీ పరిస్థితి ఏంటి అని తెలుసుకోవడానికి కూడా సర్వేలు చేస్తున్నారు. అయితే అలా జరిపిన సర్వేలో టీడీపీ, వైసీపీ పార్టీల సంగతేమో కానీ జనసేన పార్టీకి మాత్రం పెద్ద షాకే తగిలింది. ఇంతకీ ఆ షాక్ ఏంటని అనుకుంటున్నారా..?   జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష బరిలో దిగనున్న సంగతి తెలిసిందే. అందుకోసం ఇప్పటినుండే గ్రౌండ్ వర్క్ చేస్తుంది. ఇప్పటినుండే కసరత్తులు మొదలు పెట్టాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే... ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఏపీలో ఏ పార్టీ ప‌రిస్థితి ఏంటిఅని..  ప్ర‌జ‌లు ఏ లీడ‌ర్‌కి మ‌ద్ద‌తిస్తున్నారు…? ఏ పార్టీకి ఎన్నిక‌ల‌లో ఓట్ల శాతం ద‌క్కనుంది..? అనే అంశాల‌ని జిల్లాల వారీగా చిన్మ‌యి క్రొవ్విడి అనే ప్ర‌ముఖ సెఫాల‌జిస్ట్ స‌ర్వేలు నిర్వ‌హించింద‌ట‌. అయితే ఈ సర్వేలో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే... ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే..  టీడీపీకి 42-43 శాతం ఓట్ బ్యాంక్ వ‌స్తుంద‌ట‌. ఇక‌, వైఎస్సార్‌సీకి 33-34 శాతం ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెలుపుతార‌ట‌.ఇక జనసేన పార్టీ సంగతి ఏంటంటారా.. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది మరి. ఇప్పటి వరకూ 1 లేదా 2 శాతానికే పరిమితమైన ఓట్ల శాతం ఇప్పుడు ఏకంగా అది 12 నుంచి 14 శాతానికి పెరిగింది. దీంతో ఇప్పుడే ఇలా ఉండే.. ఇంకా పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వచ్చి.. ఎన్నికల ప్రచారాల్లో కనుక పాల్గొంటే ఈ శాతం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఏమో ప్రతిపక్ష నేత కూడా కావొచ్చేమో..మరి వచ్చే ఎన్నికలు ఎలా జరుగుతాయో... ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయో... తెలియాలంటే అప్పటివరకూ ఆగాల్సిందే.

జడ్జికే కోపం తెప్పించారుగా...విసిగిపోయా..

అక్రమాస్తుల కేసులో భాగంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే కదా. పాపం పాదయాత్ర చేస్తూ కూడా... ప్రతి శుక్రవారం బ్రేక్ తీసుకొని మరీ కోర్టుకు హాజరవుతున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే జగన్ నిన్న కోర్టుకు హాజరయ్యాడు. ఈసందర్బంగా జగన్ తరపు లాయర్ పై జడ్జి ఫైర్ అయినట్టు తెలుస్తోంది. జగన్ తరపు న్యాయవాది నాలుగు ఛార్జ్ షీట్లపై డిశ్చార్జ్ పిటిషన్లను కలిపి విచారించాలంటూ జడ్జిని కోరారు. అంతే జడ్డి గారు లాయర్ కు చీవాట్లు పెట్టారు.ఇంతకీ ఏ విషయంలో జడ్డిగారికి అంత కోపం వచ్చిందో తెలుసుకోవాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే.   అక్రమాస్తుల కేసులో భాగంగా... సీబీఐ జగన్ పై పలు ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే  సీబీఐ దాఖలు చేసిన సీసీ 9 కేసు ఛార్జ్ షీట్ ను పక్కన పెట్టాలంటూ గతంలో  జగన్, జగతి పబ్లికేషన్స్, విజయసాయిరెడ్డిలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు విచారణకు రాగా నిన్న సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. అయితే అదే సమయంలో  8, 10, 14 ఛార్జ్ షీట్లను కూడా కలిపి విచారించాలని జగన్ తరపు లాయర్ అశోక్ రెడ్డి కోరారు. అంతే ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన జడ్జి.... గత రెండేళ్లుగా విచారణలో జాప్యం చేస్తున్నారని... ఇంకెంత కాలం కోర్టు సమయాన్ని వృథా చేస్తారంటూ మండిపడ్డారు. మీరు వ్యవహరిస్తున్న తీరుతో విసిగిపోయానంటూ అసహనం వ్యక్తం చేశారు. తన 30 ఏళ్ల సర్వీసులో ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదని... 'ఇప్పటి వరకు కోర్టు సమయాన్ని వృథా చేసింది చాలు... ఇకపై ఇలాంటివి కుదరవు' అంటూ చీవాట్లు పెట్టారు. మొత్తానికి జగన్ కు మాత్రం ఎక్కడికి వెళ్లినా చీవాట్లు మాత్రం తప్పట్లేదుగా..

నందుల రచ్చ.. పవన్ క్లైమాక్స్..!

  నంది అవార్డులపై జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. 2014, 15, 16 సంవత్సరాలకు గాను ప్రకటించిన అవార్డులు న్యాయబద్దంగా జరగలేదని.. ఏక పక్షంగా వ్యవహరించారని పలువురు తప్పుబట్టారు. పెద్ద నిర్మాతలు నల్లమలపు బజ్జి, బండ్లా గణేష్, డైరెక్టర్ గుణ శేఖర్ లాంటి వాళ్లయితే బహిరంగంగానే తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. కొంత మంది అయితే ఈ అవార్డులకు కులాల పేరు పెట్టి పిలుచుకుంటున్నారు. ఇక ఆ రోజు నుండి ఈరోజు వరకు నందుల రగడ జరుగుతూనే ఉంది. ఇప్పటివరకూ మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిందని.. ఒక్క అవార్డు కూడా ఇవ్వలేదని పలువురు అన్నా.. మెగా కాంపౌండ్ నుండి మాత్రం ఒక్క మాట కూడా రాలేదు. అయితే ఇప్పుడు ఈ విషయంలో ఓ వార్త బయటకు వినిపిస్తోంది. ప్రస్తుతం అజ్ఞాతవాసి సినిమా షూటింగ్ లో ఉన్న పవన్ నంది అవార్డుల గొడవపై ఎలా స్పందిస్తాడు అని అనుకుంటున్నారు. కొంతమంది అయితే.. ఈ అవార్డుల చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేలా పవన్ క్లైమాక్స్ పంచ్ వేస్తాడని అంటున్నారు. దీంతో అవార్డులపై పవన్ ఎలా స్పందిస్తాడా..? అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మరి ఇంతవరకూ సైలెంట్ గా ఉన్న మెగా కాంపౌండ్ నుండి పవన్ గొంతైనా వినిపిస్తుందా..? లేక ఎప్పటిలాగానే నాకెందుకులే అని లైట్ తీసుకుంటాడా అని చూద్దాం.. ఏది ఏమైనా.. ఈ రచ్చతో.. ఇన్నాళ్లు ఇండస్ట్రీలో లోపల ఉన్న కుల కుమ్ములాటలు ఒక్కసారిగా బయట పడ్డాయని చెప్పొచ్చు.

దేవుడా.. ఓట్లు ఇలా కూడా అడుగుతారా..!

  సాధారణంగా రాజకీయ నాయకులు ఓట్లు కావాలంటే ఎలా అడుగుతారు. ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటారు. అమ్మా.. అయ్యా అని దండాలు పెడతారు. ఒక్క సారి అవకాశం ఇవ్వండి అని బతిమాలుకుంటారు. అధికారం కోసం ఏదైనా చేయడానికి సిద్దపడతారు. అలాంటిది.. ఇక్కడ ఓ రాజకీయ నేత మాత్రం... బెదిరిస్తూ ఓట్లు అడుగుతున్నాడు. ఈ విచిత్రమైన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో నవంబర్ నెలాఖరున స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బరబంకి స్థానం నుంచి బీజేపీ కౌన్సిలర్‌ రంజిత్‌కుమార్‌ శ్రీవాస్తవ భార్య శశి శ్రీవాస్తవ పోటీ చేస్తున్నారు. ఈ సందర్బంగా తన భార్య తరపున ప్రచారంలో పాల్గొన్న రంజిత్ కుమార్ శ్రీవాత్సవ 'ఇదేమీ సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం కాదు. మీకు ఎవరూ సహాయం చేయలేరు. నా భార్యకు ఓట్లు వేసి గెలిపించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. అందుకే మాకు ఓట్లు వేయండి. మీరు మాకు ఓట్లేస్తే.. ప్రశాంతంగా ఉండగలుగుతారు. లేదంటే కష్టాలు తప్పవు.' అని హెచ్చరించారు. అంతే ఇప్పుడు రంజిత్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. రంజిత్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ... అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.   మరోవైపు సొంత పార్టీ నేతలే రంజిత్ కుమార్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రంజిత్ కుమార్ మాట్లాడుతున్నప్పుడు అక్కడే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మంత్రులు దారాసింగ్‌ చౌహాన్‌, రమాపతి శాస్త్రి వేదికపైనే ఉన్నారు. దీంతో రంజిత్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి చౌహాన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. మొత్తానికి ఆఖరికి రాజకీయ నాయకులు బెదిరించి మరీ ఓట్లు అడిగే పరిస్థితి ఏర్పడింది. ఇలానే ఉంటే పరిస్థితి ఇంకెంత దూరం వెళుతుందో చూద్దాం...

లక్ష్మీపార్వతి ఒరిజినల్ క్యారెక్టర్ చూపిస్తున్నారు...

  ఆలూ లేదూ.. చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న సామెత తెలిసే ఉంటుంది కదా. అలా ఉంది ఎన్టీఆర్ బయోపిక్ వ్యవహారం చూస్తుంటే. ఎందుకంటే...ఇంకా సినిమా షూటింగ్ లు పూర్తవ్వలేదు కానీ... అప్పుడే ఒకళ్ల మీద ఒకళ్లు మాటల యుద్దాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా "లక్ష్మీస్ వీరగ్రంధం" సినిమాపై జరుగుతున్న దుమారం అంతా ఇంతా కాదు. ఈ బయోపిక్ విషయంలో... లక్ష్మీస్ వీరగ్రంథం చిత్ర దర్శకులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి..లక్ష్మీపార్వతి మధ్య మాటల యుద్దమే జరుగుతుంది. అంతేకాదు.. ఇటీవల జగదీశ్వర్ రెడ్డి... సినిమా షూటింగ్ ను కూడా ఆపేశారు.   ఇక దీనిపై స్పందించిన జగదీశ్వర్ రెడ్డి... ఈ చిత్రాన్ని అడ్డుకోవలని లక్ష్మీపార్వతి ప్రయత్నం చేస్తున్నారని.. ఆ దుష్టశక్తి బారి నుంచి కాపాడమని ఆయన పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆమెలో మార్పు కోరుతూ ఎన్టీఆర్ ఆత్మశాంతి యాత్ర చేపట్టారు. తమను ప్లాట్ ఫాంగాళ్లు అన్న లక్ష్మీ పార్వతి ఏ రాజమహల్ నుంచి వచ్చారో ప్రజలకు చెప్పాలని కేతిరెడ్డి నిలదీశారు. మీ ఊళ్లో చర్చకు సిద్ధమా, అంత శక్తి ఉందా లక్ష్మీపార్వతి పుట్టిన గుంటూరు జిల్లా బచ్చల తాటిపర్రులో బహిరంగ చర్చకు నువ్వు సిద్ధమా, షూటింగ్ పోలీస్ వారు ఆపితే మా నిర్మాత నీకు ఫోన్ చేసి మిమ్మల్ని అర్థించాడని చెబుతున్నావని, షూటింగ్‌ను ఆపే శక్తి నీకు ఉంటే, మీరే వచ్చి ఆపవచ్చు కదా అని నిలదీశారు. కష్టాల కడలిని అనుభవిస్తున్నానని, మూడు ముళ్ల పెళ్లికి ముప్పై ఏళ్ల వైదవ్యం అనుభవిస్తున్నానని మీరు మా నిర్మాతతో చెప్పలేదా అని నిలదీశారు. లక్ష్మీపార్వతి ఒరిజినల్ క్యారెక్టర్ చూపిస్తున్నారు.. తమతో ఓ రకంగా, మీడియా ముందు మరో రకంగా మాట్లాడుతున్నారని కేతిరెడ్డి ఆమెపై నిప్పులు చెరిగారు. అన్నగారి ధర్మపత్నిని అని చెప్పుకునే మీ భాష దారుణంగా, దిగజారుడుగా ఉందన్నారు. మొత్తానికి సినిమా ఎప్పుడూ పూర్తవుతుందో తెలియదు కానీ.. ఆదిలోనే హంసపాదు అన్నట్టు అప్పుడే అడ్డంకులు ఎదురయ్యాయి. ఇక ఒక బయోపిక్ విషయంలోనే ఇలా ఉంటే ఇంకా వర్మ తీయబోయే సినిమా.. తేజ తీయబోయే సినిమాకు ఇంకెన్ని అడ్డంకులు వస్తాయో.. ఎన్ని బయోపిక్ లు బయటకు వస్తాయో చూద్దాం...

శశికళ.. ఏమన్నా మైండ్ గేమా...

  అక్రమాస్తుల కేసులో భాగంగా శశికళ బెంగుళూరు పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఇటీవల ఆమె ఆస్తులపై వరుసగా ఐడీ దాడులు నిర్వహించగా.. కొన్నికోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి. శశికళ ఆమె బంధువులు... ఇళ్లల్లో ఐటీ దాడులు నిర్వహించారు. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. ఇటీవల ఆమె పెరోల్ మీద బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. శశికళ భర్త నటరాజన్ అనారోగ్యానికి గురవ్వడంతో ఆయనను కలిసేందుకు ఆమెకు అనుమతి ఇచ్చారు. అయితే ఇక్కడే ఒక్క విషయం... బయటపడింది. పెరోల్ మీద బయటకు వచ్చిన ఆమె తన భర్తను కలిసింది కేవలం ఒక్క రోజేనట. అయితే మిగిలిన రోజులు... ఆమె ఎక్కడికి వెళ్లింది.. ఏం చేసింది.. అనుకుంటున్నారా..? బయటకు వెళ్లిన ఆమె ఆ తర్వాత వ్యక్తిగత పనులు చూసుకున్నారట. అందులో భాగంగా 622 ఆస్తులను ఇతరుల పేర్లకు మార్చారట. ఇక ఆమె కదలికలపై పూర్తి స్థాయి నిఘా ఉంచిన అధికారులు, ఆమె ప్రతి అడుగును క్షుణ్ణంగా పరిశీలించి... ఆమె నివాసం, కార్యాలయాలు, సన్నిహితులు, బంధువులు, లాయర్లు తదితరులపై ఐటీ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 1400 కోట్ల రూపాయల పన్ను ఎగవేసినట్టు గుర్తించగా, సుమారు 30,000 కోట్ల రూపాయలు అక్రమార్జన చేసినట్టు గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు ఆమె ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న పరప్పణ అగ్రహార జైలు సూపరింటెండెంట్‌ కు లేఖ పంపి విచారణకు అనుమతి పొందనున్నారని సమాచారం. మొత్తానికి శశికళ మాస్టర్ మైండ్ ని బాగానే వినియోగించారు. కానీ ఆమెపై నిఘా ఉంచిన అధికారులు ఆమె ఇంటిపై దాడులు నిర్వహించారు.

బయటపడిన బోటు బాగోతం...

  అధికారులు నిర్లక్ష్యం వహిస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో.. విజయవాడ బోటు ప్రమాదం ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. విజయవాడ బోటు ప్రమాదంలో దాదాపు 23 మంది ప్రాణాలు బలైన సంగతి తెలిసిందే కదా. జరగాల్సిన నష్టం జరిగిన తరువాత కానీ.. అసలు విషయాలు బయటపడుతున్నాయి ఇప్పుడు. ఇబ్రహీంపట్నం వద్ద ప్రమాదవశాత్తు మునిగిన ఫెర్రీ బోటును బయటకు తీశారు. దీన్ని పరిశీలించిన అధికారులకు దిమ్మ తిరిగిపోయే వాస్తవం ఒకటి అర్థమైంది. బయటకు తీసిన తరువాత తెలిసింది ఆ బోటు బాగోతం ఏంటో. అసలు అది బోటు కానే కాదట. సముద్రంలో చేపలు పట్టేందుకు వాడే పడవట. ఆ పడవకే కొన్ని హంగులు అద్ది.. పర్యాటక పడవగా మార్చేశారు. ఇక ఈ బోటును పరిశీలించి.. అనుమతి ఇవ్వాల్సిన అధికారులు కూడా.. చూసీచూడనట్టుగా వ్యవహరించడంతో ఇంత ప్రమాదం జరిగింది.   వాస్తవానికి ఈ పడవ కేవలం పది మందిని మాత్రమే తీసుకెళ్లే సామర్థ్యం ఉందన్న విషయాన్ని అధికారులు గుర్తించారు. పది మంది కంటే ఎక్కువ మంది ఎక్కితే ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తనిఖీ అధికారులు చెబుతున్నారు. ప్రమాదానికి గురైన బోటుపై లాంచీల్లో పెట్టినట్లుగా గొడుగు పెట్టారు. పది మంది ఎక్కాల్సిన బోటులో 40 మంది ఎక్కారని.. ప్రమాదం కానీ మరింత లోతుగా ఉన్న ప్రాంతంలో జరిగి ఉంటే.. ఒక్కరు కూడా బతికి ఉండేవారు కాదన్న విషయాన్ని వారు చెబుతున్నారు. మొత్తానికి అటు వ్యాపారస్థుల వల్ల కానీ... అధికారుల నిర్లక్ష్యం వల్ల అయితేనేం కానీ.. అమాయకుల ప్రాణాలు నీటిపాలయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని తగిన చర్యలు తీసుకోకపోతే.. ముందు ముందు ఇంకెన్ని ప్రమాదాలు చూడాల్సి వస్తుందో..

జగన్ కు రకుల్ కు మధ్య తేడా చెప్పిన జేసీ....

  టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదైనా సరే ముక్కసూటిగా మాట్లాడటంలో ఆయన దిట్ట. ప్రతిపక్షపార్టీ పైనే కాదు.. సొంత పార్టీపైనా ఎలాంటి మొహమాటం లేకుండా... కామెంట్లు విసురుతాడు. ఇక జగన్ పై విమర్శలు చేయమంటే ఇంకా ఎనర్జీ వస్తుంది జేసీ దివాకర్ రెడ్డికి. అందుకే ఆయన కనబడితే చాలు మీడియాకు పండగే. ఇప్పటికే ఎన్నోసార్లు జగన్ పై కామెంట్లు విసిరిన జగన్.. ఈసారి ఏకంగా జగన్ ను ఓ స్టార్ హీరోయిన్ తో పోల్చి కామెంట్లు విసిరారు. దీంతో ఇప్పుడు జేసీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ జగన్ కు... రకుల్ కు లింక్ పెట్టి చేసిన వ్యాఖ్యలు ఏంటంటారా..  జగన్ ప్రజాసంకల్పం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే కదా... ఇక దీనిపై స్పందించిన జేసీ ఒకప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను దృష్టిలో పెట్టుకొని జగన్ పాదయాత్ర చేస్తున్నారు. అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సభలకు జనాలు వస్తున్నారు. రోజా పెట్టినా వస్తారని.. ఆఖరికి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వచ్చిన జనాలు ఎగబడతారని అన్నారు. రాజకీయాలు ఇకపై తనకు అనవసరమని, 2019లో రిటైర్ అవుతానని చెప్పారు. జగన్ కూడా రాజకీయాలు వదిలేసి, మంచి పారిశ్రామికవేత్తగా ఎదగాలని సూచించారు. ప్రజా సమస్యలను మీడియా ఇప్పటికే ఎత్తిచూపుతోందని, జగన్ కొత్తగా చేసేదేముందని అన్నారు.   అంతేకాదు.. జగన్ కారణంగా రెడ్లకు విలువే లేకుండా పోయిందని విమర్శలు గుప్పించారు. రెడ్డి కులస్తులంతా జగన్ వెంటే వెళ్తుండటంతో... ఇతర కులాలకు చెందినవారు రెడ్లను గౌరవించడం మానేశారని వ్యాఖ్యానించారు. రెడ్ల తోకలను కరణం బలరాం లాంటి వాళ్లు కోసేశారని ఎద్దేవా చేశారు. వైయస్ గురించి చెప్పుకునే రోజులు పోయాయని జేసీ స్పష్టం చేశారు. మొత్తానికి జేసీ వ్యాఖ్యల్లోని అర్ధం ఏంటో జగన్ కు అర్ధమైందో లేదో...

మాట మీద నిలబడ్డ కేసీఆర్.. కొన్ని ఏళ్ల సమస్యకు పరిష్కారం...

  ప్రతి ఇంటికి నీళ్ళు అందిస్తేనే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతాను లేకపోతే ఓట్లు అడగను.. ఇంత ధైర్యంగా ఈ శపధం చేసింది ఎవరబ్బా అనుకుంటున్నారా...?ఎవరో కాదు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. నల్గొంగ జిల్లా విషయంలో కేసీఆర్ ఇంత పెద్ద శపధం చేశారు. అసలు కేసీఆర్ శపధం చేయడానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే.  నల్గొండ జిల్లా  ప్లోరిసిస్ ప్రాంతానికి మారు పేరు. దరిద్రం ఏంటంటే.. నాగార్జునసాగర్ పక్కనే ఉన్నాకాని త్రాగడానికి గుక్కెడు నీళ్ళు కూడా లేని ప్రాంతం. దీనికి కారణం ఆ నీళ్లలో ప్లోరిసిస్ ఉండటమే. ఇది ఇప్పటి సమస్య కాదు. కొన్ని సంవత్సరాల నుండి నల్గొండ వాసులను ఇబ్బంది పెడుతున్న సమస్య.  జిల్లాలో మొత్తం మూడు వేల నాలుగు వందల డెబ్బై ఏడు గ్రామాల్లో నలబై శాతం గ్రామంలో 1పీపీఎం ను మించి ప్లోరిసిస్ మోతాదు ఎక్కువగా ఉంది .ముఖ్యంగా మునుగోడు నియోజక వర్గంలో మర్రిగూడెం ,నాంపల్లి మండలాల్లో అత్యధికంగా ఇరవై శాతం వరకు ఉండటం గమనార్హం. దీంతో కేసీఆర్.. ఈ సమస్యకు పరిష్కారం చూపే దిశగా అడుగులు వేశారు. దీనిలోభాగంగానే ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. దీనిద్వారా ఇప్పటికే జిల్లాలో బట్లపల్లి గ్రామంలో మొత్తం నాలుగు వందల కోట్ల రూపాయలతో ట్రీట్ మెంట్ ప్లాంట్ పనులను ఇప్పటికే తొంబై శాతం పూర్తిచేశారు. ఆరు మండలాల్లో వచ్చే డిసెంబర్ లోపు పనులు పూర్తీ కానున్నాయి. జిల్లాలో ఎక్కువగా పీడత ప్రాంతంగా ఉన్న మునుగోడు అసెంబ్లీ నియోజక వర్గంలో అధిక నిధులను కేటాయించి పనులను శరవేగంగా పూర్తిచేస్తున్నారు .అంతే కాకుండా మరో 113.67 కోట్ల రూపాయలతో అంతర్గత పనులను పూర్తిచేస్తున్నారు .మరో కొద్ది నెలలో మిషన్ భగీరథ పనులను పూర్తిచేసి నల్గొండ జిల్లాను కొన్ని దశాబ్దాలుగా పీడిస్తున్న ప్లోరిసిస్ సమస్యను పరిష్కరించి దేశానికే ఆదర్శంగా నిలవనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ .. మొత్తానికి కేసీఆర్ మాట మీద నిలబడి నల్గొండ జిల్లాకు ఓ పరిష్కారం చూపిస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ధైర్యంగా ఓట్లు అడగొచ్చన్నమాట.

ఏపీ అసెంబ్లీ... ప్రతిపక్షం కూడా అధికార పార్టీ నేతలే...

  ఒకపక్క ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండానే సమావేశాలు జరుపుతూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటే.. తాజాగా కొన్ని ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం లేదన్నా లోటును అధికార పార్టీ నేతలే తీర్చేస్తున్నారు. ప్రతిపక్షం పార్టీ పాత్రను అధికార పక్షమే పోషిస్తుండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు నేరుగా మంత్రులను నిలదీయడం, దానికి మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ మద్దతు తెలపడం విస్తు గొలుపుతోంది. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మంత్రి అచ్చెన్నాయుడును నిలదీశారు... తమ ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదని, అలా అయితే ఇక జీరో అవర్ ఎందుకని, దానిని తీసేయాలని సభలో గోరంట్ల ఊగిపోయారు.ఆయన వాదనకు బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు మద్దతు పలికారు. ఇక ఇదిలా ఉండగా.. దూళిపాళ్ల నరేంద్ర కూడా పర్యాటక శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ బోటు ప్రమాదంపై మాట్లాడుతూ.. ఇందులో అధికారుల తప్పిదం కూడా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎమ్మెల్యేలు నిలదీస్తున్నా చంద్రబాబు ఏం అనట్లేదా అని డౌట్ రావచ్చు. దీనంతటికీ కారణం చంద్రబాబేనట. సభలో ప్రతిపక్షం లేదని నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, ఎమ్మెల్యేలు ప్రతిపక్షంగా వ్యవహరించాలని సమస్యలపై మంత్రులను నిలదీయాలని పూర్తి స్వేచ్ఛను ఇచ్చారట. దీంతో ఎమ్మెల్యేలో ప్రతిపక్షపార్టీ పాత్ర పోషిస్తూ.. మంత్రులను నిలదీస్తున్నారు.   మొత్తానికి చంద్రబాబు రాజకీయానికి హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. ఒకపక్క పాదయాత్ర అంటూ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ నేతలు డుమ్మా కొడితే... చంద్రబాబు మాత్రం వారు లేకపోయినా అసెంబ్లీ జరిపించగలం అని నిరూపించారు. ఇప్పుడు తాజాగా ప్రతిపక్షం కూడా అవసరం లేదు అన్నట్టు... ప్రతిపక్షం పార్టీ పాత్రను కూడా తమ నేతలే పోషించేలా చేశారు. దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో కూడా ప్రతిపక్షం లేకపోయినా పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదేమో అనిపిస్తుంది. ఇది కనుక సక్సెస్ అయితే మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే ట్రెండ్ ను ఫాలో అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రతిపక్ష పార్టీలు నిరసనలు అంటూ బయటకు వెళ్లిపోయినా.. అధికార పార్టీలు మాత్రం ఎంచక్కా అసెంబ్లీలు నడిపేయోచ్చేమో. మొత్తానికి చంద్రాబాబుకు రాజకీయం చాణక్యుడు అన్న పేరు ఎందుకొచ్చిందో మరోసారి నిరూపించుకున్నారు.

ఆఘటనపై జగన్ అసెంబ్లీలో ఉంటే..!

  పాదయాత్ర పేరుతో ఏదో పొడిచేద్దామని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బయలుదేరిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలుకు డుమ్మా కొట్టిమరీ పాదయాత్ర ప్లాన్ చేశారు. ఏం చేస్తారు మరి.. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాలి మరి. ఆ రోజులు కవర్ చేయాలంటే అసెంబ్లీ సమావేశాలు డుమ్మా కొట్టాల్సిందే మరీ. కానీ దీనికి వారు పెట్టుకున్న పేరేమో.. పార్టీ ఫిరాయింపు నేతలపై నిరసన అని. అయితే వాళ్లు చెప్పినంత మాత్రాన నమ్మడానికి అంత అమాయకంగా అయితే ఎవరూ లేరు కదా. ఇక ఏపీ అధికార పక్షం కూడా ప్రతిపక్షం వున్నా ఒకటే.. లేకపోయినా ఒకటే.. అన్నట్టు ప్రశాంతంగా సమావేశాలు జరుపుకుంటూ పోతున్నారు.   ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ అండ్ కో బ్యాచ్ ఇప్పుడు ఓ మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంది అంటున్నాయి రాజకీయ వర్గాలు. అదేంటంటే.. కృష్ణానది వద్ద పడవ మునిగి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే కదా. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అలాంటిది ఈ టైంలో ప్రతిపక్షం కనుక అసెంబ్లీలో ఉంటే.. అధికార పక్షంపై ప్రశ్నల వర్షం కురిపించి ఇరుకున పెట్టే ఛాన్స్ కోల్పోయింది అంటున్నాయి. గతంలో పుష్కరాలు జరిగినప్పుడు జరిగిన తోపులాట గురించి జగన్ అసెంబ్లీలో రచ్చ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు కూడా తాజా ఘటనపై స్పందించి అసెంబ్లీలో రచ్చ చేసే ఛాన్స్ ఉండేది..కానీ జగన్ మిస్ అయ్యాడు అని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు మాత్రం.. ఆ జగన్ అసెంబ్లీలో ఉన్నా... ఏదో ఓ నాలుగైదు సినిమా డైలాగ్ లు కొట్టేసి, వైసీపీ నేతలు స్పీకర్ ను చుట్టుముట్టేసి, కాగితాలు చించి హడావుడి చేయడం తప్పా మరేమి ఉండేది కాదు అంటున్నారు. ప్రతిపక్ష పార్టీ వల్ల బాధితులకు ఏమైనా ప్రయోజనం చేకూరేదా..? అంటే అదీ లేదు.. అంటున్నారు. ఎందుకంటే గత మూడున్నర్రేళ్ళల్లో జగన్ ఏనాడూ ఆ కార్యాన్ని విజయవంతంగా నిర్వహించలేదు. ఈ మూడేళ్ళల్లో జగన్ కున్న ఫ్లాష్ బ్యాక్ అలాంటిది మరి. అందుకే ఈ ఛాన్స్ పోయింది అని ఫీలవడానికి కూడా ఏం లేదు.. వాళ్లు ఉన్నా ఒకటే.. లేక పోయినా ఒకటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఇంతకీ వైసీపీ నేతల మనసులో ఏముందో మరీ..

అవినీతి పరులను జైల్లో పెడతావా... ఏం మాట్లాడున్నావ్ జగన్...?

  పాపం పాదయాత్ర చేస్తూ.. అలసిపోయి ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నట్టున్నాడు జగన్.. అందుకే ఎం మాట్లాడుతున్నాడో కూడా తెలియట్లేదు. జగన్ మాట్లాడటం ఏమో కానీ.. జగన్ మాటలు వింటున్న వాళ్లకి మాత్రం ఫ్యూజులు ఎగిరిపోయినంత పనవుతుంది. ఇటీవల ఓ అవ్వ నాకు ఉండటానికి ఇల్లు లేదు... తినడానికి తిండి లేదు అని చెబితే.. దానికి జగన్ బాబు నన్ను సీఎం చేయండి.. అధికారంలోకి వస్తే అన్ని చేస్తా అని అవ్వతో పాటు అక్కడ ఉన్న వారందరికీ షాక్ ఇచ్చాడు. ఇప్పుడు ఏకంగా.. అవినీతి పరులను జైల్లో పెడతా అని మాట్లాడుతున్నాడు. దీంతో జగన్ వ్యాఖ్యలకు జనానికి నవ్వాలో.. ఏడవాలో కూడా తెలియని స్థితిలో పడ్డారు. తనదగ్గర డబ్బులు లేవని.. చంద్రబాబులాగ కేసులు లేవని మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉందంటున్నారు. అక్రమాస్తుల కేసులో ఏడాదిన్నర పాటు జైల్లో ఉన్న జగన్ ను ఊరికే టైం పాస్ కోసం అక్కడికి పంపలేదు కదా.. సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ఏకంగా జగన్ పై 11 ఛార్జ్ షీట్లు దాఖలు చేశాయి. ఇతని 11 కేసుల్లో నిందితుల నుండి వందల కోట్ల రూపాయలు ఆస్తులు జప్తు చేశాయి. ప్రతిశుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిందే. పాదయాత్ర చేసుకుంటాను.. వ్యక్తిగత మినహాయింపు ఇవ్వమని కోరినా.. కోర్టు కుదరదు పొమ్మని చెప్పింది. ఏలాగో అలా కేంద్రాన్ని మేనెజే చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. అందుకే రాష్ట్రం విడిపోయినా.. ప్రత్యేక హోదాపైనా.. జగన్ చంద్రబాబు ను టార్గెట్ చేస్తూ విమర్శిస్తాడు తప్పా...కేంద్రాన్ని మాత్రం పల్లెత్తు మాట అనడు. అంటే జగన్ కు చుక్కలే కదా. అలాంటి జగన్.. అవినీతి పరుల గురించి మాట్లాడుంటే మంచి కామెడీగా అనిపిస్తుంది. వాళ్లను జైల్లో పెడతా అని చెప్పడం ఇంకా కామెడీగా అనిపిస్తుంది. మరి జగన్ మాట్లాడేముందు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడితే బెటర్.