కొత్త ట్విస్ట్.. జయలలిత కూతురే... శోభన్ బాబు చెప్పాడు...

  తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం జయ వారసులమంటూ పలువురు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. మొదట కృష్ణమూర్తి అనే వ్యక్తి తాను జయలలిత-శోభన్ బాబుల వారసుడనని...ఆస్తి తనకే చెందాలని కోరుతూ కోర్టును ఆశ్రయించగా.. ఆ వ్యక్తి అందించిన పత్రాలు నకిలీవి అని తెలిపి నాలుగు తిట్లు తిట్టి అతగాడిని జైలుకి పంపించింది. ఇక ఆ స్టోరీ అయిపోయిందనుకుంటే ఇప్పుడు అమృత అనే యువతి తాను జయలలిత కూతురినని మరో ట్విస్ట్ ఇచ్చింది. అంతేకాదు.. కావాలంటే డీఎన్ఏ టెస్ట్ కూడా చేయించాలని కోరుతూ ఏకంగా సుప్రీంకోర్టునే ఆశ్రయించింది. దీంతో అందరూ ఆశ్చర్యపోగా.. సుప్రీంకోర్టు మాత్రం అందుకు అంగీకరించలేదనుకోండి.   అయితే ఇప్పుడు జయలలిత పై మరికొన్ని ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. జయలలితకు కూతురు ఉన్న మాట వాస్తవమేనని జయ మేనత్త కూతురు లలిత ఇంతకుముందే చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా అమృత జయకు, నటుడు శోభన్ బాబుకు పుట్టిన సంతానమేనని జయ స్నేహితురాలు గీత తెలుపుతున్నారు. అంతేకాదు ఈ విషయాన్ని శోభన్ బాబే తనతో స్వయంగా చెప్పారని పేర్కొన్నారు. 1999లో తానొకసారి శోభన్‌బాబు ఇంటికి వెళ్లినప్పుడు జయకు తనకు ఒక కుమార్తె ఉన్న విషయాన్ని శోభన్ బాబు తనతో ప్రస్తావించారని ఆమె అన్నారు. ఆమె పేరు అమృత అని కూడా చెప్పారన్నారు. 1996 నుంచి జయలలితతో అమృతకు సంబంధాలు ఉండేవని.. డీఎన్ఏ పరీక్షల్లోనే అసలు విషయం తేలుతుందని ఆమె అన్నారు. ఈ విషయం జయ ప్రియసఖి శశికళకు కూడా తెలుసని చెప్పారు. జయ కూడా శోభన్ బాబుతో తాను సహజీవనం చేస్తున్నానని, ఆయన వివాహితుడు కావడంతో పెళ్లి చేసుకోలేకపోతున్నానని అంగీకరించిందని తెలిపింది. దీనిపై ఆమె అప్పట్లో స్టార్ అండ్ స్టైల్ అనే ఆంగ్ల పత్రికకు స్వయంగా లేఖ కూడా రాశారట. ఇక ఇప్పుడు ఈ విషయం బయటకు రావడంతో అమృత ఆమె కూతురే అన్న అనుమానాలు బలపడుతున్నాయి.   మరోవైపు సుప్రీంకోర్టు సూచనతో అమృత కర్ణాటక కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలుస్తోంది. ఇక జరుగుతన్న పరిణామాలు చూస్తుంటే అమృత వాదనలు నిజమేనేమో అనిపిస్తుంది. అంత ధైర్యంగా డీఎన్ఏ టెస్ట్ కూడా చేయించాలని కోరిందంటే... నిజంగా ఆమె జయలలిత కూతురా అని ఏంటీ అని ఆలోచనలో పడ్డారు. మరి ముందు ముందు ఇంకెన్ని విషయాలు బయటపడతాయి.. నిజంగా అమృత జయ కూతురేనా తెలియాలంటే ఆ నిజం తెలిసే వరకూ ఆగాల్సిందే...

జగన్, రోజా పాదయాత్రలు... వింతలే వింతలు..

  వింతలు చూడలంటే మనం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. వైసీపీ నేతలు చేస్తున్న పాదయాత్రలు చూస్తే చాలు. కావల్సినన్ని వింతలు, విశేషాలు కనిపిస్తాయి.. వినిపిస్తాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పం పేరుతో.. ఒకపక్క పాదయాత్ర చేస్తుంటే.. మరోపక్క ఎమ్మెల్యే రోజా కూడా పాదయాత్ర మొదలుపెట్టింది. వీళ్ల పాదయాత్రల్లోనే అసలైన వింతలు కనిపిస్తున్నాయి. అవేంటనుకుంటున్నారా.. ?   జగన్ కోసం ఒకటి, రెండేళ్ళ పసి బాలుడు కూడా వేచిచూడడం… మూడు, నాలుగేళ్ల పాప నిరాహార దీక్ష చేయడం… 40 ఏళ్ళ మహిళ ముసలి అవ్వ అయిపోవడం… ఇలా చెప్పుకుంటూ పోతే ఓ మహాభారతమే అవుతుంది. తాజాగా మరో వింత బయటపడింది. అదేంటంటే.. పట్టుమని పది నిముషాలు కూడా నిలబడలేని వికలాంగుడు ఏకంగా 12 కిలోమీటర్లు జగన్ వెంట నడిచాడట. ఆశ్యర్యం ఏంటంటే..ఆ పెద్దాయన గత పదేళ్లుగా మంచానికి పరిమితం అయ్యాడట. కనీసం పది నిముషాలు కూడా సదరు వ్యక్తి నిలబడలేడట. అలాంటిది.. జగన్ పాదయాత్రలో ఏకంగా 12 కిలో మీటర్లు నడిచాడట. డాక్టర్లు, దేవుళ్ళు కూడా సాధించలేని ఇలాంటి వింతలకు నిలయంగా జగన్ “ప్రజా సంకల్పయాత్ర” లో మాత్రం సాధ్యమవుతుంది.   ఇక రోజా పాదయాత్ర విషయానికి వస్తే.. అదో విడ్డూరం. పాపం ఏసీ గదుల్లో నుండి బయటకు వచ్చారు కదా.. అందుకే ఇదో పెద్ద విషయం లాగ అనిపిస్తుంది. ఇలాంటివి సామాన్య ప్రజలకు సర్వ సాధారణం అని తెలియదు కాబోలు. ఒక విధంగా చెప్పాలంటే అసలు వీటిని లెక్కే చేయరు. కానీ వైసీపీ నేతలకు మాత్రం ఇదో పెద్ద విషయం. అందుకే రోజా పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుండి.. ఆమె కాళ్లను చూపించడమే ఎక్కువైంది. ఆమె కాళ్లకు బొబ్బలెక్కడం.. వాటికి చికిత్స చేయించుకుంటున్న ఫొటోలు వేస్తూ హంగామా చేస్తున్నారు. ఇంకా అద్భుతం ఏంటంటే... తన కాళ్ళు చూపించాలంటూ చేసిన సైగలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో  రోజా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినట్లయ్యింది. మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వింతలే బయటపడతాయి. రోజా హంగామా  కొద్ది రోజులే అయినా.. జగన్ పాదయాత్రలో మాత్రం మరో నాలుగైదు నెలల పాటు ఈ వింతలు, విడ్డూరాలు చూడాల్సిందే.

కేసీఆర్ కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అవ్వనుందా...!

  తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీఆర్ఎస్ కు ఎలాంటి ఢోకా లేదు అని చెప్పొచ్చు కూడా. తెలంగాణ ఉద్యమ పోరాటంలో పుట్టిన ఈ పార్టీ..ఆ బలంతోనే అధికారాన్ని చేపట్టింది. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పవనే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే. ప్రత్యేక రాష్ట్ర విభజనలో తెలంగాణ ఉద్యమంలో అందరూ ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా ఈ ఉద్యమంలో జేఏసీ ఛైర్మన్ కోదండరాం...కీలక పాత్ర పోషించారు. అలాంటి కోదండరాంకే ఈరోజు టీఆర్ఎస్ వ్యతిరేకమైంది. ప్రభుత్వ విధానాలపై కోదండరాం కూడా వ్యతిరేకతతో ఉన్నారు. కోదండరాం మాత్రమే కాదు... తెలంగాణ రాష్ట్రం రావడానికి ఓ రకంగా కారణమైన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్దులు కూడా కొంతమంది కేసీఆర్ కు వ్యతిరేకం అయ్యారు.   ఇక దీనిలో భాగంగానే కోదండరామ్ కూడా కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు మరో తాజా వార్త బయటకు వచ్చింది. అదేంటంటే... కోదండరాం, గద్దర్  కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా మద్దతు ప్రకటించబోతున్నారన్న వార్త వినిపిస్తోంది.  తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ రహస్యంగా భేటీ కావడం ఈ వార్తలకు ఊతమిస్తోంది. టీ.జేఏసీ చైర్మన్ కోదండరాం, ప్రజా గాయకుడు గద్దర్‌తో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జీ కుంతియా రహస్యంగా భేటీ అయ్యారు. సుమార్ రెండు గంటలకు పైగా వీరిమధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. నేరుగా ప్రజా సంఘాలు, జేఏసీ నేతలతోనే చర్చలు జరపాలన్న రాహుల్ విజ్ఞప్తితో దూతలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. అయితే కోదండరాం... గద్దరు నిర్ణయం ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి కాస్త బెటరే. ఇక కేవలం కేసీఆర్, టీఆర్ఎస్ పైనే యుద్దంచేయడానికే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇప్పుడు ఇక వీళ్ల మద్దతు కూడా లభిస్తే కాంగ్రెస్ పార్టీ కాస్త బలం పుంజుకున్నట్టే. అసలే ఈ మధ్య టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరుగుతుంది. మరి కేసీఆర్ ఇప్పుడైనా కాస్త కళ్లు తెరిచి జాగ్రత్త పడకపోతే అసలుకే మోసం వస్తుంది మరి.

మోడీ గారు జాగ్రత్త... ఏపీ స్టామినా చూడొద్దు...

  ఒకటిగా ఉన్న రాష్ట్రాన్ని రెండుగా చీల్చి.. న‌డిరోడ్డు మీద అనాథ‌ను వ‌దిలేసిన‌ట్టు యూపీఏ ప్రభుత్వం ఏపీకి తీరని అన్యాయం చేసిన సంగతి తెలిసిందే. అందుకు గాను కాంగ్రెస్ కు ఎలా బుద్ది చెప్పాలో అలా బుద్ది చెప్పారు. ఇంకా కొన్ని సంవత్సరాలైనా కాంగ్రెస్ చేసిన పాపం అంత త్వరగా మరిచిపోలేరు. ఇప్పుడు కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి పట్టనుందా.. మోడీకి కూడా బుద్ది చెప్పే సమయం దగ్గర పడిందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఇప్పటికే.. ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికే మొండిచేయి చూపించింది. పది సంవత్సరాలు ఇస్తానని పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చి దాన్ని ఇప్పుడు తుంగలో తొక్కేశారు. ఇదిలా ఉంటే ఏపీకి రావాల్సిన నిధుల విష‌యంతో పాటు రాజ‌ధాని నిర్మాణానికి చేసే సాయం విష‌యంలో మాట త‌ప్ప‌డం, విశాఖ రైల్వేజోన్‌ను ఇవ్వ‌క‌పోవ‌డం ఒకటి కాదు రెండు కాదు చాలా విషయాల్లో కేంద్రం ఏపీని చిన్న చూపు చూస్తుంది. ఇప్పుడు ఏకంగా  ఆంధ్రుల క‌ల‌ల ప్రాజెక్టు, జీవ‌నాడి అయిన పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డు పుల్ల వేసింది. పోల‌వ‌రం పూర్త‌య్యేందుకు బాబు ఎన్నో క‌ష్టాలు ప‌డుతుంటే మ‌రోవైపు ఈ ప్రాజెక్టుకు మోడీ స‌ర్కార్ అడుగ‌డుగునా అడ్డుత‌గులుతున్నారు.   ఇక ఇప్పటి వరకూ సహనంగా ఉన్నా చంద్రబాబుకు కూడా.. కేంద్ర ప్ర‌భుత్వంపై ఉన్న స‌హ‌నం నశించింది. దీంతో ఆయ‌న బీజేపీకి న‌మ‌స్కారం పెట్టి త‌ప్పుకుంటామ‌ని చెప్పారు. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం, మోడీ చేసిన మోసాన్ని ఏపీ ప్ర‌జ‌లు త‌ట్టుకోలేకపోతున్నారు. ఏపీ ప్ర‌జ‌ల ఆత్మాభిమానాల‌తో ఆడుకుంటోందని అనుకుంటున్నారు. మరి తెలుగు ప్ర‌జ‌లు ఎన్ని ఇబ్బందులు, బాధ‌లు, క‌ష్టాలు అయినా భ‌రిస్తారు కాని… ఆత్మ‌గౌర‌వం మీద దెబ్బ‌కొడితే స‌హించ‌రు. మరి మోడీగారు ఇప్పటికైనా కళ్లు తెరిస్తే మంచిది. లేకపోతే... కాంగ్రెస్ కు ప్రజలు ఎలా అయితే బుద్ది చెప్పారో.. బీజేపీకి కూడా బుద్ది చెప్పే పరిస్థితి వస్తుంది.

రాజు గారు ఏమన్నా సలహా ఇచ్చారా..!

అదేదో సినిమాలో ఓ విలన్ గిల్లితే గిల్లిచ్చుకోవాలి అని చెప్పిన డైలాగ్ గుర్తుంది కదా.. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పిన మాటలు చూస్తుంటే కూడా అలానే ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టులో భాగంగా... స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌లో కొన్ని పనులకుగాను ఏపీ ప్రభుత్వం టెండర్లకు ఆదేశాలిచ్చింది. అయితే జాతీయ హైడ్రో పవర్ కార్పొరేషన్ అద్యయనం చేసేవరకు టెండర్లను నిలిపివేయాలని స్పష్టం చేసింది. ఇక కేంద్రం వేసిన ఈ అడ్డుపుల్లపై స్పందించిన చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వంపై ఓపెన్ గానే సీరియస్ అయ్యారు. పోలవరం టెండర్ల విషయంలో కేంద్రం ఆపమంటే ఆపేస్తామనే.. కేంద్రం అదే వైఖరితో ఉంటే వాళ్ళకే అప్పజెప్పి నమస్కారం పెడతానని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ పనులు ఆరునెలలపాటు ఆగిపోతే మళ్ళీ దారి పట్టించడం కష్టమని సీఎం తేల్చిచెప్పారు. పోలవరంపై ఎందుకు ఇన్ని ఇబ్బందులో అర్థం కావడం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం సహకరిస్తే సరే...లేకుంటే మన కష్టమే మిగులుతుందని.. "నేను ఆశావాదిని....నా పని నేను చేస్తా.. మిత్రపక్షం కాబట్టే మరింత సహనంగా వ్యవహరిస్తున్నా" అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేస్తానంటే ఇప్పటికిప్పుడే కేంద్రానికి అప్పగిస్తామన్నారు. కేంద్రం ముందుకొస్తే తనకెలాంటి భేషజాలు లేవని.. "పోలవరం పనులు రాష్ట్ర ప్రభుత్వం చేయాలని నీతి ఆయోగ్ చెప్పింది.. నేనేమీ కావాలని తీసుకోలేదు" అని చంద్రబాబు చెప్పారు.   అయితే చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలకుగాను బీజేపీ పెద్దలు వెంటనే ఆయనను బుజ్జగించే పని చేశారు. కానీ సోము వీర్రాజు మాత్రం.. కేంద్రం చేసింది ఒప్పే అన్నట్టు తిరిగి చంద్రబాబుపైనే విమర్శలు గుప్పించారు. కేంద్రం తెలిపిన అభ్యంతరాలను ఏపీ ప్రభుత్వమే పరిష్కరించుకోవాలని.. అనవసర రాజకీయాలు చేయకుండా.. ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని చంద్రబాబుకు ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు టెండర్లు ఆపమని చెప్పి రాజకీయం చేస్తుంది ఎవరో మరి? కేంద్రం సహకరిస్తేనే అనే పదం సీఎం వాడటం సరికాదని.. సకాలంలోనే సహకరిస్తేనే ప్రాజెక్టు 60 శాతం పూర్తయిందన్న విషయం గుర్తుంచుకుంటే మంచిదని ఆయన చెప్పారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి ముందే ఏపీ 5,135 కోట్లు ఖర్చు చేసింది. దాన్ని ఏపీ వాటాగా కేంద్రం పరిగణించింది. మిగిలిన 7,431 కోట్లల్లో ఇప్పటివరకు కేంద్రం 4,329 కోట్లు ఇచ్చారు. మరో 3,102 కోట్లు రాష్ట్రం ఖర్చు పెట్టగా అది కేంద్రం నుండి రావాల్సి ఉంది. మరి ఏ రకంగా కేంద్రం సకాలంలోనే సహకరిస్తేనే ప్రాజెక్టు 60 శాతం పూర్తయిందని చెప్పగల్గుతున్నారో వీర్రాజు కే తెలియాలి.

సొంత ఎమ్మెల్యేలను పందులన్న జగన్..?

కాలు జారితే తీసుకోగలం.. కానీ నోరు జారితే కష్టం అంటారు మన పెద్దలు. ఏ మాట ఎక్కడ మాట్లాడినా.. అది మంచిదైనా, చెడ్డదైనా ఎన్నో చెవులకు రిజిస్టర్ అయిపోతుంది. రాజకీయ నాయకులు ఎప్పుడు.. ఎవరితో ఏం మాట్లాడినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే ఆ తర్వాత వచ్చే కంపు భరించడం కాకలు తీరిన పొలిటిషియన్స్ వల్లే కాలేదు. నువ్వా నేనా అంటూ కాలు దువ్వే శత్రువు గురించైనా సరే రాజకీయాలకి వచ్చే సరికి రెస్సాక్ట్‌తో మాట్లాడాలి. లేదంటే ఆ మాట అధికారాన్ని అందివ్వగలదు.. కుర్చీలోంచి లాగి కిందకు పడేయనుగలదు. అశాంతి, అసహనం, అసంతృప్తి మనిషి మనసులో కలకలం రేపుతాయి. అలాంటి వ్యక్తికి మాట మీద అదుపు తప్పి ఏం మాట్లాడాలో.. ఏం మాట్లాడుతున్నాడో అర్థంకాదు. ఆ కోవలోకే వస్తారు వైసీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి.   ఎంత కష్టపడ్డా కోరుకున్న లక్ష్యం దగ్గరకు రాకపోవడంతో వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిలో అసహనం రోజురోజుకి పెరిగిపోతుంది. గోల్డెన్ స్పూన్‌తో పుట్టడమో.. చిన్నప్పటి నుంచి కష్టపడిన నేపథ్యం లేకపోవడమో.. నడిచి నడిచి కాళ్లు నొప్పి పుడుతున్నాయో తెలియదు కానీ ఆయన సంయమనం కోల్పోతున్నారు. దీనికి తోడు నాలుగు రోజుల వ్యవధిలో ఇద్దరు పార్టీ నేతలు తెలుగుదేశంలో చేరడంతో జగన్‌లో ఆవేశం కట్టలు తెంచుకొంది. నిన్నటి వరకు తనతో ఉన్నారన్న మాట కూడా మరచిపోయి వారిని నానా మాటలు అనేశారు. కాంట్రాక్టర్ల వద్ద తీసుకున్న అవినీతి డబ్బుతో ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ నేతలను గొర్రెలు, పశువుల్లా కాదు.. "పందుల్లా" కొనుగోలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.   డబ్బు ఎరగా చూపారనో, మరేదో ఆశచూపి బుట్టలో వేసుకున్నారన్నా ఎవరు పట్టించుకునేవారు కాదు. కానీ మరీ పందులతో పొల్చడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రతిపక్షం అన్నాకా అధికార పక్షంపై విమర్శలు చేయడం ఎక్కడైనా ఉంటుంది. అయితే జగన్ విషయానికి వచ్చేసరికి ఆయన హద్దులు ఏనాడో దాటేసినట్లు అనిపిస్తుంది. గతంలో ఇలా ఆవేశపడి నంద్యాలలో సీఎం చంద్రబాబును నడిరోడ్డుపైనా కాల్చేసినా ఫర్లేదని.. ఉరితీసినా తప్పులేదని కామెంట్ చేయడంతో జనం చీదరించుకున్న విషయాన్ని జగన్ మరచిపోయారా..? అంటూ సోషల్ మీడియాలో చురకలు వేస్తున్నారు నెటిజన్లు. గెలుపుపై నానాటీకి జగన్‌లో భయం పట్టుకుందని.. అందుకే నోటికి ఎంత మాటొస్తే అంత అనేస్తూ అడ్డంగా బుక్కవుతున్నారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

జీఈఎస్ సాక్షిగా కేటీఆర్ కు అవమానం...

  హైదరాబాద్ లో రెండు రోజుల పాటు జీఈఎస్ సమ్మిట్ జరిగిన సంగతి తెలిసిందే కదా. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ ట్రంప్ కూడా రావడంతో ప్రత్యేకత చోటుచేసుకుంది. ఇక ఇవాంక వస్తున్నందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం చేసిన హడావుడి అంతా ఇంతాకాదు. ఆమె కోసం దాదాపు వంద కోట్లుపైనే ఖర్చు చేశారు. హైదరాబాద్ ను ముస్తాబు చేశారు. బెగ్గర్స్ ఫ్రీ చేశారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రకరకాల వంటకాలు తయారు చేయించారు. మొత్తానికి ఇవాంకాకు ఎలాంటి లోటు రాకుండా చేశారు. ఇక ఇవాంక కూడా వచ్చింది.. సమ్మిట్ లో పాల్గొంది.. ఆడవారి గురించి గొప్పగా మాట్లాడింది. ఇక మోడీ, కేసీఆర్, కేటీఆర్ కూడా ఆడవారి గురించి గొప్పగా చెప్పుకొచ్చారు.   ఇక్కడి వరకూ బాగానే ఉన్నా... ఈ సదస్సులో భాగంగా కేసీఆర్ ప్రభుత్వానికి మాత్రం... అవమానం జరిగినంత పనైంది. అదేంటంటే.. ఆడవారి సామర్థ్యాన్ని, మహిళా సాధికారత పై పెద్ద ఉపన్యాసం చేస్తున్న కేటీఆర్ ఒక్కసారిగా షాక్ తగిలింది. ఎందుకంటే... జీఈఎస్ లో  మీ ప్రభుత్వంలో మహిళా మంత్రి ఎందుకు లేరు అనే ప్రశ్న ఎదురైంది....ఈ ప్రశ్నకు కేటీఆర్ కంగుతిన్నారు. మా ప్రభుత్వంలో మహిళా ఎమ్మెల్యేలు లేరు.. దానిపైన ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని ఏదో కవరింగ్ ఇచ్చారు. అయితే ఈ సమాధానం అంత సంతృప్తికరంగా లేదు అని కేటీఆర్ కు కూడా తెలుసు. దీంతో మరి ఇప్పుడైనా కేసీఆర్ దీనిపై ఆలోచిస్తే మంచిది అని అనుకుంటున్నారు. ఎలక్షన్స్ కేవలం ఏడాదిన్నర మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే మరో కాబినెట్ విస్తరణ ఉండకపోవచ్చు అనే ఇండికేషన్ ఇచ్చారు ముఖ్యమంత్రి. ఎన్నికల దగ్గరలో క్యాబినెట్ విస్తరణ అంత తేలిక కాదు కూడా. అయితే ఈ విమర్శను కరెక్ట్ చేసుకుని ఎన్నికలకు వెళ్తే మంచిదే. చూద్దాం మరి కేసీఆర్ దీనిపై ఏం యాక్షన్ తీసుకుంటారో...

పోలవరానికి కేంద్రం అడ్డుపుల్ల... రాజు గారు ఇవి కనిపించవా...!

  కేంద్రానికి ఏపీపై ఉన్న చిన్నచూపు మరోసారి బయటపడింది. ఇప్పటికి ఏపీకి ఇస్తానన్న ప్రత్యేక హోదా విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు.. పోనీ స్పెషల్ ప్యాకేజీ విషయంలో అయినా సాయం చేస్తుందా అంటే.. ఏదో ముష్టి పడేసినట్టే అప్పుడు కొంచెం.. అప్పుడు కొంచెం నిధులు ఇస్తుంది. ఆ నిధులు అయిపోయిన తరువాత మళ్లీ బాబు గారు కేంద్రం దగ్గరకు వెళ్లి అడుక్కోవాల్సిన పరిస్థితి. ఇంతేనా ఇంకా ఎన్నో విషయాల్లో ఏపీపై కేంద్రం చిన్న చూపే చూస్తుంది. ఎన్నో వేల కోట్లు ప్రాజెక్టులు కేంద్రం వల్లే పెండింగుల్లో పడ్డాయి. ముందు మీరు డబ్బు పెట్టుకోండి.. ఆ తరువాత మమ్మల్ని అడగండి అని చెబుతున్నారు. అసలే రాష్ట్రం విడిపోయి కష్టాల్లో ఉంటే..ఆ మాత్రం కూడా ఆలోచించకుండా కేంద్రం మొండిచేయి చూపిస్తుంది. ఏదో ఒకలా పోలవరం ప్రాజెక్టు అయినా పూర్తి చేస్తుంది కదా అనుకునే లోపు ఇప్పుడు దానికి కూడా అడ్డు పుల్ల వేసింది. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పనులకు టెండర్లు పిలవగా కేంద్రం వాటిని నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌లో కొంత భాగానికి జారీ చేసిన టెండర్లను నిలిపివేయాలని స్పష్టం చేసింది.   జాతీయ హైడ్రో పవర్ కార్పొరేషన్ అద్యయనం చేసేవరకు పనులను నిలుపుదల చేయాలని కేంద్రం తెలిపిందని సమాచారం. ఎన్‌హెచ్‌పీసీ ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులపై అధ్యయనం చేసేందుకు పోలవరం ప్రాజెక్టు వద్దకు రాలేదు. కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు బ్రేకులు వెయ్యాలని చూడటంతో రాష్ట్ర ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.    మరి పోలవరం విషయంలో తాము చెబితేనే చంద్రబాబు ముందుకు కదిలారని చెప్పుకుంటున్న బీజేపీ నేత సోము వీర్రాజు ఇప్పుడు దీనిపై  మాట్లాడటానికి నోరు రావడం లేదేంటో...పోలవరం నిర్మాణం కోసం తెలంగాణ లోని ఏడు ముంపు మండలాలు ఏపీ లో కలపకపోతే ఇబ్బంది అవుతుందని సీఎం చంద్రబాబుకు ఎవరు చెప్పారో తెలుసా ? బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అట. తాను చెప్పాకే ఆ విషయంలో సీరియస్ నెస్ గమనించిన చంద్రబాబు ఆ 7 మండలాలను ఏపీ లో కలపకపోతే సీఎం గా ప్రమాణస్వీకారం చేయనని చెప్పడంతో ఆ పని వెంటనే పూర్తి అయ్యిందని చెప్పుకున్నాడు. మరి ఇప్పుడు పోలవరానికి కేంద్రం కొర్రీ వేయడం గురించి మాత్రం ప్రస్తావించలేదు. కాపర్ డాం , స్పిల్ వే, స్పిల్ చానెల్ పనులు ఆపాలని కేంద్రం లేఖ రాసింది ఎందుకో చెప్పలేకపోతున్నారు.  2019 ఎన్నికల లోపు పోలవరం పనులను ఓ కొలిక్కి తేవాలని చూస్తున్న చంద్రబాబుకు కేంద్రం అడుగడుగునా అడ్డం పడడం అందరికీ కనిపిస్తున్నా ఇంకా కొందరు బీజేపీ నేతలు మోడీ క్రెడిట్ గురించి మాట్లాడడం చూసి ఏపీ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మరి పోలవరం విషయంలో కూడా కేంద్రం ఇలాంటి పుల్లలు పెడితే.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది. అది కేంద్ర ప్రభుత్వమైనా సరే.. వీర్రాజు లాంటి వారైనా సరే....

రాహుల్ కు అప్పుడే మొదలైందిగా...

  రాహుల్ గాంధీకి త్వరలో పార్టీ పగ్గాలు అప్పచెప్పనున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి నుండి ఏంటి.. ఎప్పటినుండో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రాహుల్ గాంధీ చేతిలో పెట్టాలని చూస్తున్నా.. ఎందుకో దానికి తగిన సమయం మాత్రం రాలేదు. సమయం సంగతేమో కానీ.. రాహుల్ గాంధీ చేతిలో పార్టీని పెడితే పార్టీకి భవిష్యత్తు ఉంటుందా అని సొంత పార్టీ నేతలే డౌట్ పడిన సందర్భాలు ఉన్నాయి. అందుకే సోనియా కూడా తొందరపడి రాహుల్ కు బాధ్యతలు అప్పగించడానికి ఆలోచిస్తున్నారు. మధ్యలో పలువురు కాంగ్రెస్ నేతలే రాహుల్ బదులు ప్రియాంక గాంధీ పేరు ప్రస్థావించిన వారూ ఉన్నారు. కానీ అవేం జరగలేదు. అయితే ఇటీవలే మళ్లీ రాహుల్ కు డిసెంబర్ లో పార్టీ పగ్గాలు అప్పగిస్తున్నామని కాంగ్రెస్ ప్రకటించింది.   ఇక ఇప్పుడు కూడా రాహుల్ కు సేమ్ సిచ్యూవేషన్. సొంత పార్టీ నేతనే రాహుల్ పై సంచలన వ్యాఖ్యలు చేసే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత... షెహజాద్ పొన్నావాలా.. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీని నిలిపేందుకు ఓ నాటకం జరుగుతోందని, అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ యావత్తూ ముందస్తు ప్రణాళిక ప్రకారం జరుగుతోందని అన్నాడు. ఇదేమీ వాస్తవ ఎన్నిక కాదని, సిగ్గుపడాల్సిన ఎన్నికని.. ఒక కుటుంబంలోని ఒక వ్యక్తిని పైకి తెచ్చేందుకు జరుగుతున్న డ్రామా అని అన్నారు. జరుగుతున్న తప్పును తాను ఎత్తి చూపుతున్నానని, కాంగ్రెస్ లోని ఎంతో మందికి ఈ విషయమై పూర్తి అవగాహన ఉన్నప్పటికీ ఎవరూ నోరు మెదపడం లేదని విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ ముందుగా తన ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసి, ఆపై అధ్యక్ష ఎన్నికలకు పోటీ పడాలని అన్నారు. ఈ ఎన్నిక పారదర్శకంగా జరిగేట్టయితే బాగుంటుందని, ఇదే విషయాన్ని రాహుల్ కు లేఖ ద్వారా తెలిపానని అన్నారు. పూర్తి రిగ్ అయిన ఎన్నికల్లో తాను పోటీ చేయలేనని, అసలు ఈ విధానమే తప్పుల తడకని పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు.   మరి షెహజాద్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు, రాహుల్ గాంధీ ఎలా స్పందిస్తారో చూడాలి. సొంత పార్టీ నేతనే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడంటే రాహుల్ కెపాసిటీ ఏంటో అర్ధమవుతోంది. ఇంకా ఎంత మంది వ్యతిరేకంగా ఉన్నారో తెలియదు. మరి సొంత పార్టీ నేతలే ఇంత వ్యతిరేకతో ఉంటే ఇంకా పార్టీ బాధ్యతలు రాహుల్ ఎలా మోస్తాడూ.. పార్టీని ఎలా పైకి తీసుకొస్తాడు..

మెట్రో స్టేషన్ లో ఊరికే తిరుగుతున్నారా..? పైసల్ మాయం...!

  ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన హైదరాబాద్ మెట్రో రానే వచ్చేసింది. నిన్ననే ప్రారంభమైన మెట్రోలో ఎప్పుడెప్పుడు ప్రయాణం చేయాలా అని ఆసక్తిగా ఎదురుచూశారు. అసలు ఎలా ఉందో చూడటానికే చాలా మంది నిన్న మెట్రోలో ప్రయాణించారని చెప్పొచ్చు. స్టేషన్‌కు చేరుకున్న వెంటనే మొత్తం కలియదిరుగుతూ మెట్రో అందాలను వీక్షిస్తున్నారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అదేంటంటే...చేతిలో స్మార్ట్ కార్డ్ ఉంది కదా.. ఎంతసేపైనా స్టేషన్ లో ఉండొచ్చు అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే... ఎందుకంటే.. దానివల్ల స్మార్ట్‌కార్డులోని సొమ్మంతా స్వాహా అయిపోతుంది. మాములుగా అయితే స్మార్ట్ కార్ట్ కోసం 200 రూపాయలు చెల్లిస్తే.. అందులో 100 రూపాయలు మనం వాడుకోవచ్చు. కానీ ఆ అవకాశం లేకుండా పోయింది.   ఓ ప్రయాణికుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఉప్పల్‌కు చెందిన శ్రీనివాస్‌కు మెట్రో ఎక్కాలన్నా ఉత్సాహంతో ఎక్కాడు.. అక్కడ అంతా చూశాడు.. బయటకు వచ్చాడు. అయితే తిరిగి ఇలా బయటకు వచ్చే ముందు చూసుకుంటే కార్డులో మిగిలింది కేవలం పన్నెండు రూపాయలే. రూ.88 మాయమవడంతో శ్రీనివాస్ అవాక్కయ్యాడు. దీంతో అసలు విషయం అర్ధమైంది.. అంటే స్టేషన్ లో ఎక్కువసేపు గడిపితే స్మార్ట్ కార్ట్ లోని పైసలు మొత్తం గల్లంతు అవ్వడమే అని. సో స్టేషన్‌లో ఉన్నంత సేపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్న మాట. ఇదే కాకుండా మెట్రో ఛార్జీలు కూడా భారీగా ఉన్నాయన్న టాక్ కూడా వినిపిస్తోంది. అంతేకాదు దీనికి ఉదాహరణగా కొన్ని లెక్కలు కూడా వేసి చెబుతున్నారు. ఆ లెక్కలేంటో మీరు చూడండి...   హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మధ్య దూరం 575 కిలోమీటర్లు. ముందుగా కానీ విమాన టికెట్ బుక్ చేసుకుంటే రూ.1400 నుంచి రూ.1800 మధ్యన ఉంటుంది. ఇప్పుడు ఈ లెక్కను.. మెట్రో ఛార్జీలతో చూస్తే... హైదరాబాద్ మెట్రోలో 30 కిలోమీటర్ల జర్నీకి వసూలు చేస్తున్న ఛార్జీ రూ.60. ఈ లెక్కన 575 కిలోమీటర్లకు.. 30 కిలోమీటర్ల చొప్పునచార్జీ లెక్కేస్తే వచ్చే మొత్తం రూ.1150. అంటే.. కాస్త ముందుగా బుక్ చేసుకునే ఫ్లైట్ టికెట్ కు దగ్గరగా అన్నమాట. ఆ లెక్కల మాట సంగతేమో కానీ.. ఓ రకంగా చూస్తే మెట్రో ఛార్జీలు కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. మరి ఇలానే ఉంటే... మెట్రో జర్నీ కూడా సామాన్యులకు కాకుండా పోయే ప్రమాదం ఉంది. మరి ప్రభుత్వ దీనిపై కాస్త ఆలోచిస్తే బెటర్..

చంద్రబాబు కోడలా మజాకా... రిపోర్టర్ కు సూపర్ కౌంటర్...

  నారా వారి కోడలు నారా బ్రహ్మణి సామర్యం ఏంటో మరోసారి చూపించింది. ఓ రిపోర్టర్ కు దిమ్మతిరిగి పోయే సమాధానం ఇచ్చి నోరు మూయించింది బ్రహ్మణి. హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్నసంగతి తెలిసిందే కదా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు.. ఇవాంక ట్రంప్ ఈ సదస్సులో పాల్గొనడానికి వచ్చారు. ఇక ఈ సదస్సులో నారా చంద్రబాబు కోడలు నారా బ్రహ్మణి కూడా పాల్గొన్నారు. ఇక మీటింగ్ అయిపోయిన అనంతరం బయటకు వచ్చిన ఆమెను.. ఓరిపోర్టర్ హైదరాబాద్ లో ఈ సదస్సు జరగడం అసూయ కలిగిస్తోందా అని ఓ తింగరి ప్రశ్న అడిగాడు. ఇక దీనికి బ్రహ్మణి ఆవేశంతో ఊగిపోకుండా... చాలా నీట్ గా.. రిపోర్టర్ నోరు మాయించేలా సమాధానం చెప్పింది. ఇంతకీ బ్రహ్మణి ఏం సమాధానం చెప్పిందనుకుంటున్నారా...“ సదస్సు ఎక్కడ జరుగుతుందన్నది ముఖ్యం కాదు . దాని నుంచి ఏమి నేర్చుకున్నాం , ఎంత స్ఫూర్తి పొందాం అన్నదే ముఖ్యం. అమరావతిలో కిందటేడాది అంతర్జాతీయ మహిళా పార్లమెంట్ జరిగింది. అలాగే ఇది. అయినా మీలాగా మేము ఆలోచించలేం” అంటూ బ్రాహ్మణి సమాధానం చెప్పిందట. ఇక బ్రహ్మణి ఇచ్చిన సమాధానంతో ఆ ప్రశ్న వేసిన రిపోర్టర్ కి దిమ్మ తిరిగిపోయిందట. దీంతో బ్రహ్మణి చెప్పిన డైలాగ్ ఇప్పుడు అందరికీ తెగ నచ్చేసి సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న వాళ్లు ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు ఏం మాట్లాడితే.. ఏం తలనొప్పో అని కంగారు పడుతుంటారు. కానీ బ్రహ్మణి మాత్రం చాలా సింపుల్ గా ఆన్సర్ చేసి తన సామర్ద్యం ఏంటో చూపించింది. మరి ఎంతైనా చంద్రబాబు కోడలు కదా.. ఆ మాత్రం సమాధానం చేయకపోతే ఎలా...

హరీశ్ రావు ఎక్కడ...వెళ్లాడా.. పంపించారా...?

  హైదరాబాద్ కలల ప్రాజెక్టు ‘మెట్రో రైలు’ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. పచ్చజెండా ఊపి ప్రారంభించిన ఆయన సీఎం కేసీఆర్‌, కేటీఆర్ ఇంకా పలువురు మంత్రులతో కలిసి.. మియాపూర్ నుంచి కూక‌ట్‌ప‌ల్లికి ప్రయాణించారు మోడీ. ఇక ఈ కార్యక్రమంలో మోడీ కేసీఆర్ కంటే కేటీఆర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తోంది. కేటీఆర్ ఎక్కడని పిలిచిమరీ వచ్చేదాకా ఆగి ప్రారంభోత్సవం జరిపారు. అంతేకాదు.. రైల్లో కూడా కేటీఆర్ పక్కనే కూర్చున్నారు. కేటీఆర్ చెప్పే విషయాలను ఆసక్తికరంగా విన్నారు. ఇంకా మెట్రో కార్యక్రమానికి టీఆర్ఎస్ నేతలు చాలా మంది వచ్చారు.   అయితే ఇంత హడావుడి జరుగుతున్నా.. ఆ కార్యక్రమంలో ఓ మనిషి మాత్రం కనిపించడంలేదు. ఇప్పటికే బల్బు వెలిగిఉంటుంది.... అదేనండి కేసీఆర్ మేనల్లుడు..టీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇదే పెద్ద హాట్ టాపిక్ అయింది. హరీశ్ రావు ఎక్కడున్నాడు.. ఎక్కడికి వెళ్లాడు..ఇవే ప్రశ్నలు... అయితే నిన్న మెట్రో ప్రారంభోత్సవం జరుగుతుంటే..  హరీష్ రావు ఢిల్లీ వెళ్లారట. కాళేశ్వరం ప్రాజెక్ట్ అటవీ,పర్యావరణ అనుమతుల కోసం కేంద్రాన్ని అభ్యర్ధించడానికి హరీష్ ఢిల్లీ వచ్చారట. జలవనరుల సంఘం అధికారులతో హరీష్ ఈ విషయం తో పాటు తెలంగాణకు సంబంధించిన మిగిలిన సమస్యలపై కూడా దృష్టి పెడతారట. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే...ఆ అధికారులతో హరీశ్ రావు ఈరోజు భేటీ అవ్వనున్నారు. దానికి ఒక్కరోజు ముందే ఢిల్లీ వెళ్లాల్సిన పని లేదు. దీనివల్లే ఎక్కడాలేని డౌట్లు వస్తున్నాయి. ఆ ముందు జాగ్రత్త హరీష్ దేనా లేక కెసిఆర్ దా? అని కూడా అనుకుంటున్నారు.. ఈరోజు సమావేశం అయితే... దానికి ఒకరోజు ముందే వెళ్లాల్సిన అవసరం లేదే అని పలువురు గుసగుసలాడుకుంటున్నారు.   గతంలోనే కేసీఆర్ కుటుంబానికి... హరీశ్ రావుకు మద్య విబేధాలు తలెత్తినట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు... రాష్ట్రం విడిపోక ముందు.. విడిపోయిన తరువాత కొన్ని రోజులు కూడా కేసీఆర్ పక్కన హరీశ్ రావు కుడి భుజంగా ఉండేవాడు. కానీ మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో.. హరీశ్ రావు స్థానం కూడా తగ్గుకుంటూ వస్తుందని చెప్పొచ్చు. ఒకప్పుడు కేసీఆర్ తరువాత రెండో స్థానం ఎవరిది అంటే టక్కున హరీశ్ రావు అన్న పేరు వచ్చేది. కానీ ఇప్పుడు కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత కొద్ది రోజుల నుండి అయితే అసలు హరీశ్ రావు కనిపించడమే అరుదైపోయింది. ఇక ఇప్పుడు హైదరాబాద్ లో ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నా.. తాను పోయి ఢిల్లీలో కూర్చున్నాడు. మరి దీని వెనుక ఉన్నకారణాలు ఏంటీ... ఎంత తమ మధ్య విబేధాలు లేవు అని చెబుతున్నా.. ఇలాంటి ఘటనలు చూస్తుంటే.. విబేధాలు ఉన్నాయని నమ్మాల్సి వస్తుంది ..

నా మీద పడతారేంటి సామి....

  ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్టు అన్న సామెత అందరికీ తెలిసే ఉంటుంది కదా.. ఇప్పుడు అలాగే ఉంది చంద్రబాబు పరిస్థితి చూస్తుంటే. ఎందుకంటారా.. గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా అమెరికా అధ్యక్షుడు కూతురు ఇవాంక ట్రంప్ హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇవాంక వస్తున్నందుకు ప్రభుత్వం మామూలు ఏర్పాట్లు చేయలేదు. హైదరాబాద్ ను అందంగా ముస్తాబు చేశారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు... దోమ కూడా వాలకుండా చూస్తున్నారు. ఇక నిన్ననే హైదరాబాద్ మెట్రోను కూడా ప్రధాని మోడీ లాంఛనంగా ప్రారంభించారు. మెట్రోను ప్రారంభించారు.. కేసీఆర్, కేటీఆర్ పలువురు మంత్రులతో కలిసి మెట్రోలో ప్రయాణించారు.. ఆతరువాత ఇవాంకతో కలిసి గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. అందరూ కలుసుకున్నారు.. బాగానే మాట్లాడుకున్నారు.. విందులు ఇచ్చుకున్నారు..   ఇప్పుడు ఈ విషయంలో చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఇవంకా ట్రంప్ సమక్షంలో హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు లేకపోవడం మీద సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది. హైదరాబాద్ కు ఇవంకా వచ్చినందుకు, అమరావతి రానందుకు బాబు ఏదో తప్పు చేసినట్టు బిల్డ్ అప్ ఇస్తున్నారు. అమరావతి శంకుస్థాపన అప్పుడు చంద్రబాబు కేసీఆర్ ను పిలిచారు. చంద్రబాబు ఆహ్వానాన్ని మన్నించి.. కేసీఆర్ వచ్చారు. కానీ ఇప్పుడు కెసిఆర్ ఆ పద్ధతి పాటించలేదు. కేసీఆర్ ప్రధానిని పిలిచారు కానీ...చంద్రబాబును పిలవలేదు. ఇక గ్లోబల్ సమ్మిట్ కు చంద్రబాబుకు పిలుపురాలేదు. ఆ విషయంలో కూడా చంద్రబాబుకు సంబంధం లేదు. ఏదైనా అనాలంటే కేంద్రప్రభుత్వాన్ని అనాలి. అవన్నీ మానేసి.. చంద్రబాబు రాలేదు.. చంద్రబాబుకు జెలసీ ఎక్కువ అంటూ కొంతమంది మహానుభావులు మినిమమ్ కామన్ సెన్స్ కూడా లేకుండా పోస్ట్ పెట్టడానికి తయారైపోతుంటారు. పిలవని పేరంటానికి వెళ్లినట్టు.. ఆహ్వానించకపోయినా వెళ్లమంటారో.. ఏమో..? చంద్రబాబును పిలవనందుకు... మోడీ , కెసిఆర్ ని వదిలేసి చంద్రబాబు మీద పడితే ఏమోస్తుంది.  ఏ మాత్రం కామన్ సెన్స్ వున్న వారికి అయినా ఈ విషయం అర్ధం అవుతుంది.

పెద్ద తలకాయ కోసం వెయిటింగ్.. ఇంతకీ ఎవరబ్బా..

  వైసీపీ పార్టీ నుండి ఇప్పటికే ఎంతోమంది కీలక నేతలు అధికార పార్టీ అయిన టీడీపీలోకి జంప్ అయి షాకిచ్చారు. తాజాగా టీడీపీపై ఎన్నో విమర్శలు గుప్పించి.. ఒకప్పుడు సీఎం తల నరుకుతా అని బహిరంగంగా ప్రకటించిన గిడ్డి ఈశ్వరి కూడా టీడీపీ కండువా కప్పుకుంది. ఇక గిడ్డి ఈశ్వరి చేరికతో ఈ సంఖ్య 23 కు చేరింది. ఇక పలువురు టీడీపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకుంటున్నట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా... ఇప్పుడు ఓ వార్త మాత్రం అటు వైసీపీలోనూ..ఇటు టీడీపీలోనూ హాట్ టాపిక్ గా మారింది.   అదేంటంటే.. మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ప్రకటనపై. “వైకాపాకు చెందిన ఒక పెద్ద తలకాయ కోసం ప్రయత్నిస్తున్నాం. అనేకరకాలుగా చర్చలు జరుపుతున్నాం. ‘అన్నిరకాలు’గా వారికోసం ప్రయత్నాలు చేస్తున్నాం. అది వర్కవుట్‌ అయితే దాదాపు మా లక్ష్యం వందశాతం పూర్తయినట్లే. ఇక అక్కడ మిగిలేది ఒకరో ఇద్దరో మాత్రమే,” అని ఆయన అన్నాడు. అంతేకాదు జ‌గ‌న్ పాద‌యాత్ర ముగిసే టైంకు వైసీపీలో ఆయ‌న‌తో పాటు ఆయ‌న తల్లి, చెల్లి, కొద్దిమంది బంధువులు మాత్రమే వైసీపీలో ఉంటారని ఆయన అన్నారుఅంతే ఇప్పుడు వైసీపీలో ఉన్న ఆ పెద్ద తలకాయ ఎవరబ్బా అని అందరూ చర్చించుకుంటున్నారు. కొంతమంది అయితే జ‌గ‌న్‌కు రైట్ హ్యాండ్‌, ఆయ‌న చిన్న‌నాటి స్నేమితుడు అయిన రాయ‌చోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అని అనుకుంటుండగా.. కొంతమంది మాత్రం... ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అని అనుకుంటున్నారు. పెద్దిరెడ్డి తరలిపోతే చిత్తూర్ జిల్లాలో వైకాపా ఖాళీ అవ్వడం ఖాయం. ఆయనతో పాటు ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూడా తరలిపోతారు. దీంతో వైసీపీలో ఒకటే టెన్షన్ పట్టుకుంది.   ఒకపక్క జగన్ మాత్రం పాదయాత్ర అంటూ పోతుంటే... మరోపక్క నేతలు ఒక్కోక్కరుగా పార్టీని వదిలి వెళుతున్నారు. పోనీ నేతలు పార్టీ మారే ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నా.. జగన్ వారిని బుజ్జగిస్తున్నారా అంటే అదీ లేదు... పోతే పోండి అన్నట్టు ఉంది ఆయన వ్యవహారం. జగన్ ఈ తీరువల్లే పార్టీ నేతలు అయోమయ స్థితిలో పడ్డారు. మరోపక్క అచ్చన్నాయుడు చేసిన వ్యాఖ్యలు. దీంతో వైకాపా పార్టీ నేతల గుండెల్లో గుబులు మొదలైంది. ఏంచెయ్యాలో పాలుపోని పరిస్థితిలో పడ్డారు. మరి చూద్దాం.. ఆ పెద్ద తలకాయ ఎవరో.. జగన్ కు ఎప్పుడు షాక్ తగులుతుందో...

గాలి కూడా కంట్రోల్లో... వాళ్లే మనుషులా..

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ హైదరాబాద్ వచ్చేసింది. గత వారం రోజులు నుండి చేస్తున్న హడావుడికి కాస్త తెర దిగింది. ఇక ఇవాంక ట్రంప్ వస్తున్నందుకు గాను హైదరాబాద్ ను అందంగా ముస్తాబు చేశారు. బెగ్గర్స్ ఫ్రీ చేశారు.. ఎక్కడా దోమలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఎక్కడిక్కడ రోడ్లని శుభ్రంగా.. చిన్న కాగితం ముక్క కూడా లేకుండా చేశారు. ఇది కూడా ఇవాంక ట్రంప్ ఎక్కడ పర్యటిస్తుందో అక్కడ మాత్రమే లెండి. ఇక భారీ ఎత్తున ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.. ఎన్నో జాగ్రత్తలు చేశారు. ఇక ఇవాంకాకు డిన్నర్ ఫలక్ నామా ప్యాలెస్ లో ఏర్పాటు చేశారు. ఇక ఆమెకు ఇవ్వాల్సిన బహుమతులు కూడా కేసీఆర్ దగ్గరుండి మరి సెలెక్ట్ చేశారు. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఇప్పుడు ఇవాంకాకు స్వచ్ఛమైన గాలిని ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. దీనికి  చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలకు వార్నింగ్ కూడా ఇచ్చారట. వారం రోజుల పాటు పరిశ్రమలపై ఆంక్షలు విధించారు. హద్దూపద్దు లేకుండా పొగ వదిలితే కఠినమైన చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు పరిశ్రమల యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాలుష్య నియంత్రణ మండలి పరిశ్రమలపై ప్రత్యేకంగా నిఘా పెట్టినట్లు సమాచారం. ఐడిఎ బొల్లారం పారిశ్రామికవాడ నుంచి పొగ వెలువడకుండా చూసే బాధ్యతను కాలుష్య నియంత్రణ మండలి భుజాన వేసుకుంది.   అంటే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే... ఇవాంక వచ్చిందని మన ప్రభుత్వ పెద్దలు అంత జాగ్రత్తగా.. గాలి కూడా స్వచ్చంగా ఇవ్వాలని చూస్తున్నారు. మరి ఎన్నో ఏళ్ల నుండి ఆ పొగలోనే బ్రతుకుతున్న సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో.. కనీసం ఒక్కసారైనా ఆలోచించలేకపోయారు. ఏనాడు వారి సమస్యను పట్టించుకొని.. తగిన చర్యలు తీసుకోవడానికి చేతులు రాలేదు కానీ.. ఇప్పుడు ఇవాంక వస్తున్నందుకు గాను... ఏకంగా వారం రోజుల నుండి పొగ అనేది రాకుండా పరిశ్రమలకు వార్నింగులు ఇచ్చారు. ఆమె అమెరికా అధ్యక్షుడు కూతురు కనుక.. మనకు అమెరికాతో చాలా అవసరం ఉంది కనుక.. ఇవ్వడంలో తప్పులేదు. కానీ వాళ్లు మాత్రమే మనుషులు.. ఇక్కడ ఉన్నవాళ్లు మనుషులు కాదా వారి దృష్టిలో.  అంటే నగరం శుభ్రంగా ఉండాలంటే బయట దేశాల నుండి ఎవరైనా రావాలా..వాళ్లు వచ్చినప్పుడే ఓట్లు కావాలంటే మాత్రం ప్రజలు కావాలి... కానీ.. ఇలాంటి విషయాల్లో మాత్రం ప్రజలు పనికిరారు. ఈ ప్రభుత్వ విధానాలు ఎప్పుడు మారతాయో మరి..

మెట్రోలో టిక్కెట్లు ఎలా కొనాలి..? ఎలా ఎక్కాలి

  ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో రైలు మరికొద్ది గంటల్లో కూత పెట్టనుంది. మెట్రో ఎప్పుడు పూర్తవుతుందా..? ఎప్పుడెప్పుడు ఎక్కుదామా..? అని సగటు హైదరాబాదీ ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. అయతే సాధారణ రైల్వే స్టేషన్లలో లాగా మెట్రో స్టేషన్‌లో ఎలా పడితే అలా ప్రవర్తిస్తే కుదరదు.. ఇక్కడ కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఎల్ అండ్ టీ సంస్థ ప్రయాణీకుల అవగాహన కోసం యూజర్ గైడ్‌ను రిలీజ్ చేసింది. ప్యాసెంజర్స్ వీటిని ఫాలో అవుతూ సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేరుకోవచ్చని ఎల్‌అండ్‌టీ అధికారులు తెలిపారు. * ప్రతి మెట్రో స్టేషన్‌కు రోడ్డు లెవల్‌లో ఎలివేటర్లు, లిఫ్టులు, మెట్లు, ఎస్కలేటర్లుంటాయి. * ఎస్కలేటర్ ఎక్కిన తర్వాత దానికి ఎడమవైపే నిలబడాలి. * రెండవ అంతస్థు మధ్య భాగంలో టికెట్లు/టోకెన్లను కొనుగోలు చేయాలి * టికెట్ ఆఫీస్ మెషిన్ ద్వారా కూడా టికెట్లు/టోకెన్లను కొనుగోలు చేయవచ్చు * టికెట్లు, టోకెన్లు గోల లేకుండా స్మార్ట్‌కార్డ్ కొనుగోలు చేయడం బెస్ట్ ఛాయిస్ * ఫ్లాట్ ఫాం మీదకు వెళ్లే సమయంలోనూ.. ఎగ్జిట్ గేట్ గుండా బయటికి వెళ్లే సమయంలోనూ మీ వద్దనున్న స్మార్ట్‌కార్డ్, టికెట్,   టోకెన్‌ అక్కడి గేట్‌కి టచ్ చేస్తేనే డోర్స్ ఓపెన్ అవుతాయి. * మెట్రోలో పది కేజీల లగేజీని మాత్రమే అనుమతిస్తారు. * ప్రతి స్టేషన్‌లో ఎక్స్‌రే బ్యాగేజ్ స్కానర్, డీఎఫ్ఎండీ డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్‌ల వద్ద చెకింగ్ చేయించాలి. * ఆ బ్యాగులు కూడా 60 సెం.మీ పొడవు, 45 సెం.మీ వెడల్పు, 25 సెం.మీ ఎత్తున్న బ్యాగులనే వినియోగించాలి. * ఫ్లాట్‌ఫామ్‌పై పసుపు రంగు గీతకు వెనకాలే నిలబడి రైలు కోసం వేచి చూడాలి. * టికెట్ కొనుగోలు చేసిన 29 నిమిషాల్లోగా ఫ్లాట్‌ఫామ్ పైకి చేరుకోవాలి. అరగంట దాటితే మరో టికెట్‌ను కొనుగోలు చేయాలి.

నేను కొట్టలేదండి బాబోయ్...

చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొని ఏం లాభం.. ఇప్పుడు కమల్ హాసన్ పరిస్థితి అలానే ఉంది మరీ. వివాదాలకు కాస్త దూరంగా ఉండే కమల్.. తాను ఎప్పుడైతే రాజకీయాల్లోకి వస్తున్నా అని ప్రకటించాడో కానీ... అప్పటినుండి కావాలని వివాదాల్లో తల దూరుస్తున్నట్టు కనిపిస్తోంది. బీజేపీ కి వ్యతిరేకంగా విమర్శలు చేయడం.. పార్టీ పైన చేస్తే చేయోచ్చు.. ఏకంగా హిందుత్వంపై కామెంట్లు చేసి పెద్ద రచ్చ చేశాడు. ఆ తరువాత ఏదో ఒక అంశంపై స్పందిస్తూ విమర్శిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు.   అదేంటంటే.. ఇటీవల కమల్ ఓ పబ్లిక్ ఈవెంట్ కు వెళ్లాడు. అయితే సాధారణంగా తమ అభిమాన హీరో వస్తే అభిమానులు అత్యుత్సాహం చూపిస్తారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. ఓ అభిమాని కమల్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. సెక్యూరిటీ అతన్ని అడ్డుకున్నా... ఆ అభిమాని మాత్రం కమల్‌ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో.. ఆగ్రహంతో కమల్ ఒక్కసారిగా అభిమాని చేయి తీసి  కొట్టినంత పని చేశాడు. అంతే ఇక ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. కమల్ ను బద్నాం చేసేస్తున్నారు కొంతమంది. అభిమానులను కమల్‌ కొట్టడంపై కొందరు తీవ్ర స్థాయిలో ఆగ్రహంను వ్యక్తం చేస్తున్నారు. అభిమానంతో దగ్గరకు వచ్చిన వ్యక్తిని అలాగేనా కొట్టేది అంటూ సోషల్‌ మీడియాలో జనాలు కమల్‌ను ప్రశ్నిస్తున్నారు. ఇక దీనిపై స్పందించిన కమల్ తాను అతడిని కొట్టలేదు అంటూ చెప్పుకొస్తున్నాడు. అతడు తన కాళ్లపై పడేందుకు ప్రయత్నించాడు అని, అందుకే అతడిని వద్దని వారించాను తప్ప, అతడిపై చేయి చేసుకోలేదు అంటూ ఏదో కవరింగ్ ఇస్తున్నాడు కానీ... వీడియోలో ఉన్న ఎక్స్ ప్రెషన్స్ చూస్తుంటే మాత్రం అలా లేదని అందరికీ అర్ధమవుతుంది. మొత్తానికి కమల్ రాజకీయాల్లోకి రాకముందే ఇలా ఉంటే వచ్చిన తరువాత ఇంకెలా ఉంటుందో...

మెట్రో రైలు ఎక్కబోతున్నారా..? ఈ జాగ్రత్తలు పాటించండి..!!

  హైదరాబాద్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న మెట్రో ప్రారంభానికి కొద్ది గంటలే మిగిలి ఉంది.. ఈ నేపథ్యంలో మెట్రో ఎక్కి నగర అందాలను తిలకించాలని చిన్నా పెద్దా అందరు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే మామూలు రైల్వే స్టేషన్‌లో వలే మెట్రోలో ప్రయాణించాలంటే కుదరదు.. ఇక్కడ ఒళ్లు దగ్గర పెట్టుకొని నడుచుకోకపోతే తాట తీస్తారు. ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియమ నిబంధనలను హైదరాబాద్ మెట్రో కార్పోరేషన్ విడుదల చేసింది. వీటిని ఉల్లంఘిస్తే శిక్షలు కఠినంగా ఉంటాయి.. ప్రయాణికుల అవగాహన కోసం ఈ నియమ నిబంధనల జాబితాను ప్రతి మెట్రో స్టేషన్‌లోనూ తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ భాషల్లో నోటీసు బోర్డులో ఏర్పాటు చేశారు. మెట్రో రైళ్లు, స్టేషన్‌లలో ఎటువంటి అతిక్రమణలకు పాల్పడిన వారిపై మెట్రో రైలు చట్టం - 2002 ప్రకారం జరిమానాతో పాటు గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఒక్కో మెట్రో రైలులోని మూడు కార్లలో ఒకేసారి 974 మంది ప్రయాణించే వీలుంది. ఇందులో 126 మంది కూర్చొని, 848 నిలబడి ప్రయాణించడానికి వీలుగా రూపొందించారు. మెట్రో స్టేషన్‌, బోగీల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: * స్టేషన్ లోకి వెళ్లే సమయంలో తనిఖీ సిబ్బందికి, భద్రతా సిబ్బందికి సహకరించాలి * టికెట్ లేకుండా ప్రయాణిస్తే కఠిన చర్యలు ఉంటాయి * టికెట్ కౌంటర్, ఆటోమెటిక్ ఫెయిర్ కలెక్షన్ గేట్ల వద్ద మీ వంతు వచ్చే వరకు క్యూలైన్ లో నిలబడాలి * మెట్లు, ఎస్కలేటర్లపై జాగ్రత్తగా వెళ్లాలి * రైలు ప్లాట్ ఫామ్ పై నిలిచిన తర్వాతే బోగీలోకి ప్రవేశించాలి * ఏదైనా సహాయం కావాలనుకుంటే కస్టమర్ సర్వీస్ లేదా స్టేషన్ సిబ్బందిని సంప్రదించాలి * మెట్రో సిబ్బంది, స్టేషన్ స్టాఫ్, తోటి ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి * బోగీలో హ్యాండ్ రైల్ ను పట్టుకుని నిలబడాలి * చిన్నారులు, వికలాంగులు, సీనియర్ సిటిజెన్స్, మహిళలు సీట్లలో కూర్చునేందుకు సహకరించాలి * నిషిద్ధ వస్తువులు, పేలుడు పదార్థాలను గుర్తిస్తే… వెంటనే మెట్రో సిబ్బందికి తెలియజేయాలి * ప్రయాణిస్తున్న సమయంలో టోకెన్లు, స్మార్ట్ కార్డులు చూపించాలని మెట్రో సిబ్బంది అడిగితే వారికి సహకరించాలి * రైల్లోకి ప్రవేశించిన తర్వాత ఫొటోలు తీయరాదు * రైళ్లలో ఆహారం, తినుబండారాలు తీసుకోకూడదు * పెంపుడు జంతువులను తీసుకెళ్లకూడదు * రైలు కోసం ప్లాట్ ఫామ్ పై పరుగెత్తరాదు * స్టేషన్ పరిసరాలు, బోగీల్లో ఉమ్మి వేయడం, ధూమపానం చేయడం, పాన్ నమలడం చేయరాదు. ఆల్కహాల్ సేవించరాదు. * చిన్నారులను స్టేషన్ పరిసరాల్లో, ప్లాట్ ఫామ్ పై వద‌ల‌డం లాంటివి చేయ‌రాదు. * మెట్రో స్టేషన్ పరిసరాల్లో వీధి వ్యాపారాలు నిషేధం * బోగీలకు నోటీసులు అంటించరాదు * తమ స్మార్ట్ కార్డును లేదా టోకెన్ ను ఇతర ప్రయాణికులతో పంచుకోరాదు * బోగీ డోర్లు తెరుచుకునే లేదా మూసుకునే సమయంలో వాటి మధ్య నిల్చోరాదు

రోజక్కా ఈ పాదయాత్రలు అవసరమా...!

  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఏదో పాపం కోర్టు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వకపోయినా.. వారంలో ఒకరోజు హైదరాబాద్ వచ్చి కోర్టుకు హాజరై.. మళ్లీ పాదయాత్ర ఎక్కడ ఆపామో.. అక్కడికి వెళ్లి.. మళ్లీ పాదయాత్ర మొదలు పెడుతూ నానా కష్టాలు పడుతున్నాడు. ఇక పాదయాత్ర కోసం ఏకంగా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్న మహానుభావుడు. మళ్లీ దానికి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిరసన అని పేరు ఒకటి. ఇక పాదయాత్ర మొదలు పెట్టిన రోజే ప్యారడైజ్ పేపర్ల గొడవ.. రెండు రోజే నడుముకి బెల్ట్..ఇక ఇప్పుడు తాజాగా ఈడీ షాక్.. ఇవన్నీ కావనట్టు పార్టీ నేతల జంపింగ్లు. ఇన్ని తలకాయనొప్పులు ఉన్నా.. ఏదో నవ్వుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ పోతున్నాడు. దీనివల్ల జగన్ కు ఒరిగేది ఏముందో తెలియదు కానీ..పాదయాత్ర చేసుకుంటూ పోతున్నాడు.   ఇక్కడి వరకూ బాగానే అసలు జగన్ పాదయాత్రే చాలా కష్టంగా జరుగుతుంది. ఇప్పుడు వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకున్న రోజా కూడా పాదయాత్ర చేస్తా అని ముందుకు వస్తుంది. ఈ నెల 28వ తేదీ నుంచి రోజా పాదయాత్ర ప్రారంభం కానుంది. గాలేరు-నగరి ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనకు గాను ఆమె  ఈ పాదయాత్ర చేస్తున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. నగరి నుండి తిరుమల కొండ వరకు 88 కిలోమీటర్లు.. రోజా పాదయాత్ర నిర్వహించనున్నారుట. ఈ పాదయాత్ర నాలుగు రోజుల పాటు జరుగుతుందట. మరి ఇప్పటికే తన నోటి దూల వల్ల జగన్ కు సమస్యలు తెచ్చిపెట్టిన రోజా.. పాదయాత్ర అంటూ బయలుదేరింది. ఇప్పుడు ఈ పాదయాత్ర వల్ల ఏం సమస్యలు తెచ్చిపెడుతుంటే. మరి ఎన్ని పాదయాత్రలు చేస్తే ఏం లాభం.. నోరు కంట్రోల్ లో లేకపోతే.. ఈ  విషయం అటు జగన్.. ఆయన చెల్లిగా చెప్పుకునే రోజా ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో..