సమైక్యాంధ్ర నినాదాన్ని నిద్రలేపిందెవరు?
posted on Sep 4, 2012 @ 4:34PM
గత మూడు సంవత్సరాలుగా సమైఖ్యాంద్ర ఉద్యమం యాక్జివ్గా లేదని అందరికీ తెలుసు అయితే గత కొద్ది దినాల ముందు సమైఖ్యాంద్ర ఆచార్య నాగార్జున యూనివర్సీటీలో ఒకేసారి నిద్రలేచి సమైఖ్యాంద్ర నినాదాన్ని ప్రజల్లోకి తీసుకు వచ్చింది. ఇంత హఠాత్తుగా సమైఖ్యాంద్ర నినాదం చేయాటానికి కారణం ఏమైందా అని లోతుగా వెళితే నిజాలు బయటకు వచ్చాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణవాదులు పార్లమెంటులో నినాదాలు ఇవ్వటం తెలిసిందే. దానికి తగ్గట్టే ఉప ఎన్నికల తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రత్యేక ప్రతిపత్తిని ఏర్పాటు చేయాలని, లేదా ప్రజలు నాయకులు అంతటితో సంతృప్తి చెందకపోతే ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించుకుంది.
ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు ఢిల్లీకెళ్లి ప్రత్యేక ఆంధ్ర నినాదాన్ని మళ్లీ పైకితీసుకొచ్చారు. కేంద్రం తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా ఉందన్న అర్థంవచ్చే మాటలతో తెలంగామ వాదులకు ఇష్టమయ్యేట్టు మాట్లాడిన ఆజాద్.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీల చెవినకూడా పడేశారు. వెంటనే స్పందించిన సీమాంధ్ర ఎంపీలు కావూరి ఇంట్లో మంతనాలు జరిపి తెలంగాణకు ప్రత్యేక ప్రతిపత్తి, లేక ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే తమకేమీ అభ్యంతరం లేదని, అలా కాక ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలనుకుంటే మాత్రం కుదరదని ఓ తీర్మానం చేశారు. విషయాన్ని నాగార్జుల యూనివర్సిటీలో విద్యార్ధి సంఘాలకుకూడా చేరేశారు. అది అలా.. అలా.. అలా.. మొత్తం పాకిపోయింది. సమైక్యాంధ్ర నినాదం మళ్లీ విస్తృతంగా ప్రచారంలోకొచ్చేసింది.