విద్యార్దుల జీవితాలు బుగ్గిపాలు చేస్తున్న కిరణ్ సర్కార్
posted on Sep 4, 2012 @ 4:39PM
రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏ విషయంలోనైనా పరిజ్ఞానం తక్కువే అని రాష్ట్ర ప్రజలందరూ గుర్తించారు. అయితే ఆకస్మిక నిర్ణయాలతో విద్యార్దుల జీవితాలతో ఆడుకుంటారని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఇంజనీరింగ్ విద్యార్ధులతో ఆయన ఆడిన ఆటలవల్ల వారి విద్యాజీవితం నిర్వీర్యం అయ్యింది. ఒకే సారి ఫీజలు పెరుగుతాయని తెలియని తల్లి దండ్రులూ, విద్యార్ధులూ హతాశులౌతున్నారు. పది రోజుల క్రితం వరకు 44 వేలుగా ఫీజు నిర్ణయించాలని గొడవ చేసిన కాలేజీ ఒక్కసారిగా లక్షా ఐదువేల ఫీజును నిర్ణయించుకోవడానికి కారణం ఏమిటన్నది ఎవరికీ తెలియటం లేదు. ఎందుకంత మొత్తాన్ని విద్యార్దులు చెల్లించాలి ఏ ప్రాతిపదికన ఫీజులు 68 కాలేజీలు పెంచాయో ప్రభుత్వం విద్యార్దులకు తెలియచేయాలి. కేవలం అఫడవిట్లు పొందుపరచినందువల్ల మాత్రమే అంత ఫీజుకు ఎలా ఒప్పుకున్నారు మార్కులు తెచ్చుకున్న మద్యతరగతి విద్యార్దుల పరిస్థితి ఏమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
ఫీజులను నిర్ణయించడానికి ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలకు ఉన్న ఆర్హతను ప్రభుత్వం ఎందుకు పరీక్షించడంలేదని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించడానికి ప్రభుత్వానికి ఎంత భారం అవుతుందో తల్లిదండ్రులకు కూడా అంతే భారం అని ముఖ్యమంత్రిగారికి తెలియదా ? రాష్ట్రంలో పేరెన్నికగన్న కాలేజీల్లో చదువు మద్యతరగతి ప్రజలకు ఏ మాత్రం అందుబాటులో ఉండదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. మెరిట్విద్యార్ధులకు ఇక ఈ రాష్ట్రంలో చదువు కొససాగటం ప్రహసనమేనా. ముందు ముందు విషయాలు తెలియని విద్యార్దులు మంచి ర్యాంకులు తెచ్చుకుని ఎంతో ఆతృతతో మంచి కళాశాలల్లో చేరాలన్నా గత మూడు నెలలనుండి రాష్ట్ర ప్రభుత్వ సా....గ దీత కార్యక్రమాల ద్వారా సమస్యను జఠిలం చేసింది.
ఫీజు రీఎంబర్స్ మెంట్ ద్వారా చదువుకునే విద్యార్ధులకు ఇప్పుడు తెచ్చిన ప్రతిపాదనలతో ఏం చెయ్యాలో పాలు పోవడం లేదు. ప్రభుత్వం ముందుగా ఫీజులు పెరిగే విషయం పైన కాని పెరిగిన ఫీజులను విద్యార్ధులే కట్టుకోవల్సి వస్తుందని గాని ముందుగా తెలియచేయలేదు. ఫీజుల భారం పెరిగేటట్లయితే ముందుగానే విద్యార్ది తల్లితండ్రులకు ఆ విషయాన్ని తెలియచేస్తే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకుంటానికి లేదా వేరే ఏదైనా డిగ్రీలో చేరేందుకైనా వీలుండేది.ముందు చూపులేని మంత్రి వర్గంతో విద్యార్ధులు సమిధలవుతున్నారు. ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏకీకృత ఫీజు నిర్ణయించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది.