ఓఎన్జీసీని అమ్మేస్తారా?
posted on Sep 4, 2012 @ 4:03PM
ఒకప్పుడు గ్యాస్ ఉత్పాదక రంగంలో ఓఎన్ జీసీ నెంబర్ వన్. ఈ సంస్థ చేసిన పరిశోధనలన్నీ పూర్తిగా విజయం సాధించాయ్. కృష్ణా, గోదావరి డెల్టా బేసిన్ లో చమురు, గ్యాస్ నిక్షేపాల్ని మొట్టమొదటగా కనుక్కున్న ఈ సంస్థని పాలకులు, పై స్థాయి అధికారులు ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసేశారు. రిలయన్స్ లాంటి ప్రైవేట్ సంస్థలకు మేళ్లు చేసేందుకే ఓఎన్ జీసీని దెబ్బతీశారన్న విషయం సామాన్యులకు కూడా స్పష్టంగా తెలిసిన విషయమే. కాకినాడ తీరంలో బైటపడ్డ గ్యాస్ నిక్షేపాల్ని వెలికితీసే బాధ్యతల్ని చంద్రబాబు హయాంలో రిలయెన్స్ కి కట్టబెట్టారు. అప్పటికి మంచి ఫామ్ లో ఉన్న ఓఎన్ జీసీని కావాలనే పక్కనపెట్టారు.
ఒకప్పుడు గ్యాస్ ఉత్పాదక రంగంలో ఓఎన్ జీసీ నెంబర్ వన్. ఈ సంస్థ చేసిన పరిశోధనలన్నీ పూర్తిగా విజయం సాధించాయ్. కృష్ణా, గోదావరి డెల్టా బేసిన్ లో చమురు, గ్యాస్ నిక్షేపాల్ని మొట్టమొదటగా కనుక్కున్న ఈ సంస్థని పాలకులురిలయెన్స్ సంస్థకి, గుజరాత్ పెట్రోలియం అండ్ ఆయిల్ కంపెనీకీ పూర్తిగా అప్పజెప్పేసి రాష్ట్రానికి కనీస వాటాకూడా లేకుండా కేంద్రం అన్యాయం చేసింది. తర్వాత వై.ఎస్ హయాంలోకూడా ఇదే తీరు కొనసాగింది. ఇప్పుడు ఓఎన్ జీసీ పూర్తిగా నష్టాల్లో నడుస్తోందంటూ
కాగ్ తో లెక్కలు కట్టించింది కేంద్ర ప్రభుత్వం. మెల్లగా ఈ సాకుతో దాన్ని అమ్మిపారేసి, మొత్తంగా గంపగుత్తగా వనరుల్ని ప్రైవేట్ పరం చేసేందుకే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విశ్లేషకుల అంచనా. భారీ లాభాల్లో ఉన్న సంస్థను బరువుగా మారిపోయిందనిపించే స్థితికి తీసుకురాగలిగిన ఘనత మన ప్రభుత్వాలకు మాత్రమే ఉంటుంది మరి.