బాలీవుడ్ బామ్మ జోహ్రా.. నీకు జోహార్!
posted on Jul 11, 2014 @ 12:52PM
బాలీవుడ్ ప్రముఖ నటి జోహ్రా సెహగల్ (102) ఇకలేరు. జోహ్రా సెహగల్ గత కొంత కాలంగా హృదయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. గురువారం సాయంత్రం గుండెపోటు రావడంతో వెంటనే ఢిల్లీలోని మాక్స్ హాస్పటల్‌కు తరలించారు. అక్కడ వైద్య సేవలు పొందుతూ గురువారం సాయంత్రం జోహ్రా కన్నుమూశారు. జోహ్రాకి భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సహా పలువురు జోహార్లంటూ నివాళులు అర్పించారు. జోహ్రా సెహగల్ 1912లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహరన్ పూర్‌లో జన్మించారు. ఆమె 1946లో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె ప్రముఖ నటిగా పేరొందారు. 1998లో ఆమెను భారత ప్రభుత్వం పద్మశ్రీ, 2010లో పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించారు. జోహ్రాకి ఇంకా అమితాబ్ బచ్చన్, మాధుర్ బండార్కర్ తదితర సినీ ప్రముఖులు, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తదితరులు జోహ్రాకు నివాళులు అర్పించారు. బాలీవుడ్లో వచ్చి భాజి ఆన్ ది బీచ్ (1992), హమ్ దిల్ దే చుక్కే సనమ్, బెడ్ ఇట్ లైక్ బెక్ హామ్ (2002), దిల్ సే (1998), చీని కమ్ (2007) చిత్రాల్లో జోహ్రా సెహగల్ నటించారు