"జికా వైరస్" పై ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ ఎమర్జన్సీ
posted on Feb 2, 2016 @ 3:48PM
లాటిన్ అమెరికా దేశాల్లోని ప్రజలకు జికా వైరస్ ఈ మధ్య కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. బ్రెజిల్ నుండి.. అమెరికా దేశాలకు వ్యాపించిన ఈ వైరస్ ను అరికట్టడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నా అవి మాత్రం విఫలమవుతున్నాయి. ముఖ్యంగా ఈ వైరస్ వల్ల గర్భిణీ స్త్రీలకు ఎక్కువ సమస్యలు వస్తున్న నేపథ్యంలోనే ఆదేశాల్లో 2018 వరకూ గర్భదారణ దాల్చవద్దని.. ఆదేశాలు కూడా జారీచేసింది. ఇప్పుడు ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రమాదం ఉందని.. చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూ హెచ్ వో) కీలక సమావేశం నిర్వహించి.. ముందే మేల్కొని దీనికి తగిన చర్యలు తీసుకోవడానికి హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించింది. వైరస్ కు టీకాను కనిపెట్టే దిశగా పలుదేశాలకు చెందిన శాస్త్రవేత్తలు చర్చలు జరపనున్నారు.