జకీర్ నాయక్ తలకి రూ. 15 లక్షలు
posted on Jul 13, 2016 @ 3:19PM
ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ కు మహారాష్ట్ర స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ (ఎస్ఐడీ) క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినా కూడా ఆయనపై ఇంకా విమర్శలు తగ్గినట్టు కనిపించడంలేదు. ఏకంగా ఆయన తలకి రూ. 15 లక్షల రూపాయలను ప్రకటించారు. జకీర్ నాయక్ ఒక కల్ నాయక్ అని.. ఇస్లాం ప్రవక్తను ఆయన అవమానించారు. ఆయనను (జకీర్) చంపిన వారికి 15 లక్షల రివార్డు ఇస్తాం' అని 'హుస్సైని టైగర్స్' నేత సైయద్ కల్బె హుస్సైని నఖ్వి ప్రకటించారు.
కాగా ‘పీస్ టీవీ’లో ప్రసారమైన ఆయన ప్రసంగాలను పరిశీలించిన ఎస్ఐడీ అధికారులకు జకీర్ నాయక్ వివాదాస్పద ప్రసంగాలు చేసినట్లు ఎక్కడా చిన్న ఆధారం కూడా దొరలేదని.. ఈ నేపథ్యంలో భారత్ కు తిరిగివచ్చాక కూడా ఆయనను అరెస్ట్ చేసే ఉద్దేశమేదీ లేదని కూడా ఎస్ఐడీ అధికారులు వెల్లిడించారు.
ఇదిలా ఉండగా ఈనెల 1న ఢాకాలోని రెస్టారెంట్‌పై దాడికి పాల్పడి 22 మందిని ఊచకోతకోసిన కొందరు మిలిటెంట్లు..జకీర్ ప్రసంగాల ప్రేరణతోనే తాము ఈ దాడులకు పాల్పడినట్టు చెప్పడంతో జకీర్ చుట్టూ వివాదాలు కమ్ముకున్నాయి.