వైకాపా రైల్ రోకో!
posted on Oct 26, 2013 @ 3:02PM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా రైల్ రోకో కార్యక్రమాన్ని నిర్వహించింది. పాపం వైకాపావాళ్ళు హైదరాబాద్‌లో సమైక్య శంఖారావ సభ చేసుకునే హడావిడిలో వుంటే రైల్ రోకో కార్యక్రమం ఎప్పుడు నిర్వహించారా అనే డౌటొస్తోంది కదూ? వైకాపా ప్రత్యక్షంగా కాదు.. పరోక్షంగా రైల్ రోకో కార్యక్రమం నిర్వహించింది. అదెలాగంటే, సమైక్య శంఖారావ సభలో పాల్గొనే కార్యకర్తల కోసం వైకాపా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 18 ప్రత్యేక రైళ్ళు ఏర్పాటు చేసింది. ఈ పద్దెనిమిది రైళ్ళు హైదరాబాద్‌కి శనివారం ఉదయానికల్లా చేరాలి కదా. అందుకోసం రైల్వేశాఖ హైదరాబాద్ రూట్లో నడిచే మిగతా రైళ్ళకి రెడ్ సిగ్నల్ వేసి వైకాపా బుక్ చేసుకున్న స్పెషల్ రైళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. రైల్వేశాఖ ఔదార్యం పుణ్యమా అని వైకాపా రైళ్ళు అనుకున్న టైమ్‌కి హైదరాబాద్‌కి చేరుకున్నాయి. మిగతా రైళ్ళు మాత్రం లేటుమీద లేటైపోయ్యాయట.