ప్రభుత్వ భవనాలపై రంగుపడుతూనే వుంది!
posted on Apr 22, 2020 @ 1:25PM
ప్రపంచం మొత్తం కరోనాతో భయం భయం అంటుంటే ఏపిలో మాత్రం ప్రభుత్వ భవనాలకు రంగులు ఎలా వేయాలని జపం చేస్తున్నారు. కోర్టు చివాట్లు పెట్టిన లెక్క చేయకుండా తమ పని తాము కానిస్తున్నారు.
ప్రభుత్వ భవనాలకు రంగులు వేయవద్దని హైకోర్టు ఆదేశించిన అప్పటికీ దానిని బేఖాతరు చేస్తూ కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా ఎస్.కోట మండలం మూలబొడ్డవర పంచాయతీ భవనానికి వైసిపి నాయకులు, అధికారులు పూర్తిగా వైసిపి రంగులు అద్దారు. దీనిని స్థానికంగా ఉన్న గిరిజునులైన గ్రామస్తులు అడ్డుకోవడంతో రంగులు వేస్తున్న సిబ్బంది వెయ్యకుండానే వెనుతిరిగారు.
గిరిజన గ్రామమైన మూలబొడ్డవరలో గత ప్రభుత్వ హయాంలో 15 లక్షల రూపాయలతో పంచాయతీ భవనం నిర్మాణం జరిగింది. ఆ భవనాన్ని ఆనుకొని సుజల స్రవంతి పథకం ద్వారా 40 లక్షల రూపాయలు ఖర్చు చేశారు.
ఓ వైపు కరోనా తో ప్రపంచం మొత్తం అల్లాడుతుంటే వైసిపి ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ భవనాలకు రంగులు మార్చడం పైనే దృష్టి పెట్టడం స్థానికంగా కలకలం రేపుతుంది.