వైయస్ఆర్‌సిపి గూటికి మరో నేత

 

కాంగ్రెస్‌ పార్టీ నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ ఇష్యూతో చాలా మంది నేతలు ఆ పార్టీకి దూరమవుతుండగా ఇప్పుడు మరో నాయకుడు కూడా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకున్నారు. మంత్రి శైలజానాధ్‌ నియోజక వర్గం లో బలమైన నాయకుడుగా ఉన్న బాలనాగిరెడ్డి ఈ రోజు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బాలనాగిరెడ్డి వెళ్లిపోవటంతో కాంగ్రెస్‌ పార్టీ కి ఆ ప్రాంతంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.