వైఎస్ కుటుంబం ఊగిసలాట
posted on Apr 25, 2023 @ 4:07PM
ప్రస్తుత రాజకీయాలు నాలుగు వ్యవస్థల చుట్టూ తిరుగుతున్నాయి. సుప్రీం కోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు లాంటి న్యాయ వ్యస్థలు, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలలో రాజకీయ వివాదాల పరిష్కారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తి పెద్దది, ప్రతిభామంతమైన రాజకీయ కుటుంబాలలో ఎదురింటి సందించి కుటుంబం ముందు వరుసలో ఉంటుంది.
అలాంటి వైఎస్ కుటుంబం ప్రస్తుతం ఆ వ్యవస్థలు, సంస్థల మధ్య చక్కర్లు కొడుతోంది. వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తూ దోషులను పట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న వాళ్లు సీబీఐకి దొరక్కుండా న్యాయస్థానాల మెట్లు ఎక్కుతున్నారు. హత్యకు గురైన తన తండ్రికి న్యాయం జరగాలంటూ వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టు తలుపు తట్టారు. సునీత సుప్రీం కోర్టుకు వెళ్లడంతో కేసు తిరిగి సీబీఐ చేతికి చిక్కింది.
ఆంధ్రప్రదేశ్ నుండి కేసును తెలంగాణకు బదలాయించాలంటూ సునీత చేసి పరాటంతో వివేకా హత్య కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి ఎప్పటికప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయిస్తూనే ఉన్నారు. కాకపోతే ఆయన వాదనలు పై కోర్టుల్లో నిలవడం లేదు.గతంలో జాతీయ స్థాయిలో సంచలనం కలిగించినజగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ 11చార్జిషీట్లను వేసింది. ఆ కేసులలో 16నెలల పాటు జైలు జీవితం గడిపిన జగన్ ఎప్పటికైనా కేసులను ఎదుర్కొనక తప్పదు. ఇదంతా చూస్తుంటే 2009 వరకూ రాజకీయాలను శాసించిన వైఎస్ కుటుంబం, రాజశేఖరరెడ్డి మరణంతో కష్టాల బారిన పడిందనే చెప్పాలి. ఎన్ని సమస్యలున్నా ధైర్యంగా నిలబడి రాజకీయాలు నడిపిన వైఎస్ఆర్ తన తరువాతి తరం ఇలా వివాదాల్లో చిక్కుకుంటుందని ఊహించి ఉండరు. అయితే మితిమీరినరాజకీయ పలుకుబడి, పరిమితులు లేని ఆశ వైఎస్ కుటుంబాన్ని ఈ స్థాయికి చేర్చిందని కడపకు చెందిన రాజకీయ నేతలే అంటున్నారు.
జగన్ అక్రమాస్తుల కేసు, వివేకా హత్య కేసులే కాక ముఖ్యమంత్రిగా జగన్ తీసుకున్ననిర్ణయాలు వైఎస్ కుటుంబ ప్రతిష్టను మసక బారేలా చేశాయని వీరి వాదన. 151 స్థానాల్లో గెలిపించిన ప్రజలకు జగన్ చేసిందేమీ లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ప్రతిరోజూ కూసుల నుంచి బయటకు వచ్చే వ్యూహాలపైనే చర్చిస్తూ బిజీగా ఉండే పాలకులు ప్రజలను ఏం పట్టించుకుంటారనేది ప్రతిపక్ష పార్టీల వాదన. ఏది ఏమైనాజగన్ నుండి, సునీత వరకూ వైఎస్ కుటుంబమంతా నిఘా సంస్థలు, న్యాయస్థానాల మధ్య కాలాన్ని గడపాల్సి రావడం విచారకరం.