మీ ఆహారమే మీ ఔషదం ...
posted on Apr 23, 2022 @ 9:30AM
మీ ఆహారమే మీకు మందు అన్న ఆలోచన ఇప్పుడు పాశ్చాత్య ప్రపంచం లో వస్తున్న నూతన పోకడగా చెప్పవచ్చు.ఈ విధానం వందల సంవత్సరాలుగా సాంస్కృతిక వారసత్వం గా కొనసాగుతోంది.అదిసంస్కృతి సంప్రదాయం లో ఇమిడిపోయింది.ఏది ఏమైనప్పటికీ వ్యాధి నియంత్రణ కు నివారణకు ఆహారం కీలక పాత్ర పోషిస్తుంద? అన్నది నేటికి ప్రస్నార్ధకంగా మిగిలిపోయింది.
ఆహారంలో సమతుల పోషక ఆహారం...
ఆహార నియమ నిబందనలు పాటిస్తేనే ఆహారం మనకు ఔషదంగా పనిచేస్తుందని ప్రముఖ యునాని వైద్యనిపుణులు డాక్టర్ సత్య స్పష్టం చేసారు. ఈమేరకు యునానిలో మేము ఇచ్చే డైటో తెరఫీ తో చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సలు చేసి విజయం సాధించినట్లు తెలిపారు.మనం తీసుకునే ఆహారమే ఆరోగ్యం సంరక్షిస్తుందని దేశంలోని ప్రముఖ ఆస్త్రేలియన్ హెర్బల్ మెడిసిన్ కు చెందిన వైద్యులు డాక్టర్ గుత్త లక్ష్మణ్ రావు స్పష్టం చేసారు. మేము చేసే ఆహార వైద్యం లో మేము ఇచ్చే డైట్ షీట్ తప్పనిసరిగా పాటిస్తే దీర్ఘకాలిక వ్యాధులు. ముఖ్యంగా శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఆహారం ద్వారా వ్యాధిని నయం చేస్తామని అభయం ఇచ్చారు.ఈ అంశం పై లోతైన పరిశోదన చేసిన డాక్టర్ లక్ష్మణ్ రావు తెలుగు వన్ హెల్త్ తో మాట్లాడుతూ సమీకృత ఆహారం తీసుకుంటే ప్రతి యొక్క వ్యక్తి యొక్క ఆరోగ్యం పై ప్రభావం చూపుతుందని దీనిని మేము పూర్తిగా అధ్యయనం చేసామని ఇందుకోసం రోగి పూర్తి చరిత్ర అలవాట్లు సమగ్రంగా తెలుసుకున్నాకే ఆహార నియమాలు అమలు చేస్తామని అన్నారు .మేముసూచించే సమగ్ర ఆహార నియమ నిబందనలు అమలు కు కేవలం రోగులే కాదని కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తామని క్రమపద్దతిలో ఆహార నియమాలు పాటిస్తే ఎటువంటి మొండి దీర్ఘకాలిక రోగానికి వైద్యం చేయవచ్చని అంటారు మేము చేసిన ప్రయోగాలు మంచిఫలి తాలు ఇచ్చాయని అంటారు డాక్టర్ లక్ష్మణ్ రావు గారు.ముఖ్యంగా ఆరోగ్య రంగం పై అవగాహన అంగీకరించక తప్పదని ఎవరైతే వ్యక్తులు సమగ్ర పోషక ఆహారం పై అవగాహన ఉన్నవారిలో చాలా బలమైన రోగ నిరోధక శక్తి కలిగి ఉంటారనేది వాస్తవం.ఇది నిరూపిత మైంది కూడా గర్భదారణ,పిల్లల పుట్టుక,డయాబెటిస్ వల్ల ప్రమాదం తక్కువే కార్డియో వాస్క్యులార్ వ్యాధులు లేకుండా దీర్ఘకాలం పాటు జీవిస్తారని అంటున్నారు ఆస్త్రేలియన్ హెర్బల్ మెడిసిన్ కు చెందిన వైద్యులు డాక్టర్ లక్ష్మణ్ రావు.కొన్ని కారణాల రీత్యా దీనిపై మరింత అవగాహన అవసరమని అంటున్నారు. కొన్ని పరిశోధనలలో మనం తీసుకునే ఆహారం లో ఎక్కువ శాతం కర్బోహైడ్రేడ్స్,చక్కర శాతం,సాచు రేటెడ్ ట్రాన్స్ ఫ్యాట్స్,అధిక సోడియం శాతం ఉంటె దీర్ఘకాలిక ఇంఫ్లామేషణ్ ఉంటె లోలోపల మనకు తెలియకుండా గుండె సంబంధిత సమస్యలు టైప్ 2 డయాబెటిస్ ఇతర దీర్ఘకాలిక వ్యాధులు చిన్నపేగులు,పెద్ద పేగులసమస్యలు వచ్చే అవకాశం ఉంది.ఈ క్రమం లో భాగంగా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రథిఒక్కరి జీవితం లో సమగ్ర ఆహారం అవసరమని,జీవన శైలిలో మార్పులు అవసరమని ఆహారం లో పండ్లు కూరగాయలు పప్పు దినుసులు, ధాన్యాలు,ఆకుకూరలు,తక్కువ కొవ్వు ఉండే పదార్ధాలు,పాలఉత్పత్తులు,హెర్బల్ మెడిసిన్ అందించే జంతువుల ద్వారా ప్రోటీన్ కార్డియో వ్యాస్క్యులర్ సమస్యలకు సహకరిస్తుంది.నిపుణుల ఆలోచన ప్రకారం ఆహారం తోనే సమగ్ర ఆరోగ్యంఅని నిపుణులు సూచిస్తున్నారు.సమగ్ర ఆహారంతో కార్డియో వ్యాస్కులర్ వ్యాధులను నిలువరించవచ్చనికొలస్ట్రాల్,ఇంఫ్లామేషన్, బి పి ని పెంచే ఆహారం లేదా నిద్రలేమి వల్ల మరిన్ని అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు అభిప్రాయ పడ్డారు.డబ్ల్యు హెచ్ ఓ ఒకప్రకటన లో సమతుల పోషక ఆహారం తోనే సమగ్ర ఆరోగ్యం,ఇమ్యునిటీ రోగనిరోదక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు.మరిన్ని పరిశోదన లలో యాంటి ఆక్సిడెంట్ వంటివి అంటే కూరగాయలు,పండ్లద్వారా లభిస్తాయని దీనివల్ల రక్తంలో మెటబాలిజం లేకుండా ఉండడం వల్ల లివర్ సమస్యల తో బాధ పడేవారు కొన్ని వందల సంవత్సరాలుగా సమగ్ర ఆరోగ్య విధానాన్ని కి ఆహారం అందించడం ద్వారా ఆరోగ్యం సజావుగా సాగే విధంగా నిర్వహించడం మరింత సులభం.2౦2౦ -2౦25 ఆహార నిబంధనల ప్రకారం సమగ్ర సమతుల ఆహారం తోనే ఆరోగ్యం సాధ్యం అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ఆహారంలో పోషక ఆహారం,పళ్ళ రసాలు ఇందులో పళ్ళు,కూరగాయలు ధాన్యాలు,పప్పుదిన్సులు కొవ్వు లేని పాల ఉత్పత్తులు తక్కువ ప్రోటీన్ ఆరోగ్యాన్ని ఇచ్చే ఫ్యాట్స్,నూనెలు ఇందులో ఉన్నయని తేల్చారు.ఇందులో చక్కర,ఉప్పు సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి,మద్యం సేవించడం తగ్గించడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది.
కొన్ని ఆహారాలు...
కొన్ని ఆహారాలు కొన్ని ఆరోగ్య లాభాలు తీసుకువస్తాయి.మెడిటేరియన్ డైట్, ఆహారం బిపి ని తగ్గిస్తుంది. అమెరిక వ్యవసాయ శాఖ హేల్తీ ఈటింగ్ మై ప్లేట్ అన్నవిధనాన్ని అనుసరిస్తోంది.
ఆహారమే ఔషదం...
ఆహారమే మందు ఔషదం గా మారడం వెనుక ఒకసాధన అనుభవం,జ్ఞానం,ద్వారా తెలుసుకున్న విషయం ఆహారం లో కీలక పాత్ర పోషిస్తుందని నివారణ నిర్వహణ అంశాలే కీలక మని డాక్టర్ మురళి ఆచార్య అభిప్రాయ పడ్డారు.ఆహారమే ఔషదం అన్న విషయం లో ఒక నిర్వచనం అంటూ లేదు. అయితే సహజంగా ఆహారానికి సమతుల ఆహారానికి ప్రాధాన్యత కల్పించడమే వ్యక్తుల ఆరోగ్యం లో భాగామే నివారణ,లక్షణాలను తగ్గించడమే లేదా వ్యాధిని రివర్స్ చేయడమే అని అంటారు డాక్టర్ మురళీ ఆచార్య.పెద్దమొత్తం లో ఆకుకూరలు, రకరకాల కూరగాయాలు,పళ్ళు ,రోగ నిరోధక శక్తి నిచ్చే డ్రై ఫ్రూట్స్ తదితరాలు ఆహారంలో వినియోగిమ్చడం లక్ష్యం గా పేర్కొన్నారు.తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం ప్రాసెస్ చేసినప్పుడు కాకుండా చక్కర,ఇతర నూనెల వాడకం తగ్గించడం ముఖ్యమని అంటున్నారుపరిశోదకులు.ప్రత్యేకంగా మైక్రో న్యుట్రీయంట్ బ్లో మలిక్యుల్ ఎక్కువశాతం ప్రజలు ఆహారాన్ని వైద్యంగా అంగీకరించాలి.ఇందులో అధిక మొత్తంలో కొన్ని రకాల మూలికలు ఇతర మసాలా దినుసులు డ్రై ఫ్రూట్స్ ధాన్యాలు,పప్పు దినుసులు పండ్లు,కూర గాయలు,విరివిగా వాడడం అంటే క్రమపద్దతిలో అంటే డాక్టర్ ఇచ్చే డైట్ షీట్ ఆధారంగా క్రమం తప్పకుండా వాడితే అనారోగ్యం రమ్మన్నా రాదు అంటారు నిపుణులు.ఆహారామే ఔషదం లేదా ఆరోగ్య నిర్వహణ వైద్యంగా అంగీకరించడం సాధ్యమా కాదా ?కొన్ని ఏళ్లుగా ప్రాధమిక స్థాయినుంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లో వృద్దిచెందిన వాటితోనే ఆరోగ్యాన్ని నిర్వహించడం వ్యాధికి సరిపడా మందుల పైనే ఆధారపడి ఉన్న మనం దీనిని అంగీకరించగాలమా?ఆహారం ఔషదం విషయం లో పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదు.పాశ్చాత్య దేశాలలో ఆహారం జీవన శైలి లో మార్పులకు మొదటి ప్రాధాన్యత చికిత్స చేస్తే తప్ప దీర్ఘకాలిక వ్యాధులను నివారించాలేము.
ఆహారంలో మైక్రో న్యుట్రీ యంట్ల దృష్టి పెట్టడం వల్ల లాభాలు...
వ్యాధిని సమగ్రంగా గుర్తించాక అంటే నిర్ధారణ చేసిన తరువాత న్యుట్రీ షియన్ తెరఫీ లేదా డైటో తెరఫీ అని కూడా అంటారు. యునాని వైద్యులు దీనిని చాలా మంది వైద్యులు తమ వైద్య ప్రక్రియలో వినియోగించడం గమనార్హం వ్యాధిని నియంత్రించడానికి ఆహారం సహకరిస్తుంది. ఇందులో ఆహారం భోజనం దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు దోహదం చేస్తుంది. వ్యాదిలక్షణా లను తగ్గించి నాణ్యత తో కూడిన జీవితాన్ని జీవించగలరు అని బల్ల గుద్ది మరీ చెపుతున్నారు వైద్యులు.ఒక పరిశోదనలో శరీరంలో అలసట నొప్పులను నివారించేందుకు ఆధునీక రించిన మేరి టెర్రీనియన్ వల్ల సాధ్యమని నిరూపించారు.లింఫో ఎదిమా కింది భాగం లో వాపులు వంటి వాటికి డైటో తెరఫీ పూర్తిగా పనిచేస్తుందని యునాని వైద్యులు అంటునారు.
చవకైన చికిత్స విధానం...
ప్రస్తుతం వైద్య చికిత్స సామాన్యుడికి అందు బాటులో లేవు.చికిత్స,రోగులకు చికిత్స దీర్ఘకాలిక చికిత్సలు ప్రజలు ప్రభుత్వ భాగ స్వామ్యం అవసరమని అప్పుడే ప్రజా ఆరోగ్యం సుభిక్షంగా ఉంటుదని.నిపుణులు అంటున్నారు.ఆధునిక వైద్యం స్థానం లో ప్రత్యామ్నాయ వైద్యం గా మనగాలదా లేదా అన్న అంశం పై శాస్త్రజ్ఞులు పూర్తిగా పరిశోదనలు చేస్తున్నారని అన్నారు.ఆహారం ఔషదం కొంత మేర వైద్య ఖర్చుని తగ్గిస్తుందని వ్యాధి తీవ్రతను సరైన నిర్ధారణ పరీక్షలు చేసి ఆహారాన్ని వైద్యంగా అందిస్తేఆసుపత్రులలో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గించవచ్చని ప్రముఖ హెర్బల్ వైద్యులు డాక్టర్ గుత్త లక్ష్మణ్ రావు గారి నమ్మకం విశ్వాసం.వైద్యఖర్చులు తగ్గాలంటే ఆహారం లో నాణ్యత పెంచాల్సిందే.