వైసీపీ కనుమరుగు ఖాయం.. బాబు సీఎం తథ్యం!
posted on Jun 30, 2023 @ 10:45AM
ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు పాలన కోసం ఎదురు చూస్తున్నారు. సైకో జగన్ పాలనకు చరమ గీతం పాడాలని నిర్ణయించేసుకున్నారు. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం ఘన విజయం సాధిస్తుందన్న సంగతి ఎంత నిజమో.. ఎన్నికల అనంతరం వైసీపీ కనుమరుగు అవ్వడం కూడా అంతే నిజం. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు గురువారం (జూన్ 29) తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోనే కురుపాం నియోజకవర్గ సమస్యలన పరిష్కరిస్తామన్నారు.
రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయన్న శత్రుచర్ల అమ్మ ఒడి కార్యక్రమంపై, ఆ సందర్భంగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం సమస్మలను విస్మరించి సూడో సంక్షేమంతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందన్నారు.
పార్వతీపురం జిల్లాలో గత కొంత కాలంగా ఏనుగుల బెడద తీవ్రంగా ఉన్నా ఆ సమస్య పరిష్కారం దిశగా జగన్ ఏ చర్యా తీసుకోలేదన్నారు. కురుపాంలో అమ్మ ఒడి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ విపక్షాలపై విమర్శలు గుప్పించడానికే పరిమితమయ్యారు తప్ప, నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించలేదని ఎత్తి చూపిన శత్రుచర్ల.. ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయ విమర్శలకే పరిమితమవ్వడం జగన్ లోని ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరిన విషయాన్ని తేటతెల్లం చేస్తోందన్నారు.