తిరుపతిలో చెలరేగిపోతున్న వైసీపీ చోటా నేతలు.. షాపు కాంట్రాక్ట్ కోసం గిరిజన యువకుడిపై దాడి
posted on Aug 7, 2025 @ 11:31AM
అధికారం కోల్పోయినా కూడా వైసీపీ దాష్టికాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట వైపీపీయులు దౌర్జన్యాలు సాగుతూనే ఉన్నాయి. తాజాగా తిరుపతిలో ఓ వైసీపీ చోటా నేత గిరిజన యువకుడిపై దాష్టీకం చేశాడు. తిరుపతి శ్రీనివాసం వసతి గృహం ఎదురుగా ఉన్న షాపు కాంట్రాక్టును తనకు రాసి ఇవ్వాలంటూ వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జ్ ఓ గిరిజన యువకుడిపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు.
అనిల్ రెడ్డి గిరిజన యువకుడు పవన్ ను ఇష్టం వచ్చినట్లు కొడుతుంటూ.. అనిల్ రెడ్డి స్నేహితులు దానిని వీడియోగా తీశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అనిల్ రెడ్డిని అదుపులోనికి తీసుకున్నారు. అయితే అనిల్ రెడ్డి దాడితో భయపడిన బాధితుడు పవన్ అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. బాధితుడు పవన్ ది పులిచర్ల మండలం అని గుర్తించారు. పవన్ పేరుపై ఉన్న కాంటాక్ట్ ను తన పేరు మీద రాసివ్వాలని అనిల్ రెడ్డి ఈ దౌర్జన్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.