వైసిపి ఎమ్మెల్యే ల్లో తీసివేత కలవరం
posted on Sep 12, 2022 @ 10:00AM
పిల్లడు సరిగా చదవకపోయినా, క్లాసులో బాగా అల్లరిచేస్తున్నా భరించలేకపోతే క్లాసులోంచి బయటకి పంపుతారు. టీచర్లు సరిగా పనిచేయకపోతే హెడ్‌మాస్టర్ హెచ్చరిస్తాడు. పనివాడు సరిగా రాకుంటే యజ మాని తీసేస్తాడు. ఏపీలో సీఎం జగన్ తన ఎమ్మెల్యేల విషయంలో ఈ తీసివేత సిద్ధాంతాన్ని అమలు చేయడానికి పూనుకున్నారు. మూడేళ్లు దాటినా ఇంకా విపక్షాలను తిడుతూ శభాష్ అనిపించుకోవడం కాకుండా నిజం గా పనిచేస్తున్నది ఎవరు, ఎవరు మళ్లీ ఎన్నికలకు పనికివస్తారన్న బేరీజు వేసుకుంటే లెక్కలు తికమక పెట్టి గుణకారం కంటే తీసివేతే బాగా నచ్చింది. అందువల్ల వైసీపీ ఎమ్మెల్యేలకు నిద్రా భంగం కలిగింది. ఇక మందలింపులు, బుజ్జగించడాల మాట అటుంచితే పార్టీ టికెట్ దక్కే అవకాశమే చేజా రేట్టుగా మారిం ది. పనితీరు సరిగాలేదన్న మిషతో సీఎం జగన్ చాలామందిని వదిలించేసుకుందా మన్న నిర్ణయానికి వచ్చేశారన్నది విశ్లేషకుల మాట.
మంత్రివర్గం నుంచి ముగ్గురిని తొలగిస్తానని సాక్షాత్తూ సీఎం చేసిన ప్రకటనతోమంత్రుల్లో ఆందోళన మొద లైంది. అది మరువకముందే పనితీరు సరిగా లేని 75కుపైగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మార్పుపై ఆయన దృష్టి సారించినట్లు సమాచారం. ఆర్నెళ్లలోపు శాసనసభ్యుల పనితీరు మెరుగుపడక పోతే మార్పు తథ్య మనే సంకేతాలను సీఎం జగన్ ఇప్పటికే ఇచ్చారు. 2024ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్ ఒంటెత్తు పోకడ తో ముందుకు పోతున్నారు. సామాజిక న్యాయం, సంక్షేమని నాదంపైనే జగన్ ఎక్కువగా ఆశలు పెట్టు కు న్నారు. ఓట్ల కోసం ఇప్పటికే చట్టసభల్లో ఆయా అణగారినవర్గాలకు సీట్లు ఇచ్చారనే ప్రచారముంది.
ఏపీలోవైసీపీ మినహా మిగిలిన ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకివస్తున్న తరుణంలో జగన్ సర్కారులో హడా వుడి, ఆందోళన మొదలైంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తే జగన్ కు గడ్డు పరిస్థితులు వస్తాయనేది ఆ మూడు పార్టీల భావనగా కనిపిస్తోంది. ఇప్పటికే ఒకట్రెండు నియోజకవర్గాల్లో వైసీపీ నేతలకుఅదనపు బాధ్యతల్ని అప్పగించారు. తాడికొండలో వైసీ పీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఉండగా,అక్కడ అదనపు సమన్వయ కర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ను నియమిం చ డం, దీనిపై అక్కడపెద్దరచ్చ జరగడం తెలిసిందే. రాబోయే రోజుల్లో ఈరచ్చ మరింత పెరిగే అవకాశం ఉంది.
జగన్ పాలనావ్యవహారాలు ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగానే మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. అందుకు ఉదాహరణే ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్‌మెంట్ లభించకపోవడం. మూడేళ్ల నుంచి ఆయన్ను కలిసి సమస్యలు చర్చించే అవకాశం ఇవ్వకపోవడంపై శాసనసభ్యులు జగన్ పై అసంతృప్తివ్యక్తం చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల అభివృద్ధి పనులు, సమస్యల్ని అధి నేతకు చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు. ఎక్కడికక్కడే అభివృద్ధి పనులు నిలిచిపోవడంతో రాబోయే ఎన్నికలకు ఎలా ముందుకెళ్లాలనేదీ వారికి దిక్కుతోచడం లేదు. గత ఎన్నికల సమయంలో స్థానికంగా ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు పరిష్కారానికి నోచుకోనందున, వారంతా అసంతృప్తిగా ఉన్నారు. జిల్లాల్లో మంత్రు లు, ఎంపీల ఆధిపత్యపోరుతో అభివృద్ధి కుంటు పడింది. దీని పరిష్కారంలో సమన్వయ కర్తలు విఫలమయ్యారు. సీఎంను నేరుగాకలిసేస్థాయి పట్టుమని పది మందికి కూడా లేదనే విమర్శలు న్నాయి.
ఈ క్రమంలో వైసీపీలో ఎలా సర్దుకుపోవాలన్నది ఎమ్మెల్యేలకు అర్ధం కావడం లేదు. అటు నియోజకవర్గా ల్లోనూ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మధ్యసమన్వయం కొరవడింది. ఎంపీలు, మంత్రులకూవిభేదాలు పొడ చూపుతున్నాయి. మధ్యలో ప్రజలు నలిగి పోతున్నారు. అభివృద్ధిపై జగన్ సర్కారు నిర్లక్ష్యంజగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక, ఈ మూడేళ్లలో కేవలం సంక్షేమం పైనే దృష్టి సారించి, అభివృద్ధిని విస్మ రించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, నీటి పారుదల ప్రాజెక్టులు, పరిశ్రమల నిర్మాణంపైచిన్నచూపు ప్రద ర్శించారు. మరోవైపు, సంక్షేమం అందిస్తున్నామని చెబుతూనే ప్రజలపై విపరీతంగా పన్నుల భారాలు మోపారు. దీనికి తోడు గడపగడపకు అంటూ ప్రజలవద్దకు వెళ్లి తమ పాలన గురించి పథకాల గురించి చెబుతూ ప్రజల అభిప్రాయాలు, ఆదరణ పొందాలన్న ప్రయత్నం ఘోరంగా విఫలమయింది. మంత్రు లు, ఎమ్మెల్యలేలు ఎటు వెళ్లినా ప్రజలు తిరస్కరించి వెనక్కి పంపడం జగన్ సర్కార్‌పట్ల ప్రజల విముఖతనే తెలియజేసింది.
కేంద్రప్రయోజనాల కోసం చట్టసభల్లో ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకూ వైసీపీఎంపీలు మద్దతిచ్చారు. అయినా కేంద్రంనుంచి అదనంగా చిల్లిగవ్వ రాలడం లేదు. ఈ విధానాలతో వైసీపీపై ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయలేకపోయారు. ఆ ప్రాజెక్టు పరిధిలోని బాధితులకు కేంద్రంనుంచి పునరా వాస ప్యాకేజీ సాధనలోనూ జగన్ సర్కారువిఫలమైంది. ఇవన్నీ జగన్కు ప్రతికూలంగా మారాయి. ప్రభు త్వం పై వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించే క్రమంలో, వ్యూహాత్మ కంగా ఎమ్మెల్యే సీట్ల మార్పిడి ప్రచారాన్ని వైసీపీ తెరపైకి తీసుకొస్తూ ప్రజల్లో గందరగోళం నింపుతుం దన్న విమర్శలున్నాయి.