బాధిత కుటుంబాలకు సాయంపై వైసీపీ వికృత రాజకీయం
posted on Jan 21, 2023 5:35AM
ఓ అబద్దాన్ని నిజం చేయాలంటే.. చాలా చాలా చేయాలి. అందుకు చదువు చట్టుబండలు అవసరం లేదు కానీ... కాస్తాంత కపటం, మోసం ఉంటే చాలు. సామిరంగా.. జనాన్ని ఏంటి ప్రతిపక్ష పార్టీలను సైతం రింగ రింగా అంటూ.. అల్లాడించేయచ్చు. స్కూళ్లు, కాలేజీల్లో నేర్పని ఈ విద్య.. అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం బాగానే ఒంట పట్టించుకుంది.
ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కందుకూరులో బాదుడే బాదుడు కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మరణించారు. ఈ సందర్భంగా టీడీపీ, ఆ పార్టీ నేతలతోపాటు ఎన్నారైలు సైతం స్పందించి భారీగా నష్ట పరిహారాన్ని చెక్కులుగా అందించారు. అయితే ఎన్నారై కంచర్ల శ్రీకాంత్ ఇచ్చిన చెక్‌లు బౌన్స్ అయ్యాయంటూ.. మృతుల కుటుంబాలకు నకిలీ చెక్కులు అంటగట్టారంటూ.. వైసీపీ.. సోషల్ మీడియా సాక్షిగా .. తెలుగుదేశం పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తూ.. విషం కక్కుతోంది.
ఈ విషయంపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. అదే సోషల్ మీడియా సాక్షిగా స్పందించారు. నాయకుడు దొంగ పనులు చేస్తే, అనుచరులు వెధవ పనులే చేస్తారు. జగన్ రెడ్డి నోరిప్పితే అబద్దం.. వైసీపీ కార్యకర్తలు చేసేదంతా దుష్ప్రచారం. కందుకూరు మృతుల కుటుంబాలకు ఎన్ఆర్ఐ కంచర్ల శ్రీకాంత్ ఇచ్చిన చెక్కులు క్యాష్ చేసుకున్నాక బౌన్స్ అయ్యాయని జగన్ ఫేక్ గ్యాంగ్ విష ప్రచారం చేస్తోంది. శవాలపైనా, చివరకు మరణించిన వారి కుటుంబాలకు చేసే సాయంపైనా వికృత రాజకీయాలు చేయడం కేవలం వైసీపీకే సాథ్యమంటూ పేర్కొన్నారు. అంతేకాదు.. బాధిత కటుంబాలకు టీడీపీ తరఫున ఇచ్చిన చెక్కు నెంబర్లను సైతం నారా లోకేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ మొత్తం ఎపిసోడ్‌పై నెటిజన్లు.. వైసీపీకి చురకలంటిస్తున్నారు. అధికారం అందుకోవడం కోసం.. విశాఖ ఎయిర్ పోర్ట్ సాక్షిగా కోడి కత్తి డ్రామా నడిపినా.. సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి అత్యంత దారుణంగా హత్యకు గురైనా.. జస్ట్ గుండెపోటుతో ఆయన మరణించారంటూ తొలుత మీడియాకు చెప్పినా... ఈ హత్య కేసు సీబీఐకి అప్పగించినా.. వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారి.. సబీఐ ఎదుట ఈ హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారులు ఎవరెవరో చెప్పినా.. ఈ హత్య కేసు ముందు సాగపోవడం వెనుక ఉన్నది ఎవరనేది ప్రజలందిరికీ తెలిసిందేనని నెటిజన్లు వైసీపీకి చురకలంటిస్తున్నారు. అలాగే విశాఖ ఎయిర్ పోర్ట్‌లో కోడి కత్తి కేసులో పోడిపించినవాడు తాడేపల్లి ప్యాలెస్‌లో సకల భోగాలు అనుభవిస్తున్నాడని... కానీ కోడికత్తితో పోడిచిన వాడు గత నాలుగేళ్లుగా జైల్లో మగ్గిపోతున్నాడని.. నెటిజన్లు అంటున్నారు.
ఈ ఘటనలు గడిచి... నాలుగేళ్లు అయినా.. వీటిపై స్పందించని అధికార వైసీపీ, కందుకూరు ఘటనలో బాధితులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యారంటూ అబద్దపు వార్తలు.. అదే పనిగా ప్రచారం చేయడం ఎంత వరకు సబబు అని నెటిజనులు వైసీపీని నిలదీస్తున్నారు. అధికారం అందుకోవడం కోసమే కాదు.. ఆ వచ్చిన అధికారాన్ని నిలుపుకోవడం కోసం.. ఎన్ని చేయడానికికైనా.. ఎంత చేయడానికైనా.. ఎంతటి విషప్రచారానికైనా.. తెగబడడం జగన్, ఆయన పార్టీ నైజం అన్నట్లుగా పరిస్థితి ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఉన్న అధికారాన్ని నిలుపుకోవడం కోసం.. సమాధులనే పునాదులుగా చేసుకుని.. అధికారాన్ని నిలబెట్టుకోవాలనే నైజం జగన్ పార్టీలో కొట్టోచ్చినట్లుగా కనిపిస్తోందని నెటిజన్లు తమ అబిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదీ కాక.. జనవరి నుంచి జగనన్న ఏమిటో చూపిస్తాడు.. చూడండంటూ.. జగన్ సైన్యం పేరిట.. సోషల్ మీడియాలో గత ఏడాది నవంబర్‌లో జగన్ సైన్యం.. తన ఖాతాలో పోస్ట్ పెట్టిందని.. అది ఇలాంటి వాటి కోసమేనా అని నెటిజన్లు డౌట్ వ్యక్తం చేస్తున్నారు.