తప్పుల్ని కప్పిపుచ్చుకునే యత్నంలో వైసీపీ
posted on Jul 28, 2022 @ 11:33AM
గతంలో వారు చేయలేదని దాని పర్యవసానమే ఇప్పుడు అనుభవిస్తున్నామని అనడం ఒక్క వైసీపీ ప్రభు త్వానికే చెల్లుతుంది. చంద్రబాబు హయాంలోనే రాష్ట్ర హోదాను గట్టిపట్టు పట్టి ఉంటే ఇప్పుడు కేంద్రం చుట్టూ తిరగాల్సిన పని పడేది కాదని వైసీపీ ప్రభుత్వం అభిప్రాయం. రాష్ట్రాన్ని విభజించిన తర్వాత హోదా తప్పకుండా దక్కుతుందన్న ఆశలకు కేంద్రమే నిరాశపరిచిందేగాని తమ ప్రయత్నాల లోపం లేదని జగన్ సర్కార్ మాటి మాటికి చెబుతూ వస్తోంది. హోదాను ఇప్పటికీ కేంద్రం అమలు చేయడం లేదని దానితో పోలిస్తే నియోజవర్గాల పునర్ విభజన పెద్ద విషయం కాదని జగన్ ప్రభుత్వ సలహా దారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
అమరావతి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తమకు పాడేరు దూరమని, దానిలో తమను కలపొద్దని మాత్రమే విలీన గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఆర్ అండ్ ఆర్ సమస్యను త్వరలో నే పరిష్కరిస్తామన్నారు. వాస్తవానికి అక్కడి ప్రజలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదని, ప్రభుత్వం నుంచీ తమకు మంచి జరుగుతుందన్న ఆశలేదన్న ఆగ్రహంతోనే వారు తెలంగాణాలో తమని కలపాలని కోరుతున్నారు. అయితే వైసీపీ పాలనా లోపాలను ఈ అంశం మరింత బయటపెడుతోందన్న కారణంగా దాన్ని కప్పిపుచ్చే యత్నం చేస్తున్నది జగన్ సర్కార్.
ఎప్పుడు పెద్ద సమస్య తలెత్తినా, విపక్షాలు విమర్శిస్తున్నా, ప్రజలు ఆగ్రహిస్తున్నా జగన్ సర్కార్ మాత్రం తప్పంతా కేంద్రానిదే అంటూ హోదా అంశాన్ని పదే పదే తెరమీదకి తెచ్చి తమ తప్పిదాలు, పొర పాట్లను కప్పిపుచుకునే ప్రయత్నాలే చేస్తోంది. అంతేగాక హోదా కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. హోదా కోసం నాడు బాబు పోరాటం చేసి ఉంటే ఇప్పుడు హోదా ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూడా ల్సి వచ్చేది కాదని సజ్జల వంటివారు ప్రకటనలు చేయడం వైసీపీ సర్కార్‌కి పరిపాటిగా మారింది.
పోలవరం కాంట్రాక్టుల కోసం బాబు ఆశపడ్డారు. వరద బాధితును ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆదుకుం టోంది. రాజకీయ ప్రయోజనాల కోసమే టీడీపీ వాళ్లే విలీన గ్రామాల ప్రజలను రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయిస్తున్నారని పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో అపోహలు మాత్రమే ఉన్నాయని సజ్జల అన్నారు.