వైసీపీ బంపర్ ఆఫర్!
posted on Sep 6, 2022 @ 10:59AM
ఆషాఢం సీజన్, పెళ్లిళ్ల సీజన్‌లకీ బట్టల దుకాణాలు ఆఫర్లు ఇస్తుంటాయి. ఒక చీర కొంటే ఒకటి ఫ్రీ, ఒక వస్తువు కొంటే రెండు వస్తువులు ఫ్రీ అంటూ. జనం విరగబడతారని ఆకట్టుకునేందుకు వారి అస్త్రంగా అలాంటి ప్రకటనలు చేస్తూంటారు. అది వ్యాపారం పెంచుకోవడానికి, కష్టమర్లను పెద్ద సంఖ్యలో రాబట్టు కోవడానికి. అందులో అర్ధం ఉంది. కానీ విచిత్రంగా ఏపీలో ఏకంగా ప్రభుత్వమే కొత్తరకం బంపర్ ఆఫర్ ఇచ్చింది. వింటే షాక్ అవుతారు.
వినాయక నిమజ్జనం సందర్భంగా వైసీపీ నేతలు బంపర్ ఆఫర్ ప్రకటించారు. నిమజ్జనం అంటే ఏవో రక రకాల ప్రసాదాలు పెడతారు లేదంటే అన్నదానాలు చేస్తారు. కానీ వైసీపీ నేతల రూటే సెపరేట్. విచ్చల విడిగా మద్యం పంపిణీ చేశారు. అది కూడా ట్రాక్టర్లలో తీసుకొచ్చి మరీ. ఇది ఎక్కడో కాదు ఏకంగా ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి నివాసానికి కేవలం కూత వేటు దూరంలోనే జరిగింది.
తాడేపల్లి గేటు సెంటర్ దగ్గర విచ్చలవిడిగా మద్యం పంపిణీ జరిగింది. ట్రాక్టర్‌పై డ్రమ్ము పెట్టి మరీ వైసీపీ నేతలు మద్యం పంపిణీ చేయడం గమనార్హం. పోలీసుల సమక్షంలోనే వైసీపీ నేతలు మద్యం పంపిణీ చేశారు. సీఎం జగన్‌రెడ్డి నివాసానికి కూతవేటు దూరంలోనే పంపిణీ జరిగింది. వైసీపీ నేత వేణుగోపాలరెడ్డి తీరుపై మహిళలు మండిపడుతున్నారు.