ఎక్స్ ఈ వేరియంట్ భారత్ లో ప్రభావం ఎంత ?..నిపుణుల విశ్లేషణ...
posted on Apr 11, 2022 @ 9:30AM
కరోనా కొత్త వేరియంట్ ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తోంది.గతంలో దీని తీవ్రతను అంచనా వేయడం లో ఇబ్బంది పడ్డ మనం ఎక్స్ ఇ వేరియంట్ తీవ్రత ప్రభావం ఏమేరకు ఉంటుంది? అన్నది పెద్ద సందేహం సామాన్యులను వేదిస్తోంది. అయితే భారతీయులు ఎక్స్ ఇ వేరియంట్ కు భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు తీపి కబురు అందించారు. ఈ అంశం పై వెల్లూర్ కు చెందిన క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ గగన్ దీప్ కాగ్ ఎక్స్ ఇ వేరియంట్ వల్ల పెద్దగా ప్రమాదం లేదన్న తీపి కబురు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ కోరోనా వైరస్ నూతన వేరియంట్ పై పెద్దగా భయపడాల్సింది లేదని ఎందుకంటే ఒమైక్రాన్ సబ్ వేరియంట్ తో పోల్చినప్పుడు ఎక్స్ ఇ ప్రమాదకారి కాదని తీవ్రత ఉండే అవకాశం లేదని తేల్చారు.
ఎక్సి ఇ వేరియంట్ చింతించాల్సిన అవసరం లేదు...
జాన్ హాప్కిన్స్ కు చెందినా గుప్తా-క్లిన్స్కో ద్వారా నిర్వహించిన చర్చలలో కాగ్ మాట్లాడుతూ వేరియంట్స్ వస్తాయాని ఎందుకంటే ఇప్పుడు ప్రజలు పర్యటిస్తున్నారు,సందర్శిస్తున్నారు, ఇప్పటి వరకూ మనవద్ద ఉన్న ఎక్స్ ఇ వేరియంట్ సమాచారం ప్రకారం బి ఏ2 ,వల్ల కాస్త భయపడినా బిఏ 1 అంత ప్రమాద కారి కాదు. ఎక్స్ ఇ వేరియంట్ బిఏ1,బి ఏ2 ఇది ఒమైక్రాన్ వేరియంట్ తీవ్ర రూపం దాల్చలేదు. భారాత్ లో వ్యాక్సినేషన్ తీసుకున్న వారు ఈ వేరియంట్ కు భయపడాల్సిన అవసరం లేదు.అయితే ఎక్స్ ఇ వేరియంట్ త్వరగా విస్తరిస్తుందని డబ్ల్యు హెచ్ ఓ ప్రపంచాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే.ఇతర వేరియంట్స్ తో పోలిస్తే త్వరగా విస్తరించే వేరియంట్ ఎక్స్ ఇ మాత్రమే ఎందుకంటే ఒమైక్రాన్ లోని బిఏ2 ,బిఏ1 కలిసిందని డబ్ల్యు హెచ్ ఓ తెలిపింది.
భారాత్ లో ఎక్స్ఇ వేరియంట్ పై సస్పెన్స్...
కొన్ని రోజుల ముందు బి ఎం సి భారత్ లో ఎక్స్ ఇ వేరియంట్ తొలి కేసు పూనా నమోదు అయ్యింది. ఇండియన్ సార్క్ కోవిడ్2 జీనోమిక్స్ కన్సోర్టియం జీనోమ్ నిపుణుల విశ్లేషణలు చేసారు. వారికి వచ్చిన సందేహాల ప్రకారం దీని జీనో మిక్స్ కాంస్టిట్యుట్యూషన్ ఎక్సి ఇ వేరియంట్ తో కలవడం లేదు.
అరవై సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది...
6౦ సంవత్సరాల కన్న తక్కువ వయస్సు ఉన్న ప్రజలకు బూస్టర్ డోస్ యొక్క ప్రభావం చూపేందుకు అవసరమైన డాటా ప్రస్తుతం తమవద్ద లేదని చివరి సమా వేషం లో ఐ సి ఎం ఆర్ డైరెక్టర్ బలరాం బార్ఘవ పాల్గొన్నారు. కాగా డాక్టర్ కాగ్ చేసిన వ్యాఖ్యను బలరాం బార్ఘవ బలపరచడం విశేషం. ఈ సందర్భంగా బార్ఘవ మాట్లాడుతూ ప్రాధమిక కేంద్రలాలో అత్యధికంగా నిధులు ఖర్చుచేయడం,మంచి శిక్షణ ఇవాల్సిన అవసరం ఉందని ప్రాధమిక ఆరోగ్య కేంద్రలాలో హీన పక్షం ఎం బి బీస్ డాక్టర్స్ అవసరం ఉందని. అనారోగ్యం చికిత్స విషయంలో ప్రజలకు చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందని బార్ఘవ అన్నారు. దానా దీనా ఎక్సి ఇ వేరియంట్ ప్రభావం పెద్దగా ఉండబోదని నిపుణులు-నిపుణులు విశ్లేషించారు.