వరల్డ్ మలేరియా డే 2022 ...
posted on Apr 26, 2022 @ 9:30AM
ప్రపంచ మలేరియా దినోత్సవం.మలేరియా ఒక్కటే కాదు 5 రకాల మలేరియా వస్తుందన్న విషయం మీకు తెలుసా.మలేరియా జ్వరం వచ్చిన వెంటనే మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి?మలేరియా జ్వరాన్ని సత్వరం గుర్తించక పోతే ఇది సాధారణ జ్వరమే అని భావించి తప్పు చేయకండి.అందుకే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25 న మలేరియా డే గా ప్రకటించింది.ప్రాణాంతక మైన మలేరియా పై ప్రజలకు అవగాహన కల్పించడం మే కీలకం.ప్రపంచ ఆరోగ్య సంస్థ 2౦21 నాటి రిపోర్ట్ వివరాల ప్రకారం నేటికీ భారత్ లాంటి దేశాలలో ప్రపంచం లోని ఇతర దేశాలలో చాలా ఎక్కువ సంఖ్యలో మలేరియా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తున్నాయి.అయితే గతం తో పోలిస్తే కొన్ని సంవత్సరాలుగా దేశం లో మలేరియా కేసులు తగ్గుముఖం కావడం గమనించవచ్చు.అయితే మలేరియా ముప్పు పూర్తిగా తొలగి పోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.కాగా కోవిడ్ తరువాత మలేరియా పై దృష్టి పెట్టలేదని తెలుస్తోంది.మలేరియా కొన్ని రకాల దోమల వల్ల వ్యాపిస్తున్నవిషయం అందరికీ తెలుసు. అయితే మలేరియా ఒకటి కాదు 5 రకాలు ఉన్నాయన్న విషయం తెలుసా.అసలు మనకు తెలియని ఆరు రకాల మలేరియా ఏమిటో చూద్దాం.
మలేరియా అంటే ఏమిటి ?...
మలేరియా జ్వరం ఒకరకమైన తీవ్ర సమస్య ఎనాఫిలిస్ అనే దోమ కాటు వేయడం వల్ల వ్యాపిస్తుంది.ప్లాస్మా డియం వాడవేక్స్ పేరుతో పిలిచేది ప్రోటో జోవా ఉంటుంది.
మలేరియా ఎప్పుడు వస్తుంది...
మలేరియా జ్వరం వేసవి కాలం లో లేదా వర్షా కాలం లో రావడం సహజం.మలేరియా దోమలు ముఖ్యంగా నీరు నిల్వ ఉన్న ప్రాంతం లో లేదా మురికి నీరు నిల్వ ఉన్న ప్రాంతాల లో దోమలు తమ గుడ్లను పెంచుతాయి.డెంగు వ్యాధి సంబంధిత దోమలు తాజా నీటిలో పుట్టుకు వస్తాయి.మలేరియా ఎవరికైనా రావచ్చు.నీటి నిల్వ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ మలేరియా ఒకటి కంటే ఎక్కువసార్లు మలేరియా రావచ్చు. అక్కడే మలేరియా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మలేరియా ఎలా వ్యాపిస్తుంది?...
ఎనాఫిలిస్ దోమ ఎప్పుడైతే కాటు వేస్తుందో ఆవ్యక్తి ప్లాస్మోడియం లోకి వ్యాపిస్తుంది.ఈ పరాన్న జీవి లివర్ రక్తనాళాలలో వచ్చి చేరడం తో వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురిఅవుతారు.సరైన సమయం లో సరైన చికిత్స అందక పోవడం వల్ల అది ప్రాణాంతకం గా మారవచ్చు. మలేరియాను సాధారణ జ్వరంగా భావించి తప్పు చేయకండి. అదే సమయం లో చికిత్స చేయకుంటే ప్రాణం పోయే ప్రమాదం
ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మలేరియా లక్షణాలు...
మలేరియా వచ్చిన రోగులు తీవ్రమైన జ్వరం తో పాటు వణికి చలితో తీవ్రంగా వణికి పోతారు.జ్వరం సహజంగా 24 గంటల నుంచి 48గంటలు లోపు చూపిస్తుంది.దీనికికారణం మలేరియాను వృ ద్ది చేసే పరాన్న జీవి సమయ సమయానికి రక్తంలో కలిసి ఉంటుంది.రక్తనాళాలలో విస్తరిస్తుంది.అక్కడ ఒకరకమైన విషాన్ని తయారు చేస్తుంది.ఈ కారణంగా వణుకు తో కూడిన జ్వరం వస్తుంది.
దీని లక్షనాలు...
తీవ్రమైన జ్వరం,చలివేయడం,తలనొప్పి,ఒళ్ళు నొప్పులు,కండరాల నొప్పులు,వాంతులు,అసహనం బలహీన పడడం వంటి లక్షణాలు ఉంటాయి.
మలేరియా రకాలు...
మలేరియా సహజంగా 5 రకాలు ఉంటాయి.
దీనికి రకరకాల పరాన్న జీవులే కారణం కావచ్చు.
1) ప్లస్మోడియా మలేరియా ...
ప్లస్మోడియా మలేరియా ఒకరకమైన ప్రోటోజోవా ఒకరకంగా చెప్పాలంటే బినాయిన్ మలేరియా కారణమౌతోంది.ఈ రకమైన ప్లస్మోడియా ఫాల్సిపెరం లేదా ప్లస్మోడియా ఫాల్సిపెరం లేదా ప్లాస్మాడియా వాడా వైక్స్ అంత ప్రమాద కరమైనది కాదు.
2)క్వార్టాన్ మలేరియా దీనిబారిన పడిన రోగికి ప్రతినాలుగు రోజులకు జ్వరం వస్తుంది.
దీనితో పాటు రోగి మూత్రం నుంచి ప్రోటీన్ కోల్పోతారు.ఈ కారణంగా రోగి శరీరంలో ప్రోటీన్ తగ్గిపోతుంది.దీనివల్ల రోగిలో ఇంఫ్లామేషణ్ వాపులు వస్తాయి.
౩)ప్లాస్మా డియో నోలెస్...
ఈ రకమైన మలేరియా దేశంలో ఆశియాలో కనుగోన్నారు. ఫ్రైమేట్ మలేరియా ఒక పరాన్న జీవి ఈ మలేరియా సోకిన వారిలో చలివేయడం వణుకు తో పాటు జ్వరంవస్తుంది. లక్షణాలలో జ్వరం,తలనొప్పి ఆకలి వేయక పోవడం,చలితో పాటు తీవ్రమైన వణుకు వంటివి కీలక లక్షణాలుగా వైద్యులు పేర్కొన్నారు.
మలేరియా నుండి ఎలా రక్షించు కోవాలి...
మలేరియా నుండి రక్షించుకోవాలంటే దోమకాటు నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి.మనకుటుంబం దోమల బారిన పడకుండా రక్షించుకోవాలి.ఎవరైనా మలేరియా వచ్చిన రోగిని కాతువేసిన అదే దోమ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని కాటు వేస్తే మలేరియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.దోమకాటు నుండి రక్షింప బడాలంటే మస్కిటో రిపలేన్ట్స్ వాడవచ్చు.లేదా శాస్త్రీయ పద్దతిలో దోమలు లోపలి చొరబడకుండా ఇత్రమార్గాలు పద్దతులు అమలు చేయాలి.