లోకం గెలిచిన వీరుడు..కోహ్లీ!
posted on Nov 2, 2022 @ 3:32PM
కింగ్ కోహ్లీ బుధవారం మ్యాచ్ లో గొప్ప రికార్డు నెలకొల్పాడు. ఐసిసి టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన సూపర్ బ్యాటర్ గా నిలిచాడు. బంగ్లా తో జరుగుతున్న మ్యాచ్ లో తన వ్యక్తి గత స్కోర్ 16 దాటగానే ఆ అద్బుత రికార్డు నెలకొల్పిన సూపర్ ఫాస్ట్ బ్యాటర్ గా అందరి మన్ననలు అందుకున్నాడు. కింగ్ ఆల్వేస్ కింగ్ అనిపించు కున్నాడు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ ఊహించని విధంగా పెవిలియన్ చేరగానే కింగ్ రంగంలోకి దిగాడు.
వస్తూనే ధాటిగా బ్యాట్ చేస్తూ స్కోర్ పరిగెత్తించాడు. తన మహత్తర బ్యాటింగ్ సత్తా ప్రదర్శించడంలో కోహ్లీ అన్ని వత్తి డులను అధిగమించాడు. ప్రపంచ కప్ లో రికార్డు పరుగుల ప్రయాణంలో లంక మాజీ కెప్టెన్ మహెలా జయవర్దనే ని అధిగమించాడు. జయవర్దనే 31 ఇన్నింగ్స్ లో 1,016 పరుగులు చేశాడు. కోహ్లీ ఆ రికార్డును తన 25 వ ఇన్నింగ్ లోనే అధిగమించి కింగ్ అనిపించుకున్నాడు. 2014, 2016 ప్రపంచకప్ పోటీల్లోనూ కోహ్లీ తన సత్తా రుచుచూపిన సంగతి తెలిసిందే. 2014 కప్ లో అత్యధిక పరుగులు తీసిన బ్యాటర్ గా నిలిచాడు. అప్పటి 316 పరుగుల స్వైర విహారంతో భారత్ ను ఫైనల్స్ తీసికెళ్లాడు. కానీ ఫైనల్లో లంక చేతిలోనే ఓడిపోయింది.
2016లో అత్యధిక పరుగులుచేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. కోహ్లీ ప్రస్తుత రికార్డు ప్రదర్శన అతని కెరీర్ లో మరో మైలు రాయిగా నిలుస్తుంది. కోహ్లీ అద్బుత రికార్డు సాధన పట్ల బీసీసీ ఐ శుభాకాంక్షలు తెలిపింది.