Read more!

వావ్ ఎమోజీస్... స్క్రీన్ మీద చిలిపి ముసుగులు...

వాట్సాప్, ఫేస్ బుక్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్.. ఓయబ్బో సోషల్ మీడియాకు  ఎన్ని అలంకార భూషితాలో..  పోస్టులు, ఆ పోస్టుల మీద రోస్టులు, పొగడ్తలు, వీటన్నింటికోసం విరివిగా చెక్స్ట్ కంటే ఎక్కువగా అందరూ ఇప్పట్లో ఉపయోగించేది ఎమోజీలే.. నవ్వు వ్చిచనా, ఏడుపు వచ్చినా, ప్రేమ పుట్టినా, అలిగినా, ముద్దు చేయాలన్నా ఇలా ఒకటనేమిటి నవరసాలకు మించి ఎమోజీలు ప్రతి ఒక్కరి మొబైల్ లో ఉంటాయి. అయితే ఈ ఎమోజీల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.. వాటితో ఎంత సరదా చేయచ్చనేది తెసుసుకుందాం.

మనిషి భావానికి బదులుగా ఇంటర్నెట్ యుగంలో ఎమోజీలను వాడుతున్నాం. అయితే ఈ ఎమోజీ అనే పదాన్ని ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ లో 2015లో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతి ఏడాది  జులై 17న ప్రపంచ వ్యాప్తతంగా ఎమోజీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఎమోజీలకు మొదటిరూపం ఎమోటికాన్. ఫుల్ స్టాప్, కమా, బ్రాకెట్ వంటి నమూనాలతో వీటిని రూపొందించేవారు. మొట్టమొదటి సారి 1862 సంవత్సరంలో అబ్రహం లింకన్ ప్రసంగానికి సంబంధించిన కాపీని ముద్రించడంలో జరిగిన పొరపాటుకు  - ':)' - అనే ఎమోటికాన్ వినియోగించబడింది. ఆ తరువాత 1881లో ఈ ఎమోటికాన్ లను అమెరికన్ వ్యంగ్య పత్రిక పక్ ద్వారా ప్రచురించింది.  ఆ తరువాత ఎమోజీలను చిన్న చిన్న బొమ్మల ఆకారంలో పరిచయం చేయడం మొదలుపెట్టారు.

మొదటి ఎమోజీని జపనీస్ కళాకారుడు పిగెటకా కురిటా రూపొందించాడు. ఇది 1999నాటి ఆవిష్కరణ. 2010లో యూనికోడ్ లో ఎమోజీలను చూపించడం, కొత్త వాటిని జోడించడం మొదలుపెట్టారు. ఎమోజీల కోసం మొత్తం 198ఆకారాలు జత చేశారు. ఇదీ ఎమోజీ గురించి కొంత ఆసక్తికరమైన విషయాలు.

అయితే ఈ ఎమోజీ రోజు స్నేహితులు, బంధుమిత్రులు ఎమోజీల ద్వారా సంభాషణ సాగించడం, కొత్త కొత్త ఎమోజీలు సృష్టించడానికి ప్రయత్నించడం వంటివి మంచి ఫన్ ను అందిస్తాయి.

                                          *నిశ్శబ్ద.