Read more!

వర్షాకాలం ఇవి వద్దు... ఇలా చేస్తే ముద్దు!

అసలే వర్షాకాలం. బయటకు వస్తే చలి... అలాగని వెచ్చదనం కోసం ఇంట్లోనే కూర్చుంటే చదువులెలా సాగుతాయి? ఉద్యోగాలెలా చేస్తాం? రెయిన్‌ కోటు తగిలించుకునో గొడుగేసుకునో బయటికి వెళ్లక తప్పదు. అయితే మనం ధరించే దుస్తులు మాత్రం వానకు తగ్గట్టు లేకపోతే అసౌకర్యం తప్పదు మరి. ఈ వానలకు ఎలాంటి దుస్తులయితే బాగుంటుంది, యాక్సెసరీస్‌ ఏవి బాగుంటాయి... ఒకసారి తెలుసుకుందాం.

వర్షాకాలంలో యువతరం బట్టల గురించి శ్రద్ధ తీసుకోవాలి. ఇక కాలేజీకి వెళ్లే విద్యార్ధులకు దీని పట్ల మరింత శ్రద్ధ అవసరం. ఎండల్లో పల్చని రంగులు వాడినప్పటికీ ఇప్పుడు ముదురు రంగులు వాడటం ఉత్తమం. ఎందుకంటే వర్షాకాలంలో తడి , బురద ఉంటుంది .. పల్చని రంగులయితే మరకలు పడితే త్వరగా వదలవు . అలాగని మందపాటి దుస్తులు వాడకూడదు . తేలికపాటివి అయితేనే మంచిది. వాటిలో తెలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం ఈ కాలంలో ఎంతో శ్రేయస్కరం.

ఇవి వద్దు! ఇలా చేస్తే మేలు :
1. వర్షాకాలంలో ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే దుస్తులకు దూరంగా ఉండటం ఉత్తమం.
2. బట్టలు పొడిగా వుంచుకోవాలి. తడి వల్ల బ్యాక్టీరియా త్వరగా చేరుతుంది. అందుకే ఎక్కువసేపు తడిగా వుండకూడదు.
3. తెలుపు రంగు బట్టలు అసలు వాడొద్దు . మురికి పట్టిందంటే తొందరగా వదలదు.
4. ఏ చిన్న మరక పడ్డా దూరానికి కూడా కనిపించి అసహ్యంగా వుంటుంది కాబట్టి ముదురు రంగు బట్టలు వాడితే మంచిది.

ఇవి బాగుంటాయి!
1. కాటన్, సింథటిక్‌ ఫ్యాబ్రిక్‌ వంటి దుస్తులను వాడటం మంచిది.
2. సాయంకాలం సమయంలో ఫ్రాక్స్, అనార్కలీ బాగుంటాయి.
3. స్కిన్‌ టైట్, లెగ్గింగ్స్‌ కూడా బాగుంటాయి.
4. అదే విధంగా చీరలు, చుడిదార్లు ధరించే వారు శాండిల్స్, షూస్‌ వంటి వాటిని వేసుకుంటే మంచిది.
5. హ్యాండ్‌ బ్యాగులు చిన్న సైజులో కాకుండా, కాస్త పెద్దవిగా ఉన్నవి అయితేనే నయం.
6. వర్షాకాలంలో ఎక్కువగా మేకప్‌ వేసుకోకపోవడమే మంచిది.
7. అలాగే వర్షాకాలంలో స్లిప్పర్స్‌ కంటే షూ వాడడం బెటర్‌. లేదంటే శాండిల్స్‌ అయినా ఫరవాలేదు.
8. స్లిప్పర్స్‌ వేసుకుంటే మాత్రం బట్టలపై బురద మరకలు పడి అసహ్యంగా కనిపిస్తాయి.