ఏపీకి విపత్తు పునరుద్ధరణ..
posted on Jul 17, 2015 @ 11:08AM
విపత్తు పునరుద్దరణ పనులకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ బ్యాంకు రూ 1500 కోట్లకు పైగా రుణంగా ఇవ్వనుంది. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వానికి, ప్రపంచ బ్యాంకుకు మద్య ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. గురువారం కేంద్ర కేంద్రం తరపున ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి ఎస్ సెల్వకుమార్, ప్రపంచ బ్యాంకు తరఫున భారతదేశ డైరెక్టర్, ఏపీ తరపున భూ, విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి జగదీశ్ చందర్ శర్మ సమావేశమయిన నేపథ్యంలో ఈ ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా ప్రపంచ బ్యాంకు తరఫున భారతదేశ డైరెక్టర్, ఎస్ సెల్వకుమార్, జగదీశ్ చందర్ ఈ ఒప్పందం పై సంతకాలు కూడా చేశారు. ప్రపంచ బ్యాంకు ఇచ్చే ఈ రుణంతో ఏపీలో ఏర్పడే విపత్తుల్ని తట్టుకునే శక్తి సామర్థ్యాల పెంపు, ఆయా ప్రాంతాల్లోని ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందిచనున్నారు. రానున్న ఐదేళ్లలో ఏపీ ప్రభుత్వం ఈ నిధుల్ని వినియోగించి విద్యుత్తు సరఫరా వ్యవస్థను బలోపేతం చేయటం, రహదారుల పునరుద్ధరణ, మొదలైన కార్యక్రమాలను అమలు చేయనుంది. అంతేకాక తుఫాను ప్రమాద ఉపశమన పథకం ఏపి, ఒడిశా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మొదటి దశగా రూ. 1491.71 కోట్లుగా అంచనా వేసింది. అయితే ఇప్పుడు మొదటి దశ అంచనాలను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది. రూ 835 కోట్లు మేర పెంచుతూ... మొత్తాన్ని రూ 2331.71 కి పెంచింది.