కే సీఆర్ నియంతృత్వ ధోరణి విడనాడాలి
posted on Jul 17, 2015 @ 12:01PM
తమ వేతనాలు పెంచాలని గతవారం రోజులకు పైగా మున్సిపల్ కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం వాళ్లు చేస్తున్న సమ్మెను చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే మున్సిపల్ శాఖ ఉన్నా సమస్య పరిష్కారం కాకపోవడం ఆశ్చర్యం. అయితే కార్మిక సంఘాల పై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వైఖరిపట్ల పలు పార్టీలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వామపక్షాలు బంద్ కు పిలుపునిచ్చాయి. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, కే సీఆర్ నియంతృత్వ ధోరణి విడనాడాలని వామపక్షాల కార్యకర్తలు ధర్నా చేపట్టి.. ఆర్టీసీ బస్సులను అడ్డుకొని నిరసన తెలిపారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో పోలీసులు వచ్చి వామపక్షాల కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అంతేకాక రాష్ట్రంలోని పలు చోట్ల కార్మిక సంఘాల కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. కాగా వామపక్షాలు చేస్తున్న బంద్ కు కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ పార్టీలు మద్దతు పలికాయి.