ఎమ్మెల్యే మాగంటి పి.ఏ వీరంగం
posted on Sep 19, 2022 @ 12:34PM
రాజుగారి కంటే రాజుగారి బామ్మర్ది చాలా పవర్‌ఫుల్ .. అనాదిగా జానపద కథల్లో వింటున్న మాట. కాలం ఎంతగా మారినా ఇది రాజకీయాల్లో మరింత స్పష్టంగా గమనిస్తూనే ఉన్నాం. ఇదే పెద్ద దురదృష్టం. ఎవరూ ప్రశాంతంగా ఉన్నా ఈ రెండో వ్యక్తి చొరబడి దారుణాలకు తెగబడ్డం జరుగుతోంది. రాజ్యం మాది, అధికారం మాది, రాజు మావాడు, అంతా నాయిష్టం అనే దుర్మార్గులు రెచ్చిపోతున్నంత కాలం పోలీసు వ్యవస్థకూడా ఏమీ చేయలని స్థితి ఏర్పడిందన్నది అంతటా వినవస్తున్న విమర్శలు.
ఎమ్మెల్యేలు, ఎంపీల దగ్గర పనిచేసేవారికి కూడా సామాన్యజనం లోకువే. అధికారుల పదవి బలాన్ని అడ్డుపెట్టుకుని వారు కూడా ఆధిపత్యం, అఘాయిత్యాలకు పాల్పడుతుండడమే దారుణం. ఈమధ్యనే వైసీపీ ఎంపీగారి లీలలు బయటపడి భయపెట్టాయి. ఇపుడు తాజాగా ఎమ్మెల్యే పీఏ వీరంగా బయట పడిం ది.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పీఏ వీరంగం సృష్టించాడు. మాగంటి పీఏ విజయ్ ఓ వివాహిత గొంతు కోశాడు. ఈ దాడిలో మహిళకు తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను యశోద ఆస్ప త్రికి తరలించారు. బాధితురాలికి ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన విజయ్..న్యూడ్ కాల్స్ చేసి మహి ళ ను వేధించడం మొదలు పెట్టాడు.
ఆదివారం రాత్రి ఆ మహిళ ఇంటికి వెళ్లి కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురి చేయడంతో మహిళ నిరాక రిం చింది. ఆ సమయంలో ఆమె భర్త ఇంట్లో లేకపోవడంతో తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురి చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో తన వెంట తెచ్చుకున్న బీర్ బాటిల్ ను పగలగొట్టి దాని గాజు ముక్కను ఆమె గొంతులో దించాడు. ఆమె అరుపులు విన్న స్థానికులు అక్కడికి రాగా అప్పటికే విజయ్ అక్కడి నుం చి వెళ్లిపోయాడు. దీంతో స్థానికులు ఆమెను చికిత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించారు.
నిందితుడు విజయ్ ఎమ్మెల్యే పీఏ కావడంతో..పోలీసులు పట్టించుకోవటం లేదని బాధితురాలి కుటుంబీ కులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది కావడంతో పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.