ఎలిజబెత్ రాణి 2 అంత్యక్రియలు ... పలు దేశాధినేతలు హాజరు
posted on Sep 19, 2022 @ 1:12PM
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 సెప్టెంబర్ 8న కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా విదేశాల నుంచి ఆమె పార్ధివదేహాన్ని సందర్శించడానికి వచ్చిన పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులకు లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలె స్‌లో కింగ్ చార్లెస్ 3 ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా భారత్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా భారత్ తరఫున హాజరయి నివాళులు అర్పించారు.
ప్యాలెస్ సమీపంలోని లాన్సెస్టర్ హౌస్ లో ఏర్పాటు చేసిన రాణి కండోలెన్స్ బుక్‌లో ముర్ము సంతకం చేశారు. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ హాల్ లో భద్రపరిచిన రాణి ఎలిజబెత్ 2 పార్ధివ దేహానికి ముర్ము నివా ళులు అర్పించారు.
భారత రాష్ట్రపతి ముర్ము బ్రిటన్‌లో సెప్టెంబర్ 17 నుంచి 19 వరకూ పర్యటించనున్నారు. రాణి అంత్య క్రియ లకు కూడా భారత ప్రభుత్వం తరఫున హాజరవుతారు. శనివారంనాడు ముర్ము లండన్ చేరుకు న్నారు. ఆమెతోపాటు విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా కూడా ఉన్నారు. ఆమెను లండన్ గాట్విక్ విమానా శ్రయంలో బ్రిటన్ ప్రెసిడెంట్, బ్రిటన్‌లో భారత హైకమీషనర్ సాదరంగా ఆహ్వానించారు.