క్రిష్ యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ఉపసంహరణ
posted on Mar 5, 2024 @ 10:40AM
హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారం మరోసారి టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. రాడిసన్ హోటల్ లో కొందరు వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నారంటూ గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంలో ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్ పేరు రావడంలో అందరూ ఉలిక్కి పడ్డారు. క్రిష్ ను కూడా నిందితుడిగా పోలీసులు చేర్చారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ కోసం క్రిష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు.రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో నిందితుడైన క్రిష్‌గా పేరుగాంచిన సినీ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మార్చి 4వ తేదీలోగా తమ వైఖరిని తెలియజేయాలని తెలంగాణ హైకోర్టు శుక్రవారం పోలీసులకు తెలిపింది . సాక్ష్యాధారాలు లేని కారణంగా ట్రయల్ కోర్టు రిమాండ్‌ను తిరస్కరించిన సహ నిందితుడు గజ్జల వివేకానంద్ వాంగ్మూలం ఆధారంగానే పోలీసులు తనను నిందితులుగా చేశారని క్రిష్ వాదిస్తూ పిటిషన్ వేశారు. జస్టిస్ జి రాధా రాణి దీన్ని విచారించారు.ఈ సందర్భంగా క్రిష్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ... ముందస్తు బెయిల్ పిటిషన్ ను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. క్రిష్ కు నిర్వహించిన టెస్టుల్లో నెగెటివ్ గా తేలింది. దీంతో, బెయిల్ పిటిషన్ ను క్రిష్ వెనక్కి తీసుకున్నారు.