చలికాలంలో వచ్చే జలుబు, గొంతు నొప్పికి ఇవి దివ్యౌషధం..!
posted on Oct 28, 2023 @ 1:19PM
కొందరికి తరచుగా జలుబు, ఫ్లూ, దగ్గు వస్తుంటాయి. ఈ సందర్భంలో గొంతు నొప్పి సాధారణం. ఇది వివిధ ఇన్ఫెక్షన్ల వల్ల సంభవించవచ్చు. చలికాలం వస్తే ఇది మామూలేనని పలువురు వాపోతున్నారు. కొందరు వ్యక్తులు గొంతు నొప్పితో వాపును కూడా అనుభవిస్తారు. అయితే గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు అనేక హోం రెమెడీస్ ఉన్నాయి. మన పెద్దలు కూడా వీటి గురించి చెబుతుంటారు. చలికాలంలో వేధించే గొంతునొప్పి, జలుబుకు సంబంధించిన హోం రెమెడీస్ గురించి ఇప్పుడు చూద్దాం.
తేనె:
తేనె చాలా సంవత్సరాలుగా సాంప్రదాయ ఔషధం యొక్క సహజ రూపంగా ఉపయోగిస్తున్నారు. ఇది వివిధ ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేద ఔషధంగా పనిచేస్తుంది.
ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నందున ఇది మన శరీరంలో మంటను తగ్గించడంలో గొప్పగా పనిచేస్తుంది. ఇది కాకుండా, ఇది వెంటనే గొంతు నొప్పి తగ్గిస్తుంది.
ఉప్పు నీటితో గార్గ్లింగ్:
గోరువెచ్చని ఉప్పు నీరు మీ స్క్రాచీ గొంతు, జలుబు వల్ల వచ్చే గొంతు నొప్పికి ఉత్తమ ఔషధంగా కనిపిస్తుంది. ఇది గొంతులోని బ్యాక్టీరియాను తొలగిస్తుంది. నొప్పిని కూడా తగ్గిస్తుంది.
దీని కోసం, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పు వేసి, బాగా మిక్స్ చేసి రెండు నిమిషాలు పుక్కిలించాలి.
చమోమిలే టీ తాగడం:
ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, ఇతర ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి గొంతు నొప్పికి నివారణగా పనిచేస్తాయి. మీరు తాగే చమోమిలే టీలో కొంచెం తేనె కలుపుకుంటే మరింత మేలు జరుగుతుంది. ఇది కెఫిన్ కలిగి ఉండదు కాబట్టి, ఇది కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది.
వేడి నిమ్మరసం తాగడం:
చలికాలంలో మీ గొంతు నొప్పికి గోరువెచ్చని నిమ్మరసం దివ్యౌషధంగా పనిచేస్తుంది. శరీర బరువును తగ్గించడమే కాకుండా అనేక చర్మ సమస్యలకు ఇది ఔషధంగా పని చేస్తుంది.
చలికాలపు లక్షణాలను తొలగించడమే కాకుండా, యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ వైరల్ లక్షణాల వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, గొంతులో ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.