ఆహారంలో ఇదొక్కటి లోపించడం వల్లే ఇరవై ఏళ్ళకే ముసలోళ్ళుగా కనబడుతున్నారు

మనిషిని బట్టి వయసు అంచనా వేస్తుంటారు చాలామంది.  ఈ అంచనాలో కొన్ని సార్లు నిండా 20ఏళ్ళు కూడా లేనివారు ఆంటీలు, అంకుల్స్ అనే ట్యాగ్ లోకి వెళతారు. చిన్న వయసులోనే ఇలా పిలవడం వల్ల మనసులో భోరుమని కుమిలిపోయేవారు చాలామంది ఉన్నారు. నేను ఆంటీలా కనబడుతున్నానా అని ముఖం మీద అనేసేవారు కూడా ఉన్నారు. అయితే ఇది ఎదుటివారి తప్పూ కాదూ, మీ వయసు తప్పూ కాదు. అక్కడున్న తప్పల్లా శరీర చర్మంలో వచ్చిన మార్పే. చిన్నవయసులో చర్మం ముడుతలు పడటం, బలహీనంగా మారటం, శరీరం కూడా వయసు మించినట్టు కనబడటం జరుగుతుంది. ఈ కారణం వల్లే అన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్య ఏర్పడటానికి శరీరంలో తీసుకునే ఆహారంలో ఒకే ఒకటి లోపించడం కారణమని ఆహార నిపుణులు చెబుతున్నారు. చిన్నవయసులోనే శరీరం ముసలిగా  మారకూడదంటే అవసరైన  పోషకం ఏంటి?  అది ఏ ఆహారాలలో లభిస్తుంది? పూర్తీగా తెలుసుకుంటే..

సాదారణంగా వయసు పెరిగేకొద్ది శరీరం ముసలిగా మారుతుంది. చర్మం యవ్వనంగా ఉండటానికి కారణమయ్యే కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోవడమే దీనికి ప్రధాన కారణం. చిన్నవయసులోనే కొల్లాజెన్ సరిగా ఉత్పత్తి కాకపోతే చిన్నవసులోనే ముసలివాళ్లుగా కనబడతారు. చిన్నవయసులో వృద్దాప్య సమస్యను అధిగమించాలంటే కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించే ఆహారాలను సమృద్దిగా తీసుకోవాలి.  కింది ఆహారాలు తీసుకుంటే శరీరానికి కొల్లాజెన్ సమృద్దిగా అందుతుంది. పైపెచ్చు ఇవి అందుబాటులో ఉండేవే. అవేంటో తెలుసుకుంటే..

టమోటా..

చర్మం వృద్దాప్యంలోకి జారుతుందనడానికి మొదటి సూచన ముఖంలోనే కనిపిస్తుంది. ముఖం మీది చర్మం ముడతలు పడుతూ ఉంటే వెంటనే టమోటా వినియోగం పెంచాలి. టమోటాలు తినడం వల్ల లైకోపీన్, కొల్లాజెన్ కంటెంట్ శరీరంలో పెరుగుతాయి.  ఇది ఒకరకమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది.

ఆకుపచ్చని కూరగాయలు..

కొల్లాజెన్ లోపాన్ని అధిగమించడానికి మాంసాహారులు, శాఖాహారులు కూడా తినగలిగే ఆహారం ఆకుపచ్చని కూరగాయలు. ఆకుపచ్చని కూరగాయలను సహజంగానే ఆరోగ్యానికి ఎంతో మంచివని అంటారు.  ఆకుకూరలలో పాలకూర, బ్రోకలి, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్న కూరగాయలు తీసుకోవడం వల్ల కొల్లాజెన్ పొందడం సులువు.

అరటిపండు..

బాగా ఆకలిగా ఉన్నప్పుడు భోజనం ఏమీ లేకపోయినా రెండు అరటిపండ్లు తిని గంటకు పైగా ఆకలిని అధిగమించవచ్చు. అరటిపండు కడుపునింపడంతో పాటు శరీరానికి ఆరోగ్యం చేకూరుస్తుంది. అయితే అరటిపండు తింటే వృద్దాప్యాన్ని కూడా జయించవచ్చు. అరటిపండులో కొల్లాజెన్ ఉంటుంది. ప్రతిరోజూ అరటిపండు తింటే కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది వృద్దాప్యాన్ని ఆమడదూరంలో ఉంచుతుంది.

పై మూడు రకాల పండ్లు, కూరగాయలను ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే కేవలం నెలరోజులలోపే ముడుతలు పడిన చర్మం యవ్వనంగా మారడం గమనిస్తారు. ఈ ఆహారాలు రోజువారి లైఫ్ స్టైల్ లో భాగం చేసుకుంటే యాబై ఏళ్ళు దాటినా యవ్వనంగా యూత్ లా కనిపిస్తారు.

                                                  *నిశ్శబ్ద.