కెప్టెన్సీకి విండీస్ స్టార్ బ్యాటర్ పూరన్ గుడ్ బై
posted on Nov 23, 2022 @ 2:08PM
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో జట్టు వైఫల్యానికి బాధ్యత వహిస్తూ విండీస్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేశాడు. ఆ వరల్డ్ కప్ లో విండీస్ ఘోరంగా ఆడి కసీనం సూపర్ 12 దశకు కూడా వైదొలగిన సంగతి తెలిసిందే. క్వాలిఫయర్ లోనే జింబాబ్వే చేతిలో చిత్తై పూరన్ సేన ఇంటి ముఖం పట్టింది.
టి20లలో రెండు సార్లు వరల్డ్ చాంపియన్ గా నిలిచిన విండీస్ ఇంతఘోరంగా విఫలం కావడంపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే జట్టు ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ కెప్టెన్సీకి గుడ్ పై బెబుతున్నట్లు పూరన్ ప్రకటించారు. ఇన ఇస్టాలో ఈ విషయాన్ని పూరనే స్వయంగా వెల్లడించాడు. కీరన్ పోలార్డ్ రిటైర్ మెంట్ తో పూరన్ కు విండీస్ క్రికెట్ జట్టు సారథ్య బాధ్యతలను ఆ దేశ క్రికెట్ బోర్డు పూరన్ కు అప్పగించింది. కానీ కనీసం ఏడాది కూడా పూరన్ కెప్టున్ గా కొనసాగకుండానే సారథ్యాన్ని వదులుకున్నాడు.
“టీ20 ప్రపంచకప్‌లో జట్టు ప్రదర్శన తీవ్ర నిరాశకు గురిచేసింది. అప్పటి నుంచి కెప్టెన్ గా కొనసాగాలా వద్దా అని ఆలోచిస్తున్నా.. చివరకు సారథ్య బాధ్యతల నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నాడు. 15 వన్డేలు, 15 టి20లకు విడీస్ కెప్టెన్ గా పూరన్ ఉన్నాడు.