మీరు సిద్ధమైతే మేము సిద్ధమే చంద్ర బాబు..
posted on Feb 17, 2021 @ 9:38AM
ఏపీలో విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై కేంద్రానికి బుద్ధి చెప్పడానికి కార్మిక సంఘాలు , ప్రజలు పార్టీల నాయకులు ఆందోళనలు చేస్తుండగా.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు గా లేకపోగా.. ప్రజల్లో తమ ఉనికిని కాపాడుకోవడానికి మేము సిద్దమే అంటూ మొసలి కన్నీరు కారుస్తుంది. విశాఖ ప్రయివేటీకరణపై ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ..విశాఖ ఉక్కును ప్రయివేట్ పరం చేయొద్దని. తెలుగు ప్రజల హక్కును కాపాడుకోవడానికి అందరు ఒక్కటి కావాలని. విశాఖ ఉక్కు తెలుగు ప్రజల సొత్తు.. దాన్ని దక్కించుకోవాలని అందుకు ప్రజలు, పార్టీలు కలసి కట్టుగా సిద్ధం కావాలని.. తెలుగు ప్రజల గళం విప్పి కేంద్రం మెడలు వంచాలంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అందుకు రాజీనామాలకు మీరు సిద్ధమైతే మేము సిద్ధమంటూ చంద్ర బాబు నాయుడు సవాల్ విసిరాడు.. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేసే ఆలోచనను వ్యతిరేకించే పక్షంలో అధికార వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే, తాము ఒక్క నిమిషంలో రాజీనామా చేస్తామని తనతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాజీనామా చేస్తారని ఆయన అన్నారు, ఈ విషయంలో తాను సీనియర్ నేతననే అహం లేకుండా ప్రజల మనోభావాలను పరిరక్షించేందుకు ముందుకు వస్తానని అన్నారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు సీఎం స్థాయిలో ఉన్న జగన్ ఏం చెబితే, అది చేస్తానని, ఈ విషయంలో అధిక బాధ్యత తనపైనే ఉందని జగన్ గుర్తించాలని సూచించారు.
వ్యక్తి గత హక్కు, సామాజిక హక్కు, వ్యక్తి గత హక్కుకు భంగం కలిగితే ఒక్కరే నష్టమవుతారు.. అదే సామాజిక హక్కు కు భంగం కలిగితే కొన్ని వేల జీవితాలు నష్టపోతాయి .. ఒక రాష్ట్రాన్నికి నష్టమవుతుంది.. ఇప్పుడు ఏపీ ముందు ఉన్న ప్రశ్న కూడా అదే విశాఖ ఉక్కు ను ప్రయివేట్ పరం చేయటానికి కేంద్రం కుట్రలు పన్నుతోంది..సామజిక హక్కుకు భంగం కలుగుతుంది.. ఆ సామజిక హక్కును కాపాడుకునే బాధ్యత మనందరిది..