నిజమేనా.. పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
posted on Nov 23, 2022 @ 9:43AM
నిత్యం పెరుగుతూ ప్రజలను బెంబేలెత్తించేస్తున్న పెట్రో ధరలు తగ్గు ముఖం పట్టనున్నాయట. పెట్రో ధరలు భారీగా తగ్గే అవకాశాలున్నాయన్న సమాచారంతో ప్రజలు ఊరట చెందుతున్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ భారీ ధరలతో బేజారైపోయిన సామాన్య ప్రజలకు భారీ ఊరట లభించే అవకాశం ఉందన్న వార్తలు ప్రభుత్వ వర్గాల నుంచే వినవస్తున్నాయి.
గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు స్థిరంగాఇంధన ధరలు భారీగా తగ్గే అవకాశం కనిపిస్తుంది. గతంలో భారీగా పెరిగిన ఈ ధరలు ఆ మధ్య కొద్దిగా తగ్గి ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. అందుకు కారణం గత పదినెలలుగా అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు దిగిరావడమే కారణం.
రానున్న రోజులలో అంతర్జాతీయ విఫణిలో ముడి చమురు ధరలు మరింత తగ్గనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తతుం అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర 87.81 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. అంటే గత మార్చితో పోలిస్తే దీని ధర దాదాపు 35శాతం తగ్గింది. వచ్చే కొద్ది రోజులలో ఇది 82 డాలర్లకు పడిపోయాయని అంటున్నారు.
అదే జరిగితే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. చమురు కోసం డ్రిల్లింగ్ పెంచుతామని యూకే ప్రధాని రిషి సునక్ ప్రకటన, యూరప్‌లోని ఇతర దేశాలు డ్రిల్లింగ్ పెంచినకూడా డ్రిల్లింగ్ పెంచడంతో ముడి చమురు ధరలు తగ్గి పెట్రో ధరలు నేలకు దిగి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.