కాంగ్రెస్ కోటను ఖర్గే కాచుకుంటారా?
posted on Oct 26, 2022 @ 11:10AM
గెలవంగానే సరిపోదు ముందుంది ముసళ్ల పండగ అన్నాడు పూర్వం ఒక పంచాయితీ ఎన్నికల్లో ఓడినాయన. కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి ఎన్నికయినంత మాత్రాన పార్టీలో అన్నీ తానై చేసేదాని కంటే మేడమ్ గారి మాట వింటూ వ్యూహాత్మకంగా ముందడుగు వేయాల్సి వస్తుందేగాని తన బుర్రపెట్టి అడుగు ముందుకు వేయడానికి అంతగా అవకాశం ఉండదని ఖర్గే గెలిచిన తర్వాత రాజకీయ విశ్లేషకులు అన్నారు. ఇందులో నిజానిజాలు, వాస్తవాలు ఎంత ఉన్నప్పటికీ, త్వరలో రెండు రాష్ట్రాల్లో జరిగే ఎన్ని కల్లో పార్టీని గెలిపించాల్సిన అత్యవసర బాద్యత ఖర్గే నెత్తిన పడింది. పదవిలోకి రాగానే కాస్తంత విశ్రాం తికి తావు లేకుండా ముంచుకువస్తున్న ఎన్నికలు ఖర్గే నాయకత్వ పటిమను పరీక్షిస్తాయన్నది వాస్తవం. వీటి కంటే ఆ తర్వాత 2024 ఎన్నికలు పార్టీకి దేశంలో ప్రతిష్టను నిలబెట్టే పని మాత్రం పూర్తిగా బాధ్యతవహించాల్సి వస్తుంది. ఏది ఎటువచ్చినా రాయి పడేది మాత్రం పార్టీ అధ్యక్షునిగా ఖర్గే మీదే మరి.
గతవారం పార్టీ ఎన్నికలో గెలిచి సోనియా నుంచి సర్టిఫికెట్ తీసుకోవడంతో పూర్తి బాధ్యతలు స్వీకరిం చినట్లయింది. ఇక 80 ఏళ్ల కర్ణాటకా కి చెందిన ఈ సీనియర్ నాయకుడికి పరీక్షలు చాలానే ఉన్నాయి. వాటిలో తన పంథాలో ముందుకు నడుస్తారో, అనాదిగా వస్తున్న రబ్బర్ స్టాంప్ పరంపరనే అనుసరిస్తారో చూడాలి. కానీ గాంధీ కుటుంబేతర వ్యక్తి గా పార్టీ పగ్గాలు చేపట్టినందుకు దాదాపు పార్టీలో సీనియర్లు, యువ నాయకుల మద్దతు ఉంటుంది. అయితే ఆ పదవి ఆయన్ను వెదుక్కుంటూ వచ్చిం దని, తన సత్తాతో ఖర్గే నిరూపించుకోవాల్సి ఉంది.
ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లో ఓటర్లను పూర్తిగా తమ పార్టీ వేపు మొగ్గుచూపేలా చేయడం అన్నది చిన్నపాటి టాస్క్ కాదు. నవంబర్ 12న జరిగే ఎన్నికల్లో ఆయన సత్తాను హిమాచల్ ఓటరు కాంగ్రెస్ నుంచి దూరం కాకుండా చూసుకోవాలి. నిన్నటి వరకూ సోనియా గాంధీని అభిమానించి ఓటువేస్తు న్నవారు ఇపుడు ఖర్గేను చూసి వేస్తారా అనేది కొంత అనుమానం. ఎందుకంటే, చాలా ప్రాంతాల్లో గాంధీ కుటుంబం మీదనే పార్టీ నడుస్తున్నది. అదే భావన ప్రజల్లో కొనసాగుతోంది. కనుక ఆ కుటుంబేతరులు పార్టీ పగ్గాలు పట్టగానే వారు వెంటనే సరేననే స్తారనీ అనుకోలేము. ఇలాగే గుజరాత్ కూడా ఎన్నికలకు సిద్ధపడుతోంది. ఇది ప్రధాని మోదీ స్వరాష్ట్రం. ఇక్కడ కాంగ్రెస్ ను గెలిపించుకోగలగితే ఖర్గే మొనగా డనే అనిపించుకుంటారు. ఇక్కడ బీజేపీకి బలం తగ్గిందనే అభిప్రా యాలూ ఉన్నాయి గనుక కాంగ్రెస్కు అవకాశాలు ఉండవచ్చు. డిసెంబర్లో ఫలితాలు వచ్చేవరకూ ఓటరు మనసులో మాట తెలియదు.
ఇక 2023లో ఖర్గేకు అసలు సిసలు పరీక్ష ఉంది. అప్పుడు ఏకంగా తొమ్మిది రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, కూడా ఉన్నాయి. అయితే రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. మరోవంక ఈ కీలక ఎన్నికలు లెక్కలోకి తీసుకునే రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టారన్న అభి ప్రాయాలూ ఉన్నాయి. పార్టీ పగ్గాలు ఖర్గే పట్టినప్పటికీ తొమ్మిది రాష్ట్రాల్లో పార్టీ గెలిచేందుకు రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఎంతో ఉపయోగపడు తుందన్న అభిప్రాయాలే వినపడుతున్నాయి. పార్టీ పగ్గాలు చేపట్టిన గాంధీ కుటుంబేతరుల్లో ముందుగా సీతారామ్ కేసరి ఉన్నారు. 1998లో పదవి నుంచి ఆయన్ను తొలగించి సోనియా గాంధీ పార్టీ పగ్గాలు అందుకున్నారు. ఇక ఇప్పుడు ఖర్గే చేపట్టారు. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం పెగడంతో కాంగ్రెస్ పట్టు తప్పుతోందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఇఫుడు ఖర్గే తలకు ఆ సమస్యను పరిష్కరించుకోవడం కూడా పట్టుకుంది. గాంధీ కుటుం బేతరునిగా ఆయన పార్టీ పగ్గాలు పట్టుకున్నంత మాత్రాన అంత సులువుగా జరిగిపోతాయన్నది ఊహించడమూ కష్టమే.