భర్తను చంపిన భార్య.. అల్లుడిని చంపిన మామ
posted on Mar 19, 2021 @ 4:35PM
అనుమానంతో భార్యను చంపినా భర్త. ప్రియుడి మోజులో పడి భర్తను చంపినా భార్య, అంటూ రోజు ఏదో ఒక వార్త వింటుంటాం. మరి కొంత మంది అయితే అనుమానం పెంచుకుని చిన్న చిన్న విషయాలకే గొడవలు పడి చంపుకోవం ఫ్యాషన్ అయిపొయింది ఈ రోజులల్లో. అదే తరహా అనుమానం మరో భర్త మరణానికి కారణం అయింది. అనుమానం పెనుభూతం అన్నారు పెద్దలు. నిజానికి ప్రతి మనిషికి అనుమానం సహజం.
తాజాగా విశాఖపట్నంలో భర్తపై అనుమానంతో భార్య రోకలిబండతో అతి దారుణంగా కొట్టి చంపింది. ఈ ఘటన ఏవీఎన్ కాలేజీ ద్వారం వీధిలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు అంటున్నారు. ఆ గొడవలే వివాదంగా మారి హత్యకు దారి తీసి ఉంటుందంటున్నారు. .
పోలీసుల వివరాల ప్రకారం భర్త పుండరీ కాక్షయ్య పిల్లలను చంపేస్తాడనే భయంతోనే భర్తను హత్య చేసినట్లు భార్య పుణ్యవతి అంటోంది అంటున్నారు. హత్య గురించి తెలిసిన వెంటానే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహిటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పోలీసులు మాత్రం కేవలం క్షణికావేశంలోనే ఆమె భర్తను హత్య చేసిందా. లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు మాత్రం ప్రతి నిత్యం వారి ఇంట్లో గొడవలు జరుగుతుండేవి అని అంటున్నారు. అయితే కేవలం పుణ్యవతి మాత్రమే హత్య చేసిందా? భర్తను హత్య చేయమని ఎవరైనా ప్రోత్సహించారా? ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు..
మద్యం మత్తులో అల్లుడిని చంపినా మామ..
విశాఖలోనే మరో దారుణం చోటు చేసుకుంది. పెందుర్తి మండలంలోని చినముషిడివాడలో మద్యం మత్తులో అల్లుడిని మామ కొట్టి చంపాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మామ శంకర్, అల్లుడు చిన్నా మధ్య మద్యం మత్తులో మాటకు మాటా పెరిగి.. గొడవకు దారి తీసింది. దాంతో కోపోద్రేకంలో రాడ్‌తో కొట్టి అల్లుడు చిన్నను మామ శంకర్ హత్య చేశాడు. అలాగే హత్య చేసిన మామ శంకర్ తో పాటు ఆ గొడవకు కారణమైన బావ మరిది అశోక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేవలం మద్యం సేవించి ఉండడం వల్లే హత్య చేశాడా? లేదంటే రెండు కుటుంబాల మధ్య పాత వివాదాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.