మీకూ ఆఫీసులో నిద్ర ముంచుకొస్తుందా... అయితే ఇది తప్పక చదవాల్సిందే..
posted on Mar 1, 2024 @ 7:30PM
బాగా గమనిస్తే ఆఫీసులలో చాలా మంది నిద్రమత్తుతో ఉంటారు. ఇలాంటి సమస్యలతో మీరు కూడా ఇబ్బంది పడుతుంటే దీని గురించి కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే ఇది కేవలం మీ ఒక్కరి సమస్య కాదు. ఇది ఉద్యోగాలు చేస్తున్న జనాభాలో కనీసం 15శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్టు తెలిసింది. ఆఫీసులో నిద్రపోవడం కేవలం ఆఫీసులో తోటి ఉద్యోగస్తులు, బాస్ ముందు పరువు తీయడమే కాదు.. ఇది చెయ్యాల్సిన వర్క్ మీద కూడా గణనీయంగా ప్రభావం చూపిస్తుంది. అయితే ఆఫీసు వేళల్లో నిద్రపోవడానికి కారణం ఏమిటి? ఇలా ఎందుకు జరుగుతుంది తెలుసుకుంటే..
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, పగటిపూట లేదా ఆఫీసులో నిద్రపోవడానికి ప్రధాన కారణం రాత్రి నిద్ర లేకపోవడమే. ప్రతి ఒక్కరికీ 6-8 గంటలు నిద్ర అవసరం. అంత సమయం నిద్రపోకపోతే, లేదా ఈ నిద్రాక్రమం అస్తవ్యస్తమైతే.. దీని కారణంగా పగటిపూట కూడా నిద్రపోయేలా అనిపించవచ్చు. అంతే కాకుండా కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు.
కొన్ని వ్యాధుల కారణంగా పగటిపూట ఎక్కువగా నిద్రపోవడం లేదా ఎక్కువగా పగటి సమయంలో నిద్రపోతుండటం జరుగుతుంది. కొన్ని శారీరక ఆరోగ్య పరిస్థితులు, మానసిక ఆరోగ్య రుగ్మతలు దీనికి కారణమని భావించవచ్చు.
డిప్రెషన్-ఆందోళన, స్కిజోఫ్రెనియా, లూపస్, పార్కిన్సన్స్ వ్యాధి, మల్టిపుల్ స్క్లెరోసిస్, హైపోథైరాయిడిజం మొదలైన వ్యాధుల ప్రమాదం ఇలా పగటి సమయంలో నిద్రపోవడం అనే ప్రక్రియ కారణమవుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఇవి రెండూ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి.
న్యూరోలాజికల్, న్యూరోడెజెనరేటివ్ వ్యాధులు..
నార్కోలెప్సీ వంటి నరాల సంబంధిత రుగ్మతలు ఉన్నప్పుడు పగటిపూట కూడా నిద్రపోవడం జరుగుతుంది. నార్కోలెప్సీలో మెదడు నిద్రమేల్కొనే చక్రాన్ని సరిగ్గా నియంత్రించలేకపోతుంది. నార్కోలెప్సీ ఉన్నవారు అధికంగా లేదా అకాల నిద్రపోవడానికి ఇదే కారణం. ఇది కాకుండా, వృద్ధులలో డిమెన్షియా లేదా పార్కిన్సన్స్ వ్యాధుల కారణంగా, పగటిపూట అధికంగా నిద్రపోయే సమస్య కూడా ఏర్పడుతుంది.
ఆహారంలో ఆటంకాల వల్లా..
పగటిపూట నిద్రపోయే సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు మధ్యాహ్నం భారీ భోజనం తీసుకోవడం దీనికి ఒక కారణం. షుగర్ అధికంగా ఉన్న స్నాక్స్, సోడా, వైట్ బ్రెడ్, రైస్ వంటి కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల కూడా నిద్ర బాగా వస్తుంది. దీనికి పరిష్కారం కావాలంటే తేలికపాటి ఆహరం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన. పోషకమైన ఆహారాన్ని తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుంది నిద్రలేమిని తగ్గిస్తుంది.
నిద్రను దూరం చేయడానికి ఏమి చేయాలంటే..
ఆఫీసులో పదే పదే నిద్రపోతున్నట్లు అనిపిస్తే దాన్ని వదిలించుకోవడానికి తక్కువ మొత్తంలో కెఫిన్‌తో కూడిన పదార్థాలు తీసుకోవచ్చు. కెఫీన్ మెదడు నాడీ వ్యవస్థలో కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది. కాఫీ-టీ నిద్రను దూరం చేస్తుంది.
ఇదిమాత్రమే కాకుండా ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కూడా నిద్ర వస్తుంది. అందుకే పనిచేసే స్థలం నుండి అప్పుడప్పుడు లేచి తిరగడం వల్ల రక్త ప్రవాహం పెరుగుతుంది, శరీర నీరసం పోతుంది. నిద్ర కూడా నియంత్రణలో ఉంటుంది.
*నిశ్శబ్ద.