శాకాహారులలో విటమిన్ బి-12 లోపమా...ఈ మూడు ఆహారాలతో భర్తీ చేయచ్చు...
posted on Jul 26, 2023 @ 9:30AM
శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలలో విటమిన్-బి12 ఒకటి, ఇది శరీరంలోని రక్తం, నరాల కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ విటమిన్ లోపం ఉన్న వ్యక్తులకు బలహీనత, తిమ్మిరి, నడవడానికి ఇబ్బంది, వికారం, బరువు తగ్గడం, చిరాకు, అలసట, హృదయ స్పందన రేటు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ విటమిన్ దీర్ఘకాలిక లోపం మెదడు దెబ్బతినడానికి, రక్తహీనతకు కూడా దారితీస్తుంది. అందుకే ఈ విటమిన్ ను శరీరానికి కావసినంత అందించడం చాలా ముఖ్యం. చాలామంది విటమిన్ బి-12 కేవలం మాంసాహారంలో లభిస్తుందని అనుకుంటారు. దీనికి తగ్గట్టు ఈ విటమిన్ బి-12లోపం ఎక్కువగా శాకాహారులలోనే ఏర్పడుతుంటుంది. అయితే శాకాహారులు కూడా విటమిన్ బి-12 ను సులువుగానే పొందవచ్చు. కేవలం మూడు పదార్థాలు ఆహారంలో భాగం చేసుకుంటే చాలు. ఈ విటమిన్ లోపాన్ని జయించవచ్చు. ఇంతకూ ఈ విటమిన్ బి-12 సులువుగా లభ్యమయ్యే మూడు ఆహారాలు ఏవో తెలుసుకుంటే..
అరటిపండు..
అరటిపండు అత్యంత పోషకాలు, విటమిన్లు అధికంగా ఉండే పండ్లలో ఒకటి. అరటిపండ్లు తీసుకోవడం ద్వారా విటమిన్ బి12 చాలా సులువుగా పొందగలుగుతాం. రోజులో శరీరానికి కావలసిన బి-12 విటమిన్ ను భర్తీ చేయడంలో అరటిపండు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది అందరికీ, అన్ని సీజన్ లలో అందుబాటులో ఉంటుంది. ధర కూడా తక్కువ. అరటిపండులో విటమిన్లతో పాటు ఫైబర్ కూడా ఉంటుంది, ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, మలబద్ధకం, అల్సర్ సమస్యలను తగ్గిస్తుంది. మొత్తం శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే శక్తి అరటిపండుకు ఉంది.
బీట్ రూట్..
బీట్‌రూట్‌లో చాలా ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి. విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. దీనిని విటమిన్ బి12 పవర్‌హౌస్ అంటారంటే బీట్ రూట్ బి-12 విటమిన్ కు ఎంత మంచి ఆప్షనో అర్థం చేసుకోవచ్చు. బీట్‌రూట్ తీసుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరగడం, రక్తహీనతను తొలగించడం, రక్తపోటు సమస్యను తగ్గించడం వంటి ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. బీట్‌రూట్‌ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా విటమిన్-బి12 లోపం వల్ల కలిగే సమస్యలను సులభంగా అధిగమించవచ్చు.
శనగలు..
చికెన్, ఇతర మాంసాహారం తీసుకునేవారికి బి-12 విటమిన్ సమృద్దిగా అందుతుంది. అయితే మాంసాహారం తీసుకోని వారికి బీట్రూట్, అరటిపండుతో పాటు శనగలు ఉత్తమ ఎంపిక. నల్ల శనగలు విటమన్ బి-12 ను సమృద్దిగా కలిగి ఉంటాయి. విటమిన్-బి12తో పాటు ఫైబర్, ప్రొటీన్లు, అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. శరీరం ఐరన్ గ్రహించే శక్తిని పెంచడంలో, ప్రోటీన్ ను గ్రహించడంలో శనగలు దోహదం చేస్తాయి. శనగలు మొలకలు తెప్పించి తినడం లేదా నానబెట్టిన శనగలు తినడం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చు.
*నిశ్శబ్ద.