ఎందుకు నమ్మాలో మీరే చెప్పండి జగన్
posted on Jul 16, 2022 @ 10:33AM
తలచి ఒక్క మేలు చేస్తే జీవితాంతం గుర్తుంచుకుంటారు, ఒక్క మేలు చేస్తే అభిమానం వెల్లువెత్తు తుంది. కానీ ఏ మేలు చేశారని తనను నమ్మాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తెలియజేయాలని మాజీ మంత్రి టిడిపి నేత జవహర్ ప్రశ్నించారు.
అసలు పాలనా కాలం సగం వ్యర్ధమయిందన్న అరోపణలే రాష్ట్రమంతా వినపడుతున్నాయి. కేవలం విప క్షాలే కాదు, తెలుగు ప్రజలంతా జగన్ ది సుభిక్షమైన పాలన అని ఏ సందర్భంలోనూ భావించండం లేదు. రైతాంగానికి ఇచ్చిన భరోసా కేవలం ప్రచారఘట్టంగా మారింది. పంట రుణాల సబ్సిడీలో రైతులకు అన్యా యమే జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తతున్నాయి. రైతులకు ధాన్యం కొనుగోలు సొమ్ము ఇవ్వ లేదు. రైతాంగం ఇక ఏ విధంగా నమ్మాలో ప్రభుత్వం తెలియజేయాలి. రుణాల సమయంలో ఎలాంటి ఇబ్బంది వుండదని, బ్యాంకుల నుంచీ ఎలాంటి ఒత్తిడీ వుండదని ప్రచారం చేసినట్టుగా వాస్తవంలో ఏదీ జరగ లేదు.
మరోవంక, విద్యారంగంలో తీసుకున్న నిర్ణయాలు విద్యార్ధులకు ఏమేరకు ప్రయోజనకరమన్నది అంద రూ ప్రశ్నిస్తున్నారు. ఇంగ్లీషు మీడియం పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన, పాఠశాలల నిర్వహణ విషయాల్లో సందిగ్ధత కల్పించారు. తక్కువమంది విద్యార్ధులు, ఉపాధ్యాయులు వున్నవి, తక్కువ అటెం డెన్స్‌తో నడుస్తున్నవి ఒక్కటిగా చేయడమన్న నిర్ణయాలు ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా మారింది. అన్నింటికీ మించి విడ్డూరమేమంటే, శుక్రవారంనాడు విశాఖ పర్యటనకు జనాన్ని తోలడానికి స్కూలు బస్సులు వినియోగించుకోవడం. అందుకు స్కూళ్లకి సెలవ ప్రకటించడం. ఇంతకంటే చోద్యం వుంటుం దా?
ఇలాంటి పిచ్చిపనులతోనే నమ్మకాన్ని కోల్పోతున్నది వైసీపీ సర్కార్. ఒకటేమిటి అన్నింటా జగన్ ప్రభు త్వం ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది. దీన్ని గురించి విపక్షాలే కాదు ప్రజలూ విసిగెత్తి కామెంట్లు చేయ డం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఇంకా జగన్ ప్రభుత్వాన్ని నమ్మడం ఎలా అన్నది పెద్ద ప్రశ్నే. దళితు లపై దమనకాండ కొనసాగిస్తున్నందుకు నమ్మాలా? దళితుల సంక్షేమ పధకాలు 27 రద్దు చేసినందుకు నిన్ను నమ్మాలా? అని విపక్ష నేత జవహర్ నిలదీస్తున్నారు. వెయ్యి అబద్ధాలు లక్షల వాగ్దాన భంగం చేస్తున్నందుకు నమ్మాలా? మధ్యపాన నిషేధాన్ని నినాదంగా మార్చి ప్రజలను ఏమార్చినందురు నిన్ను నమ్మాలా? వారంలో రద్దు చేస్తానని సీపీయస్ ఉద్యోగులను మోసగించి నందుకు ఎలా నమ్మాలో చెప్పాలని జవహర్ ప్రశ్నించారు.
ఇదిలా వుండగా, జూలై 15 నాటికి రాష్ట్రంలో రోడ్లన్నీ బాగు చేసి ఒక్క గుంట కూడా కనిపించకుండా మర మ్మత్తు చేసి ఆ ఫొటో లు కూడా ప్రదర్శిస్తానని సీఎం జగన్‌రెడ్డి ఘనంగా చెప్పారు. ఆ తేదీ వచ్చింది, పోయింది. రోడ్లు పరిస్థితి అలానే వుంది. ప్రజలకు మొహం చూపించడానికి సిగ్గనిపించడం లేదా? అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. శుక్రవారం ఆమె ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ కాని వాగ్దానాలు చేయడం, ప్రజల్ని మభ్యపెట్టడం మానుకోవా లన్నారు.