అగ్ర నేతలతో వరుస భేటీ అవుతున్న మెగాస్టార్ అసలు వ్యూహం ఏమిటి?
posted on Oct 18, 2019 @ 11:56AM
'సైరా' తో మెగాస్టార్ ఘన విజయం సాధించిన తరువాత మెగా హీరో పలువురు అగ్రనేతలతో భేటీ అవుతున్నారు.దీనిపై మెగాస్టార్ ఎటువైపు అడుగులు ఎటు వేయబోతున్నారనే అనుమానాలు జోరందుకుంటున్నాయి.కానీ మెగాస్టార్ మాత్రం పెదవి విప్పడం లేదు. చిరంజీవి వరుస భేటీలు ఇప్పుడు చర్చ నీయాంశంగా మారాయి. ఆయన ఈ వరుస సమావేశాలు ఎందుకు జరుపుతున్నారని చర్చ మొదలైంది.మొన్న గవర్నర్ తమిల శ్రీతో భేటీ, నిన్న జగన్ తో ఫ్యామిలీ లంచ్ మీటింగ్, వెంకయ్యనాయుడుతో మర్యాదపూర్వక సమావేశం, రేపు అమిత్ షా, మోదీని కలవబోతున్న మెగా హీరో పై పలు అనుమానాలు వెల్లడవుతున్నాయి. మళ్ళీ పొలిటికల్ గా యాక్టివ్ అవుతారా లేక సైరా ప్రమోషన్ కోసమే ఈ మీటింగుల అనే విషయం ఆసక్తికరంగా మారింది.
చిరంజీవి ఇటీవలే తెలంగాణ గవర్నర్ తమిల శాయిని కలిశారు. ఆ తర్వాత అమరావతి వెళ్లి సతీసమేతంగా ఏపీ సీఎం జగన్ ని కలిశారు. గంటపాటు లంచ్ మీటింగ్ జరిగింది. అయితే ఈ మీటింగ్ లో ఏమి చర్చించారనేది హాట్ టాపిక్ గా మారింది.కేవలం మర్యాదపూర్వక భేటీ ఏ అని రాజకీయాలు చర్చించలేదని బయటకి చెప్పారు. కానీ లోపల సమావేశాల్లో చాలా చర్చించారు అనే అనుమానాలు మాత్రం రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. జగన్ తో మీటింగ్ అలా ముగిసిన వెంటనే చిరంజీవి ఢిల్లీకి పయనమైయ్యారు.ఉపరాష్ట్రపతి వెంక్యనాయుడిని కలిసి ఆయనకు సైరా సినిమాను చూపించారు. రేపో మాపో ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాను కూడా కలవబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మీటింగ్ నేపథ్యంలో కొత్త కొత్త వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.బీజేపీ వైపు చూపు పడింది అనే ప్రచారం ఊపందుకుంది.
ఏపీలో బీజేపీకి క్రౌడ్ పుల్లర్ కావాలి. బీజేపీకి సరైన లీడర్ దొరకడం లేదు. దీంతో చిరంజీవిని లాగాలని ఎప్పట్నుంచో బీజేపీ ప్రయత్నిస్తోందని అంటున్నారు. అమిత్ షా భేటీ తర్వాత చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీపై క్లారిటీ వస్తుందని న్యూస్ వైరల్ అవుతోంది. అయితే చిరంజీవి వస్తే బీజేపీ, వైసీపీ కూడా రాజ్యసభ సీటు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయని తెలుస్తోంది. కానీ చిరు మనసులో ఏముందో పార్టీలు మాత్రం పసిగట్టలేకపోతున్నాయి. అయితే చిరూ సన్నిహితుల్లో మాత్రం వేరే వర్షన్ వినిపిస్తున్నారు. సైరా సినిమా ముందు నుంచే చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదని ఆయన ఇక రాజకీయాల వైపు వెళ్లారని అంటున్నాయి.
కేవలం సినిమా ప్రమోషన్ కోసమే నేతలను కలుస్తున్నారని వీరు చెబుతున్నారు. ఈ వరుస భేటీలు వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని వివరిస్తున్నాయి. మరోవైపు చిరంజీవి వరుస సినిమాలతో బిజీ కాబోతున్నారు. కొరటాల శివ డైరెక్షన్ లో సినిమాకు ఇప్పటికే ప్రారభించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇలా వరుస సినిమాలతో చిరంజీవి బిజీ కాబోతున్నారని, ఎలాంటి పరిస్థితుల్లో రాజకీయాల వైపు రారనేది ఆయన సన్నిహితుల మాట.మరి చిరంజీవీ మనసులో ఏముందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాలి.