ఏపీకి కొత్త ఎస్‌ఈసీ ఎవరంటే..?
posted on Mar 23, 2021 @ 2:35PM
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హయాంలో రాష్ట్రంలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ కి పచ్చ జెండా ఊపినప్పటికీ, కరోనా కారణంగా రెడ్ సిగ్నల్ వేశారు. అది అలా ఉండగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం ఈనెల 31తో ముగియనుంది. కావున కొత్తగా బాధ్యతలు చేపట్టే ఎస్‌ఈసీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారిన నేపథ్యంలో కొత్త ఎస్‌ఈసీ ఎవరనే అంశం ఆసక్తికరంగా మారింది.
ఈనేపథ్యంలో ఏపీ తదుపరి ఎస్‌ఈసీ ఎవరనేదానిపై చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లను గవర్నర్‌కు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఏపీ మాజీ సీఎస్ నీలం సాహ్ని, ప్రేమచంద్రారెడ్డి, శామ్యూల్ పేర్లను గవర్నర్‌కు పంపినట్లు సమాచారం. చూడాలి మరి ఏపీ కి కొత్త ఎస్‌ఈసీ ఎవరనేది తెలియాలంటే వేయిట్ చేయాలి.