ముఖ్యమంత్రి శివకుమార్? సిద్ద రామయ్య?
posted on May 13, 2023 @ 4:11PM
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో వాడి వేడి చర్చ జరుగుతోంది. 2013 నుంచి 2018 వరకు ముఖ్యమంత్రిగా పని చేసిన సిద్ద రామయ్యకి మళ్లీ అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వం యోచిస్తోంది. గాంధీ ఫ్యామిలీకి విధేయుడుగా ఉన్న డికె శివకుమార్ పేరు కూడా ముఖ్యంత్రి అభ్యర్థి రేసులో ఉన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లి ఖార్జున ఖర్గే , రాహుల్ గాంధీ ఆలోచనను బట్టే ముఖ్యమంత్రి అభ్యర్థి డిసైడ్ కానున్నారు. 2024 లోకసభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా సిద్ద రామయ్యను ప్రకటించాలని రాహుల్ గాంధీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీని ఎదుర్కోవడానికి సీనియర్ కాంగ్రెస్ నేత సిద్దరామయ్యను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి శివకుమార్ పేరును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది.
డికె శివకుమార్ అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్న రాజకీయ నేత. అతన్ని ఎంపిక చేస్తే వచ్చే లోకసభ ఎన్నికల్లో పార్టీకి ఆర్థిక సహకారం అందించవచ్చని పార్టీ భావిస్తోంది. ఒక వేళ శివకుమార్ ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే కేంద్రంలో ఉన్న బిజెపి సర్కారు కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే పన్ను ఎగవేత, మనీలాండరింగ్ కేసులో నిందితుడు. ప్రస్తుతం అతను బెయిల్ మీద ఉన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా శివకుమార్ ను ప్రకటిస్తే బిజెపీ ప్రభుత్వం పాత కేసులను తోడనుందని వార్తలు వినిపిస్తున్నాయి. శివకుమార్ పై సిబిఐ, ఈడీ, ఐటీ శాఖ లలో అనేక కేసులున్నాయి. దర్యాప్తు సాగుతుంది. శివకుమార్ ఇప్పటకే 104 రోజులు తీహార్ జైలులో గడిపారు.