సోనియాను అభినందించిన స్టాలిన్
posted on May 13, 2023 @ 2:51PM
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం బిజెపి వ్యతిరేక శక్తులకు ఊరట నిచ్చింది. తమిళనాడులో డిఎంకె నేత, ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ ఫలితాల పట్ల తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఫోన్ చేసి మరీ అభినందించారు. యుపిఏ మిత్ర పక్షాలతో బాటు బిజెపిని వ్యతరేకించే పార్టీలు కాంగ్రెస్ నేతలకు అభినందనలు తెలుపుతునకర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖరారైంది. మొత్తం 224 స్థానాలకు ఎన్నికలు జరగ్గా... కాంగ్రెస్ 97 స్థానాల్లో నెగ్గి, 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ 113 కాగా, అందుకు మరో 16 స్థానాల దూరంలో ఉంది. అధికార బీజేపీ 48 స్థానాల్లో నెగ్గి, మరో 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జేడీ (ఎస్) 14 స్థానాల్లో గెలిచి, 7 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు 4 స్థానాల్లో నెగ్గారు.
కాగా, కాంగ్రెస్ ఈ స్థాయిలో ఫలితాలు సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. గత కొన్నాళ్లుగా మోదీ ప్రాభవం ముందు కాంగ్రెస్ వెలవెలాపోతోంది. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. కానీ, కర్ణాటక ఫలితాల నేపథ్యంలో బీజేపీని మట్టి కరిపించామన్న ఆనందం కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది.