ఇంతకి జగన్ వైజాగ్ వెళ్లేది ఎప్పుడు?
posted on Apr 5, 2023 9:24AM
ఏపీ సీఎం జగన్ వైజాగ్ నుంచి పాలన కొనసాగిస్తానని చెప్పి దాదాపు మూడు నెలలవుతోంది. అసలు జగన్ నిజంగా వైజాగ్ వెడతారా..? అక్కడి నుంచే పాలన సాగిస్తారా..? అంటే అనుమానమే అంటున్నారు పరిశీలకులు. ఎన్నికల ముందు సీఎం జగన్ వైజాగ్ వెళ్తున్నట్టు ఆయన కేబినెట్ మంత్రులు తెగ ప్రచారం చేశారు. త్వరలో తాను వైజాగ్ నుంచి పాలన సాగిస్తానని స్వయంగా జగన్ కూడా చెప్పారు.
అయితే వైజాగ్ వెళ్లే విషయంపై జగన్ ఎందుకో ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అయితే జగన్ వైజాగ్ వెళ్లేది ఇప్పుడు కాదు.. జులైలో అని టాక్ వస్తోంది. మూడు రాజధానులు అంటూ తెగ హడావుడి చేసిన వారంతా ఇప్పుడు సైలెంట్ గా ఎందుకు ఉంటున్నారని జనం ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో విశాఖ నుంచి పాలన విషయంలో జగన్ ఇప్పుడంత ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు కనిపించడం లేదు. సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణ జరుగుతోంది.
విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేయండని ఏపీ ప్రభుత్వం సుప్రీంకు అభ్యర్థనల మీద అభ్యర్థనలు పెట్టినా ఫలితం ఉండటం లేదు. మరో ఏడాదిలో ఎన్నికలు వచ్చేస్తున్నాయి . అందుకే జగన్.. మూడు రాజధానులు, వైజాగ్ అంశాలను పక్కన పెట్టేశారా అన్న సంశయం పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఎలా చేద్దాం..ఏం చేద్దామని జగన్ కు ఎవరూ సలహా ఇవ్వలేరు.. ఎంతైనా ఆయన మోనార్క్ కదా... సలహాదారులెంత మంది ఉన్నా ఆయనకు సలహా ఇచ్చే ధైర్యం ఎవరికీ లేదు మరి.!