వాట్సాప్ యూజర్లు జర జగ్రత్తా..
posted on Jul 30, 2016 @ 5:13PM
స్మార్ట్ ఫోన్ యూజర్లకి వాట్సప్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కమ్యునికేషన్ కోసం అందరూ ఉపయోగించే యాప్ లో ఇది మెయిన్ యాప్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అది ఇప్పుడు వాట్సప్ ఉపయోగించే వాళ్లు కొంచెం జాగ్రత్త అని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే మెసేజ్ ల ప్రొటెక్షన్ ఉండదట. అసలు సంగతేంటో చూద్దాం.. ఇటీవల వాట్సాప్ ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ తీసుకొచ్చినా సంగతి తెలిసిందే. అయితే అది కేవలం మూడు నెలలు మాత్రం కాపాడుతుందట. దీంతో పూర్తిగా మెసేజ్ల ప్రొటెక్షన్ కు ఉపయోగపడదంట. మెసేజ్ లు డిలీట్ చేసిన అవి ఫోన్లోంటి తొలగిపోవట. అలాగే ఉంటాయట. ఈ విషయాన్ని యాపిల్ ఐఓఎస్ సెక్యురిటీ నిపుణుడు జోనాథన్ చెప్పారు. ఇంకా ఆయన చెబుతూ.. మెసేజ్ లు డిలీట్ చేసినా అవి ఫోన్లోనే ఉంటాయని.. ఫోరెన్సిక్, రికవరీ సాప్ట్వేర్ ద్వారా డేటాను రికవరీ చేసుకోవచ్చన్నారు. వాట్సాప్ చాట్ మొత్తాన్ని పూర్తిగా డిలీట్ చేయాలంటే, వాట్సాప్ను ఫోన్ నుంచి పూర్తిగా తొలగించే మార్గమమే ఉత్తమని ఆయన సూచించారు. మరి వాట్సాప్ యూజర్లు బీ కేర్ ఫుల్..