మేనేజర్ చెంప చెళ్లుమనిపించిన ఎమ్మెల్యే..
posted on Jul 30, 2016 @ 4:32PM
ఈమధ్య నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఘటనలు చాలానే చూశాం. అధికారం చేతిలో ఉంది కదా అని.. సామాన్య ప్రజలపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో బిహార్‌లోని కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఎమ్మెల్యే మెహబూబ్‌ఆలం కూడా చేరిపోయారు. ఓ బ్యాంకు అధికారిపై చేయి చేసుకొని ఆయన తన అధికారన్ని చూపించారు. వివరాల ప్రకారం.. మెహబూబ్‌ఆలం గ్వాల్‌టోలిలోని అలహాబాద్ బ్యాంకుకు వెళ్లారు. అయితే అక్కడ వెళ్లిన ఆయన మేనేజర్ రాకేశ్ రంజన్ రూంలోకి వెళ్లి ఆ సీట్లో తను కూర్చుంటానని చెప్పాడు. అయితే దానికి రాకేశ్ ఒప్పుకోకపోవడంతో ఆగ్రహం చెందిన ఎమ్మెల్యే అతని చెంప మీద కొట్టాడు. దీంతో రాకేశ్ ఈ విషయంపై పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యే తనను కొడుతున్న వీడియోను కూడా చూపిస్తూ.. ఆలం ఇలా చేయడం ఇదేం మొదటిసారి కాదని.. గతంలో కూడా ఇలానే చేశాడని ఆరోపించాడు. ఇక రాకేశ్ ఆరోపణలకి స్పందించిన ఎమ్మెల్యే అందరూ ఎప్పుడూ చెప్పిన కథలే చెప్పుకొచ్చాడు. అవన్నీ తప్పుడు ఆరోణలు అంటూ కొట్టిపడేశాడు. పైగా బ్యాంకు మేనేజర్ ప్రవర్తనే సరిగా లేదని చెప్పాడు. మరి ఎవరు చెప్పినదాంట్లో నిజం ఉందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.